అవే అబద్ధాలు!


Sat,October 6, 2012 02:44 PM

ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక పరిస్థితుల్లో ఉంది. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వం గౌరవించడం లేదు. ఈ నేపథ్యంలో నే ఆరు వారాల పాటు సకలజనుల సమ్మె జరిగింది. అరెస్టు లు, నిర్బంధాలు, దాడులను అధిగమించి అన్ని వర్గాల వారు ఉద్యమంలో భాగస్వాములయ్యారుపభుత్వం‘నాసా’ చట్టం, పీడీ యాక్టులను ప్రయోగించి వందలాది కేసులు పెట్టి ఉద్యమకారులను భయవూబాంతులకు గురిచేయడానికి, అణిచివేయడానికి పూనుకుంది. మరోవైపు ఉద్యమానికి నాయకత్వం వహించే పార్టీలను, నాయకులను అబాసు పాలుచేయడానికి తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ కుట్రలు, కుతంవూతాలతో దాడులకు పూనుకుంటున్నాయి. అందులో భాగంగానే కేసీఆర్ తెలంగాణకు చెందిన వ్యక్తి కాదని, ఎక్కడో పుట్టాడని, ఇక్కడ ఉద్యమానికి నాయక త్వం వహించడానికి అయన ఎవరనే ప్రచారానికి ఆజ్యం పోశాయి. గత 11 ఏళ్లుగా తెలంగాణ కోసం కేసీఆర్ నాయకత్వం వహిస్తున్నారు. రాష్ర్ట సాధనే ధ్యేయంగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, టీడీపీలు తమ ఎజెండాలను మార్చుకున్నాయే తప్ప కేసీఆర్ అదే ఎజెండాతో కొనసాగుతున్నారు.

ఈనేపథ్యంలో కేసీఆర్ విజయనగం జిల్లాలో పుట్టాడనే దుష్ర్పచారాన్ని ఆంధ్రావాదులు లేవనెత్తుతున్నారు. వారికి వత్తాసు పలుకుతున్న కొందరు తెలంగాణ ప్రాంత నేతలు కూడా వారితోనే స్వరం కలుపుతున్నారు. కేసీఆర్‌పై జరిగేది కేవలం వ్యక్తిగత దాడి మాత్రమే కాదు. తెలంగాణ ఉద్యమంపై జరుగుతున్న దాడిగా దీన్ని భావించకతప్పదు. ఏడేడు తరాలుగా కేసీఆర్ వంశస్తులు కరీంనగర్ జిల్లాలోని మోహినీకుంట ప్రాంతానికి చెందిన వారని తెలంగాణలో ఎవరినడిగినా చెబుతారు. అయినా.. ఒక ప్రాంతం అన్యాయానికి, దోపిడీకి, వివక్షకు గురవుతున్నప్పుడు ఎక్కడివారైనా గొంతెత్తి చాటడమే ఉద్యమ వీరుడి నైజం. ఈక్రమంలోనే తెలంగాణకు దశాబ్దాల కాలంగా జరుగుతున్న అన్యాయాన్ని సహించలేకపోయిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేస్తున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా తెలంగాణ కోసం పోరాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన డిమాండ్ ఒక్కటే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు రాజకీయ ప్రామాణికం. ప్రజల్లో ఉన్న తెలంగాణ ఆకాంక్షను దశా బ్ద కాలంగా ఉద్యమ రూపం లో ప్రజల్లోకి తీసుకెళుతున్న రాజకీయ చరిత్ర కేసీఆర్‌ది. కేసీఆర్‌పై తప్పుడు ప్రచారం చేయడమనేది ముమ్మాటికీ తెలంగాణ ఉద్యమంపై దాడిగానే తెలం గాణ ప్రజలు భావిస్తున్నారు.

ప్రపంచ చరివూతలో ఎందరో ఉద్యమకారులు ప్రాంతాలకు అతీతంగా ఉద్యమాలు నడిపి చరిత్ర పుటల్లో నిలిచారు. నిజమైన ఉద్యమకారులకు ప్రాంతంతో పనిలేదు. ఎక్కడ అన్యా యం, దోపిడీ జరిగినా గొంతెత్తి ప్రశ్నించే హక్కు ఉద్యమకారుల సొంతం. డాక్టర్ నార్మన్‌బెతూన్ కెనడాలో పుట్టి చైనా విప్లవంలో పాల్గొని విప్లవోద్యమ నేతగా నిలిచారు. అలాగే డాక్టర్ కోట్నీస్ ఇండియాలో పుట్టి చైనా విప్లవంలో పాల్గొని ఆ పోరులో గాయపడ్డ వారికి సేవలు చేసి అక్కడే తుది శ్వాస విడిచాడు. అనిబిసెంట్ అనే మహిళ ఇంగ్లాండ్‌లో పుట్టి ఇండియాలో హోమ్‌రూల్ ఉద్యమాన్ని నడిపారు. భారతీయులను భారతీయులే పాలించాలనే నినాదంతో ఆమె ఉద్యమం సాగించారు. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్య, మోటూరి హనుమంతరావులు కృష్ణా జిల్లాలో పుట్టినప్పటికీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఆ పోరాటాన్ని ముందుండి నడిపారు. అనంతపురానికి చెందిన తరిమెల నాగిడ్డి, కృష్ణా జిల్లా వాసులైన కొండపల్లి సీతారామయ్య, కె.జి.సత్యమూర్తిలు తెలంగాణలో విప్లవోద్యమ నిర్మాణానికి కృషి చేశారు. ఏ ప్రాంతం, ఏ జాతి, ఏ కులం అనేది సమస్య కానేకాదు. చేసే ఉద్యమం న్యాయబద్ధమైందా.. ప్రజాస్వామ్యమైందా.. కాదా అనేదే సమస్య. దానినే పరిగణలోకి తీసుకోవాలి.

తెలంగాణ ఉద్యమాన్ని ఆపడానికి పాలక పార్టీలు అనేక ఎత్తుగడలు వేస్తున్నాయి.అందులో భాగమే నాయకత్వంపై బురద చల్లుతున్నాయి. ఇప్పుడు నాయకత్వం మీద, ఉద్య మం మీద జరిగే దాడిని సమైక్యంగా ఎదిరించాలి. ఉద్యమాన్ని ముందుకు నడిపించాలి. కుట్రలు, కుతంవూతాలను అధిగమించాలి. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఉద్యమం కొనసాగించడం ప్రధానం. ఉద్యమ శక్తులు రాష్ట్రోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి.

- ఆకుతోట ఆదినారాయణ

35

AKUTOTA ADINARAYANA

Published: Sat,October 6, 2012 02:39 PM

ఉద్యమ పార్టీపై ఉపేక్ష వద్దు..

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా, ఉద్యమంలో భాగస్వామ్యం వహిస్తున్న పార్టీల తీరుతెన్నులను పరిశీలిస్తే, ఒక్కో పార్టీ సిద

Published: Sat,October 6, 2012 02:44 PM

ఆకాంక్షను ఎత్తుకున్న కామ్రేడ్స్

పోరాటాలు, ఉద్యమాలు కమ్యూనిస్టులకు కొత్తేమీ కావు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఎన్నో చరివూతాత్మక పోరాటా లు, త్యాగాలు చేస

Published: Sat,October 6, 2012 02:42 PM

సిద్ధాంతాలు రైట్... సమస్యలు లెఫ్ట్

ఉద్యమం అంటే సమష్టి కష్టం, త్యాగం. అప్పుడే దాని ఫలితాలు ఆశించిన మేరకు, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఉంటాయి. అమెరికా సామ్రాజ్యవాదంపైనా

Published: Sat,October 6, 2012 02:40 PM

ప్రజాస్వామ్య ఉద్యమం పట్టదా?

ఏరాజకీయ పార్టీ అయినా ప్రజల అభీష్టాన్ని గుర్తించి ముందుకు సాగాలి. అప్పుడే ఆ పార్టీ ప్రజల్లోకి దూసుకుపోగలుగుతుంది. ప్రధానంగా ఉద్యమా