డ్యూయ‌ల్ షేడ్స్‌లో మ‌హేష్ న‌ట విశ్వరూపం

Wed,November 20, 2019 08:09 AM

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మ‌హ‌ర్షి చిత్రం త‌ర్వాత సరిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. చిత్ర రిలీజ్‌కి కొద్ది రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌డంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగవంతం చేశారు. రీసెంట్‌గా టీజ‌ర్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించారు. ఈ నెల 22న సాయంత్రం 5:04నిమిషాలకు టీజర్ విడుదల చేయనున్నట్లు పోస్ట‌ర్ ద్వారా తెలిపింది చిత్ర బృందం. అయితే పోస్ట‌ర్‌లో మ‌హేష్ లుక్ చ‌ర్చ‌నీయాంశ‌మైంది. క‌త్తి ప‌ట్టుకొని క‌సిగా చూస్తున్న మ‌హేష్ సరిహద్దులోని సైనికుడులా, కర్నూల్ లో నివ‌సించే సివిలియ‌న్‌గా అల‌రించ‌నున్నాడ‌ట‌. టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని అందించ‌డం ఖాయం అని అంటున్నారు. చిత్రంలో ర‌ష్మిక మంధాన క‌థానాయిక‌గా న‌టిస్తుంది. లేడీ అమితాబ్ విజయశాంతి దాదాపు 13ఏళ్ల తరువాత ఈ చిత్రంతో వెండి తెరపై కనిపించనున్నారు. ఆమె భారతి అనే ఓ పవర్ ఫుల్ లేడీ రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

1309
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles