తెలంగాణ కాలజ్ఞాని


Tue,June 20, 2017 12:11 AM

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ (1934-2011)ను స్మరించుకుంటున్నది. కలలు, ఆశలు, ఆకాంక్షలు అందరికీ ఉంటాయి. తమ గురించి తమ జీవితం గురించి పతిఒక్కరూ నిరంతరం ఏదో ఒక కల కంటూనే ఉంటారు. దాన్ని నిజం చేసుకోవాలని తపిస్తుంటారు. ఆచార్య జయశంకర్ కూడా అలాంటిదే ఒక కలగన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్తగా మాత్రమే కాదు, రాష్ట్రాల పునర్నిర్మాణసూత్రాల ఆవిష్కర్తగా కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.

తన గురించి కాకుండా తన ప్రాంతం గురించి తపించా రు. తన జీవితకాలం మొత్తం ఆ కలను సాకారం చేసే దిశగా ప్రయతించారు. తనలో మొదలైన ఆ తపనను తనకు పరిచయమైన ప్రతిఒక్కరి మదిలో నాటాడు. జయశంకర్ మదిలో ఒక భావనగా మొదలైన ఆకలయావత్ తెలంగా ణ జాతిలో భావ చైతన్యాన్ని కలిగించి ఈ ప్రాంత ప్రజల మహాస్వప్నమై విస్తరించింది. గత ఆరు దశాబ్దాలుగా ప్రజల మనసులను తొలుస్తూ కదిలిస్తూ, నడిపిస్తూ వస్తున్న ఆ కల ఎవరినీ నిద్రపోకుండా నిలబెట్టింది. ఈ స్థితిలో జయశంకర్ గారు లేకపోవడం ఒక్క తెలంగాణ సమాజానికే కాదు, యావత్ తెలుగుజాతికి తీరనిలోటుగా కనిపిస్తున్నది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ బతికి ఉంటే పరిస్థితులు ఇంత సంక్లిష్టంగా మారి ఉండేవి కావేమో! ఎందుకంటే ఆయనలో తెలంగాణవాది మాత్ర మే లేడు. ఒక జాతి ఆర్థికంగా ఎదుగడానికి, స్వాలంబనతో మనగలగడానికి కావాల్సిన శాస్త్రీయ ప్రతిపాదనలున్నాయి. గాలిలో ప్రతిధ్వనించే ప్రాంతీయ నినాదాన్ని, ఒక బలమైన ప్రాంతీ య అభివృద్ధి ఆకాంక్షగా, ప్రాంతీయ అస్తిత్వ వాదం గా సిద్ధాంతీకరించిన మేధావిగా ఆయన తన ప్రతిపాదనలో రెండువైపుల నుంచి ఆలోచించారు.

అపోహలు, అనుమానాలు,ఆధిపత్య ధోరణులు, అపనమ్మకాలు, షరతులు, ఉల్లంఘనలు కొనసాగుతున్నంత కాలం ఏ జాతి ఐక్యంగా మనజాలదన్నది సార్ అభిప్రా యం. దీని ప్రాతిపదికనే ఆయన తెలంగాణవాదానికి పదునుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన నాటినుంచి తెలుగు ప్రజల్లో జాతి భావనకంటే ఈ పోకడలే ఎక్కువగా ప్రభావితం చేశాయి. అది అనేక సందర్భాల్లో ఉద్యమాలు,ఆందోళనల రూపంలో చరిత్రలో ఆవిష్కృతమైంది. దీనికి పరిష్కారం ప్రాం తాలుగా విడిపోయి ప్రజలుగా కలిసి ఉండవచ్చన్నది ఆయన ప్రతిపాదనల్లో మొదటిది. షరతులు, ఒప్పందాలతో కలిసిన ఇద్దరిలో నిరంతరం ఒకరిమీద ఒకరికి అపనమ్మకాలు ఉన్నప్పుడు ఎవరికి వారుగా ఉండటమే మంచిది కాబట్టి విభజన ఒక్కటే పరిష్కారమని ఆయన భావించారు. నిజానికి కలిసిన తర్వాతే తెలుగుజాతి భావన ఉందనుకోవడం పొరపాటు. రెండు ప్రాంతాలు కలువక పూర్వం కూడా తెలంగాణ, ఆంధ్రా పాంతాల మధ్య అన్నిరకా ల సంబంధాలు, అనుబంధ బాంధవ్యాలున్నాయి. రెండు ప్రాంతాల్లో వేమన పద్యాలు, సుమతీ శతకాలు, శ్రీశ్రీ మహా ప్రస్థానాలు, బహ్మం గారి కాలజ్ఞానాలు, గుర్రం జాషువా గబ్బిలాలు, నన్నయ, తిక్కన, సోమనల పురాణ పారాయణాలు కలిసే ఉన్నాయి. విభజన వల్ల తెలుగు భాష కో, సంస్కృతికో జరిగే నష్టం ఏమీ లేదు. ఈ ప్రాతిపదికను పునాదిగా చేసుకునే జయశంకర్ తెలంగాణవాదాన్ని ఒక గుణాత్మక, క్రియాశీల సిద్ధాంత భూమికగా మలిచారు.

ప్రస్తుత ఉద్యమం 1968-69లో, 1971-72లో వచ్చిన వాదాలకు భిన్నమైనది. ఆ రెండు వాదాలు ఒక ప్రాంతం నుంచి మరొకరు వెళ్లిపోవాలనో, వెళ్లిపోతామనో వచ్చినవి. కానీ గడిచిన ఇరవయ్యేళ్ళగా జయశంకర్ ఆలోచనల ప్రభావంతో వచ్చిన ఉద్యమాలేవీ తెలంగాణ నుంచి ఆంధ్రా-రాయలసీమ ప్రజలు వెళ్ళిపోవాలని ఏనాడూ అనలేదు. అధికారం, ఆధిపత్యం మాత్రమే వద్దన్నది తెలంగాణ ఉద్యమ సారాంశం. జాగో- బాగో అన్న వారిని కూడా వారించి, మీరు మేల్కోండి మీ వాదనను వినిపించి వారిని ఒప్పించండి అని మాత్రమే జయశంకర్ సార్ చెప్పేవారు. దాన్నే ఆయన భావచైతన్యం అన్నారు. తెలంగాణ ఏర్పాటై న తర్వాత కూడా ఆంధ్రా పజలు ఎవరైనా సరే ఇక్కడే ఉండవచ్చని, అయితే ప్రజలను ఏమార్చే ఆధిపత్య దోపిడీవర్గాల పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాలన్నాడు.
పొట్టపోసుకోవడానికి వచ్చే వారిని తెలంగాణ ప్రజలు ఆదరించాల్సిందే, పొట్ట కొట్టే వాళ్ల మీదే మన వ్యతిరేకత అంతా అన్న కాళోజీ సూత్రానికి తెలంగాణ కట్టుబడి ఉండాలన్నాడు. జై ఆంధ్రా ఉద్యమం పేరుతో ఆంధ్రా రాయలసీమ రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు వెళ్లిపోతామని అన్నారు తప్ప ఇక్కడ గ్రామాల్లో స్థిరపడిపోయిన వారిని తీసుకువెళ్తామని అనలేదు. తెలంగాణ వాళ్ళు కూడా వారిని వెళ్ళిపొమ్మనలే దు. అప్పుడైనా ఇప్పుడైనా గొడవంతా హైదరాబాద్ గురించి, హైదరాబాద్‌లో ఉన్న ఉద్యోగులు, రాజకీయ నాయకులది తప్ప ప్రజలది కాదు.

హైదరాబాద్‌లో రాజ్యాంగబద్ధంగా ఎవరైనా ఉండొచ్చు. ఇక్క డ గుజరాతీలు, మరాఠీలు, మార్వాడీ వ్యాపారులు, కాయస్తులు తమిళులు ఇట్లా అనేక రాష్ర్టాల నుంచి వచ్చిన వాళ్ళు గణనీయంగా ఉన్నారు. వాళ్ళెవరికీ పేచీలేదు. ఎందుకంటే వాళ్ళెవరూ సచివాలయం లో చక్రం తిప్పేవారుకాదు. అలాగే గత ఇరవై ఏళ్ళలో ప్రైవేట్ రంగంలో లక్షలాదిమంది హైదరాబాద్‌లో స్థిరపడిపోయిన వారెవరికీ ఏ గొడవా లేదు. హైదరాబాద్ మాది అని వాళ్ళు అనడం లేదు. మనది అని మాత్రమే అనుకుంటున్నారు. ఎప్పుడైనా సరే మనది అనుకున్నంత వర కు గొడవే ఉండదు. అయితే గొడవంతా అధికారం మాది, పరిపాలన మాది అంటేనే. కచ్చితంగా తెలంగాణ భూమి పుత్రుల చేతుల్లోనే ఉండాలన్నది జయశంకర్ గారి ఆలోచనలోని బలమైన ప్రాంతీయ ఆకాంక్ష. అందుకే ఆయన ఉద్యోగాల గురించి, విద్యావకాశాల గురించి మాట్లాడారు. వాటినే ఉద్యమానికి మూల స్తంభాలుగా భావించారు. ఒక్క తెలుగు జాతే కాదు ఏ మానవ జాతి అయినా అభివృద్ధి చెందేది ఈ రెం డు మౌలిక మానవ వనరుల మూలంగానే అన్నది సత్యం. ఆ రెండూ ఇక్కడి ప్రజలకు అందడం లేదన్నదీ నిజం. వాటిని తిరిగి పొందడం ఒక్క తెలంగాణ రాష్ట్రం వల్లనే సాధ్యమన్న వాస్తవాన్ని జయశంకర్ గుర్తించారు. తెలంగాణ సమాజాన్ని గుర్తించే విధంగా చేశారు. అందువల్లనే ఆయన ముల్కీ నిబంధనలను, 610 జీవోను పదేపదే ప్రస్తావిస్తూ తన వాదానికి పునాదిగా మలిచారు.

హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని చెప్పడం పచ్చి అబద్ధం అన్నది ఆయన బలమైన వాదనగా ఉండేది. అలాంటి అర్థంలేని వాదనలతో హైదరాబాద్‌ను తెలంగాణ నుంచి వేరుచేయాలని చూస్తే అది సాధ్యం కాదు. వాంఛనీయం అంతకన్నా కాదు. అలాంటి దుస్సాహసం చేస్తే ఇక్కడ అంతర్యుద్ధం రాక తప్పదాని కూడా ఆయన అంటుండేవారు.రాజకీయపార్టీలు రాష్ట్రంలో స్వార్థంతో వ్యవహరిస్తే సీమాంధ్రకు నష్టం చేసినవాళ్ళు అవుతారని కూడా ఆయన రెండోవైపు కూడా ఆలోచించేవారు. సీమాంధ్ర అభివృద్ధికి అక్కడి వనరులు, ఖనిజ సంపద తీర ప్రాంతం, రవాణా వ్యవస్థలు ఎలా ఉపయోగపడతాయో విశ్లేశించేవా రు. ఒకరకంగా తెలంగాణ గురించి ఎంత నిబద్ధతతో వ్యవహరించేవా రో, ఆంధ్రా రాయలసీమ ప్రాంతాల గురించి కూడా అంతే హేతు బద్ధం గా ఆలోచించేవారు. ప్రత్యేక రాష్ట్రం అయితే రాయలసీమ ప్రజాస్వామ్యీకరించబడుతుందని, కోస్తా సామాజికరంగంలో బలమైన మార్పు లు వస్తాయని కూడా ఆయన విశ్లేషించారు. రాష్ట్రం విడిపోతే వచ్చే జల వివాదాలు ఏవీ ఉండవని రెండు నదుల జలాల మీద కేంద్రం ఒక నిర్ణ యం తీసుకుని పెద్దన్న పాత్ర పోషించి అక్కడి రైతులు నష్టపోకుండా చూడాలని, దానికి తెలంగాణ నాయకత్వం సహకరించాలన్నారు.
జయశంకర్ సార్ బతికున్న కాలంలోనే తెలంగాణ అనివార్యమని డిసెంబర్ 9న చేసిన ప్రకటన మీద నిలబడకుండా ఒత్తిళ్లకు కేంద్ర ప్రభు త్వం తలొగ్గదని గట్టిగా విశ్వసించారు. ఒకవేళ అలా జరిగితే తెలంగాణ లో అంతకంటే భీకరమైన పరిస్థితి తలెత్తుతుందని, చాలా అనర్థాలు జరుగుతాయని హెచ్చరించారు. జాతీయస్థాయిలో అన్నిపార్టీలు అర్థం చేసుకొని ప్రత్యేక రాష్ట్రం అవసరం, వాంఛనీయం, అనివార్యం అని నిర్ద్వందంగా చెప్పిన తర్వాత అడ్డంకి లేనే లేదని, ఒకవేళ ప్రభుత్వం వెనకకుపోయినా సొంత రాష్ట్రం సాధించాలన్న కలతో, తపనతో ఉన్న తెలంగాణ యువతరం అధికారపు ద్వారాలను బద్దలుకొట్టి అయినా ఆ కలను సాకారం చేసుకుంటారని అనేవారు.
Ganta
కొన్నిసార్లు కొన్ని ప్రామాణిక సూత్రాలు, విలువలు, అనుభవాలు కూడా నడిపిస్తాయి. వాటినే సిద్ధాంతాలు అని, అలా ఎలా నడుస్తాయో ప్రామాణికంగా చెప్పినవారిని సిద్ధాంతకర్తలని అంటారు. వారినే కొంద రు కాలజ్ఞానులని కూడా అంటారు. ఆ మాటలు ప్రొఫెసర్ జయశంక ర్ గారికి ముమ్మాటికీ సరిపోతాయి. అదే ఇప్పుడు రుజువు కాబోతున్న ది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్తగా మాత్రమే కాదు, రాష్ర్టాల పునర్నిర్మాణ సూత్రాల ఆవిష్కర్తగా కూడా చరిత్రలో చిరస్థాయి గా నిలిచిపోతారు.
(ఘంటా చక్రపాణి రాసిన తెలంగాణ కాలజ్ఞాని ప్రొఫెసర్ జయశంకర్ పుస్తకంలోంచి కొన్ని భాగాలు.)

752

Ghanta Chakrapani

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ

Published: Fri,January 24, 2014 12:06 AM

ఇదేనా రాజ్యాంగ నిబద్ధత?

గతంలో రాష్ర్టాల విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ప్రవర్తించలేదు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడి