భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం


Thu,December 18, 2014 02:02 AM

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి. ఈ ప్రకటన చారిత్రక సందర్భం చాలా కీలకమైనది. విద్య పూర్తిగా ప్రైవేటు, అలాగే సామ్రాజ్యవాదుల చేతుల్లోకి మారుతున్న తరుణంలో ఈ మొత్తం ప్రక్రియకు అడ్డుకట్టవేసి, విద్యను సామాజిక న్యాయంవైపు, సమభావం వైపు మళ్లించడమే కాక మతోన్మాద ప్రభావం నుంచి కార్పొరేట్ కటకటాల నుంచి విద్యారంగాన్ని విముక్తం చేయవలసిన బాధ్య తను ఈ దేశ ప్రజల మీద పాలకులు పడేశారు.

విద్యా రంగం విషపూరితమైతే ఆ విషం అన్ని రంగాలకు పాకి సామాజిక వ్యవస్థ నిలువునా కూలిపోతుంది. ఈ విధంగా వ్యవస్థలు కూలిపోవడం చరిత్ర నిండా మన కు కనిపిస్తాయి. కానీ చరిత్ర గతిని మలచ గల, మలపగల ప్రజాస్వామ్యశక్తులు కూడా ఆ విధ్వంసం నుం చి పుట్టుకొస్తాయన్నది కూడా చారిత్రక సత్యమే. కానీ విద్యారంగం కూలిపోతే కొత్త శక్తులు దానినుంచి పుట్టడానికి విద్యలో ప్రజాస్వామ్య సంస్కృతి ఉండాలి. ఆ విలువలను సాధ్యమైనంత వరకు నిలబెట్టగలగడమే విద్యా పోరాటయాత్ర లక్ష్యం. ఈ లక్ష్యమే భోపాల్ ప్రకటనకు స్ఫూర్తి.

మన దేశంలో వందల ఏళ్లుగా కోట్లాదిమంది శ్రామి క జనానికి, అలాగే మహిళలకు విద్య నిరాకరించబడింది. ధర్మశాస్త్రం పేర మనువు రూపకల్పన చేసిన అధర్మ శాస్త్రంలో విద్యను నిరాకరించడమే కాక, శ్రామికులు మహిళలు అలాంటి ప్రయత్నం చేస్తే కఠినమైన శిక్షలను నిర్దేశించాడు. ఇంత అప్రజాస్వామికమైన, అమానవీయమైన మను ధర్మశాస్ర్తానికి డాక్టర్ అంబేద్కర్ నిప్పు పెట్టాకే సమాజానికి దాని దుర్మార్గం పూర్తి గా అవగాహనలోకి వచ్చింది.

దేశ చరిత్రలో దుర్మార్గమైన సంప్రదాయాలు ఎం త బలంగా ఉన్నాయో, దానికి వ్యతిరేకంగా లేదా సమాంతరంగా అభివృద్ధి చెందిన సత్సంప్రదాయా లు కూడా అంతే బలంగా ఉన్నాయి. బుద్ధుడు బోధించిన బౌద్ధం, చార్వాకులు, లోకాయనులు లేవదీసిన ప్రశ్నలు సాధారణమైనవేమీ కావు. అలాగే మధ్య యుగంలో విలసిల్లిన భక్తి ఉద్యమం, సూఫీ సంప్రదా యం మన ఆలోచనలను ఆచరణను సుసంపన్నం చేశాయి.

అందరికి విద్య ముఖ్యంగా బాలికలకు విద్య అనే చైతన్యాన్ని ప్రజా జీవనంలోకి తెచ్చిన మహాత్మాఫూలె, సావిత్రిబాయి దంపతులు విద్యా చరిత్రకు కొత్త బాటలు వేశారు. స్వాతంత్రోద్యమ కాలంలో అంబేద్కర్, గిజూబాయ్, ఠాగూర్, గాంధీ విద్య గురిం చి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఒక కొత్త సమాజాన్ని కలలు గన్న భగత్‌సింగ్ నూతన స్ఫూర్తినిచ్చాడు. అందుకే భోపాల్ సభకు భగత్‌సింగ్ ప్రాంగణంగా, సభా వేదికకు సావిత్రిబాయి ఫూలే వేదికగా, సమావేశహాలుకు డాక్టర్ అంబేద్కర్ పేరును పెట్టారు.

వీళ్లందరి కృషి ఫలితంగా స్వాతంత్య్రోద్యమ కాలం లో అందరికీ విద్య అన్న నినాదం ముందుకు రావడ మే కాక 1944లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అందరికీ విద్య అన్న విధాన ప్రకటన చేసింది. ఈ మొత్తం ప్రక్రి య ఫలితంగా అందరికి విద్య అనే అంశం భారత రాజ్యాంగంలో భాగమయింది.

అంబేద్కర్ విద్యను ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలో చేర్చాలని ప్రతిపాదించినప్పుడు చాలామంది సభ్యులు అది ఆచరణయోగ్యం కాదని అభ్యంతరాలు చెప్పడంతో, రాజ్యాం గ రచన చాలా ఆలస్యమైందనే ఒత్తిడి బయట ఉండ డం వల్ల ఈ అంశం మీద లోతైన చర్చ జరగలేదు. స్వాతంత్య్రం తర్వాత ఒక దశాబ్ద కాలంలో అందరికీ విద్య అందుబాటులోకి రావాలని ఆదేశిక సూత్రాల లో చేర్చబడింది. దశాబ్ద కాలం ఏమో కానీ, ఆరున్నర దశాబ్దాల తర్వాత కూడా విద్య పేదలకు అందని ద్రాక్షగానే ఉండిపోయింది.

కేంద్రంలో, రాష్ర్టాల్లో భిన్న రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. నూతన సామాజికీకరణలు జరిగాయి. అయినా విద్యకు దక్కవలసిన ప్రాధాన్యం దక్కలేదు. నూతనంగా ఎదిగిన సామాజిక వర్గాలకు రాజ్యాధికారంలో కొంత వాటా దక్కినా, అంతిమంగా మళ్లీ మెకాలె, మనువు తిరిగి మన విధాన నిర్ణయాలను, విద్య దశ, దిశను నియంత్రించే స్థాయికి చేరుకున్నారు.

ఈ చారిత్రక నేపథ్యంలో దేశమంతా ఉద్యమం నిర్వహించి ప్రజల దగ్గరకు వెళ్లిన భిన్న రాష్ట్ర ఉద్యమకారులు, ఉద్యమ ప్రతినిధులు భోపాల్‌లో సమావేశమయ్యారు. సమావేశం నాలుగు డిసెంబర్ నాడు జరిగినా చాలామంది ఉద్యమకారులు భోపాల్ గ్యాస్ బాధితుల ప్రతిఘటనకు మద్దతుగా డిసెంబర్ మూడు నాడే భోపాల్‌కు చేరుకున్నారు. ఈ బాధితులు గత ముప్ఫై ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నారు.

ఇరోం షర్మిల మణిపూర్‌లో 14 ఏళ్లుగా, భోపాల్ బాధితులు ముప్ఫై ఏళ్లుగా, విద్యాపోరాటం నాలుగైదు ఏళ్లు గా తమ తమ లక్ష్యాల కోసం పోరాటాలు చేస్తున్నారు. విద్యా పోరాటం తమ లక్ష్యాలను తక్షణమే సాధించగలదనుకోవడం భ్రమే. సామ్రాజ్యవాద ప్రేరేపిత విషవాయువుకు వ్యతిరేకంగానైనా, సైనిక ప్రత్యేక అధికారాల చట్టం చేసిన దేశ రాజ్య నియంతృత్వానికి వ్యతిరేకంగానైనా,ఈదేశంలో అందరికీ సమానమైన నాణ్య మైన విద్య కోసమైనా జరిగే పోరాటమైనా సుదీర్ఘ పోరాటాలే.

ఈ ఉద్యమాలన్నీ ఒక వ్యవస్థీకృత అన్యాయానికి, అసమానతలకు, ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలని విద్యాపోరాటంలో పాల్గొంటున్న వాళ్లకు తెలియక కాదు. కానీ పోరాటాలే లేకపోతే సామ్రాజ్యవాద విషవాయువైనా, భారత రాజ్య వ్యవస్థ అయినా, విద్యారంగంలోని అసమానతలు, ఆధిపత్యాలైనా మరింత పెట్రేగి ఒక భయంకరమైన వ్యవస్థను సృష్టించి, మనిషిని మనిషిగా బతకనివ్వని స్థాయికి చేరుకోకుండా అడ్డుకట్టవేయడమే ఇప్పటి అవసరం.

భోపాల్‌లో జరిగిన ఊరేగింపులో నాలుగైదు వేల మంది పాల్గొన్నారు. ఇందులో మధ్యప్రదేశ్ గిరిజను లు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ నుం చి పాల్గొన్న వాళ్ల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. సమావేశానికి వచ్చిన వాళ్లలో విద్యార్థులు, యువజనుల పాత్ర కూడా గొప్పదే. సమావేశం చివరిలో యువజనులు వందల సంఖ్యలో పాటలు పాడడమే కాక ముక్తకంఠంతో ఈ దేశ ప్రస్తుత విద్యా విధానానికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ దేశంలోని అసంఖ్యాక ప్రజల జీవన పోరాటాలలో భాగంగా, వాళ్ల ఆకాంక్షలు సాకారమయ్యేదాకా పోరాడే ప్రజలతో మమేకమౌతామని ప్రకటించారు. గిరిజన మహిళలు చాలా స్ఫూర్తిదాయకమైన పోరాట పాటలు పాడారు. ఇదంతా ఒక పెద్ద ప్రజాస్వామ్య అనుభవమే. విద్యా పోరాటానికి మద్దతుగా దేశంలోని తొమ్మిది వామపక్షపార్టీల ప్రతినిధులు మాట్లాడారు. ఇందులో పార్లమెంటరీ పార్టీలున్నాయి. పార్లమెంటు బయట పోరాడుతున్న పార్టీలున్నాయి. స్వాతంత్య్రం తర్వాత విద్యాహక్కు కోసం ఇన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యశక్తులు తమ తమ రాజకీయ విభేదాలను పక్కకు పెట్టి ఒకే వేదికమీది నుంచి మాట్లాడడం బహుశా ఇది మొదటిసారి.

దేశంలో ఎలాంటి విద్యావిధానం అవసరమో భోపాల్ శంఖారావం పేర ఒక మ్యానిఫెస్టో ప్రవేశపెట్ట బడింది. సభ ఏకగ్రీవంగా ఈ ప్రకటనను ఆమోదించింది. దేశంలో స్కూలు స్థాయిలో కామన్ స్కూల్ విధానం ప్రవేశపెట్టాలని, రాష్ట్రపతి కొడుకైనా రైతు కొడుకైనా ఒకే బడికి వెళ్లాలని, సంపద, కులం, వర్గం తో సంబంధం లేకుండా ఒక నివాస ప్రాంతంలో ఉం డే బాలబాలికలు ఆ ప్రాంతంలో ఉండే ఒకే స్కూలుకు వెళ్లాలని ప్రకటన పేర్కొన్నది. అలాగే ఏ అవధులు, అభ్యంతరాలు లేకుండా యువత తమ విద్యను కొనసాగించేలా అవకాశాలు కల్పించే విధానం ఉండాలని, అలాగే డబ్ల్యూటీవోలో విద్యను చేర్చడానికి సమర్పించిన ఆఫర్‌ను వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేసింది.
మాతృభాషలో బోధనను కూడా ఆ ప్రకటన సమర్థించింది.

మాతృభాషలో బోధన అందరు బాలబాలికలకు అమలుచేయాలని పేర్కొంది. కొందరికి ఇంగ్లీష్ మీడియం, కొందరికి మాతృభాష అనే వివక్షతో కూడి న పద్ధతి కాక, ఇంట్లో మాట్లాడే భాష, అలాగే బయట తమ చుట్టూ ఉండే ప్రజలు మాట్లాడే భాషలో పిల్లల విద్య ఉండాలి. కోట్లాదిమంది సామాన్యప్రజలు తమ తమ భాషల్లో మాట్లాడుతూ తమ చరిత్రను, తమ సంస్కృతినీ, తమ శ్రమైక అనుభవాన్ని, ఒక్క మాట లో చెప్పాలంటే తమ జీవితాన్ని పంచుకుంటున్నప్పు డు చదువుకున్న మనుషులకు ఆ జీవితంతో సంబం ధం లేకపోతే చదువుకున్న మనిషి తన ప్రజలతో ఉండే అవినాభావ, ఆత్మీయ సంబంధాలను విడగొడుతున్నట్టే.

hara

ఆంగ్లభాషను ఇతర విదేశీ భాషలతో సహా నేర్చుకోవచ్చు. కానీ ఇంగ్లీష్‌లోనే ప్రపంచమున్నదని ఎవరైనా అంటే వేలాది ప్రపంచభాషలతో సుసంపన్నమైన మానవ నాగరికత ఏమైనట్టు? ఇంగ్లీషు భాష పట్ల గౌరవం వేరు, వ్యామోహం వేరు. అన్ని భాషల ను గౌరవించినట్టే ఇంగ్లీష్‌ను గౌరవిద్దాం. ఏ ప్రజలకై నా పరాయిభాష విముక్తి సాధనం కాలేదు. ఇది మాన వ చరిత్ర పోరాట సారాంశం. అలాగే విద్యను కాషాయీకరించడాన్ని సదస్సు ఏకగ్రీవంగా వ్యతిరేకించిం ది. విద్య రాజ్యాంగ స్ఫూర్తితో శాస్త్రీయ విలువలతో కూడుకున్నది కావాలి. కానీ మధ్యయుగాల నాటి అంధ విశ్వాసాల మధ్య పడకూడదు. మానవాళి తన సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో ముందుకు వచ్చింది. గతంలోకి ప్రయాణం ఆత్మహత్యా సదృశం. రాబో యే కాలంలో భోపాల్ ప్రకటన వెలుగులో దేశ ప్రజలను సమీకరించి ఒక ప్రజాస్వామ్య, మానవీయ, శాస్త్రీయ సమసమాజం దిశగా ప్రజలు ముందుకుపోయేలా ఉద్యమించడమే భోపాల్ సదస్సు స్వప్నం.

1266

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

Published: Thu,September 18, 2014 12:09 AM

సమున్నత మానవత్వమే కవి లక్ష్యం

ప్రజలు తమ జీవితాలు మారాలనే చేసే పోరాటాలు ఉంటాయి. అలాగే వియత్నాం యుద్ధంలాంటి యుద్ధాలుంటాయి. యుద్ధం మీద యుద్ధం చేసే యుద్ధాలు కూడా ఉం

Featured Articles