ఊరట ఏదీ!


Fri,February 28, 2014 12:31 AM

ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది.

బాధలు తీర్చకపోయినా కనీసం ఊరడింపు కావాలని బాధితులు కోరుకుంటా రు. తెలంగాణకు కనీసం ఆ మాత్రం ఊరడింపు కూడా దక్కక పోవడం మరింత బాధాకరం. తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందినప్పటి నుంచి కేంద్ర మంత్రి జై రామ్ రమేశ్ తరచుగా మీడియాతో మాట్లాడుతున్నారు. ఇటీవలి రాష్ట్ర పర్యటన సందర్భంగా కూడా విభజన తదుపరి పరిస్థితులపై వివరంగా మాట్లాడాడు. కానీ ఆయన మాటల్లో తెలంగాణకు జరుగుతున్న నష్టానికి సంబంధించి, దానిని పూడ్చడానికి తీసుకుంటున్న చర్యల గురించి ఒక్క మాట లేకపోవడం ఆందోళనకరం. ఆయన మాటలన్నీ సీమాంధ్ర ప్రాంతాన్ని మాత్రమే ఉద్దేశించి ఉంటున్నాయి. ఇతర ప్రాంతాలకు ఏమి చేసినా అభ్యంతరం లేదు. కానీ తెలంగాణను కూడా పట్టించుకోవడం కేంద్రం బాధ్యత.

రాష్ట్ర విభజన కోసం కేంద్రంలో ఏర్పాటయిన మంత్రుల బందంలో సభ్యుడైన జై రామ్ రమేశ్ మొత్తం విభజన ప్రక్రియలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. బిల్లు పార్లమెంటు ఆమోదం పొందే వరకు తెరవెనుక సంప్రదింపులలో, రాజ్య సభలో చర్చ సాగుతున్నప్పుడు బీజేపీ- సీమాంధ్ర నాయకులకు ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా వ్యవహరించడంలో జై రామ్ రమేశ్‌ది ప్రధాన పాత్ర. రెండు ప్రాంతాల సమస్యలు, ఆకాంక్షలు ఆయనకు తెలువదు అనుకోవడానికి వీలు లేదు. కేంద్ర మంత్రి అయిన జై రామ్ రమేశ్ మాటలు కేంద్ర ప్రభుత్వ ధక్కోణాన్ని సూచిస్తాయి. అందువల్ల జైరామ్ రమేశ్ మాటల సరళి తెలంగాణ పట్ల కేంద్రం ఉదాసీన వైఖరికి సూచనగా భావించవలసి వస్తున్నది. జైరామ్ రమేశ్ మాట్లాడుతున్న తీరు గమనిస్తే- తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయడమే ఈ ప్రాంతానికి చేసిన గొప్ప మేలు అని ఇక ఏమీ పట్టించు కోవలసిన అవసరం లేదని భావిస్తున్నట్టు తెలుస్తున్నది.

జైరామ్ రమేశ్ కొద్ది రోజులుగా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితులను వెల్లడిస్తున్నారు. రాష్ర్టాల పునర్వ్యస్థీకరణ కమిషన్ తెలంగాణ రాష్ట్రం విడిగా ఉండాలని సూచించిందన్న విషయం ఆయన గుర్తు చేస్తూ తెలంగాణ ఉద్యమం అరవై ఏండ్లుగా సాగుతున్నదని ఆయన వివరిస్తున్నారు. సుదీర్ఘ సంప్రదింపులు సాగి, అన్ని రాజకీయ పక్షాలు అంగీకరించిన తరువాతనే విభజన నిర్ణయం తీసుకున్నామని ఆయన పదేపదే అంటున్నారు. మొత్తం ప్రక్రియ రాజ్యాంగ బద్ధంగా సాగిందని, కేంద్రానికి విభజన అధికారం ఉన్నదని న్యాయస్థానం పలు తీర్పులలో స్పష్టం చేసిందని ఆయన సమర్థించుకుంటున్నారు. ఇందులో తప్పేమీ లేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రజల అభిమానం పొందడానికి ప్రయత్నించడంలో ఆశ్చర్యమేమీ లేదు.

ఇందులో భాగంగా జైరామ్ రమేశ్ సీమాంధ్రకు కలుగుతున్న లబ్ధి గురించి వివరిస్తున్నారు. తాము ఏయే ప్యాకేజీలు ఇవ్వబోతున్నామో చెబుతున్నారు. విభజన తరువాత ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కట్టబెట్టడం వల్ల యాభై వేల కోట్ల రూపాయల ప్రత్యక్ష లబ్ధి చేకూరుతుందని అంచనా. పరోక్ష లబ్ధి అంచనాకు అందనిది. దీనికి తోడు అభివద్ధి ప్యాకేజీ ఉండనే ఉన్నది. వీటన్నిటి పట్ల తెలంగాణ వారికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ సమస్యల విషయంలోనే ఆయన సంతప్తికరంగా మాట్లాడడం లేదు.

రాష్ట్ర విభజన సందర్భంగా సీమాంధ్రకు వ్యవసాయం, నీటిపారుదల, విద్య తదితర రంగాలలో హామీలు ఇచ్చినట్టు జైరామ్ రమేశ్ గురువారం గుర్తు చేశారు. ఈ హామీలే తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయి. సీమాంధ్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి అన్ని రకాల న్యాయపరమైన హామీలు బిల్లులో పొందు పరిచామని ఆయన చెబుతున్నారు. కష్ణా, గోదావరి నదీ జలాల నిర్వహణకు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని, విద్యా రంగంలో అవే కోటాలు పదేండ్ల పాటు కొనసాగుతాయని ఆయన సీమాంధ్రను ఉద్దేశించి చెబుతున్నారు. అంటే పేరుకు తెలంగాణ రాష్ర్టాన్ని ఇవ్వడం తప్ప రాష్ట్రం ఏర్పాటు కావడం వల్ల తెలంగాణ ప్రయోజనాలు నెరవేరకుండా, అన్ని విధాలా అదే నష్టం కొనసాగుతుందని జైరామ్ రమేశ్ మాటల్లోనే తెలిసిపోతున్నది. కానీ ఇదే సందర్భంలో తెలంగాణకు పరిహారంగా తాము చేయబోతున్నదేమిటో ఒక్క మాట చెప్పడం లేదు. ఇంతకాలం నీటి పంపకంలో తెలంగాణకు జరిగిన అన్యాయం చక్కదిద్దుతామని అనడం లేదు.

ఇంతకాలం తెలంగాణ నిధుల దోపిడీకి గురైన తెలంగాణ సమాజాన్ని ఆదుకోవడానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాల్సింది. తెలంగాణలో వ్యవసాయ రంగానికి జరిగిన నష్టాన్ని కూడా గుర్తించి ఆదుకునేందుకు హామీలు ఇస్తే బాగుండేది. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా కూడా ఇటీవల తెలంగాణ నాయకులు కలిసినప్పుడు- ఇంత కాలం మీరు బాధితులు, ఇప్పుడు వారు బాధితులు. వారిని బాధపెట్టే మాటలు మాట్లాడవద్దు అన్నారని తెలిసింది. కానీ వాస్తవం వేరే విధంగా ఉన్నది. ఇంతకాలం తెలంగాణనే బాధిత పక్షం. ఇకముందు కూడా తెలంగాణ బాధిత పక్షంగానే ఉండబోతున్నది. కానీ తెలంగాణ రోదన ఎవరూ వినడం లేదు. తెలంగాణ వారికి నాలుగు స్వాంతన వాక్యాలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. కేంద్రంలో సీమాంధ్ర పెత్తందారుల మాటనే ఇంకా చెలామణి అవుతున్నది.

360

Allam Narayana

తూటాను మోస్తున్నవాడి ప్రశ్న

శివరాత్రి దినమువోలె/ ఒక్క పొద్దిడిసే యాళ/శివుడు చిన్నాబోయిండో నా కూనల్లారా... తెలగాణ పల్లేలన్ని/ ఎములాడకెళ్లంగ.... అని సాగే పాట గద్దర్‌ది. ఎక్కువ ప్రచారంలో లేనిది. కొద్దిమంది మాత్రమే విన్నది కావొచ్చు కానీ.... దానికదిగా ఇదొక అద్భుత కావ్యగానం. మానాల అ...

అన్యాయం చక్కదిద్దరా!

ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఇక మిగిలింది కేంద్ర పాలకులు. కేంద్రంలో ఇప్పటి వరకు అధికారం నెరిపిన పార్టీలలో కాంగ్రెస్‌ది ప్రధాన బాధ్యత. కొంత కాలం పాలించిన బీజేపీ కూడా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ...

తెలంగాణ వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభువులను ప్రీతిపాత్రం చేసుకునే క్రమంలో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి ఏమాత్రం వెనుకాడదని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్‌లో చేరి ఎంతో సేపు కాలేదు. కేంద్ర క్య...

అచ్చమైన గణతంత్రం

దేశంలోనే ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి, ఒక జాతి ఆకాంక్ష తీర్చడానికి ప్రయాసతో కూడిన అప్రజాస్వామిక విధానం అవలంబించడం తగదు. కేంద్రంలోని విధానకర్తలు ఇప్పటికైనా సొంత రాష్ట్ర డిమాండ్లు తీర్చడాన్ని ఒక విధానంగా స్వీకరించాలె. ఆధిపత్యశక్తుల ఇష్టాయిష్టాలతో ని...

నీచ రాజకీయం!

ధన ప్రభావంతో ప్రజల ఆకాంక్షను దెబ్బతీయవచ్చునని అనుకునే వారికి పరకాల ఎన్నిక ుణపాఠం నేర్పింది. ప్రజలకు హామీలు ఇచ్చి మాట మారిస్తే ఎట్లా ఉంటుందో ఇదే జగన్, చంద్రబాబు యాత్రలకు ఎదురైన వ్యతిరేకతే నిదర్శనం. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఓటంటే బలమైన ...

నిరంతర పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలె? అందుకు అనుసరించే వ్యూహం ఎటువంటిది అనే సందేహాలు రావచ్చు. ఎప్పుడు కాని ఏ సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి పోరాడాలనేది చెప్పేది ప్రజలే. పోరాట వ్యూహాన్ని నిర్ణయించేది కూడా ప్రజలే. నిజాయితీ గల ఉద్యమకారుల...

దొంగ దెబ్బ

29వ రాష్ట్రంగా మనకు దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుభవిస్తున్న అన్ని హక్కులున్నాయి. వాటికి ఫెడరల్ నిర్మాణంలో హామీలున్నాయి. రాజ్యాంగబద్ధత ఉన్నది. ఆ ధీమాతో మన ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగించక తప్పదు. దోపిడీ పీడనలు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చెలర...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

విముక్త జాతి!

ఎవరం దారి వీడలేదు. పోరాటం మనలను మరింత పరిణుతులను చేసింది. మనలో సంఘీభావం పెంచింది. చరిత్రలో ఏ దశ చివరిది కాదు. ఎవరి బాటలో వారం సాగుదాం. అన్ని బాటలు కలిసే దశ ఒకటి మళ్ళా తప్పకుండా వస్తది. ఆ తెలంగాణ కోసం ముందుకు సాగుతూనే ఉందాం. సార్వభౌమ సంస్థ అయిన పా...

పతనం...

లగడపాటి రాజగోపాల్ నిజస్వరూపాన్నే కాదు, సీమాంధ్ర మీడియా మాయాజాలాన్ని కూడా తెలంగాణ ఉద్యమం బయట పెట్టగలిగింది. సీమాంధ్ర మీడియా వ్యతిరేక కథనాల దాడి ఎంత సాగినా తెలంగాణ ఉద్యమం అంతకంతకూ వద్ధి చెందుతూ ఢిల్లీని తాకడం తాజా పరిణామం. సీమాంధ్ర బేహారిగా ఉండి ప్...

బరితెగింపు

తాను అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంగానైనా సహకరిస్తే బాగుండేది. వచ్చే వారం ఈ లోక్‌సభ పదవీ కాలంలో చిట్టచివరిది. ఈ లోగా తెలంగాణ బిల్లును ఆమోదించి ధర్మం పక్షం వహిస్తే సరేసరి. లేకపోతే ఈ నాయకులు ప్రజల మధ్యకు ...

చివరి క్షణంలో రభస

అసెంబ్లీ అభిప్రాయం పొందిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి తెలుపడంతో ఇగ పార్లమెంటులో ప్రవేశ పెట్టడమే మిగిలింది. ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టవచ్చునని తెలుస్తున్నది. దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరే రోజు దగ్గర పడ్డది...

ఇంకేమి వదులుకోవాలి?

తెలంగాణ ఉద్యమం వచ్చిందే మన నీళ్ళ కోసం, కొలువుల కోసం, నిధుల కోసం. మన జాగల మన రాజ్యం కోసం. అదీ లేకపోతె ఇగ తెలంగాణ ఇచ్చుడెట్లయితది. ఇప్పటికే మూడు తరాలు నష్టపోయినం. పిల్లలు ఆగమైండ్రు. ఇంకా ఏం వదులుకోవాలట! పార్లమెంటుల బిల్లు పెట్టినప్పుడు చర్చ జరగవలసి...

ఏది సమాఖ్య స్ఫూర్తి?

తమ వాదనలో పస లేనప్పుడు డొంక తిరుగుడు మాటల్లో దొర్లాడడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటే. ఏదైనా రాష్ట్రంలోని చిన్న ప్రాంతం విడిగా బతకాలనుకుంటే, ఆ రాష్ర్టాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండాలనే రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధికరణం ద్వారా తగు ఏర్పాటు చేశారు....

పీడ వదిలినట్టే!

రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఎన్ని ఏడుపుగొట్టు తీర్మానాలు చేసినా తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయం. తెలంగాణ ప్రజలకు ఈ పెత్తందారుల పీడ విరగడ కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు కూడా వీళ్ళ ...

బిల్లుకు విముక్తి ...

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉద్యమం జమిలిగా ఒక కార్యాచరణతో, ఓరిమితో, ఉపాయంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి, బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎందుకు వేరుపడుతున్నదో? అది ఎంత అనివార్యమో? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అవస్థలు, అణచివేత, దోపిడీ అనుభవించిందో? సమర్థంగా చెప్...

రాజ్యాంగస్ఫూర్తి నిలబడాలి

బీఏసీలో వచ్చిన అభిప్రాయాలు, అట్లాగే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అనే ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ విశేషాధికారాలతో సీఎం తీర్మానాన్ని తిరస్కరించడమే ఆరోగ్యకరమైన రాజ్యాంగస్ఫూర్తి కాగలదు. విశేష అధికారాలను స్పీకర్ వాడుకునే సందర్భంలో తీర్మాన...

ఐక్యత అపూర్వం

తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక, సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించ డం ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్టయింది. సమాజశక్తుల్లో,చివరికి ప్రజా ప్రాతినిధ్య శక్తుల్లో కూడా ఈ ఉద్యమం ఒక అనివార్య ఐక్యతను పాదుకొల్పింది. ఐక్యంగా లేకపోతే బలయిపోతామన...

హైదరాబాద్..చష్మేబద్దూర్!

హైదరాబాద్! నువ్వు అపురూప అమాయక సౌందర్యానివి వెలుగు నీడల భోలా ప్రపంచానివి నీ చుట్టూ ఇప్పుడు సమైక్య రోగుల బర్బర నత్యం హైదరాబాద్ *చెష్మెబద్దూర్! మద్రాస్ మీద కన్నేసిన ఆ మహాదాశయులే కదా ఇప్పుడు నీ అంగాంగం చుట్టుముట్టిన క్రిములు ఎప్పుడో పోయిందనుకున్...

ఎన్నాళ్లీ వంచన?

అటు మీడియా, ఇటు సీమాంధ్ర పెత్తందారీ నాయకత్వం సీమాంధ్ర ప్రజలకు ఈ విధంగా వాస్తవాలు చెప్పకుండా దాచి ద్రోహం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రజలను ఎన్నటికీ తీరని గందరగోళంలోకి నెడుతున్నారు. ఆ విధంగా తమను తాము మోసం చేసుకుంటున్నారు. తెలుగు ప్రజలను మోసం చేస్...

Featured Articles