సమున్నత మానవత్వమే కవి లక్ష్యం


Thu,September 18, 2014 12:09 AM

ప్రజలు తమ జీవితాలు మారాలనే చేసే పోరాటాలు ఉంటాయి. అలాగే వియత్నాం యుద్ధంలాంటి యుద్ధాలుంటాయి. యుద్ధం మీద యుద్ధం చేసే యుద్ధాలు కూడా ఉంటాయి. యుద్ధంలేని ప్రపంచం కావాలనే యుద్ధాలలో నూతన సమాజ బీజాలుంటాయి. ఆత్మరక్షణ యుద్ధాలుంటాయి. అందుకేనేమో ఈ కవిసభలో
సామ్రాజ్యవాద ప్రేరేపిత యుద్ధాల మీదే చాలా కవిత్వం వచ్చింది.

haragopalపాలమూరు అధ్యయన వేదిక సెప్టెంబర్ 13న నిర్వహించిన కవి సభ అనూహ్యరీతిలో జరిగింది. ప్రపంచంలో ఒక మూలలో ఉన్న వెనుకబడిన జిల్లా లో దాదాపు 80 మంది కవుల కవిత్వంలో ఆక్రంద న, ఆవేదన, ఆవేశం, ఆగ్రహం కట్టలు తెంచుకొని ప్రవహించినట్టు అనిపించింది. నిజానికి ఇది యుద్ధ వ్యతిరేక సభగా నిర్వహిస్తే, యుద్ధం మీద ఆగ్రహం ప్రకటిస్తూ అందరు కవులు సామ్రాజ్యవాదాన్ని ఖం డించారు. అసహ్యించుకున్నారు. ఒక ధర్మాగ్రహాన్ని ప్రకటించారు. దీనికి ప్రధాన కారణం ఇజ్రాయిల్ పాలస్తీనా మీద జరుపుతున్న తక్షణ నేపథ్యం. గాజా లాంటి ఒక చిన్న ప్రాంతంలో జరుగుతున్న ఒక ఉన్మాద యుద్ధానికి ఇంత పెద్ద ఎత్తున కవులు స్పం దించడం ఒక చారిత్రాత్మక అనుభవమే. ఆ విధంగా చూస్తే ప్రపంచం చాలా చిన్నదైపోయింది. పెట్టుబడి ప్రపంచాన్ని ఆక్రమించుకుంటున్న కొద్దీ, ప్రజల స్పం దన ముఖ్యంగా సృజనాత్మక కవిత్వం విశ్వజనీనమౌతుందన్నది పాలమూ రు కవిసభ సారాంశం.

రెండు దశాబ్దాల క్రితం ప్రపంచ బ్యాంకు అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి చొచ్చుకుని వస్తున్నప్పుడు హైదరాబాద్ బిర్లా ప్లానెటోరియంలో జరిగిన ఒక సదస్సులో దాదాపు 20మంది ఆలోచనాపరులు, ప్రజాస్వామ్య వాదులు ప్రపంచబ్యాంకు అభివృద్ధి నమూనా మీద తీవ్రమైన దాడి చేశారు.దీంతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు నిర్ఘాంతపోయారు. తాము ఇచ్చే అప్పు వెనుక ఎలాంటి షరతులు ఉండవని, కేవలం మీ రాష్ట్ర రాజకీయ నాయకుల ఆలోచనలు ప్రపంచబ్యాంకు ఆలోచనలకు దగ్గరగా ఉన్నవే తప్ప మేం ఏ నిబంధనలు విధించలేదని సంజాయిషీ చెప్పినా లాభం లేకపోయింది. సదస్సు తర్వాత ప్రపంచ బ్యాంకు అధినేత ఒకరు ప్రపంచంలో ఎక్క డా తాము ఇంత ప్రతిఘటనను ఎదుర్కొలేదని అన్నారు. అది తెలుగు ప్రజలు ముఖ్యంగా తెలంగా ణ ప్రాంత చైతన్యస్థాయి. ఆ సదస్సుకు రెండు దశాబ్దాల తర్వాత జరిగిన పాలమూరు సదస్సుకు ఒక అవినాభావ చైతన్య లంకె ఉన్నది.

పాలమూరు సభను ప్రారంభించిన మాడభూషి శ్రీధర్ (ప్రస్తుతం కేంద్ర సమాచార కమిషనర్) వరంగల్‌లో పుట్టి పెరగడం వల్ల కావొచ్చు, అంతకుముం దు జర్నలిస్టుగా, లాయర్‌గా, నల్సార్‌లో ఆచార్యుడు గా కావచ్చు.. తన ప్రారంభోపన్యాసంలోనే అమెరి కా తన ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రపంచ వ్యాప్తం గా యుద్ధాలను ప్రేరేపిస్తున్నదని అన్నాడు. అలా ప్రారంభమైన సభలో సామ్రాజ్యవాదం దాని ప్రధా న ఏజెంట్ అమెరికాను, దాని యుద్ధనీతిని కవులు నిర్దంద్వంగా ఎండగట్టారు. ఈ చైతన్యానికి సమాజ పరిణామంలో ఎక్కడ వేళ్లున్నాయన్నది నాలాంటి సామాజికశాస్త్ర విద్యార్థి అన్వేషణ.

కవులలోని ఈ చైతన్యం కవి వ్యక్తిగత చైతన్యమే కాక ఎక్కడో సామాజిక చైతన్యంలో ఈ కవిత్వపు పునాదులున్నాయి. కవుల ధైర్యం, విశ్వాసంలో తెలంగాణ సాయుధ పోరాటం నుంచి, విప్లవ పోరా టాల నుంచి, నిన్నటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం దాకా అన్ని ప్రభావాలున్నాయనిపించింది. బహుశా ప్రత్యేక రాష్ట్రం సాధించిన విజయం కూడా ఇందులో ఉందనిపించింది. ప్రత్యేక రాష్ట్ర సాధన సాకారమౌతుందని చాలామంది భావించలేదు. బలమైన పెట్టుబడిదారీ వర్గాన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదు.

వైఎస్ బతికుంటే తెలంగాణ ఇలా ఏర్పడేది కాదు. ప్రాణ నష్టం చాలా ఉండేది. చరిత్ర తిరిగిన మలుపుల్లో ఒక వెనుకబడిన ప్రాంతం తామొక విజయాన్ని సాధించగలిగాం అనేది ఒక కొత్త విశ్వాసా న్ని కలిగిస్తుంది. కవి సభ నాకు వ్యక్తిగతంగా కొత్త విశ్వాసాన్ని కలిగించింది. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఇన్ని గొంతులున్నాయనేది నిజంగానే గొప్ప అనుభవం. ప్రపంచీకరణ మీద బహుశా దశాబ్దం క్రితం జరిగిన సదస్సులో చాలామంది మాట్లాడారు. సభలో ఉన్న ఆర్‌ఎస్‌రావు నాతో ఏంటీ ఎవ్వరూ సామ్రాజ్యవాదం అనే పదాన్ని ఉపయోగించడం లేదని అన్నాడు.

రావుగారు పాలమూరు సభలోఉంటే దశాబ్ద కాలంలో భాషలో, భావనలో వచ్చిన మార్పుకు సంతోషించేవారు. ఈ కవిత్వంలో పొలిటికల్ ఎకానమీ,అలాగే ప్రపంచ పరిణామాల అవగాహన లోతుగా ఉన్నది. సాహిత్య ప్రపంచానికి రాజకీయ, ఆర్థిక పరిణామాల పట్ల సాధారణంగా శ్రద్ధ ఉండదు.కానీ మానవుల ఆశలు,ఆకాంక్షలు, దుఃఖం వీటి పట్ల చాలా గాఢమైన స్పందన ఉంటుంది. ఉద్యమాల పట్ల సజీవమైన అనుభూతి ఉంటుంది. దుః ఖానికి, అసమానతలకు మూల కారణాలు సామాజిక నిర్మాణ పునాదులలో ఉంటాయని ఒకవేళ తెలిసినా, దాన్ని కవిత్వంలో పెట్టడం కొంచెం కష్టం. కానీ పాలమూరు సభలో చాలా కవితలు, ఆయుధ వ్యాపారం మీద దానికి సంబంధించిన ఆగడాల మీద బలమైన కవితలు వచ్చాయి. ఆయుధ వ్యాపారానికి, సామ్రాజ్యవాదానికి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల మధ్య ఉండే అంతఃసంబంధాలను కవులు కవిత్వీకరించగలిగారు.

ఇలాంటి సభ పెట్టాలనుకున్నప్పుడు పాలమూరు అధ్యయన వేదిక అవగాహనలోభారతదేశం యుద్ధంలోకి దిగడమో, దింపబడడమో, దిగజారడమో జరగనున్నదని, మనచుట్టూ ఉన్న దేశాల మధ్య స్నేహ సంబంధాలు పెరగాలని, ఏ పరిస్థితిలోనైనా యుద్ధా న్ని నివారించడానికి ప్రజాభిప్రాయ నిర్మాణం జరగాలనే ఒక భావన ఉన్నది. కానీ యుద్ధ వ్యతిరేకత సామ్రాజ్యవాద వ్యతిరేకతగా రూపాంతరం చెందడం ఆశించని ఒక మంచి పరిణామం.
కవిత్వం కాబట్టి మానవీయ స్పందన చాలా ఉం ది. కవిత్వంతో పాటు యుద్ధాలలో జరిగిన మానవ హననం మీద ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా చేర్చారు. ఈ చిత్రాలు చూసిన వారిని భయపెట్టాయి. బాధ పెట్టాయి. హృదయ ప్రకంపనలను కూడా కలిగించాయి. చిన్న పిల్లల దగ్గరి నుంచి మహిళలు, పరుగెత్తుతున్న ప్రజలు, పొలాల్లో రక్షణ కోసం దాక్కున్న వారు.. బెదురు చూపులు, శరీరం నిండా గాయాల తో మనుషులు.

హిట్లర్‌చేసిన ఊహించరాని, ఊహించలేని హింస.మనుషులను కిందపడేసి చంపుతున్న దృశ్యాలు. ఇవి సేకరించడానికి పాలమూరు అధ్యయన వేదిక మిత్రులు చాలానే శ్రమపడ్డారు. ఈ దృశ్యాలు ఒక మానవీయతను మనిషిలో పెంచుతాయి. కెమెరా వెనుక కూడా బహుశా ఒక కవి కన్ను ఉంటుందేమో..! ఆ దృశ్యాలను ఫోటో తీసిన వారి ధైర్యం సాధారణమైందేమీ కాదు. కెమెరా కవి కన్ను గా, కన్ను కవి కెమెరాగా మారిన అరుదైన దృశ్య మిది. చాలామంది కవులు యుద్ధాల్లో పసిపాపలు చనిపోవడం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. మిత్రుడు ఒకరు అన్నట్టు ప్రతి కవిలో ఒక బాల్యం దాగి ఉంటుంది. అందుకే పసిపాపలంటే కవులకు అమితమైన ప్రేమ.గతంలో యుద్ధాలలో పౌరులను, పిల్లలను, తల్లులను తాకకపోవడం ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో పెట్టుబడి లుంపెనైజ్ కావడం వల్ల, దాని నైజం చాలా అమానుషంగా మారింది.

అందుకే అమెరికా సైన్యాలు చాలా దుర్మార్గాలకు పాల్పడ్డాయి. బాంబులు స్కూళ్ల మీద, హాస్పిటల్స్ మీద వేయడమంటే మనిషి క్రూర జంతువుగా మారడమే. ఈ క్రూరత్వం ప్రస్ఫుటంగా అమెరికా చర్యల్లో కనిపిస్తున్నది. మనిషి సౌఖ్యం కోసం మానవత్వాన్ని హింసించుకోవడం ఎంత విషాదం.మనిషి మనిషిగాజీవించే ఆనందాన్ని కోల్పోవడమే పెట్టుబడి మార్గం. కాబట్టి పెట్టుబడిదారీ పంథాను ప్రశ్నించవలసిందే, దాని దిశను దశ ను మార్చవలసిందే. ఆ దశను దాటి మానవాళి మరో ప్రపంచంలోకి ప్రయాణిస్తుందని మార్క్స్ విశ్వసించాడు.

చివరిగా కవులు అన్ని యుద్ధాలకు వ్యతిరేకమా? లేక కొన్ని రకాల యుద్ధాలకేనా? అనే ప్రశ్న ఒకటి ముందుకు వచ్చింది. ప్రజలు తమ జీవితాలు మారాలని చేసే పోరాటాలు ఉంటాయి. అలాగే వియత్నాం యుద్ధం లాంటి యుద్ధాలుంటాయి. యుద్ధం మీద యుద్ధం చేసే యుద్ధాలు కూడా ఉంటాయి. యుద్ధం లేని ప్రపంచం కావాలనే యుద్ధాలలో నూతన సమా జ బీజాలుంటాయి. ఆత్మరక్షణ యుద్ధాలుంటాయి. అందుకేనేమో ఈ కవి సభలో సామ్రాజ్యవాద ప్రేరేపిత యుద్ధాల మీదే చాలా కవిత్వం వచ్చింది. ఆయు ధ వ్యాపారం కోసం, సహజ వనరులను కొల్లగొట్ట డం కోసం, ప్రపంచం మీద ఆధిపత్యం కోసం జరిగే యుద్ధాలు వేరు.

నూతన ప్రపంచం కోసం మానవీ య సమాజం కోసం జరిగే యుద్ధాలు వేరు. అందుకే రెండవ రకపు యుద్ధాలలో అమానుష చర్యలుండ వు. పిల్లలను చంపడం, మహిళలను చెరచడం వంటి సంఘటనలుండవు. గ్రంథాలయాలు, పురాతన కట్టడాల మీద గౌరవం ఉంటుంది. ఉండాలి. మానవాళి మనుగడ కోసం మరోప్రపంచం కోసం జరిగే యుద్ధాలలో అమానుషమైన చర్య ఏది జరిగినా కవులు ఖం డించవలసిందే. కవికి యుద్ధంలోని విలువల మీదే ధ్యాస ఉండాలి. సమున్నత మానవత్వం కవి స్వప్నం కావాలి. పాలమూరు సభలో ఈ మానవత్వ పరిమళాలు వికసించే దృశ్యం ఒకటి కనిపించింది.

1217

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

Featured Articles