చివరి క్షణంలో రభస


Tue,February 11, 2014 12:13 AM

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తున్నది. దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే రోజు దగ్గర పడ్డది. బిల్లులోని అభ్యంతకరమైన అంశాలను తొలగించి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న సంపూర్ణ రాష్ట్రం ఆవిర్భవించే విధంగా ఈ కొద్ది రోజులు కషి చేయవలసి ఉన్నది.

ఢిల్లీలో విభజన చట్టబద్ధమవుతుంటే, రాష్ట్రంలో ఆచరణ రూపం పొందుతున్నది! రాష్ట్ర మంత్రిమండలి కూడా ప్రాంతాల వారిగా చీలిపోవడాన్ని బట్టి విభజన రేఖ ఎంత దట్టంగా మారిందో తెలుస్తున్నది. తాత్కాలిక పద్దుల ఆమోదం కోసం శాసన సభ సమావేశమైన సందర్భంగా జరిగిన మంత్రి మండలి సమావేశంలో తెలంగాణ మంత్రులు లేరు. సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశం కూడా సీమాంధ్ర సభ్యులకే పరిమితమైంది. ఉమ్మడి చట్టసభలు, ఉమ్మడి పాలన అనేవి ఇప్పుడిక అర్థం లేకుండా పోయాయి. ఇంకా సమైక్యత పేర గొడవలు చేద్దామనుకునే వారు ఈ వాస్తవికతను గుర్తిస్తే బాగుంటుంది. రాష్ట్ర విభజన ఎట్లాగూ జరుగుతున్నది కనుక ఈ దశలోనైనా సీమాంధ్ర నాయకులు సుహద్భావంతో వ్యవహరిస్తే బాగుండేది. ఈ చివరి దశలో కూడా విద్వేషపూరితంగా వ్యవహరిస్తూ అడ్డుపడాలని చూడడం మంచి పద్ధతి కాదు. వచ్చే ఎన్నికలలో సీమాంధ్ర పెత్తందారుల మద్దతు కోసం ప్రయత్నిస్తున్న రాజకీయ పక్షాలు కూడా తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధమైన సూచనలు చేయడం, లేనిపోని అభ్యంతరాలు పెట్టడం సమర్థనీయం కాదు.
ప్రజల ఆకాంక్షలు, ప్రజాస్వామ్యం
ఎన్నికల ప్రయోజనాల కన్నా
ఉన్నతమైనవి. బీజేపీ వంటి జాతీయ పార్టీ విస్తత దేశ ప్రయోజనాలను దష్టిలో పెట్టుకొని వ్యవహరించాలే తప్ప సీమాంధ్ర పెత్తందారులను సంతప్తిపరిచే క్రమంలో దిగజారిపోకూడదు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నామంటున్న తమ సూత్రబద్ధ
వైఖరిని వదులుకోకూడదు.

తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టబోయే ముందు తమ షరతులు నెరవేర్చాలంటూ ఒత్తిడి తేవడం దివాలాకోరుతనమే. చివరి క్షణంలో జిత్తులమారి వేషాలకు దిగే బదులు ముందుగానే చర్చలకు దిగితే ఎంతో హుందాగా ఉండేది. తెలంగాణ ఉద్యమం ఇవాళ్ళ పుట్టింది కాదు. మలి దశ ఉధతినందుకొని కూడా దశాబ్దం దాటి పోయింది. ఇంత కాలం ఈ సీమాంధ్ర పెద్దలు ఏమి చేసినట్టు? తెలంగాణ ఉద్యమం సీమాంధ్ర ప్రయోజనాలకు విరుద్ధం కాదని తెలంగాణవాదులు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. తాము సమైక్యతను కోరుతున్నాము కనుక విభజనపై చర్చలు జరపలేదని అంటూ కొందరు తప్పించుకోవచ్చు. కానీ కలిసి ఉందామని అనుకున్నా అందుకోసం చర్చలు జరపడం తప్పనిసరి.

అటువంటి చర్చలు ఎవరూ ఇప్పటి వరకు జరపలేదు. కొన్నేండ్లుగా ఉద్యమాన్ని, ఢిల్లీలో పరిణామాలను గమనిస్తున్న వారికి విభజన అనివార్యమని కూడా తెలిసిపోయింది. అయినా ఎందుకు చర్చలు జరపనట్టు? కనీసం వర్కింగ్ కమిటీ ఆమోదించిన తరువాత, క్యాబినెట్ ఆమోదం తరువాత కూడా వీరి ప్రవర్తనలో మార్పు రాలేదు. విభజన బిల్లు వచ్చినప్పుడు అసెంబ్లీలో సీమాంధ్ర నాయకుల ప్రవర్తన ఎంత అసహ్యకరంగా ఉన్నదో ప్రపంచమంతా చూసింది. ఇంత కాలం ఇంతగనం బాధ్యతారహితంగా వ్యవహరించి మళ్ళా బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టే ముందు అడ్డం తిరుగుతామని అంటే ఎవరూ అంగీకరించరు. పదేండ్ల కాలం విద్యా ఉపాధి అవకాశాలు రాజధానిలో కొనసాగాలని అంటున్నవారు ఇంతకాలం ఏమి చేసినట్టు? పదేండ్ల కిందనే విభజనకు అంగీకరిస్తే, ఇవాళ తమ ప్రాంతంలోనే అన్ని అవకాశాలు మెరుగుపడేవి కాదా? పదేండ్లు సాగదీసి, మళ్ళీ ఇప్పుడు ఇంకా తెలంగాణ వారి అవకాశాలను కొల్లగొట్టడానికి అవకాశం ఇవ్వాలని దబాయించడమేమిటి?

ఎన్నికల ప్రయోజనాలను ఆశించి కొన్ని రాజకీయ పక్షాలు సీమాంధ్ర పెత్తందారులకు వత్తాసు పలుకుతున్నాయి. 2009 నుంచి సీమాంధ్ర ప్రజా ప్రాతినిధ్య రాజకీయ పక్షాలతో అనేక సార్లు చర్చలు జరిగాయి. సంపూర్ణ తెలంగాణ ఇచ్చే దిశగా అడుగులు వేయాలే తప్ప చివరి దశలో చర్చలు అనవసరం. బీజేపీతో సహా రాజకీయ పక్షాలను కూడగట్టి ఇంకా తెలంగాణకు అడ్డుతగులుతామని సీమాంధ్ర పెత్తందారులు చెప్పుకోవడం వారి అహంకారానికి నిదర్శనం. బీజేపీ అయినా, ఏ ఇతర రాజకీయ పక్షమైనా ఇప్పుడు తెలంగాణకు అడ్డుపడే పరిస్థితి లేదు. కాకపోతే ఎన్నికల ప్రయోజనాల కోసం మద్దతుగా ఓ మాట మాట్లాడవచ్చు. అంతే తప్ప ఒక స్థాయికి మించి బీజేపీ కూడా ఒత్తిడి తేలేదు. పద్నాలుగు ఏండ్ల కిందట ఎన్డీయే హయాంలో జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్‌తోపాటు తెలంగాణ రాష్ర్టాన్ని కూడా ఏర్పాటు చేయవలసింది. ఈ విషయంలో బీజేపీ, టీడీపీ విఫలమయ్యాయి.

అందువల్ల ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఇతరులకు నీతులు చెప్పే నైతికాధికారం ఈ పార్టీలకు లేదు. పైగా ఈ చివరిదశలో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి కూడా నీళ్ళలో, నిధుల్లో, విద్యా ఉద్యోగ అవకాశాలలో తెలంగాణ వారికి అన్యాయం జరిగే విధంగా సవరణలు చేయాలని కోరడం సమర్థనీయం కాదు. బీజేపీ లేదా టీడీపీ చేస్తున్న ఇటువంటి సూచనలను కేంద్రం ఆమోదించకూడదు. ప్రజల ఆకాంక్షలు, ప్రజాస్వామ్యం ఎన్నికల ప్రయోజనాల కన్నా ఉన్నతమైనవి. బీజేపీ వంటి జాతీయ పార్టీ విస్తత దేశ ప్రయోజనాలను దష్టిలో పెట్టుకొని వ్యవహరించాలే తప్ప సీమాంధ్ర పెత్తందారులను సంతప్తిపరిచే క్రమంలో దిగజారిపోకూడదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నామంటున్న తమ సూత్రబద్ధ వైఖరిని వదులుకోకూడదు.

353

Allam Narayana

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అ...

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంత కాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ...

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడదని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరి ఎంతో సేపు కాలేదు. కేంద్ర క్య...

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో ని...

ఊరట ఏదీ!

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది. ...

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ...

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారుల...

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలర...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం. సీమాంధ్ర బేహారిగా ఉండి ప్...

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు ...

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసి...

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకాలనుకుంటే, ఆ రాష్ర్టాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధికరణం ద్వారా తగు ఏర్పాటు చేశారు....

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ ...

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్...

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి కాగలదు. విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మాన...

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యంగా లేకపోతే బలయిపోతామన...

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్ *చెష్మెబద్దూర్! మద్రాస్ మీద కన్నేసిన ఆ మహాదాశయులే కదా ఇప్పుడు నీ అంగాంగం చుట్టుముట్టిన క్రిములు ఎప్పుడో పోయిందనుకున్...

ఎన్నాళ్లీ వంచన?

అటు మీడియా, ఇటు సీమాంధ్ర పెత్తందారీ నాయకత్వం సీమాంధ్ర ప్రజలకు ఈ విధంగా వాస్తవాలు చెప్పకుండా దాచి ద్రోహం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రజలను ఎన్నటికీ తీరని గందరగోళంలోకి నెడుతున్నారు. ఆ విధంగా తమను తాము మోసం చేసుకుంటున్నారు. తెలుగు ప్రజలను మోసం చేస్...

Featured Articles