విద్యాహక్కు పోరాట అనుభవాలు


Sat,November 8, 2014 02:03 AM

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున్నది. కన్యాకుమారి నుంచి ప్రారంభించిన యాత్రలో అఖిలభారత విద్యాహక్కు ఫోరం తరఫున నేను పాల్గొన్నా ను. అక్కడ జనం పెద్ద సంఖ్యలో హాజరు కాకున్నా స్కూలు పిల్లలు, ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘ నాయకులు ప్రత్యేకంగా ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు సయ్యద్‌వలీ (కాకతీయ విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ స్కాలర్) పాల్గొన్నాడు. ఇద్దరు పూర్వ వీసీలు-డాక్టర్ వాసంతీదేవి, డాక్టర్ ముత్తుకుమారన్ పాల్గొన్నారు.

discription

ఒకరు మహిళా విశ్వవిద్యాలయం వీసీ కాగా, మరొకరు భారతిదాసన్ వీసీ. వీరు దక్షిణ భారతదేశ యాత్ర కాగడాను అఖిలభారత ఫోరానికి అందించగా, కాగడాలు కన్యాకుమారి సరిహద్దులోని బలరాంపురం దగ్గర కేరళ బాధ్యులకు అప్పజెప్పడానికి ఉద్యమ నినాదాలతో అలంకరించిన వాహనంలో కార్యకర్తలు ముందుకు సాగారు.

కన్యాకుమారిలో పోరాటం ప్రారంభం ఒకవైపు తిరువళ్ళూర్ విగ్రహం, మరోవైపు గాంధీ మంటపం సమీపం నుంచి జరిగింది. కొంత దూరంలో వివేకానంద రాక్ కూడా ఉంది. ఆ సమయంలో ఎందు కో అనుకోకుండానే గాంధీ ఉప్పు సత్యాగ్రహం గుర్తుకొచ్చింది.ఆ సత్యాగ్రహం ప్రారంభంలో జనం ఎక్కువ సంఖ్యలో లేకున్నా, ప్రతిఘటన సాగుతున్న క్రమంలో ఒక ప్రవాహంలా మారి, అది చరిత్రలో గుర్తుంచుకోదగ్గ ఉద్యమంగా నిలిచింది. ఉద్యమ విస్తృతి సమస్య తీవ్రతను బట్టి ఉంటుంది. విద్యా పోరాట ఉద్యమం ఇప్పుడు కాకున్నా రేపైనా ఒక రాజీలేని పోరాటంగా మారక తప్పదు.

ఏడు దశాబ్దాల తర్వాత కూడా పాలకులు భార త రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరించి కోట్లాదిమంది బాలబాలికలను నిరక్షరాస్యులుగానే ఉంచారు. ఇచ్చిన విద్యను కూడా సమాన నాణ్యత గల విద్య ను ఇవ్వలేదు. ఈ విఫలం పాలకుల ఘోరాతి ఘోర వైఫల్యాల్లో ఒకటి. గత ఐదు ఆరు దశాబ్దాల ఒత్తిడి వల్ల, ప్రజా చైతన్యం పెరగడం వల్ల విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించక తప్పలేదు. చట్టం చేశారు. కానీ ఆ చట్టం చాలా లోపభూయిష్టంగానే కాక, నాలుగు సంవత్సరాల తర్వాత కూడా దాని అమ లు విషయంలో చిత్తశుద్ధి లేకపోవడం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో జరిగిన విద్యా సదస్సులో అఖిలభారత విద్యా హక్కు ఫోరం పుట్టింది. ఈ ఫోరం గత నాలుగేళ్లుగా తన శక్తిమేరకు పోరాడుతున్నది.

నిజానికి పేద తల్లిదండ్రులకు పిల్లలను చదివించాలనే కోరిక బలంగా, విస్తృతంగా ఉంది. మధ్యతరగతికి పిల్లల ఫీజులు చాలా భారమైపోయాయి. పిల్లల చదువులకు అప్పులు చేయడం సాధారణమైపోయింది. ఇక సంపన్నుల పిల్లల విలువలు, ప్రవర్తన తల్లిదండ్రులకే కాక సమాజానికి సవాలుగా మారింది. కార్పొరేట్ కళాశాలల్లో ఏం చదువు చెబుతున్నారో తెలియదు. కానీ వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన వారు అమానవీయంగా తయారయ్యా రు. ఈ మధ్యే హైదరాబాద్‌లో ఒక ఐటీ కంపెనీలో లక్షల జీతం సంపాదిస్తున్న మనిషి భార్యతో విభేదాలు రావడం వల్ల తన ఇద్దరు అమాయకులైన పసిపిల్లల గొంతుకోసి చంపి పూడ్చిపెట్టాడు.

ఈ ఒక్క సంఘటన చాలు మన విద్య తాత్విక స్వభావ స్వరూపాలేమిటో అర్థం చేసుకోవడానికి. అందుకే ప్రత్యామ్నాయ విద్యాపోరాటం సంపన్నుల అవస రం కూడా. విద్య వ్యాపారీకరణ మనిషిని ఎంత అథఃపాతాళానికి తీసుకపోతుందో తెలుసుకోవడానికి మన చుట్టూ ఉండే మనుషులను గమనిస్తే అట్టే అర్థమౌతుంది. విద్యాహక్కు ఉద్యమం పిల్లలందరి కీ సమానమైన విద్యే కాదు, సమాజ శ్రేయస్సు కోసం, సమ సమాజంవైపు మనిషిని తీసుకవెళ్లడం కోసం అవసరం. ఇప్పుడు విద్యా పోరాటానికి కావలసిన సామాజిక, ఆర్థిక, చారిత్రక పరిస్థితులు పరిపక్వంగా ఉన్నాయి. అందుకే ఉద్యమం తీవ్రస్థాయికి పోక తప్పదు.

ఈ ఉద్యమ సందర్భంలో నవంబర్ ఒకటి నాడు తమిళనాడులోని నాగర్‌కోయల్‌లో భాషా రాష్ట్ర ఏర్పాటు మీద మీటింగ్ జరిగింది. ఇందులో రాజకీయ నాయకులు, ప్రజాస్వామ్యవాదులు, విద్యాహక్కు కార్యకర్తలు పాల్గొన్నారు. మాట్లాడిన ఎనిమిది, పది మంది వక్తలు సమాన విద్య గురించి మాట్లాడడమే గాక మాతృభాషలో బోధనను బలపరుస్తూ మాట్లాడారు. తమిళనాడుకుండే సామాజి క, చారిత్రక నేపథ్యంవల్ల, ఇతర ప్రాంతాల్లో ఆంగ్లం పిచ్చి పట్టుకున్నా, వీరికి తమ భాష పట్ల అభిమా నం ఏ మాత్రం తగ్గలేదు. ఈ మీటింగ్‌కు వచ్చిన నూట యాభై, రెండు వందల మంది మూడు నాలు గు గంటలు చాలా ఆసక్తిగా ఉపన్యాసాలు విన్నారు. ఈ సదస్సులో విద్యా వ్యాపారీకరణ కాషాయీకరణకు వ్యతిరేకంగా మాట్లాడడమే కాక భారత రాజ్యాంగంలోని ప్రజాస్వామ్య, సెక్యులర్, శాస్త్రీ య, సోషలిస్టు విలువలను కాపాడుకోవాలనే ఆకాంక్ష కనిపించింది. మీటింగ్ చాలా స్ఫూర్తిదాయకంగా ఉందని చాలామంది నన్ను వ్యక్తిగతంగా కలిసి చెప్పారు.

మరునాడు కన్యాకుమారి నుంచి తిరువనంతపురం చేరుకోగానే సమస్య మీద ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇందులో పాల్గొన్న కొందరు జర్నలిస్టులు ఉద్యమానికి తమ వ్యక్తిగత అభినందనలు తెలుపుతూ ఉద్యమ విజయాన్ని ఆకాంక్షించారు. కేరళలో సీపీఎం పార్టీ అనుబంధ విద్యార్థిసంఘం ఎస్‌ఎఫ్‌ఐ సహకరించకపోవడం వల్ల ఉద్యమం ఊపందుకోలేకపోయింది.ఎస్‌ఎఫ్‌ఐ నిరాసక్తత వల్ల ఏఐఎస్‌ఎఫ్ కూడా ఉద్యమంలో శ్రద్ధ పెట్టలేదు. ఇవి రెండే కేరళలో బలమైన విద్యార్థి సంఘాలు. ఈ దృక్పథమే వామపక్ష రాజకీయాల వైఫల్యానికి దారి తీసింది. విద్య లాంటి అంశంపై తాము స్వంతంగా మౌలిక ఉద్యమాలు నిర్వహించరు, నిర్వహిస్తే సహకరించరు! మిగతా రాష్ర్టాలతో పోలిస్తే, తెలంగాణ రాష్ట్ర ఏఐఎస్‌ఎఫ్ మెరుగు.

కేరళలో కొంత ప్రయ త్నం చేయడంవల్ల ఈ సంఘం ఉద్యమంలో పాల్గొనడానికి కొంత సంసిద్ధతను చూపింది. పార్లమెంటరీ వామపక్ష పార్టీలు ఇప్పుడైనా కొంత ఆత్మపరిశీలన చేసుకోవలసిన అనివార్యత ఏర్పడింది. కేరళ, పశ్చిమబెంగాల్‌లో గతంలో అధికారంలో ఉండ డం వల్ల ఇప్పుడు ఆ రెండు పార్టీలు కొత్త సమస్యలను, సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. విద్యాహక్కు ఉద్యమానికి సహకరించమని పొలిట్‌బ్యూరోకు విజ్ఞప్తి చేసినా స్పందన లేకపోవడం చూస్తే, అవగాహనను పునఃపరిశీలించడం పాఠాలు నేర్చుకోవడం ఇంకా మిగిలే ఉంది. తిరువనంతపురం ప్రెస్ కాన్ఫరెన్స్ విద్యా పోరాటానికి మంచి ప్రచారమే ఇచ్చిందని బాధ్యులు ఫోన్ చేసి చెప్పారు.

తిరువనంతపురం నుంచి ఈశాన్య భారతంలోని నాగాలాండ్‌కు వెళ్లవలసిన బాధ్యత పడింది. ఈశా న్య రాష్ర్టాల రాజకీయ, సామాజిక, ఆర్థిక చరిత్రే భిన్నం. నాగాలాండ్ ప్రజలు అత్యధికంగా క్రిష్టియ న్లు. పాలనాపరంగా వాళ్లు, చరిత్రలో ఎన్నడూ ఎవ రి ఆధిపత్యంలో లేరు. అందుకే వాళ్ల పోరాట చరిత్రే వేరు. కానీ విచిత్రంగా విద్యా రంగంలో మాత్రం మొత్తం భారతదేశ అనుభవమే వాళ్ల అనుభవం. దేశంలో మారిన, మారుతున్న విద్యా విధాన ప్రభా వం ఈశాన్య ప్రాంతం మీద బలమైన ప్రభావం కలిగించింది. విద్యా పోరాటానికి ఈ ప్రాంత సమస్య లు కొన్ని కొత్త సవాళ్లను ముందుకు తీసుకవచ్చా యి. ఇందులో ఒకటి- మాతృభాషలో బోధన. రెండవది- కాషాయీకరణ. ఈ రెండు అంశాల మీద నాగాలాండ్ రాష్ట్ర రాజధాని కోహిమాలో, అలాగే ఈ రాష్ట్రంలో మరో పెద్ద పట్టణం దీయాపూర్‌లో చాలా ఆసక్తికర చర్చ జరిగింది. ఈ రెండు అంశాలను వచ్చే వారం కాలమ్‌లో చర్చించుకుందాం.

నవంబర్ రెండున హైదరాబాద్‌లో ప్రారంభమైన విద్యా పోరాటం, బహుశా దేశంలో ఎక్కడా జరగనంత బలంగా జరిగిందనే చెప్పాలి. నిజానికి తెలంగాణలో ఉద్యమం నిరంతరంగా ఏదో ఒక స్థాయిలో గత మూడు నాలుగు దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నది. ఆ బీజాలు బలంగానే ఉన్నాయి. అందుకే కేజీ టూ పీజీ ఉచిత విద్య అన్న నినాదం ప్రభుత్వం నుంచే వచ్చింది. కేజీ టూ పీజీ ఉచిత విద్య అంటే ఏమిటో స్పష్టత లేదన్న చర్చ జరుగుతూనే ఉన్నది. ఈ అంశాన్ని ప్రజలే నిర్వచించవలసి ఉంటుంది. ఇప్పుడున్న ఆర్థిక అభివృద్ధి నమూనా లో విద్యకు పెద్ద స్థానం లేదు. ప్రపంచబ్యాంకు ఆలోచన నుంచి ప్రభుత్వం బయటపడడం అంత సులభం కాదు. కల్వకుంట్ల కవిత గారు కార్పొరేట్ స్కూళ్లు కొనసాగుతాయని అన్నారు.

అలాగే బడ్జెట్‌లో విద్యకు కేటాయింపు కేజీ టూ పీజీ ఉచిత విద్య అనే విధాన ప్రకటనకు అనుగుణంగా లేదు. విద్యారంగ ప్రజాస్వామ్యీకరణ తెలంగాణ ప్రజల మీద ఆధారపడే ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న ఉద్యమంలో ఈ అంశాలన్నీ విస్తృత చర్చకు రావా లి. వచ్చే సంవత్సరం బడ్జెట్ వరకు ప్రాధాన్యతలను మార్చే దిశగా ఈ ఉద్యమం ప్రజాభిప్రాయాన్ని సమీకరించగలగాలి. ప్రజలు తమకు ఏం కావాలో స్పష్టంగా అడిగే స్థాయికి ఎదగాలి.

682

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

Published: Thu,September 18, 2014 12:09 AM

సమున్నత మానవత్వమే కవి లక్ష్యం

ప్రజలు తమ జీవితాలు మారాలనే చేసే పోరాటాలు ఉంటాయి. అలాగే వియత్నాం యుద్ధంలాంటి యుద్ధాలుంటాయి. యుద్ధం మీద యుద్ధం చేసే యుద్ధాలు కూడా ఉం

Featured Articles