మరో నిద్రలేని రాత్రి..


Thu,September 25, 2014 02:30 AM

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది.
ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి
ఏ కొత్త విలువలను అందించారు, ప్రజాస్వామ్యాన్ని ఎంత సుసంపన్నం చేశారు అనేదే ప్రమాణం. చరిత్రలో మిగిలేది విలువలే.

సెప్టెంబర్ 21వ తేదీన ప్రభు త్వం ప్రవర్తించిన తీరు నిర్ఘాంతపరచింది. ప్రజా ఉద్యమాల ద్వారా సాధించిన రాష్ట్రం గుణాత్మకంగా మారకపోయినా మెరుగైన పాలన, భావ ప్రకటనా స్వేచ్ఛ కొంతకాలమైనా నిలుస్తుందని, తెలంగాణ సమాజానికి ఉండే సుదీర్ఘ పౌరహక్కుల అనుభవం వల్ల మావోయిస్టు రాజకీయాల మీద కూడా ఒక సాహసపూరితమైన చర్చ సాధ్యమే అనే విశ్వాసం దెబ్బతిన్నది. నిజానికి తెలంగాణ బిల్లు లోక్‌సభలో పాస్ అయినప్పుడు వరవరరావు సార్ ఇంట్లో మేమందరం యాధృచ్ఛికమే అయినా హేమలతగారు బిల్లు పాస్ అవుతున్న సందర్భంలో చాలా ఎైక్జెట్‌గా ఉన్నారు.

ఆమె ఉత్సా హం మీద, ఆమె ఎం దుకు అంత సంతోషంగా ఉన్నారో అప్పుడు ఇదే కాలమ్‌లో రాసి ఉన్నాను. హేమలత గారు మాక్సింగోర్కీ అమ్మలాగ, పోరాట ప్రజలకు ఆమె అక్క. చాలా మంది ఆమెను అక్క అనే పిలుస్తారు. హేమ గారు అంత సంతోషంగా ఉంటే ఎందుకో నా సహచరి వనమాల గారు ఢిల్లీ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పిన అంశాన్ని కూడానేను గత వ్యాసంలో ప్రస్తావించాను. చరిత్ర ఎంత వేగంగా మలుపులు తిరుగుతుందో ఊహించడం చాలా కష్టం. తెలంగాణ రానే వచ్చింది. మూడు నాలుగు నెలల్లోనే హేమ గారు నాకు ఫోన్ చేసి వీవీ ని అదుపులోకి తీసుకున్నారని, ఎప్పుడు వదిలిపెడతారో కనుక్కొని చెప్పండి అని అడిగితే..1974 జ్ఞాపకాలు గుర్తుకొ చ్చాయి.

ఆమె గర్భిణీగా కేసులు ఎదుర్కొవడం, కోర్టుల చుట్టూ తిరగడం కళ్లముందు కనిపించాయి. వీవీకి ఆయన కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర నిర్మాణం మరింత భద్రత భావనను కల్పించే బదులు, చరిత్ర కొనసాగింపుగా వేధింపులు ప్రారంభమయ్యాయి.ఇక నా సహచరి వనమాల ఆందోళన నిజమైంది. పరిస్థితి చేయి జారకముందే ముఖ్యమంత్రితో మాట్లాడాలని, తెలంగాణ ముఖ్యమంత్రి ఎంతకాదన్నా మన ముఖ్యమంత్రే ఉంటాడు కదా అనే జయశంకర్ మాటలు జ్ఞప్తికి వచ్చి, బాధ్యతగా ఆయనతో మాట్లాడుదామని బయలుదేరుతుంటే..వనమాల గారు వెళ్లవద్దు, పరిస్థితి బాగాలేదు అని అన్నప్పుడు ఆందోళన కలిగింది.

ఆమె ఆరోగ్యం బాగా లే దు. (తెలంగాణ ఉద్యమంలో వనమాల గారు ఎప్పుడైనా మాట్లాడితే ఆవేశంగా మాట్లాడేది, జనం చప్ప ట్లు కొట్టేవారు) ఆమె ఆందోళన అర్థం చేసుకొని, ముఖ్యమంత్రిని కలవాలని వెళ్తునప్పుడు సమస్య గురించి చెప్పాను. నన్ను కలవడానికి వచ్చిన పౌరహక్కుల నేత రఘునాథ్ కూడా నాతోపాటు ఉన్నా డు. రఘునాథ్ ఆంధ్ర అనే పదాన్ని పౌరహక్కుల సంఘం పేరు నుంచి తొలగించాలని పట్టుబట్టి తొలగించినవాడు. అంత తొందరవద్దు అని మాబోటి వాళ్లు అన్నా, వాళ్ల ఉత్సాహమే వేరు. మా కారును మార్గ మధ్యంలో పోలీసులు ఆపి రఘునాథ్‌ను అదుపులోకి తీసుకోవాలనే ఆజ్ఞలు తమకున్నాయని మర్యాదగానే ఒత్తిడి చేశారు.

నేనే రఘునాథ్‌కు నా దగ్గర ఉన్న పుస్తకాన్ని ఇస్తూ.. సాయంత్రం దాకా పుస్తకం చదువుకో, సాయంత్రం వదిలిపెడతారని నేను అనుకుంటున్నానని చెప్పి, ఎలాగూ ముఖ్యమంత్రిని కలిసి పరిస్థితి వివరిద్దామని అనుకుంటు న్నాం అన్నాను. రఘునాథ్ దిగగానే మిమ్మల్ని ఇంటికి పంపాలని మాకు ఆర్డర్ ఉందని పోలీసులు అన్నారు. నా నలభై ఏళ్ల పౌరహక్కుల అనుభవంలో టెలిఫోన్‌లో బెదిరింపులు, కుక్కల పేర, పులుల పేర ఏర్పడిన బృందాలు చేశాయి. కానీ పోలీస్ వ్యవస్థ ప్రత్యక్షంగా ఎప్పుడూ ఇలాంటి నిర్ణయం తీసుకోలే దు. దీన్నే మీడియా హిజ్ అరెస్ట్ అని ప్రసారం చేసింది.

ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాంఅని వివరిస్తే, ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే.. పొత్తూరు వెంకటేశ్వర్ రావు గారిటింకి అన్నాను. అక్కడి దాకా మేం వస్తాం అని ఇద్దరు కానిస్టేబుల్స్ మా కారులో కూర్చొని పొత్తూరు ఇంటి దాకా వచ్చారు. పొత్తూరు గారు తన మార్గం ద్వారా ప్రయత్నించి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేదని, పరిస్థితిని అంచనా వేయడానికి చుక్కా రామయ్య గారితో కలిసి మహేందర్‌రెడ్డి (కమిషనర్) దగ్గరికి వెళ్లాం. సాయంత్రం వరకు అందరిని వదిలివేస్తారని, పోలీస్ స్టేషన్లలో ఏ ఇబ్బంది కలగకుండా చూస్తున్నామని చెపితే అది మహేందర్‌రెడ్డికి ఉండే సంస్కారమో, లేక రాజకీయ నిర్ణయమో తెలియదు. నా బాధ్యతగా హేమలత గారికి ఫోన్ చేసి సాయంత్రం వరకు వదిలివేస్తారని తెలిపాను.

మావోయిస్టు పార్టీ ఏర్పడి దశాబ్ద కాలం అయిన సందర్బంగా ప్రత్యామ్నాయ రాజకీయాల మీద చర్చ చేయాలన్నది సదస్సు ఉద్దేశం. ఇందులో భిన్నాభిప్రాయాలున్న వాళ్లున్నారు. నాకు కూడా ప్రత్యామ్నాయ రాజకీయాల మీద ఉండే అవగాహనను పంచుకొని, మావోయిస్టు పార్టీ తమ భాషను మరింత మానవీయంగా మార్చవలసిన అవసరముందని, మొత్తం సామాజిక మార్పు కేవలం జనతన సర్కార్ నుంచే సాధించడం కష్టమనేది నా ఆలోచన. జనతన సర్కా ర్ ఒక ప్రత్యామ్నాయ ప్రయోగం. దాంట్లో అనుమానం లేదు. ఇంకా చాలా ప్రత్యామ్నాయాలను ప్రయోగాలను చేయవలసిన అవసరముందని మాట్లాడదామనుకున్నాను. మావోయిస్టులు అంటే హింస అనే అభిప్రాయాన్ని ఎలా మారుస్తారన్నది వాళ్ల ముందుండే సవాలు. వాళ్ల హింస గురించి ఇం త భయపడే వాళ్లకు గుజరాత్, ముజఫర్‌నగర్‌లో జరిగిన హింసకు ఎందుకు స్పందించడం లేదో,

ఎందుకు భయం కలగడం లేదో అర్థం కాదు!
ఈ అనుభవం తర్వాత ఆరోజు రాత్రి అసలు నిద్ర పట్టలేదు. ఏదో ఆందోళన. ఒక స్వప్నం విచ్ఛిన్నమైన ఫీలింగ్. జయశంకర్, కాళోజీ, కన్నబీరాన్, బాలగోపాల్, శంకరన్ లాంటి వాళ్లు లేరన్న ఒక లోటు. నేనే కాక నా సహచరి కూడా నిద్రలేని రాత్రి గడిపింది. ఇది వ్యక్తిగత జీవితం. భయమల్లా తెలంగాణ ప్రజ లు కొంతకాలమైనా కంటినిద్ర పోవాలనే కల చెదిరిపోవడం ఎంత విషాదమో. వీవీ ని అదుపులోకి తీసుకున్నారని పొత్తూరు వెంకటేశ్వర్‌రావు గారికి తెలిపినప్పుడు ఇక నేను ఎక్కువ కాలం బతకడంలో అర్థం లేదు హరగోపాల్ గారు అన్నారు. ఈ ఆవేద న టీఆర్‌ఎస్ పార్టీని కదిలించకపోతే.. తెలంగాణ ప్రజలకు మిగిలింది ఉద్యమాన్ని కొనసాగించడమే.

మన కళ్ల ముందు జరిగే హింసను విస్మరిస్తూ, మరో హింసను సీరియస్‌గా తీసుకుంటున్న పౌర సమాజం అన్నిరకాల హింసకు, దళితుల మీద, మైనారిటీల మీద, మహిళల మీద సమాజంలోని వ్యవస్థీకృత హింసకు, అలాగే రాజ్యహింసకు స్పం దించాలి. సమాజానికి ఒక సమగ్ర విలువలు లేకపోవడం వల్ల హింసను హింసగా చూడలేకపోతున్నారు. మన విలువలు ఇలాగే కాలబడితే త్వరలోనే ఈ హిం స మన ఇంటి దాకా వస్తుందని సమాజం గ్రహించాలి.

ఇక సెప్టెంబర్ 21వ తేదీకి వస్తే.. టీఆర్‌ఎస్ ప్రభు త్వం ఈ నిర్ణయం ఎలా తీసుకుందో బోధపడడం లేదు. టీఆర్‌ఎస్ పార్టీలో స్నేహితులున్నారు. నేను గౌరవించేవాళ్లున్నారు.నేను ఇష్టపడే ఈటెల రాజేం దర్ లాంటి వాళ్లున్నారు. ఉద్యమ అనుభవం ఉన్న పార్టీ ఈ నిర్ణయాన్ని ఎలా తీసుకున్నదో దీని అంతిమ సారాంశం ఏమిటో ఇంకా విశ్లేషించవలసిన అవసరముంది.ఇది తొందరపాటు చర్య. తప్పుడు నిర్ణ యం. ఇక ఇక్కడితో ఆగాలి. కేసీఆర్ గారు దీన్ని లోతు గా పరిశీలించాలి.

మరీ కుక్కలను, పులులను పోలీ సు యంత్రాంగం లేపకముందే జాగ్రత్తపడాలి. రాష్ర్టాన్ని ఏ పరిస్థితిలో పోలీసు యంత్రాంగం చేతిలోకి వెళ్లకముందే వ్యవస్థపై రాజకీయ నియంత్రణ సంపూర్ణంగా ఉండాలి. రేపు మంత్రుల నుంచి సీఎం దాకా పోలీసుల అనుమతితో ఎక్కడికి పోవాలి, ఎక్క డికీ పోకూడదో నిర్ణయించే దీనస్థితికి రాకూడదు. టీఆర్‌ఎస్ పార్టీలో ప్రజలతో సంబంధమున్న వాళ్లు, ప్రజ లు గౌరవించే వాళ్లు కొందరున్నా రు. వీళ్లంతా పోలీసుల మీద ఆధారపడే పరిస్థితి రాకూడదు. దీనికి రాజకీయ దృఢ నిశ్చయం కావాలి.

ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు తీసుకునే అవకాశం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి కొన్ని కచ్చితమైన అభిప్రాయాలున్నా యి. ప్రజాస్వామ్యం మీద వాళ్ల అవగాహనే సమస్యాత్మకం.ఇద్దరు కలెక్టర్ల అపహరణ సందర్భంలో మధ్య వర్తిగా వెళ్లినప్పుడు ఒడిశాలో ఒక ప్రాంతీయ పార్టీ, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ, కేంద్రంలో కాంగ్రెస్ అధికారం లో ఉన్నాయి. రాజకీయ పార్టీలతో ప్రమేయం లేకుం డా, ప్రతి నిర్ణయాన్ని కేంద్రం అనుమతితోనే తీసుకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం. నెహ్రూ ఉదార విలువలను విధ్వంసం చేసినాకే కాంగ్రెస్ విముక్త భారత్ అని బీజేపీ అనగలుగుతున్నది. ఆ సాంప్రదాయాలను బీజేపీ మరింత దుర్మార్గంగా ముందుకు తీసుకపోతున్నది.

ఇంత జరిగినా.. టీఆర్‌ఎస్ పార్టీ పట్ల జాలి వేస్తున్నది కానీ పూర్తి ఆగ్రహం కలగడం లేదు. కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో దేశంలోని ఫెడరలిజానికి కేంద్ర హోం మినిస్ట్రీ పెద్ద సవాలు. అయితే శంకరన్ గారు త్రిపుర ఛీప్ సెక్రటరీగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని పంపితే.. 24 గంటల్లో ఆర్మీ త్రిపుర నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేసి వెనక్కి పంపారు. మేం అడిగినప్పుడే రావాలి. కానీ మాకు తెలియకుండా రాష్ట్రంలోకి రాకూడదని ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తిని నిలబెట్టారు.సెప్టెంబర్ 21ఘటనలో కేంద్రం జోక్యం చేసుకున్నప్పుడు.. కేంద్రానికి చాలా కచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రజా ఉద్యమం నుంచి ఎదిగింది, తెలంగాణకు ప్రజాస్వామ్య సంస్కృతి ఉంది. మావోయిస్టు పార్టీతో చర్చలు జరిపిన అనుభవముంది.

పార్టీపైన నిషేధం కొనసాగుతున్నప్పుడు రాష్ట్ర హోం మంత్రి జానారెడ్డి మావోయిస్టు పార్టీకి లేఖలు రాశా డని వివరించి, రాష్ట్రంలోని వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఉప ఎన్నికల్లో మూడు నాలుగు లక్షల మెజారిటీతో గెలిచిన పార్టీ ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించవలసి ఉండె.చివరగా తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి చరిత్ర నిర్మాణంలో భాగం. ఇది అసాధారణ అవకాశం. ఇది చరిత్రలో ఎప్పుడో జరిగే అరుదైన సంఘటన. మనదేశ చరిత్రలో బీసీ రాయ్, నబ కృష్ణచౌదరి, ఛాలియా, ఇ.ఎం.స్ నంబూద్రిపాద్, కామరాజ్ నాడార్, నృపేన్ చక్రవర్తి లాంటి వారు చరిత్రలో నిలిచిపోయారు.

haragopal మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏకొత్త విలువలను అందించారు, ప్రజాస్వామ్యాన్ని ఎంత సుసంపన్నం చేశారు అనేదే ప్రమాణం. చరిత్రలో మిగిలేది విలువలే. భావితరాలు కొత్త విలువలను అందించిన వ్యక్తులను ఉద్యమాలను గౌరవిస్తారు. కేంద్రం జోక్యం ఎక్కువైతే పార్టీ, ప్రభుత్వానికి రాజీనామా చేసి, ప్రజల దగ్గరకు వెళ్లాలి. కానీ కేంద్రం నుంచి డబ్బులు రావేమో అని భయపడుతూ పాలనను సాగిస్తే తెలంగాణ ప్రజలు హర్షించరు.

2425

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 18, 2014 12:09 AM

సమున్నత మానవత్వమే కవి లక్ష్యం

ప్రజలు తమ జీవితాలు మారాలనే చేసే పోరాటాలు ఉంటాయి. అలాగే వియత్నాం యుద్ధంలాంటి యుద్ధాలుంటాయి. యుద్ధం మీద యుద్ధం చేసే యుద్ధాలు కూడా ఉం

Featured Articles