వేలంటైన్స్‌డే గిఫ్ట్ ఇవ్వ‌బోతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Sat,October 19, 2019 11:06 AM

సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ చివ‌రిగా డియ‌ర్ కామ్రేడ్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంకి మిక్స్‌డ్ టాక్ ల‌భించింది. ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా ఉన్న విజ‌య్ దేవ‌ర‌కొండ .. క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వర్ అనే రొమాంటిక్ డ్రామా చిత్రం చేస్తున్నాడు. తన తొమ్మిద‌వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేఎస్‌ రామారావు నిర్మిస్తున్నారు . ఈ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్,ఇజబెల్లా, క్యాథరిన్ థెస్రా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సినిమాలో అధికభాగం పారిస్‌లో షూట్ చేశారు. చిత్ర షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. చిత్రంలో విజయ్ దేవరకొండ గడ్డం పెంచుకుని హార్ట్ బ్రేక్ అయిన ఒక ఫెయిల్యూర్ లవర్‌లా క‌నిపిస్తున్నాడు. మూవీని వేలంటైన్స్‌డే గిఫ్ట్‌గా ఫిబ్ర‌వ‌రి 14,2020న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.

1261
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles