ఇన్‌స్టాగ్రామ్‌లో తొలి ఫోటో పోస్ట్ చేసిన ప్ర‌భాస్

Thu,April 18, 2019 09:54 AM
Young Rebel Star Prabhas First Post on Insta

బాహుబ‌లి సినిమాతో ప్ర‌పంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న న‌టుడు ప్ర‌భాస్. ప్ర‌స్తుతం సాహో సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఆయ‌న సినిమా విశేషాల‌ని తెలుసుకోవాల‌ని, ప్ర‌భాస్‌తో ముచ్చటించాల‌ని అభిమానులు ఎంత‌గానో ఆశ‌ప‌డుతున్నారు. అయితే ఫ్యాన్స్‌కి ప్ర‌భాస్‌తో ముచ్చ‌టించేందుకు అనువైన వేదిక సోష‌ల్ మీడియా. కొన్నాళ్ళుగా ప్ర‌భాస్ కేవ‌లం ఫేస్ బుక్ వేదిక‌గానే అభిమానుల‌తో ట‌చ్‌లో ఉంటున్నారు. అయితే అభిమానుల డిమాండ్ వ‌ల‌న ప్ర‌భాస్ రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయ‌న ఇలా ఎంట్రీ ఇచ్చాడో లేదా దాదాపు 8 ల‌క్ష‌లకి పైగా ఫాలోవ‌ర్స్ ప్ర‌భాస్‌ని ఫాలో అవుతున్నారు. ఇక ప్ర‌భాస్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో తొలి పోస్ట్ ఏం పెడ‌తాడా అని అభిమానులు ఆశ‌గా ఎదురు చూస్తున్న త‌రుణంలో రీసెంట్‌గా అమరేంద్ర బాహుబలి పాత్రలో కత్తులను తిప్పుతున్న ఫొటోను షేర్ చేశాడు. ఈ ఫోటోని రెండు ల‌క్ష‌ల మంది లైక్ చేయ‌గా, 14 వేల‌కి పైగా నెటిజ‌న్స్ కామెంట్ పెట్టారు. ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదల కానుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్ర‌భాస్ చేస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ కూడా ఈ ఏడాదే విడుద‌ల కానుంద‌ని అంటున్నారు.

1748
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles