న‌న్ను స‌ల్మాన్ పెళ్ళి చేసుకోబోతున్నారు..

Sun,August 18, 2019 12:40 PM
Zareen Khan reveals why she wants to marry superstar

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ఇప్ప‌టికి పెళ్లికాని ప్ర‌సాద్‌లానే ఉన్నారు. కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్స్‌తో న‌టించిన స‌ల్మాన్ కొంద‌రితో ప్రేమాయ‌ణం న‌డిపారు. స‌ల్మాన్ జీవితంలో పెళ్లి అనేది క‌లగానే ఉంది. ఆ మ‌ధ్య లులియా వాంట‌ర్‌తో స‌ల్మాన్ పెళ్లి జ‌ర‌గ‌నుందని ప్ర‌చారం చేశారు. కాని అది అక్కడికే పులిస్టాప్ ప‌డింది. తాజాగా స‌ల్మాన్ న‌న్ను పెళ్లి చేసుకోబోతున్నారు అని బాలీవుడ్ భామ చెప్పుకొచ్చింది.

వీర్ చిత్రంలో స‌ల్మాన్ స‌ర‌స‌న న‌టించిన జరీనా ఖాన్ తాజాగా మీడియాకి ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఇందులో త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌తో పాటు సినిమా విష‌యాల‌ని షేర్ చేసుకుంది. అయితే రిపోర్ట‌ర్ మీ పై మీరు ఓ రూమ‌ర్ సృష్టించుకోవాలి. అది ఫుల్ వైర‌ల్ కావాలి అని జ‌రీనాకి చెప్ప‌డంతో ఆమె వెంట‌నే .. సల్మాన్‌ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు. నాపై ఇలాంటి రూమర్స్‌ చాలా ఫన్నీగా ఉంటాయి. నాకు అసలు పెళ్లిపై నమ్మకం లేదు. చెప్పాలంటే ఈ మధ్యకాలంలో పెళ్లనేది కామెడీగా మారిపోయింది’ అని సమాధానమిచ్చింది.

9209
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles