నిదానమే ప్రధానం


Sat,June 7, 2014 12:18 AM

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడిపించబోతున్నారు. ఉద్యమ కాలంలో తాను నిర్దేశించిన లక్ష్యాన్ని తానే పూర్తి చేసే బాధ్యతను తలకెత్తుకున్నారు. నిజానికి ఇది తలకు మించిన భారమే.ఉద్యమం పరిపాలన ఒకటి కాదు. ఉద్యమకారులకు ఉన్న స్వేచ్ఛ పాలకులకు ఉండదు. ఉద్యమం పరిమితులు, షరతులను ధిక్కరించి సాగి తే పరిపాలన పరిమితులకు లోబడి నడుస్తుంది. ఉద్యమ కారులకు ధిక్కార స్వభావం, మొండితనం, దూకుడు ఉంటే ఉండవచ్చు కానీ పాలకులకు అవేవీ పనికిరావు. పాత్రల్లో ఉన్న ఈ వైవిధ్యాల వల్లే ఉద్యమకారులు పాలక వర్గాలుగా మారినప్పుడు తడబడుతుంటారు. త్వరత్వరగా పనులు పూర్తి చేయాల న్న తాపత్రయం వల్ల తప్పటడుగులు వేస్తుంటారు. తాము ఉద్యమకాలంలో లేవనెత్తిన అన్ని సమస్యల ను వెంటనే పూర్తి చేయాలనే తొందర దీనికి కార ణం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ కూడా ఇప్పుడు ఆ తాపత్రయంలోనే ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఆలస్యంగానైనా జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్రం తొలి ప్రభుత్వం ఏర్పడింది. ఉద్యమంలో క్రియాశీలంగా ఉన్నవాళ్ళు, అంతో ఇంతో కార్యదక్షులు అన్న పేరు తెచ్చుకున్నవాళ్లనే ఆయ న మంత్రివర్గంలోకి తీసుకున్నారు.


వాళ్ళలో సగం మంది మంత్రులు కూడా ఇంకా అధికార బాధ్యతలు చేపట్టనేలేదు. ఈలోగా రుణమాఫీ విషయంలో కేసీఆర్ బ్యాంకర్ల తో సమావేశం అయ్యారు. లోపల ఏం మాట్లాడుకున్నారో తెలియదుగానీ రుణమాఫీకి పరిమితులు విధిస్తున్నారన్న వార్త గుప్పుమంది. అంతే ఒక్క రోజులో సీన్‌రివర్స్ అయ్యింది కేసీఆర్ ఎప్పుడు తప్పులు చేస్తా డా అని ఎదురు చూస్తున్న ప్రతిపక్షాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. రాజకీయం ఇలాగే ఉంటుంది. ప్రజలు కూడా తమ ప్రయోజనాల తరువాతే ఏదయినా ఆలోచిస్తారు. నిజానికి రుణమాఫీ విషయం లో రైతులందరికీ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని టీఆరెస్ మ్యాఫెస్టోలో చెప్పింది. ఏ రైతులు, ఏ రుణాలు, ఏసంవత్సరానివి అన్న వివరాలేవీ అం దులో లేవు. ఎన్నికల సమయంలో అన్ని అంశాల కంటే రైతుల రుణమాఫీనే కేసీఆర్ ఎక్కువగా ప్రచా రం చేశారు. అప్పటికే రుణభారంతో కునారిల్లిపోయి న రైతులంతా నిజంగానే ఇదొక వరంగా భావించా రు. ఇప్పుడు అందులో కోతలు విధించడం వారికి మింగుడు పడడంలేదు. కాబట్టి ముందుగా చెప్పిన మాటకు కట్టుబడి ఉండడమే మంచిది. ఇది మొదటి సవాలు మాత్రమే. ఇటువంటివి భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదురు కాబోతున్నాయి.

తెలంగాణ ఉద్యమం అనేక ఆర్థిక సామాజిక అం శాలతో ముడివడి ఉన్న ఒక విశాల ఎజెండాను ముందుకు తెచ్చింది. దానికితోడు ఉద్యమ సారథి గా ఆయన గత 14సంవత్సరాల్లో ప్రజలలో తెలంగాణ ఆకాంక్షను సజీవంగా ఉంచడానికి ఒక రంగు ల ప్రపంచాన్ని సష్టించారు. ఆయన ఉద్యమకాలంలో తరచూ ప్రస్తావించిన నీళ్ళు, నిధులు, నియామకాలు ఇప్పుడు ప్రధాన సవాళ్లుగా మారబోతున్నా యి. సుదీర్ఘకాలంగా నడిచిన తెలంగాణ ఉద్యమం ఇటువంటి బలమైన ఆకాంక్షలను ప్రజ ల్లో ప్రోది చేసింది. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్న సమయంలో సకల జనులను అందులో భాగస్వాములను చేయడానికి ఆయన అనేక విషయాలు చెప్పారు. తెలంగాణ సమస్య ఒక సుదీర్ఘ కాల వివక్ష నుంచి పుట్టింది. పాలక వర్గాలు దశాబ్దాలపాటు సాగించిన వివక్షే తెలంగాణ వెనుకబాటుతనానికి కారణమయ్యింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుం చీ వలస పాలన అంతమైతే ప్రజల బతుకులు బాగుపడతాయన్న నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేసింది. ఆంధ్రా పాలకుల దోపిడీ, వివక్ష వల్ల వివిధ రంగాల్లో ఎంత నష్టం కలిగిందో లెక్కలేసింది. మనరాష్ట్రం మనకు వస్తే తప్ప అభివద్ధి సాధ్యం కాదని చెపుతూ ప్రజల ఆకాంక్షలన్నీ ప్రతిబింబించే విధంగా ఎన్నికల మ్యానిఫెస్టో రూపొందించింది. దానినొక సాదా సీదా ఎన్నికల పత్రంగా కాకుండా తెలంగాణ పునర్నిర్మాణ ప్రణాళికగా ప్రజల ముందుకు తెచ్చింది. ప్రజలు నమ్మారు. అనూహ్యమైన రీతిలో ఆ పార్టీకి బ్రహ్మరథం పట్టా రు. ఇంతవరకు బాగానే ఉంది కానీ పునర్నిర్మాణం అనేది మనం వేగిర పడినంత మాత్రాన పూర్తయ్యేది కాదు. అనేక అభివద్ధి ఆకాంక్షలతో ముడివడిన విషయం.కాబట్టి విధాన నిర్ణయాలకు కొంత సమ యం, సమాలోచన అవసరం అవుతాయి. బహుశా తమను గెలిపించిన ప్రజలకు ఎంతోకొంత వెంటనే చేసి చూపించాలన్న ఉద్దేశ్యంతో ముందుగా రుణమాఫీ అంశం చేపట్టి ఉండవచ్చు. కానీ దానిలో ఉన్న లోతుపాతులను రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించి, రాబోయే శాసనసభలో విధి విధానాలు ప్రకటించి ఉంటే రాజకీయాలకు ఆస్కా రం లేకుండా సమస్య పరిష్కా రం అయ్యేదేమో.

టీఆరెస్ ఎన్నికల ప్రణాళికలో ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి. అవన్నీ రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాది అవుతాయి. కానీ అదే సమయంలో రాష్ట్ర ఖజానాకు మోయలేని భారం కూడా కాబోతాయి. అన్నీ ఒకేసారిగా కాకుండా దశల వారీగా చేపట్టి పూర్తి చేస్తే తప్ప అవి సాధ్యమయ్యే పనులు కావు. రుణ మాఫీ సమస్య ఏదో ఒక విధంగా సద్దుమణిగి నా రేపు కరెంటు సమస్య ముందుకు రానుంది. అది ఊహించే కేసీఆర్ చర్యలు చేపడుతున్నారు. తొలుత చెప్పినట్టుగా ఎనిమిది గంటలు కరెంటు అందేలా చర్యలు చేపట్టవలసిన అవసరం ఉన్నది. తెలంగాణ లో ఇప్పటికే 1500 మెగావాట్ల విద్యుత్ కొరత ఉం ది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయానికి ఎనిమిది గంట ల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాల్సి ఉన్నది. అలాగే భూమిలేని దళిత ఆదివాసీలకు ఒక్కొక్క కుటుంబానికి మూడెకరాల సాగు భూమి ఇస్తామన్నారు. రేపో మాపో వాళ్ళూ అడగడం మొదలు పెడతారు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర సాగు కు వీలయిన మిగులు భామి ఏదయినా ఉందా, లేకపోతే రైతుల నుంచి కొనుగోలు చేస్తారా, అందుకు ఎంత ఖర్చు కాబోతుంది.

ఈ అంచనాలన్నీ మొద లుపెట్టాలి. ఇవన్నీ చూసుకునే కొంత సమయం తీసుకుని అయి నా ఎప్పటి నుంచి భూ పంపిణీ ఉంటుందో ముందుగానే చెప్పాలి. ఇప్పుడు చాలా మంది నీడలేని నిరు పేదల్ని రెండు బెడ్ రూంల ఇల్లు వూరిస్తునాయి. గహ నిర్మాణ పథకం కూడా వివాదాస్పదం కావొ చ్చు. ఇప్పుడు రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఎందరు, ఎంతమంది ఇప్పటికే వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందారు వంటి వివరాలన్నీ గ్రామ స్థాయి నుంచి సేకరించాల్సి ఉంది. ఆ పని ఇప్పుడు మొదలు పెడి తే తప్ప ఏడాదిలోపు ఇల్లు కట్టిస్తారన్న కల నెరవేర దు. ఇకపోతే నియోజకవర్గానికి లక్ష ఎకరాల చొప్పున సాగునీరు కూడా అంత సులభం కాదు. ఇది నీటి వనరుల అందుబాటు మీద ఆధారపడి ఉంటుంది.ముందుగా చెరువులు పూడికలు తీసి ఆధునీకరిస్తామని మ్యానిఫెస్టో చెపుతోంది. కానీ మరో వారంలో వర్షాలు మొదలయితే ఇది కూడా ఆరు నెలల దాకా ఆచరణ సాధ్యం కాదు.

నిరుద్యోగ యువత నుంచి కూడా మరో పెను సవాలు ఎదురు కాబోతున్నది. నిజానికి 2009 లో ఉద్యమాన్ని మొదలుపెట్టింది ఉద్యోగులయితే మలు పు తిప్పింది మాత్రం ఉస్మానియా కాకతీయ విద్యార్థులు, అలాగే నిరుద్యోగులు. వారిలో చాలామంది తెలంగాణ వస్తే తమ బతుకులు బాగు పడతాయని కలలుగన్నారు.తెలంగాణ సాధనలో ప్రాణాలొడ్డి పోరాడారు.కానీ ప్రభుత్వ ఉద్యోగాల పంపిణీ పూర్తయితే తప్ప ఎన్ని ఉన్నాయో ఉద్యోగుల పంపిణీ ప్ర క్రియ పూర్తయితే తప్ప తెలిసేలా లేదు. మరోవైపు తాత్కాలిక కాంట్రాక్టు ఉద్యోగాల్లోఉన్నవాళ్ళు కూడా పర్మినెంట్ అవుతామన్న ఆశతో ఉన్నారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తే కొంత ఉపశమనం కలుగవచ్చు. ఈ ప్రక్రియ వెంటనే మొదలు కావాల్సి ఉన్నది.అలాగే కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కూడా తెరాస హామీలిచ్చింది. హైదరాబాద్‌కు సహజంగానే పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉంది. ఇప్పటికే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)గా గుర్తింపు పొందింది. అవకాశాలు అందుకోవాలంటే నిరుద్యోగుల్లో అవసరమైన నైపుణ్యాన్ని పెంచే దిశగా ఆలోచించాలి.

తెరాస కేజీ నుంచి పీజీ వరకు పూర్తిగా నిర్బంధ ఉచిత విద్యను ప్రతిపాదించింది. నిజానికి ఇప్పుడు విద్యారంగం కేజీ నుంచి పీజీ వరకు కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉంది. వాళ్ళిప్పుడు ప్రభుత్వాన్ని శాసించే స్థితిలో ఉన్నారు. విద్యారంగంలో సమూల ప్రక్షాళన చేపడితే తప్ప ఇది సాధ్యం కాదు. మరోవైపు ఉన్నత విద్య ఏ మాత్రం నాణ్యత లేనిదిగా తయారయ్యిం ది. విశ్వవిద్యాలయాలకు వసతులు వనరులు లేవు. పాలక మండళ్లు, వైస్ చాన్స్‌లర్లు కూడా చాలా విశ్వవిద్యాలయాల్లో లేరు. విద్యారంగ సంస్కరణలు ముందుగా విశ్వవిద్యాలయాల నుంచి మొదలు కావాలి. మ్యానిఫెస్టోలో కేజీ నుంచి రెసిడెన్షియల్ కాకుండా ప్రాథమిక స్థాయిలో కామన్ స్కూల్ సిస్టం తేవాలి. ఐదో తరగతి నుంచి మాత్రమే రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండాలి. ఇవన్నీ ఏకపక్షం గా కాకుండా అధ్యాపకులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చించి ఏకాభిప్రాయంతో నిర్ణయా లు తీసుకోవాలి.
నిర్ణయాలు ఏవైనా ఆయా రంగాల్లో నిపుణుల తో, ప్రజాసంఘాలు, పౌర సమాజం ప్రతినిధులతో చర్చించి మాత్రమే తీసుకుంటామని కేసీఆర్ పదేపదే చెపుతున్నారు.

నిజానికి అదే మంచి పద్ధతి. ప్రజలను భాగస్వాములను చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతుంది. ప్రతిపక్షాల విమర్శలకు ఆస్కారం లేకుండా చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం లో ఇప్పుడున్న మంత్రులలో చాలామంది ఉద్యమకారులు. ప్రభుత్వ పాలనలో మొదటిసారి భాగస్వామైన వాళ్ళు. ఉద్యమంలో ఉన్న దూకుడు పాలనలో పనికిరాదు. ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఇప్పటి వరకు చేరిన అధికారులలో చాలా మంది పరిపాలన అనుభవంతో పాటు సమర్థత, నిజాయి తీ ఉన్నవాళ్ళు. వాళ్ళతో సమన్వయం అవసరం. ఉద్యమాన్ని ఉరకలెత్తించినట్టుగా పరిపాలనను పరుగెత్తించడం కుదరదు. నిలకడగా నడిస్తేనే అలసట లేకుండా ఐదేళ్ళ ప్రయాణం సాగుతుంది. నిదానమే ఇప్పుడు ప్రధానం!
[email protected]


636

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ

Published: Fri,January 24, 2014 12:06 AM

ఇదేనా రాజ్యాంగ నిబద్ధత?

గతంలో రాష్ర్టాల విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ప్రవర్తించలేదు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడి

Featured Articles