స్వేచ్ఛతోనే విద్యా వికాసం


Fri,October 10, 2014 02:02 AM

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్వం గర్వంగా తమ విశ్వవిద్యాలయాల గురించి చెప్పుకోవడానికి ఏమన్నా మిగలాలి.

నూతన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యా రంగంలో మార్పులు తలపెడుతున్నారని,విశ్వవిద్యాలయా ల్లో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని, వీటిలో అధికార దురుపయోగం జరిగిందని, అన్ని విశ్వవిద్యాలయాలను ఒకే చట్టం కిందికి తీసుకరావాలని, పాలనను, అకడమిక్ విభాగాలను వేరు చేయాలని, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను ప్రోత్సహించాలని, దూర విద్య ద్వారా వనరులు సమీకరించాలని, రిజిస్ట్రార్‌లను బయటి నుంచి తీసుకరావాలని ఆలోచిస్తున్నారని...వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ ఎవరు అంటున్నారో ఎవరి ఆలోచనా ధోరణో పూర్తిగా బయటకు రాలేదు. బయట జరుగుతున్న చర్చ చూస్తే విశ్వవిద్యాలయాలను నియంత్రించాలనే ధోరణి బలంగా ఉన్నట్టు తోస్తున్నది.నాలుగున్నర దశాబ్దాలుగా మూడు విశ్వవిద్యాలయాల్లో బోధన చేసిన వాడుగా, ప్రస్తుతం రెండు విశిష్ట ప్రతిష్ట గల విద్యాసంస్థల్లో బోధిస్తున్నవాడుగా, ఈ ఆలోచనా విధానం ఎంత లోపభూయిష్టమైనదో, అవి ఏ తప్పుడు అవగాహన నుంచి వస్తున్నాయో సులభంగానే చెప్పవచ్చు. పైన పేర్కొన్న పరిష్కారాలు ఉన్నత విద్యకు ప్రజాస్వామ్య సంస్కృతి వికాసం చెందడానికి ప్రమాదకరం.

తెలంగాణ ఉద్యమ కాలంలో ఉన్నత విద్య ఆ చర్చకు రాలేదని కాదు. కానీ జరగవలసినంత చర్చ జరగలేదు. దీనికి మా లాంటి వారే కారణం. జయశంకర్ మరణించడం వల్ల తెలంగాణకు ప్రత్యేకంగా ఉన్నత విద్యకు చాలా నష్టం జరిగింది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆయనకు విధాన నిర్ణయంపై ఎంత ప్రభావముండేదో తెలియదు. కానీ క్రియాత్మకమైన చర్చ జరగడానికి ఆయన ప్రజెన్స్ స్ఫూర్తిదాయకంగా ఉండేది. ఆయన కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా పనిచేసినప్పుడు రాడికల్ రాజకీయాలు ఉధృతంగా ఉన్నాయి. విద్యార్థి సంఘం వార్షికోత్సవాలు విద్యార్థులకు మాత్రమే పరిమితం అయ్యేవి కావు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వచ్చేవాళ్లు. వార్షికోత్సవానికి గద్దర్‌ను పిలవడం ఒక పెద్ద సవాల్‌గా ఉండేది. రిజిస్ట్రార్, వైస్ చాన్స్‌లర్‌ల మీద పోలీసుల నుంచి ఒత్తిడి ఉండేది. నేను విద్యార్థి సంఘ అడ్వైజర్‌గా వీసీతో, రిజిస్ట్రార్‌తో సంప్రదింపులు జరిపి, మొత్తంగా గద్దర్‌ను పిలిచేవాళ్లం.

జయశంకర్ ఆ సభకు హాజరయ్యేవాడు. ఒక వార్షికోత్సవంలో గద్దర్ పుట్టపర్తి సాయిబాబా మీద సెటైర్ పాడితే ఆ పాటను మరొకసారి పాడమని చెప్పండి అని జయశంకర్ నాకు ఒక చీటీ పంపించాడు. జయశంకర్‌కు విద్యా సంస్థల మీద, వాళ్ల స్వతంత్ర ప్రతిపత్తి మీద, విద్యార్థుల రాజకీయాల మీద ఎలాంటి ప్రజాస్వామ్య అవగాహన ఉండేదో ప్రస్తుత నిర్ణేతలు తెలుసుకోవలసి ఉన్నది. తెలంగాణ విద్యార్థుల అధ్యాపకుల పాత్ర లేకుండా తెలంగాణ రాష్ట్ర సాధన జరిగేదా? తెలంగాణ రాష్ట్రం ఈ అనుభవాన్ని మూడు నాలు గు నెలల్లో మరిచిపోతే ఎలా? జయశంకర్ వందలసార్లు అధ్యాపకులు విద్యార్థులు, అన్యాయం జరుగుతుంటే చూస్తూ సహించకూడదని సభల్లో మళ్లీ మళ్లీ చెప్పేవాడు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో ఇక ఆ విలువలకు గౌరవం ఉండదా? తెలంగాణలో అన్యాయాలు జరగవా? రేపు మరో పార్టీ అధికారంలోకి వస్తే (అది బీజేపీ, టీడీపీలే కావచ్చు!) మళ్లీ పోరాటాలుండవా? ఏ ప్రభుత్వమైనా నిర్ణయాలు తీసుకునేప్పుడు ఏ విలువల వెలుగులో ఆ నిర్ణయా లు తీసుకుంటున్నారో దానిపట్ల ప్రజాస్వామిక స్పృహ ఉండాలన్నది నేను చాలాసార్లు ఇదే కాలమ్ లో రాశాను.

జయశంకర్ కాకతీయ వీసీగా పనిచేస్తున్నప్పుడు ఒక మంత్రి ఒక ఉద్యోగిని మార్చమని లెటర్ ఇస్తే, ఆ ఉద్యోగిముందే దాన్ని చింపి చెత్తబుట్టలో వేసి మినిస్టర్‌కు ఇప్పుడు నేను ఏం చేశానో అదే చెప్పమని అన్నాడు. ఆ మంత్రికి జయశంకర్ మీద చాలాకాలం కోపం ఉండేది. విశ్వవిద్యాలయాల అంతర్గత పాలనలో రాజకీయ నాయకుల జోక్యం ఉండకూడదని, విశ్వవిద్యాలయాలు స్వయం పాలక సంస్థలని ఆయ న నమ్మేవాడు. ఈ సంస్థలు పార్లమెంటు, అసెంబ్లీల ద్వారా నెలకొల్పబడతాయి. ఇవి ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లు కావని, విశ్వవిద్యాలయ అధ్యాపకులు ప్రభుత్వ ఉద్యోగులు కారనేది గుర్తు చేయాలి. అక్కడే ఐఏఎస్ అధికారులకు, యూనివర్సిటీ అధ్యాపకులకు తేడా ఉంది. ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నిష్కర్షగా, నిర్భయంగా చెప్పవలసిన బాధ్యత అధ్యాపకుల మీద సమాజం పెట్టింది. లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ్ సర్వీస్‌లో కొత్తగా చేరినప్పుడు ఒక సభలో మాట్లాడుతూ తినేటప్పుడు తప్పించి నోరు తెరవడానికి వీలులేని ఒక ఉద్యోగంలో తాను చేరానని చెప్పాడు. స్వేచ్ఛను కోరుకొని చాలామంది అధ్యాపక వృత్తిలోకి వచ్చారు.

విశ్వవిద్యాలయాలను నియంత్రించడానికి 1980 లలో ఎన్టీఆర్ చట్టాలలో మార్పులు తెచ్చాడు. దానికి వ్యతిరేకంగా మేం పోరాడాం. ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులను దొడ్డిదారిన విశ్వవిద్యాలయాల్లోకి ఆనాటి పాలకులు చొప్పించారు. వీసీతో అధికారాలను దురుపయోగం చేస్తున్నారనే నెపం మీద దాదాపు ముగ్గురు ఐఏఎస్ అధికారులను ఈసీ సభ్యులుగా నియమించారు. ముగ్గురికి దాదాపు వీటో పవర్‌ను ఇచ్చారు. ఏ కారణం చేతైనా ఈసీలోని మెజారిటీ సభ్యులు నిర్ణయాలు తీసుకుంటే ఆ ఫైల్‌ను సెక్రటేరియేట్‌లో ఆపి, మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఐఏఎస్ అధికారులు, అధ్యాపకులు వీసీల కంటే నిజాయితీపరులని ఎవరైనా అంటే సమాజం నమ్మే పరిస్థితిలో లేదు. నాకు తెలిసి మన రాష్ట్రంలో వీసీలు ఎవ్వరూ జైలుకు వెళ్లలేదు.
ఈ అధికారులకు అధికారం తప్ప వీళ్ల అర్హతలేమిటి? అర్హతల్లా రాజకీయ నాయకుల దగ్గర వాళ్ల అడుగులకు మడుగులు ఒత్తడం తప్ప తమకుండే స్వంత ప్రతిభ చాలా తక్కువ. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వ అధికారులు ఎవ్వరూ ఈసీలో ఉండరు. చాలా వరకు భారత రాష్ట్రపతి నామినీస్ ఉంటారు. వీరందరు కూడా ఇతర విశ్వవిద్యాలయ వీసీలు లేదా విద్యా రంగంలో చాలా ప్రతిష్ట గలిగినవారు. ఈ సంస్కృతిని ఇప్పటి కేంద్ర ప్రభుత్వం ధ్వంసం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

గత తరంలోని ఐఏఎస్ అధికారులైన బీపీఆర్ విఠల్, యం. ఆర్ పాయ్, ఎస్ ఆర్ శంకరన్, బీడీ శర్మ, కేఆర్ వేణుగోపాల్, కె. మాధవరావు, యుగంధర్, వై.వి.రెడ్డి లాంటి వారి సంగతి వేరు. వీళ్లందరికి విశ్వవిద్యాలయాల స్వతంత్ర ప్రతిపత్తి మీద చాలా గౌరవం ఉండే ది. బీజీఆర్ విఠల్‌ని వెంగళ్‌రావు ఉస్మానియా వీసీగా వెళ్లమని అడిగితే ఆసంస్థలు మనవి కావు. అక్కడ జీవిత కాలం పరిశోధన చేసిన వారుంటారు. అవి అధ్యాపకులు నడుపుకోవలసిన సంస్థలు, నాలాంటి వాడికి అక్కడ స్థానం లేదు, నాకు ఆ అర్హతలు కూడా లేవు అని ముఖ్యమంత్రికి చెప్పానని విఠల్ గారు స్వయాన నాతో అన్నారు. శంకరన్ గారు తాత్కాలికంగా విద్యాశాఖ సెక్రటరీగా పనిచేసినప్పు డు వీసీలకు కొన్ని ఆదేశాలు ఇవ్వమని ఎన్టీఆర్ అంటే, ఆ అధికారం మీకు నాకు లేదు అని చెబితే ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారట. వీసీలను మనమే నియమిస్తాం కదా అని అంటే, జడ్జీల నియామకాలు కూడా ప్రభుత్వాలే చేస్తా యి కానీ జడ్జీలకు మనం ఆదేశాలు ఇవ్వలేం కదా! అని చెప్పుతూ విశ్వవిద్యాలయాలకు క్యాసీ జ్యుడిషియర్ అధికారాలుంటాయని చెప్పారు. ఇప్పుడున్న ఐఏఎస్ అధికారుల్లో చాలామందికి ఈ అవగాహన ఉందా అన్నది అనుమానమే.

తెలంగాణ ప్రభుత్వానికి విశ్వవిద్యాలయాలను నియంత్రించాలనే భావన ఉంటే, దాన్ని వదులుకోవాలని సవినయంగా మనవి. వీసీలను నియమించేప్పుడు సమర్థులైన నిజాయితీపరులైన వ్యక్తులను సామాజిక న్యాయ సూత్రాలను గౌరవిస్తూ నియమించాలి. దేశంలో అతి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలుగా తీర్చిదిద్దే బాధ్యత అప్పజెప్పి, వాళ్లకు అండదండగా నిలబడి సంతృప్తికరమైన వనరులను సమకూర్చాలి. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి, మొదటి క్యాబినెట్ తీసుకునే నిర్ణయాలు చారిత్రక స్పృహతో తీసుకోవాలి. నెహ్రూ క్యాబినెట్‌లో పనిచేసిన విద్యామంత్రి అబుల్ కలాం ఆజాద్, ఢిల్లీ విశ్వవిద్యాల వీసీని కలవడానికి అపాయింట్‌మెంట్ తీసుకొని వెళ్లేవాడు. స్వేచ్ఛలో విద్యాసంస్థలు వికాసం చెందుతాయి. నియంత్రణ నియంతృత్వ విధానం మనుషుల సృజనాత్మకత కుత్తుక నొక్కేస్తుంది.

haragopalప్రపంచంలోని అతి ప్రతిష్ట గల 200 విశ్వవిద్యాలయాల్లో మన దేశం నుంచి ఒక్కటి కూడా లేదు. ఎట్లా ఉంటాయి? కపిల్ సిబాల్ లాంటి ఒక్క మం త్రి చాలు మొత్తం విద్యాసంస్థలను ధ్వంసం చేయడానికి. అబుల్ కలాం ఆజాద్ నుంచి కపిల్‌సిబాల్ స్థాయికి పడిపోయాక ప్రపంచ ప్రతిష్ట గల విశ్వవిద్యాలయాలను ఎలా నిర్మిస్తారు? మన రాజకీయ సంస్కృతి, మన బ్యూరోక్రాట్లు, అలాగే అధ్యాపకుల తీరుతెన్నులు ఇలా ఉంటే ప్రపంచ విద్యా పటంలో మన విద్యారంగం అదృశ్యమయ్యే స్థితి ఎంతో దూరంలో లేదు. తెలంగాణ విశ్వవిద్యాలయాలను కాపాడుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందేమో అనే భ్రమ నన్ను ఇంకా వేటాడుతున్నది. 70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్వం గర్వంగా తమ విశ్వవిద్యాలయాల గురించి చెప్పుకోవడానికి ఏమన్నా మిగలాలి. ఆ స్వప్నం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పడ్డ మొదటి ప్రభుత్వానికే లేకపోతే పోరాటాలు ఎందుకు చేసినట్టు?

569

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

Published: Thu,September 18, 2014 12:09 AM

సమున్నత మానవత్వమే కవి లక్ష్యం

ప్రజలు తమ జీవితాలు మారాలనే చేసే పోరాటాలు ఉంటాయి. అలాగే వియత్నాం యుద్ధంలాంటి యుద్ధాలుంటాయి. యుద్ధం మీద యుద్ధం చేసే యుద్ధాలు కూడా ఉం

Featured Articles