జైరా.. నువ్వు నా రోల్ మోడ‌ల్‌: ఆమిర్ ఖాన్‌

Tue,January 17, 2017 01:18 PM
You are my role model, Aamir Khan to Zaira Wasim

ముంబై: ద‌ంగ‌ల్ ఫేమ్, క‌శ్మీరీ న‌టి జైరా వసీమ్‌కు బాస‌ట‌గా నిలిచాడు బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ ఆమిర్‌ఖాన్‌. జ‌మ్ముక‌శ్మీర్ సీఎం మ‌హ‌బూబా ముఫ్తీని జైరా క‌ల‌వ‌డంపై సోష‌ల్ మీడియాలో ఆమెపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో ఆమె క్ష‌మాప‌ణ చెప్పాల్సి వ‌చ్చింది. అయితే ఆమిర్‌ఖాన్ మాత్రం జైరా చేసిందాంట్లో త‌ప్పేముందంటూ ప్ర‌శ్నిస్తున్నాడు. నేను జైరా ప్ర‌క‌ట‌న చ‌దివాను. ఆమె క్ష‌మాప‌ణ చెప్ప‌డానికి కార‌ణ‌మేంటో నాకు తెలుసు. జైరా.. మేమంతా నీ వెంట ఉన్నాం. నీలాంటి యంగ్‌, టాలెంటెడ్‌, హార్డ్‌వ‌ర్కింగ్‌, ధైర్య‌వంతురాలైన పిల్ల‌లు ఇండియాలోనే కాదు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న పిల్ల‌ల‌కు ఆద‌ర్శంగా నిలుస్తారు. నాకు కూడా నువ్వు రోల్‌మోడ‌లే. ఆమెను అలా వ‌దిలేయండ‌ని అంద‌రినీ కోరుతున్నా అని ఆమిర్‌ఖాన్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా కోరాడు.

దంగ‌ల్ సినిమాలో జైరా.. రెజ్ల‌ర్ గీతా పోగాట్ యుక్త వ‌య‌సు కేరక్ట‌ర్‌లో కనిపించింది. ఈ వివాదంపై రెజ్లర్లు గీతా, బ‌బితా కూడా జైరాకు మ‌ద్ద‌తుగా నిలిచారు. జ‌మ్ముక‌శ్మీర్ మాజీ సీఎం ఒమ‌ర్ అబ్దుల్లా కూడా మెహ‌బూబాను క‌లిస్తే త‌ప్పేంటి అటూ జైరాకు మ‌ద్ద‌తు ప‌లికారు. జైరా వ‌సీమ్ త‌న త‌ర్వాతి సినిమా కూడా ఆమిర్‌ఖాన్‌తోనే చేస్తోంది. సీక్రెట్ సూప‌ర్‌స్టార్ పేరుతో వ‌స్తున్న ఈ సినిమాలో బుర్ఖా ధ‌రించి క‌నిపించ‌నుంది జైరా. త‌న తండ్రి ఆకాంక్ష‌ల‌కు విరుద్ధంగా మ్యూజిక్‌ను కెరీర్‌గా మ‌ల‌చుకోవాల‌నుకుంటున్న యువ‌తి పాత్ర‌లో జైరా న‌టించనుంది.

2240
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles