అభిమానుల గుండెల్ని పిండేస్తున్న విర‌హ‌గీతం

Tue,March 19, 2019 08:51 AM
Yedetthu Mallele Lyrical song released

టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ నాగ చైత‌న్య‌, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన చిత్రం మ‌జిలి. దివ్యాంష కౌశిక్ మ‌రో హీరోయిన్‌గా న‌టించింది. నిన్నుకోరి ఫేం శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా చిత్రం నుండి లిరిక‌ల్ సాంగ్స్ విడుద‌ల చేస్తూ వ‌స్తున్నారు. తాజాగా మ‌న‌సుల్ని దోచే విర‌హ‌గీతాన్ని విడుద‌ల చేశారు. ‘యేడెత్తు మల్లెలే కొప్పులోన చేరే దారే లేదే .. నీ తోడు కోయిలే పొద్దుగూకే వేళ కూయలేదే’ అంటూ సాగిన ఈ పాటకు గోపిసుందర్ అద్భుతమైన ట్యూన్స్ అందించగా.. కళాభైరవ, నిఖిత గాంధీ అంతే అద్భుతంగా ఆలపించారు. ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ ఈ పాట‌కి లిరిక్స్ రాయ‌డం విశేషం. ప్ర‌స్తుతం ఈ సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది. మీరు ఈ సాంగ్ విని ఎంజాయ్ చేయండి.

2744
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles