సీమాంధ్ర ఉగ్రవాదం!


Fri,February 14, 2014 12:43 AM

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను
పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు
వేదికైతే ఇక ఈ దేశాన్ని ఎవరు కాపాడగలరు? దీనంతటికీ కాంగ్రెస్ పార్టీ
బలహీనతే కారణం. ఆ పార్టీ 2009న తీసుకున్న నిర్ణయాన్ని
వ్యతిరేకించినప్పుడే లగడపాటిని పార్టీ నుంచి బయటకు పంపించిఉంటే
సభలో ఈ పరిస్థితి వచ్చేది కాదు.

భారత పార్లమెంటు మీద దాడికి సూత్రధారి అన్న అభియోగంతో అఫ్జ ల్ గురు అనే ఒక కాశ్మీర్ యువకున్ని భారత ప్రభుత్వం సరిగ్గా ఏడాది కిందట (ఫిబ్రవరి 9, 2013న) ఉరితీసింది. 2001 డిసెంబర్‌లో పార్లమెంటు మీద దాడి జరిగినప్పుడు అఫ్జల్ గురు అక్కడ లేడు. పార్లమెంటు మీదికి దూసుకువచ్చి కాల్పులు జరిపిన ఐదుగురిని భద్రతాదళాలు దారిలోనే కాల్చి చంపేశాయి. ఆ తరువాత దాదాపు ఒక దశాబ్దంపాటు దీన్ని భారతదేశం మీద దాడిగా దేశ భక్తులంతా భావించారు. పార్లమెంటు మీద దాడి ద్వారా ఈ దేశ సార్వభౌమాధికారాన్ని సవాలు చేశారన్నది అఫ్జ ల్ మీద మోపిన అభియోగం. నిజానికి అఫ్జల్ గురు పార్లమెంటుకు వెళ్లలేదు, కనీసం ఆ పరిసరాలలో కూడా లేడు.

అయినప్పటికీ ఆ కుట్రకు కారణమని పోలీసులు చూపిన సాక్ష్యాల మేరకు అదొక సీమాంతర ఉగ్రవాద చర్యగా కోర్టు తీర్పు చెప్పింది. దేశమం తా నిజమేనని నమ్మింది. మరి సీమాంధ్ర ఉగ్రవాదం సంగతి ఏమిటి? సీమాంతర ఉగ్రవాదులను తుదముట్టిస్తామని చెప్పే భారతీయ జనతాపార్టీ ఇప్పుడు ఈసీమాంధ్ర ఉగ్రవాదులను ఎందుకు వెనకేసుకు వస్తోంది. దేశ సమగ్రతను దెబ్బతీసి రాజకీయ అస్థిరతను సష్టించడమే ఉగ్రవాదం లక్షణం. అదే అస్థిరతను ఇప్పుడు సీమాంధ్ర ఉగ్రవాదులు సష్టిస్తున్నారు.

తెలంగాణ బిల్లు చర్చకు వచ్చిన సందర్భంగా ఎంపీ లగడపాటి రాజగోపాల్ చర్య నిజంగానే సభలో పిచ్చిపట్టినవాడిగా ప్రవర్తించాడు. అతని ఉన్మాద ప్రవర్తన భయవిహ్వలతకు కారణమయ్యిం ది. ఆయన నిండు సభలో కారం, మిరియాల పొడి కలిపిన ద్రవాన్ని వెదజల్లడంతో సభ అవాక్కయ్యిం ది. ఒక్క లోక్‌సభను మాత్రమే కాదు. తెలంగాణ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. యావత్ దేశం అవాక్కయ్యింది. ఈదేశ ప్రజలను కాపాడడానికి చట్టాలు చేసి దేశ భద్రతకు పూచీ ఇవ్వాల్సిన పార్లమెంటు సభ్యులు ఏం జరుగుతుందో తెలియని అయోమయంతో బయటకు పరుగులు తీశారు. సరిగ్గా టెర్రరిస్టుల దాడి సందర్భంగా పార్లమెంటు భవనం వెలుపల ఆవరించిన భయమే ఇప్పుడు పార్లమెం టు లోపల ఆవరించింది. పార్లమెంటు బయటే కాదు పార్లమెంటు లోపల కూడా టెర్రరిస్టులు ఉంటారని రాజగోపాల్ నిరూపించాడు. అది ఇప్పు డు యావత్ భారత దేశాన్ని కలవరపెడుతోంది.

సాధారణంగా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఏం చేస్తారు. 2001లో మాదిరిగా కారణా లు అడగకుండానే కాల్చిపారేస్తారు.ఆ తరువాత అదొక టెర్రరిస్టు చర్యగా చెపుతారు. కానీ లగడపాటికి మాత్రం మినహాయింపు దొరికింది. ఎందుకం ఆయన ఒక పెట్టుబడిదారుడు. అలాగే డబ్బుసంచులతో ఎవరినయినా కొనేయగలిగే శక్తిమంతుడు. అధికారపక్షాన్నీ ఇంతకాలం మేనేజ్ చేస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు ప్రతిపక్షాన్ని కూడా తనకు అనుకూలంగా మలచుకోగలుగుతున్నాడు. లేకపోతే తల పండిన పార్లమెంటేరియన్ ఎల్‌కే అద్వానీ అంత అధ్వాన్నంగా ఎలా మాట్లాడుతున్నాడు? ఆయనను పార్లమెంటులో కలిసిన విలేకరులు లగడపాటి ఎపిసోడ్ మీద మాట్లాడవలసిందిగా కోరారు.

ఆయన మాత్రం అన్నీ చెప్పి బడ్జెట్ తప్ప ఇంకేదీ చర్చలోకి రావొద్దని చెప్పాడు. ఆ వెంటనే అప్పటిదాకా తెరవెనుక వుండి వ్యూహాలు రచించిన చంద్రబాబు ప్రత్యక్షమయ్యాడు. ఐదువందల మందికి పైగా సభ్యులున్న లోక్‌సభలో కేవలం ఐదుగురు సభ్యులే ఉన్న ఆయనకు ఢిల్లీలో ఏం పని అని అడగకండి. ఇప్పు డు సీమాంధ్ర ఉగ్రవాదులకు తర్ఫీ దు ఇస్తున్నది ఆయనే! సాధారణంగా ఇలాంటి సమయంలో ఆయన చేతనయితే సమర్థించాలి, చేవ ఉంటే వ్యతిరేకించాలి, కానీ ఆయన తెలంగాణ వ్యతిరేకులను కూడగట్టే దళారీ పనిలో ఉన్నాడు. అప్పటిదాకా తెరవెనుక ఉన్న ఆయన ఉత్సాహం ఆపుకోకుండా టీవీల ముందుకు వచ్చి లబోదిబోమంటూ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నా డు. ఇదంతా కాంగ్రెస్ ఆడిస్తోన్న నాటకమని ఆడిపోసుకున్నాడు. ఇంకేముంది తెలుగు చానెల్స్ అన్నీ అసలు విషయం వదిలేసి ఇప్పుడు రాజగోపాల్‌ను రక్షించే పనిలో ఉన్నాయి. ఆత్మరక్షణ కోసమే ఆయ న మిరియాల పౌడర్ సభలోకి తెచ్చాడని చెప్పిస్తున్నాయి.

రాజగోపాల్ ప్రవర్తనలో కొత్తగా వచ్చిన మార్పే మీ లేదు, ఆయన 2009 నాడే తెలంగాణవాదుల తో కసబ్ అనే పేరును తెచ్చుకున్నాడు. ఇప్పుడు అది నిరూపించుకున్నాడు.ఇప్పుడు అతనికి తోడయిన మరో దుండగుడు తెలుగుదేశం పార్టీకి చెంది న మోదుగుల వేణుగోపాలరెడ్డి. ఆయన తెలంగాణను పీల్చి పిప్పిచేస్తోన్న రాంకీ గ్రూప్‌కు దగ్గరి బంధువు.

ఆయన గతంలోనే రైళ్ళు పేల్చి వస్తానని, మానవ బాంబుగా మారిపోతానని చెప్పాడు. ఇప్పు డు సరిగ్గా అదే పని చేశాడు. ఆయన లోక్‌సభలోకి కత్తితో ప్రవేశించాడని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో విచారణలో తేలుతుంది. కానీ ఆయన గత చరిత్ర అలాంటి మనస్తత్వం ఉందనే చెపుతోం ది. ఈ ఇద్దరే కాదు సీమాంధ్ర నేతలంతా పార్లమెంటులో తీవ్రవాదులనే తలపింపజేశారు. అనకాపల్లి ఎంపీ సబ్బంహరి సభలోనే ఆత్మాహుతికి దళపతి అవతారం ఎత్తారు. ఆయన నిండుసభలో ఆత్మాహుతికి పాల్పడతానని బెదిరించడంతో ఆయన సభ లో ఉన్నంత సేపూ ఆయనను, మార్షల్స్, భద్రతా సిబ్బంది కనిపెడుతూనే ఉన్నాయి. మైకులు విరిచేసి విసిరేయడం, కంప్యూటర్లు ఎత్తేయడం అద్దాలు పగులగొట్టడం ఇట్లా సభలో సీమాంధ్ర ఎంపీలు చేయని హింస లేదు. ఆ చర్యలు గమనించిన వారు ఎవరైనా సరే టెర్రరిస్టు చర్యలకు తీసిపోవనే అంటారు. ఇది కేవలం సభాహక్కులకే కాదు, దేశ సార్వభౌమాధికారానికి కూడా ముప్పుగానే భావించాలి.

భారతదేశానికి రాజ్యాంగం తయారు చేసుకున్నప్పుడు చాలామంది ఈ దేశంలో న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన పరిపాలనకు అంకురార్పణ జరుగుతుందని ఆశపడ్డారు. భారత రాజ్యాంగం ప్రజలకొ క పెట్టని కోటగా ఉండి కాపాడుతుందని, పౌరులందరికీ సమానమైన హోదా, విలువ, గౌరవం దక్కుతాయనీ భావించారు. సమాజంలో అప్పటిదాకా ఉన్న ఆధిపత్య ధోరణులన్నీ అంతమైపోతాయనీ అనుకున్నారు. అందుకే రాజ్యాంగ పీఠికలో భారతీయులమైన మేము ఈ రాజ్యాంగాన్ని రాసుకున్నామని ప్రకటించారు. సర్వజన ప్రాతినిధ్యం ఉన్న రాజ్యాంగ సభ దీన్ని రూపొందించింది. రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వేదికైతే ఇక ఈ దేశాన్ని ఎవరు కాపాడగలరు? దీనంతటికీ కాంగ్రెస్ పార్టీ బలహీనతే కారణం. ఆ పార్టీ 2009న తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించినప్పుడే లగడపాటిని పార్టీ నుంచి బయటకు పంపించి ఉంటే సభలో ఈ పరిస్థితి వచ్చేది కాదు.

ఇదొక్క లగడపాటి మనోవైకల్యం మాత్రమే కాదు. ఆధిప త్య ధోరణికి, అధికారానికీ, అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ సీమాంధ్ర సామూహిక నాయకత్వ వైపరీత్యం.
ఒక కసబ్ వెనుక, ఒక అఫ్జల్ గురు వెనుక రకరకాల తీవ్రవాద సంస్థలు ఉన్నాయని చెబుతుంటా రు. రాజగోపాల్ వెనుక కూడా రాజకీయ తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా దీనిని ఎదుర్కోకపోతే ఒక్క తెలంగాణకే కాదు ఈ దేశానికే ముప్పు. తెలంగాణ వచ్చి నా రాకపోయినా ప్రజల్లో భయోత్పాతం సష్టిస్తూ భారత రాజ్యాంగ పునాదులనే ధ్వంసం చేస్తున్న ఇలాంటి టెర్రరిస్టులను తరిమికొడితే తప్ప ప్రజాస్వామ్యం మనుగడ కష్టం. [email protected]

425

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ

Published: Fri,January 24, 2014 12:06 AM

ఇదేనా రాజ్యాంగ నిబద్ధత?

గతంలో రాష్ర్టాల విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ప్రవర్తించలేదు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడి