సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?


Fri,March 28, 2014 12:33 AM

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార పదవులిస్తే సామాజిక తెలంగాణ రాదు.

సామాజిక ఉద్యమాలు చాలా సందర్భాల్లో ఆశించిన లక్ష్యాలు నెరవేర్చ డం కంటే ఊహించని పార్శ్వాలను తడుముతుంటాయి. ఉద్యమ సందర్భంలో ప్రజానీకం దీనివల్ల తమకెలాంటి మేలు జరుగుతుందో ఆలోచించి అందులో భాగస్వాములవుతారు. తెలంగాణ ఉద్యమం కూడా సమష్టి చైతన్యానికి ప్రతీకగా ఉంటూనే సామాజిక మూలాలను వెతికే ప్రయత్నం చేసింది. మౌలికమైన అనేక అంశాలను వెలుగులోకి తెచ్చింది.
ఉద్యమంలో ఉన్న భిన్న భావజాలాలున్న వ్యక్తులు, సంస్థలు, ప్రజాసంఘాల మూలంగా ఉద్యమం కేవలం రాష్ట్ర సాధనకే పరిమితం కాకుండా అనేక కీలకమైన అంశాలను చర్చకు పెట్టింది. అందులో ఎలాంటి రాష్ట్రం, ఎవరి రాష్ట్రం, ఎవరి అధికారం అనే అంశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సామాజిక తెలంగాణ, ప్రజాస్వామికతెలంగాణ మీద చర్చలు, వాదోపవాదాలు జరిగాయి. నిజానికివి విస్తతితో కూడుకున్నవి.
ప్రజల పోరాటాలు, ఉద్యమాల ద్వారా మాత్రమే సాధ్యమయ్యేవి. కానీ రాజకీయపార్టీలు వాటిని ఎన్నికలకు, ముఖ్యమంత్రులకు పరిమితంచేసి రాజకీయ సంకుచితవాదంవైపు నడిపిస్తున్నాయి. సామాజిక తెలంగాణ అన్న విశాలభావనను సామాజికన్యా యం అనే తేలికపాటి ఎన్నికల నినాదంగా మార్చివేశాయి.
తెలంగాణవాదం ఈ ప్రాంతపు ప్రజల ఉద్వేగపూరిత ఆకాంక్షగా మొదలయినప్పటికీ క్రమక్రమంగా ఒక సామాజిక, ఆర్థిక ప్రత్యామ్నాయ నమూనాగా మారింది. అలాగే వలసవాద ఆధిపత్యానికి వ్యతిరేకంగా బలపడింది.
1952లో వచ్చిన ముల్కీ వ్యతిరేక ఉద్యమం, 1969లో వచ్చిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, మళ్ళీ 1990లో మొదలయిన ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలో వచ్చిన మార్పుకు అద్దం పడతాయి. ఈ దశలో తెలంగాణవాదం మరింత పరిణతితో ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో తెలంగాణలో జరిగిన సామాజిక విధ్వంసానికి విరుగుడుగా, ఒక ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చింది. మరోవైపు మార్కెట్ మాయాజాలంలో చిక్కుకున్న చేనేత మొదలు ఇతర వత్తులు కుప్పకూలిపోయాయి.
నేత కార్మికుల ఆత్మహత్యలు,వలసలుపెరిగిపోయాయి. గ్రామీణ సామాజిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. తెలంగాణ కన్నీటి పాటను గోరటి వెంకన్న,గద్దర్ లాంటి అనేకమంది తెలంగాణ వాగ్గేయకారులు వాడ వాడ లా పాడి వినిపించారు. కవులు, రచయితలు గ్రామా ల విధ్వంసం మీద అనేక రచనలు చేశారు. ఉద్యోగాల మీద అధికారిక నిషేధం సాగింది. ప్రభుత్వ రంగంలో ఉపాధి కల్పించిన వందలాది పరిశ్రమలను మూసివేయడంతో లక్షలాది ఉపాధి కోల్పోయారు.
ప్రభుత్వ రంగంలో కొత్త ఉద్యోగాలు లేక, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు రాక నిరుద్యోగుల్లో అసంతప్తి తారాస్థాయికి చేరుకుంది. ఈ దశలో సంఘటితమై నిరసన తెలపడానికి, పోరాడటానికి కూడా అవకాశాలు లేకుండా ప్రభుత్వం అశాంతిని అణచివేసే అధికారం పోలీసు దొరకు అప్పగించింది. ఇట్లా ఒక దశాబ్ద కాలంలో మొత్తం తెలంగాణ సమాజాన్ని మార్కెట్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం చేసింది. దీనంతటికీ కర్త, కర్మ, క్రియ అన్నీ చంద్రబాబునాయుడు అన్నది చారిత్రక సత్యం. సరిగ్గా ఈ సంక్షోభపు పునాదుల నుంచే తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టింది.
తెలంగాణను ఒక పార్లమెంటరీ రాజకీయ నినాదంగా మార్చి ప్రజలకు ఒక కొత్త ఆశ రేకెత్తించింది. మన నీళ్ళు మనకు రాకుండా పోతున్నాయని, ఉద్యోగాల్లో మన వాటా మనకు దక్కడం లేదని ప్రజల సమస్యలకు కారణం వలస పాలనే కారణమని మన రాష్ట్రం మనకు వస్తే మన పాలన మనకు ఉం టుందని ఒక సరికొత్త ప్రతిపాదన చేసింది.
తమ కష్టాలకు తెలంగాణ రాష్ట్ర సాధనే ఒక తక్షణ పరిష్కారంగా ప్రజలు భావించి ఉద్యమంలో కదిలారు. ప్రజలంతా కేసీఆర్‌ను నమ్మి ఆయన వెంట నడవకపోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే తమ కష్టాలు తీరుతాయని మాత్రం నమ్మారు. ఆ నమ్మకంతోనే ఎవరి వేదికల్లో వారు తెలంగాణవాదాన్ని ప్రచారం చేశారు. సామాజిక పునర్నిర్మాణ భావనకు పునాది పడింది అక్కడే. ఒక కులం మరో కులాన్ని దోచుకోవడం, వివక్ష ప్రదర్శించడం, అవమానకరమైన రీతిలో తక్కువ చేసి చూడడం జరిగినట్టే తెలంగాణ సమాజాన్ని కూడా ఆంధ్రాపాలకులు చూశారు.
కాబట్టే ఇది కేవలం రాజకీయ పోరాటంగా కాకుం డా సామాజిక ఆర్థిక స్వయం ప్రతిపత్తి కోసం సాగిన ఉద్యమంగా గుర్తింపు పొందింది. నిలబడి గెలిచింది. ఈ గెలుపులో తెలంగాణ ప్రజలందరి భాగస్వామ్యం ఉంది. అంటే తెలంగాణ సమాజంలోఎక్కువ సం ఖ్యలో ఉన్న అణగారిన కులాలకు, వర్గాలకు ఎక్కువ భాగస్వామ్యం ఉంది. ఆంధ్రా పాలకుల దోపిడీ నుం చి తెలంగాణ విముక్తి కావాలని కోరుకున్నట్టే భూస్వాములు, దొరలూ, అగ్రవర్ణ ఆధిపత్య శక్తుల నుంచి, భావజాలం నుంచి కూడా విముక్తి కావాలని ఈ వర్గాలు, కులాలు, ప్రజలు కోరుకున్నారు.
దాన్నే వాళ్ళు సామాజిక తెలంగాణ అన్నారు. సామాజిక తెలంగాణ అంటే ఉద్యమ నాయకత్వం అప్పగించ డం అని అప్పట్లో కొందరు వాదించారు. ఇప్పుడు చాలామందే రాష్ట్ర పరిపాలనను అణగారిన వర్గాల నాయకులకు అప్పగించడమని వాదిస్తున్నారు. నిజానికి ఈ రెండూ కాదు. ఎక్కడయినా నాయకులు ఎది గి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు. నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార పదవులిస్తే సామాజిక తెలంగాణ రాదు.
సామాజిక తెలంగాణ ఆచరణాత్మక ప్రణాళిక, ప్రజల భాగస్వామ్యం, ఒక ప్రత్యేక అభివద్ధి లక్ష్యంగా సాగాల్సిన ఉద్యమం.అది సామూహిక చైతన్యం ద్వారా సాధించావలసిందే తప్ప వ్యక్తిగత పదవులతో దానికదే రాదు. సామాజిక తెలంగాణ రావాలంటే సమాన భాగస్వామ్యంతోపాటు సమ గ్ర ప్రణాళికతో ధ్వంసమైన సామాజిక రంగాలన్నిటినీ పునర్నిర్మించాలి. అన్ని కులాలకు, వర్గాలకు వారి వారి రంగాల్లో గౌరవప్రదమైన జీవిక ఉండేలా ఈ ప్రణాళిక ఉండాలి.
విద్య, వైద్యం, ఉపాధి రంగాల మీద ప్రత్యేక దృష్టి ఉండాలి. దీనికి ఇప్పటిదాకా ఆచరిస్తున్న పద్ధతులు, విధానాలు కాకుండా ప్రజలకు అనుకూలమైన ఆర్థిక విధానాలు ఉండాలి. మొత్తంగా పాలన సంస్కరించబడాలి. భూమి పంపి ణీ జరగాలి, చదువులు అందుబాటులో ఉండాలి. ఆ చదువులకు సార్థకత ఉండాలి. అన్నిటికీమించి అణగారిన వర్గాలను మనుషులుగా చూసే సంస్కారం, సమాన భావన రావాలి. దీనికి ప్రజల్లో చైతన్యం రావాలి. నిజంగానే స్వతంత్రుడు, శక్తివంతుడైన ఒక దళిత ప్రతినిధి నాయకత్వంలో పాలన ఉంటే ఇవన్నీ సాధించవచ్చు. కానీ అలా నాయకత్వం వహించే శక్తి ఉన్నవాళ్ళు, ఒకవేళ ఉన్నా వారికి స్వాతంత్రం ఉన్నా దా అన్నది కూడా ఆలోచించాలి.
తెలంగాణ విధ్వంసం మొదలైన నాటి నుంచి, ఇంకా చెప్పాలంటే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ నాయకులంతా రాజకీయాల్లో, పదవుల్లో ఉన్నారు. కాకపోతే ఆంధ్రా పాలకుల కింద తాబేదార్లుగా ఉన్నారు. మా నాయకుడు, మా ముఖ్యమంత్రి ముఖ్యం అనుకున్నారు తప్ప నా ప్రాంతం ఇది అని అనుకోలేదు. అధికారంలో ఉన్నవ్యక్తి ఏ కులమైనా ఆ పార్టీ విధానాల ప్రకారమే, తన నాయకుడి ఆదేశాన్ని బట్టే నడుస్తాడు.
తనదే ఒక స్వతంత్ర పార్టీ అయితే తప్ప స్వతంత్రంగా ఉండడం భారత దేశ పార్లమెంటరీ వ్యవస్థలో సాధ్యం కాదు. ఇది అంబేద్కర్ మొదలు కాన్షీరాం దాకా, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మొదలు ఆయన యాదవ శిష్యులు ములాయం, లాలూప్రసాద్ దాకా నమ్మారు. వాళ్ళు సొంతంగా పార్టీలు స్థాపించుకుని, ప్రజల్లోకి వెళ్లి, వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడ్డారు. ప్రజలందరికీ పాలకులయ్యారు తప్ప, పెత్తందార్ల కింద పెద్ద పాలేర్లుగా ఉండాలనుకోలేదు.తెలంగాణలో ఇప్పుడు కొందరు కొత్త పాలేర్లను నియమించేస్తున్నారు.
సామాజిక తెలంగాణ డిమాండ్ ఊపందుకున్న ఉద్యమ కాలంలో కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి బాణాన్ని వదిలారు. ఒకటికి వందసార్లు చెప్పారు. కానీ ఇప్పుడు అది సాధ్యం కాదన్న సంకేతాలు ఇస్తున్నారు. కారణాలు ఏవైనా ఆయన మాట మీద నిలబడరన్న భావనను మరింత బలపరిచింది. ఇదే అదునుగా కాంగ్రెస్ బీసీని పార్టీ అధ్యక్షుడిగా చేసి సామాజిక తెలంగాణ తమతోనే సాధ్యం అనడానికి ఇదే సాక్ష్యం అంటున్నది.
కానీ పొన్నాల లక్ష్మయ్య సామర్థ్యం మీద నమ్మకం లేకనో ఏమో ఆయనను కేవలం వ్యం గ్యపు మాటలకు పరిమితంచేసి పని చేయడానికి ఇంకొక రెడ్డి గారిని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించుకుంది. తెలంగాణ ఆర్థిక, సామాజిక, సాంస్కతిక జీవనాన్ని కుప్పకూల్చిన చంద్రబాబు తెలంగాణకు ఇప్పుడు బీసీని ముఖ్యమంత్రి చేసి సామాజిక న్యా యం చేస్తానంటున్నాడు. ఆంధ్రాలో సామాజిక న్యాయం అవసరం లేనట్టుగా అక్కడ ఆయనే ముఖ్యమంత్రి కావాలని కలగంటున్నాడు.తెలంగాణ కోసం రెడీమేడ్‌గా మార్కెట్లో ఉన్న బీసీ నేతల్ని ముందుకు తెస్తున్నాడు.
అభ్యర్థుల ఎంపిక మొదలు అన్ని అధికారాలు తన దగ్గరే ఉంచుకున్న నాయుడు అలంకారప్రాయ పదవుల్లో తెలంగాణ బీసీలను నియమిచారు. ఈ నాయకులు మొహమాటం లేకుండా తెలంగాణ అభివద్ధి మా బాబుగారితోనే సాధ్యమని విధేయతను చాటుకుంటున్నారు. ఇకపోతే మరో రెడ్డిగారి అధ్యక్షతన నడుస్తున్న బీజేపీ కూడా బీసీనే ముఖ్యమంత్రిని చేస్తుందట.
అయినా ఎవరో ఒక బీసీని, ఎస్సీలు ఎందుకు భరించాలి? అతనికి కులం ఉండదా? అలాగే ఎస్సీల్లో ఒక ఉపకులం వ్యక్తిని ఇంకో ఉపకులం వ్యక్తి అంగీకరిస్తాడా? అసలు ఈ ఇద్దరినీ ఇతర కులాలు ఆమోదిస్తాయా? స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు పాలకులు దళితులకు, బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే రాయితీలు, వెసులుబాట్లు, పదవులన్నీ ఒక భిక్షంగానో,దానంగానో ఇస్తున్నారు తప్ప, వాళ్ళ హక్కు అనే అవగాహన ప్రజలకు కల్పించలేకలేకపోయారు.
అంతేకాదు పాలకులుగా మారాలనుకునే దళిత బహుజన వాదులు కూడా వారిమధ్య ఏకత్వ భావన సాధించలేకపోయారు. అగ్రవర్ణాలు దళితులను ఎలా చూస్తున్నాయో, ఎంత దూరంలో పెడుతున్నాయో బీసీ కులాలు కూడా అలాగే చూస్తున్నాయి. ఇటువంటి ధోరణి ఉన్న సమాజంలో ఇది సాధ్యపడే పనేనా అన్నది కూడా ఆలోచించాలి. ప్రజల్లో అటువంటి సమభావన కలిగించకుండా, అలాంటి నాయకత్వం ఎదగకుండా, సామాజిక తెలంగాణ కావాలని కోరుకోవడం పగటి కలె అవుతుంది.
కులంతో సంబంధం లేకుండా స్పష్టమైన ప్రణాళికకు చిత్తశుద్ధి, నిబద్ధత, కార్యదక్షతకు తోడైతే అగ్రకులం వాైళ్లెనా సామాజిక తెలంగాణను ఆచరణలోకి తేవచ్చు. పునర్నిర్మాణం గురించి మాట్లాడేవాళ్లు నవ నిర్మాణం అని చెప్తున్న వాళ్లు ఎవరైనా సరే ధ్వంసం చేసిన వాళ్లకు పునర్నిర్మించే అర్హత లేదని గుర్తించుకోవాలి. నవ తెలంగాణ నిర్మించుకునే హక్కు తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి నడిపించిన వాళ్లకే ఉంటుందని గమనించాలి.
[email protected]

364

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ

Published: Fri,January 24, 2014 12:06 AM

ఇదేనా రాజ్యాంగ నిబద్ధత?

గతంలో రాష్ర్టాల విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ప్రవర్తించలేదు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడి