నవసమాజం కోసమే సమాన విద్య


Thu,October 16, 2014 01:29 AM

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస్తున్న వారెవ్వరూ సంపన్నులు కారు. ఉద్యమానికి విదేశీ డబ్బు తీసుకోవద్దనేది నిర్ణయం. వనరులు సమాజంనుంచే రావాలి. జాతీయ ఉద్యమానికి ఉదారంగా విరాళాలు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి. విరాళాలు ఇచ్చేవారు విద్యా పరిరక్షణ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మీనారాయణ (9441219028)ను సంప్రదించవచ్చు.

ఈ సంవత్సరం నోబెల్ బహుమానం పిల్లల హక్కుల కోసం కృషి చేస్తున్న మలాల యూసుఫ్‌జాయ్, కైలాశ్ సత్యార్థికి ఇచ్చారు. దీన్ని శాంతి కోసం పనిచేసిన వారికి ఇస్తారని ఒక నమ్మకం. ఇది ఈ మధ్యకాలంలో చాలా విమర్శలకు గురైంది. ఇది కేవలం ఒత్తి డి ద్వారా రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇస్తున్నారని అమెరికా అధ్యక్షుడు ఒబామాకు ఇవ్వడంతో బహిర్గతమైంది. ప్రపంచమంతటా రక్తపుటేర్లకు కారణమైన వ్యక్తికి శాంతి బహుమతి ఇవ్వ డం బహుమతికే అవమానం. ఈ సంవత్సరం ఎన్నుకున్న ఇద్దరు వ్యక్తుల వెనుక రాజకీయ ప్రయోజనా లు లేవని, ఇది నిష్పక్షపాతంగా ఇచ్చారని అనడానికి లేదు. ఆ అంశాన్ని గురించి ప్రత్యేకంగా రాయవలసి ఉంటుంది.

విద్య ప్రపంచవ్యాప్తంగా వ్యాపారీకరణ గుప్పిట్లోకి నెట్టబడుతున్నప్పుడు పిల్లల హక్కులకు నోబెల్ కమి టీ ప్రాధాన్యం ఇవ్వడం సందర్భోచితంగా ఉంది. కైలాశ్ సత్యార్థి దేశంలోని పిల్లల హక్కుల కంటే, అం తర్జాతీయ రంగంలోనే ఎక్కువ పనిచేశాడనేది తెలుస్తూనే ఉన్నది. బహుశా భారతదేశంలో పిల్లలందరికి సమానమైన, నాణ్యమైన విద్య కోసం అనిల్ సద్గోపా ల్ చేసిన కృషితో ఎవ్వరూ పోటీలో నిలవలేరు. తన పరిశోధనను అదీ ప్రతిష్ట కలిగిన బయోకెమిస్ట్రీ రంగా న్ని వదిలి, గ్రామీణ ప్రాంత పిల్లలకు సైన్స్ ఎలా బోధించాలనే అంశం మీద మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో ఒక అరుదైన ప్రయోగం చేశాడు. చిన్నపిల్లలతో రాత్రింబగళ్లు కూచుని తాను నేర్చుకుంటూ పిల్లలకు విద్యాబోధన చేశాడు. తన ఆరోగ్యం దెబ్బతిన్నా నవంబర్ నెలలో దేశవ్యాప్తంగా ఆల్ ఇండి యా ఫోరం చేపట్టిన శిక్షాసంఘర్ష్ (విద్యా హక్కుల పోరాటం)యాత్రకు సమాజాన్ని సంసిద్ధం చేయడానికి కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నాడు.

అనిల్ సద్గోపాల్‌తో పాటు దేశవ్యాప్తంగా18 రాష్ర్టా ల్లో దేశంలోని పిల్లలందరికి, పేద,ధనిక తేడా లేకుం డా సమానమైన నాణ్యమైన విద్య ఉచితంగా అందుబాటులోకి రావాలనే నినాదం ఈ ఉద్యమానికి కేం ద్ర బిందువు. అలాగే ఉన్నత విద్య వ్యాపారీకరణను, ప్రపంచీకరణను వ్యతిరేకిస్తూ దేశంలోని యువతీ యువకులందరికి ఉన్నత విద్య అందుబాటులో ఉం డాలని, తల్లిదండ్రుల ఆర్థిక స్థాయిని బట్టికాక యువ త ఆకాంక్షల సాకారానికి తగిన అవకాశాలు సమాజము,ముఖ్యంగా ప్రభుత్వాలు ఉన్నత విద్యలో కల్పించాలనే డిమాండ్ ఈ ఉద్యమంలో మరొక కీలక అంశం.

గత రెండు దశాబ్దాలుగా విద్యా రంగం-స్కూలు విద్య నుంచి విశ్వవిద్యాలయాల దాకా తీవ్ర విధ్వంసానికి గురైంది. దేశ పాలకులు సామ్రాజ్యవాద శక్తు ల సేవలో మునిగితేలుతున్నారు. సామ్రాజ్యవాద శక్తులు నిన్నటిదాకా తమకు సేవ చేసిన అహ్లువాలి యా, చిదంబరం, మన్మోహన్,కపిల్‌సిబాల్‌ని కాలగర్భంలోకి నెట్టి, ఇప్పుడు మరో జట్టును ప్రోత్సహిం చి అంతర్జాతీయ ప్రఖ్యాతి కల్పిస్తున్నారు. నిన్నటి దాకా వీసా కూడా నిరాకరించిన నరేంద్రమోడీకి అమెరికా బ్రహ్మరథం పట్టింది. ఈ జట్టు ఏ మాత్రం విఫలమైనా, త్వరలోనే మరో బృందాన్ని ప్రోత్సహిస్తారు. సామ్రాజ్యవాదశక్తులు తమ ప్రయోజనాల కోసం ఈ ఎత్తుగడలు వేస్తూనే ఉంటాయి. మన పాలకులు ఎందుకు ఇలా రూపాంతరం చెందారో విశ్లేషించవలసిన అవసరముంది.

ఇలాంటి చారిత్రక సంక్షోభ దశలో దేశ భవిష్యత్తు గురించి మదనపడేవారు సరాసరి ప్రజల దగ్గరికే వెళ్లవలసి ఉంటుంది. ఈ చారిత్రక కర్తవ్యంలో భాగంగా అఖిలభారత విద్యాహక్కు ఫోరం నవంబర్ రెండు నుంచి డిసెంబర్ నాలుగు వరకు సంఘర్ష్ యాత్ర ను చేపట్టింది. ప్రజాస్వామ్యం వికాసం చెందాలంటే ప్రజల దగ్గరకు వెళ్లడం, వాళ్ల అనుభవాలను, అనుమానాలను, భయాలను, అభిప్రాయాలను తెలుసుకోవలసి ఉంటుంది. దేశవ్యాప్తంగా మీడియా ప్రచా రం వల్ల ప్రభుత్వస్కూళ్లల్లో చదువురాదని, ఆ స్కూళ్ల కు పిల్లలను పంపితే వాళ్లకు భవిష్యత్తే ఉండదని, ఇంగ్లిషు మీడియంలో చదివితేనే చదువని మాతృభాష విద్యా బోధనకు పనికిరాదని, మన భాషలను మనమే కించపరుచుకొని మన ఆత్మగౌరవాన్ని ఇంగ్లిషుకు తాకట్టు పెడుతున్నాం.

భాష ఒక మాధ్యమం మాత్రమే. భాషే విజ్ఞానం కాదు. ఇంగ్లిషు వస్తే చాలు ఉజ్వల భవిష్యత్తు అనే ప్రచారం చాలా జరిగింది. ఇంగ్లిషు మాతృభాషగా ఉన్న ఇంగ్లాండ్, అమెరికా తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. వీటితో సంబంధం లేకుండా దేశంలో ఇంగ్లిషు భాషపట్ల పెరిగిన మమకారం అనుహ్యస్థాయికి చేరుకుంది. ఈ అంశం మీద ప్రజలతో మాట్లాడవలసిన అగత్యం ఏర్పడింది. అలాగే ప్రభుత్వ స్కూళ్లు నిజంగా పనిచేయడం లేదా, ఉపాధ్యాయులు పూర్తిగా తమ బాధ్యతలకు స్వస్తి చెప్పా రా? ప్రైవేట్ స్కూళ్లలోని ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తున్నారా? ఇవన్నీ ప్రశ్నలే.

వాస్తవాలు ఏమిటి అనే చర్చ నిష్కర్షగా జరగవలసిందే. ప్రభుత్వ ఉపాధ్యాయులకు విద్యా బోధనలోని ఆనందం అర్థం కాలేదా? పేద పిల్లల మేధ స్సు వికాసం చెంది సంపూర్ణమైన మనుషులుగా ఎదగడంలో కనిపించే జీవిత పరమార్థం వాళ్ల అనుభవంలోకి రావడంలేదా? ఉపాధ్యాయులు తమ బాధ్యతలు నెరవేర్చకపోతే నిలదీయవలసిందే. అధికారంలో ఉండేవారు సమాజంలోని స్వార్థపరశక్తులు ప్రభుత్వ స్కూళ్లను పనిగట్టుకొని విధ్వంసం చేస్తుంటే వాళ్లకు వ్యతిరేకంగా పొరాడడానికి ఉపాధ్యాయులు భయపడుతున్నారా? పేద పిల్లల అభివృద్ధి కోసం, సమాన అవకాశాల కోసం పోరాటాలు చేయడం మనం మరచిపోయామా? ఈ అంశాలన్నీ ఈ యాత్రలో చర్చకు రావలసిందే.

పిల్లలందరికీ సమాన విద్య ఒకవైపు, ఉన్నత విద్యారంగాన్ని ప్రపంచ మార్కెట్‌శక్తుల నుంచి, అలా గే దేశంలోని స్వార్థ పరశక్తుల నుంచి మనం కాపాడకపోతే, ఇప్పుడు పోరాటం చేయకపోతే భవిష్యత్ తరాలు మనను క్షమించవని గుర్తుంచుకోవాలి. ఈ ఉద్యమానికి తెలంగాణ నుంచి అరుదైన ప్రతిస్పంద న వచ్చింది. ఒకవైపు ముఖ్యమంత్రే కేజీ టు పీజీ ఉచిత విద్య అనే నినాదం ఇచ్చి ఉన్నాడు. ఆవిధం గా ఈ ఉద్యమానికి ఒక సానుకూల వాతావరణం ఉన్నదనే భావించాలి. ఈ ఉద్యమం ప్రభుత్వం చెప్పే ఉచిత విద్యను మరింత స్పష్టంగా, అర్థవంతంగా నిర్వచించవలసి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఐదు ఐళ్లలో పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చేలా ప్రజల నుంచి ఒత్తిడి పెం చాలి. అలాగే తెలంగాణ విశ్వవిద్యాలయాలకు, ఉన్న త విద్యకు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చే దిశగా కృషి చేయాలి.

విశ్వ విద్యాలయాలు తమ తమ జిల్లాల్లో అభివృద్ధికి, మార్పుకు సజీవమైన కేంద్రాలు కావాలి. జిల్లా ప్రజలకు విశ్వవిద్యాలయం తమదనే భావన కలగాలి. ఇక్కడ తమ సమస్యలను, తమ కష్టాలను చర్చిస్తారని, పరిశోధనలు చేస్తారని, పరిష్కార మార్గాలలో భాగస్వాములౌతారని భావించా లి. ఇవన్నీ ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఈ ఉద్యమంలో ఎంత పెద్ద ఎత్తున పాల్గొంటారన్న దాన్ని బట్టి ఉంటుంది. అయితే తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఇచ్చిన పిలుపుకు స్పందించి, 115 ప్రజాసంఘాలు, యాభై మంది లబ్ధప్రతిష్ట కలిగిన వ్యక్తులు ఉద్యమానికి మద్దతు తెలిపారు. నాకు తెలిసి బహు శా ఇన్ని సంఘాలు ఒక ఉద్యమానికి తమ మద్దతు, సంఘీభావం తెలపడం గతంలో ఎప్పుడూ జరగలేదనే అనుకుంటున్నాను. తెలంగాణలో ఈ యాత్ర నవంబర్ 20వ తేదీ నుంచి 27 వరకు నిర్వహించబడుతుంది. నవంబర్ రెండున కన్యాకుమారిలో యాత్ర ప్రారంభమౌతుంది. అలాగే ఈశాన్య రాష్ర్టాలలో నాగాలాండ్ లేదా మణిపూర్‌లో ప్రారంభమౌతుంది.

అంటే దేశంలో నాలుగు ఐదు దిశల నుంచి ఒకేరోజు ప్రారంభమై అన్ని రాష్ర్టాలలో కొనసాగి అంతిమంగా డిసెంబర్ నాలుగున యాత్ర ముగింపు సభ భోపాల్‌లో జరుగుతుంది. ఇది ముగింపు సభ కాదు, లక్ష్యసాధన జరిగేదాకా ఉద్యమం కొనసాగించడానికి ఇదొక స్ఫూర్తి సభ.

తెలంగాణలో ఉండే విస్తృత ప్రజాస్వామ్యశక్తుల వల్ల, అలాగే పోరాట వారసత్వం వల్ల దేశం మొత్తం తెలంగాణవైపు చూస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఒకనాడు బెంగాల్ రాష్ట్రం నిర్వహించిన చారిత్రక పాత్ర ను నిర్వహించవలసి ఉన్నది. విద్యా పరిరక్షణ జాతీయస్థాయి ఉద్యమంలో తెలంగాణ భాగస్వామ్యం చాలానే ఉన్నది. మన ఉపాధ్యాయ సంఘాలు జాతీయస్థాయి సంస్థలో సభ్యసంఘాలుగా ఉన్నాయి. ఈ మొత్తం జాతీయ ఫోరానికి సలహాదారులలో పూర్వ వీసీలు, శాస్త్రవేత్తలు, జీవితమంతా విలువల కోసం నిలబడిన నిజాయితీ కలిగిన ప్రజాస్వామ్యవాదులు చాలామంది ఉన్నారు.

haragopal

మన రాష్ట్రంలో విద్యా పరిరక్షణ కమిటీ సభ్య సంఘాల ఉపాధ్యాయుల సంఖ్య 50 నుంచి 60 వేల దాకా ఉంటుంది. గత మూడు నాలుగు దశాబ్దాలుగా నాకు వ్యక్తిగతంగా, అలాగే సేవ్ ఎడ్యుకేషన్ కమిటీకి ఒక సంఘంగా నిరంతర సాన్నిహిత్యం ఉం ది. మార్కెట్‌శక్తుల విజృంభన తర్వాత ఉదారత్వం తగ్గుతూ వస్తున్నది. అందుకే ఈ కాలమ్ (ఉచితం కాకున్నా) ద్వారా ఉపాధ్యాయ మిత్రులకు ఇతర తెలంగాణ ప్రజాస్వామ్యవాదులకు ఆర్థిక సాయం కోసం అభ్యర్థన చేయక తప్పడం లేదు. నవంబర్ నెలలో జరిగే చరిత్రాత్మక ఉద్యమాన్ని మనందరం ముందుకు తీసుకపోవలసిన అవసరం ఉంది. దీన్ని మరో స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా పరిగణించి అదే స్ఫూర్తితో పిల్లలందికి భవిష్యత్తు కోసం ఉద్యమిద్దాం.

988

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

Published: Thu,September 18, 2014 12:09 AM

సమున్నత మానవత్వమే కవి లక్ష్యం

ప్రజలు తమ జీవితాలు మారాలనే చేసే పోరాటాలు ఉంటాయి. అలాగే వియత్నాం యుద్ధంలాంటి యుద్ధాలుంటాయి. యుద్ధం మీద యుద్ధం చేసే యుద్ధాలు కూడా ఉం

Featured Articles