వైఎస్ జగన్ సింహంలా కనబడుతున్నారు: పూరీ జగన్నాథ్

Sun,May 26, 2019 07:02 PM
ys jagan look like as lion to me says Puri jagannadh


ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు ఉమాశంకర్ గణేశ్ 2019 ఏపీ ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి వైఎస్సార్పీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. తన సోదరుడు ఎమ్మెల్యేగా గెలవడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు పూరీ. వైఎస్ జగన్ వల్లే తన సోదరుడు ఉమా శంకర్ గణేశ్ విజయం సాధించాడని, ఇంతటి ఘనవిజయాన్ని అందించిన జగన్ కు నేను, నా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు.

నా సోదరుడికి జగన్ అంటే ప్రాణం. జగన్ ఫొటో చూసినా..వీడియో చూసినా ఎంతో ఎక్జయిటింగ్ అవుతుంటాడు. ఉమాశంకర్ ఎందుకు ఎందుకు అలా ఫీలయేవాడో నాకిప్పుడు అర్థమైంది. గత ఎన్నికల్లో నా తమ్ముడు ఓడిపోయినా, జగన్ మళ్లీ ధైర్యం చెప్పి వెన్నంటి ఉండి ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను రాజకీయాల్లో లేను. కానీ నాకు యోధులంటే చాలా ఇష్టం. తండ్రి చనిపోయాక ఎన్నో అవమానాలు, కష్టాలు అధిగమించి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న జగన్ నాకు సింహంలా కనబడుతున్నారన్నారు. జగన్ తో తన తమ్ముడు ఉమాశంకర్ కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసి..పలు విషయాలను పంచుకున్నారు పూరీ.
6609
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles