సాయంత్రం ఫ‌స్ట్ లుక్‌తో ప‌ల‌క‌రించ‌నున్న రౌడీ

Fri,September 20, 2019 12:49 PM

రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం హీరో అనే సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. దీంతో పాటు తన తొమ్మిద‌వ సినిమాగా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేఎస్‌ రామారావు నిర్మాణంలో సినిమా చేస్తున్నాడు . 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' డైరెక్టర్ క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవ‌ల 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే టైటిల్‌ని ఫిక్స్ చేస్తూ అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ రోజు సాయంత్రం 5గం.ల‌కి చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌నున్నారు. విజ‌య్ లుక్ ఎలా ఉంటుందోన‌ని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్,ఇజబెల్లా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సినిమాలో అధికభాగం పారిస్‌లో షూట్ చేశారు. మిగిలిన షూటింగ్‌ని హైదరాబాద్‌లో పూర్తి చేస్తున్నారు. చిత్రంలో విజయ్ దేవరకొండ గడ్డం పెంచుకుని హార్ట్ బ్రేక్ అయిన ఒక ఫెయిల్యూర్ లవర్‌లా క‌నిపిస్తాడ‌ని టాక్.

1146
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles