జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?


Thu,January 22, 2015 02:19 AM

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల్‌గా అనిపించినా ఉత్సాహంగానే కనిపిం చాడు. జైలులో పరిస్థితి కొంత మెరుగు పడిందని, తనతో పాటే తనలాంటి కేసుల వల్లే నిర్బంధంలో ఉన్న నలుగురు కామ్రేడ్స్ తనకు కొంత సహాయంగా ఉండడం వల్ల కొంత ఊరటగా ఉంద న్నాడు. వాళ్లందరికి త్వరలోనే బెయిలు వచ్చే సూచ నలున్నాయని, వాళ్లు బయటికి వెళ్లిపోతేనే తన పరి స్థితి గందర గోళం గా ఉంటుందని చెబుతూ, తన బెయిల్ ప్రక్రియ వేగ వంతం చేయాలని మిత్రులకు చెప్పవలసిందిగా కోరాడు. అయితే తాను నిర్బం ధించబడిన సెల్‌లో బయట గాలి వీచినా, సూర్యోద యమైనా సంకేతాలను బట్టి తెలుస్తుంది తప్ప కళ్లకు కనిపించదని అన్నాడు. ఆ విధంగా మేం మాట్లాడు తున్నంత సేపూ ఇద్దరు ఇంటలిజెన్స్ వాళ్లు అక్కడ కూచున్నది నేను గమనించలేదు. కొంత సేపటి తర్వాత కానీ నా దృష్టికి అది రాలేదు.

discription

ఇక మేం మాట్లాడుతున్న క్రమంలోనే ఒక ఆశ్చర్య కరమైన సంఘటన సాయిబాబా వివరించాడు. ఆయనను నిర్బంధంలోకి తీసుకున్న తర్వాత గడ్చి రోలిలోని ఒక పోలీస్ స్టేషన్‌లో తన కేసు రిజిస్టర్ అయిన విషయంలో తీసుకపోయినప్పుడు- దాదాపు రెండువేల మంది పోలీసులు, వంద వాహనాలు, 20 ల్యాండ్ మైనింగ్ క్లియరెన్స్ యంత్రాలతో తీసు కెళ్లా రని చెప్పాడు. అది ప్రముఖ మావోయిస్టు నాయ కులను తరలించినప్పుడు కల్పించే భద్రతతో సమానమని చెప్పాడు. సానుభూతిపరులు అంటే ప్రమాదకరమని చాటడానికి ఇంత ఆర్భాటం చేశారని మనం సులభంగానే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ వింతను చూస్తున్న గిరిజనులను భయభ్రాంతులకు గురిచేయడం మరో కారణం కావచ్చు. సాయిబాబ 90శాతం అంగవైక ల్యం ఉన్న వాడు. మూడు చక్రాల వాహనం లేకపోతే ఆయన కదలడం కూడా కష్టం. ఒక నడవలేని మని షి రాజ్యా నికి అంత ప్రమాదకరంగా ఎందుకు కని పిస్తున్నాడు? అనేది కీలకమైన ప్రశ్న.

ఆ మధ్య కాలంలో యూపీఏ ప్రభుత్వ హయాం లో చిదంబరం గారి హోంమంత్రిత్వ శాఖ మావో యిస్టు రాజకీయాల గురించి బహిరంగంగా మాట్లా డుతున్నవారే అడవిలో ఉండే అన్నల కన్నా ప్రమా దం అనే ఒక సూత్రీకరణ చేశారు. అడవిలో చెట్లు ఉండనీ, దాని వేళ్లు పట్టణప్రాంత మేధావులలో ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. ఈ సూత్రీకరణ మన ఉమ్మడి రాష్ట్ర పోలీసు మేధావులు చేసి ఉంటా రని నా అనుమానం. మన రాష్ట్ర పోలీసులు కేంద్రం లోని పోలీసు సంస్థలకు తాత్వికవేత్తలే కాక రోల్ మోడల్స్ కూడా. యూపీఏ చిదంబరం, ఎన్డీఏ ప్రభు త్వం హోం మినిస్టర్ కంటే ఒకరకంగా ఒక ఆకు తక్కు వ. ఎన్డీఏ ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్నా ప్రతి పక్షంలో ఉన్నా అణచివేత విషయంలో వాళ్లది కఠిన వైఖరి.

అది వాళ్ల బలం, అది వాళ్ల బల హీనత. అన్ని పార్టీల లాగ కాక బీజేపీ వేళ్లు సంఘ్ పరివార్‌లో ఉన్నా యని దేశ ప్రజలకు స్పష్టంగానే తెలుసు. ఈ సంఘ్ పరివార్ ప్రచారంలో చాలా నైపు ణ్యం ఉన్నవారు. గణేష్ పాలు తాగడాన్నైనా, గుజరా త్ అభివృద్ధి గురించి అయినా అంతే వేగంగా ప్రచా రం చేయ గలరు! మావోయిస్టు సానుభూతి పరులని ముద్ర వేయగలరు. విస్తృతంగా ప్రచారం చేయగల రు. దాని కి చట్టబద్ధంగా నడుచుకోవలసిన పోలీసులు కూడా ఈ ప్రచారం చేయడంలో సిద్ధహస్తులు. ఇక మన మీడియా గురించి ఎంత తక్కువ మాట్లాడితే ప్రజా స్వామ్యానికి అంత ప్రయోజనకరం. ఏ ప్రజా స్వామ్య విలువలపై నమ్మకం లేని మీడియా ముఖ్యంగా జాతీయ మీడియా ఎంత ప్రమాదకరంగా మారిం దో, దాని నిజస్వరూపమేమిటో గత ఆరు, ఏడు నెల లుగా చాలా సుస్పష్టంగా బహిర్గతమయ్యింది.

ఇంతకూ సాయిబాబా చేసిన నేరమేమిటి? ఆయ న ఏ హింసాకాండలో పాల్గొనలేదు. భౌతికంగా ఎవ రి మీద దాడి చేయలేదు. గుజరాత్, ముజఫరాబాద్ మతోన్మాద హింసలో పాల్గొనలేదు. రెచ్చగొడుతూ ఉపన్యాసాలు చేయలేదు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా క్లాసులు ఎగ్గొట్టలేదు. ఆయనకు ఏ స్కాంలో పాత్రలేదు.అయినా ఆయన జైలులో ఉన్నా డు. దేశంలో జరుగుతున్న నేరాలు, హింస విధ్వం సం మధ్య మనం బతుకుతున్నాం. గతంలో ఎన్న డూ లేనంతగా అసమానతలు పెరుగుతున్న వ్యవస్థ ఇది. ప్రపంచంలోని ఒక్క శాతం ధనికుల సంపద, మిగతా 99శాతం మంది మొత్తం సంపద కంటే ఎక్కువ. దేశంలోని ఖనిజ వనరులను,అడవిని దోచుకు పోయేందుకు తలుపులు బార్లా తెరిచి విదేశీ వ్యాపా రస్థులను పిలిచి వనరులను దోచుకోమని ఆహ్వాని స్తున్నాం. ఈ దేశపు ఆదివాసీలు దశాబ్దాలు గా జల్, జమీన్, జంగల్‌ను కాపాడుకునేందుకు బ్రిటిష్ వారి తో పోరాడారు. ఇప్పటికీ అదే పోరాటాలు కొనసా గిస్తున్నారు.

గిరిజన ఉద్యమాల పట్ల సాయిబాబాకు గౌరవం ఉండడమే పెద్ద నేరంగా రాజ్యం పరిగ ణిస్తున్నది. నిజానికి 90శాతం అంగ వైకల్యం ఉన్న మనిషిని చూస్తే ఇంత బలగం ఉన్న రాజ్యానికి ఎందు కు భయం! సాయిబాబాను జైళ్లో పెట్టి బెయిల్ కూడా ఇవ్వకపోవడం రాజ్య బలాన్ని కాదు, రాజ్య బలహీన తను చాటుతున్నది.
సాయిబాబా అరెస్టు రెండు, మూడు మౌలికమైన తాత్విక, చట్టబద్ధ అంశాలను ముందుకు తెస్తున్నది. ఒకటి-ప్రజాస్వామ్యంలో కొన్ని విలువలకు విశ్వా సాలకు నిలబడడం నేరమా? ఒక దేశంలో ప్రజా స్వామ్యంలో స్వేచ్ఛకు అర్థం ఏమిటి? పాలకులు ఏది చేసినా దాని గురించి పొగుడ్తూ మాట్లాడడమే స్వేచ్ఛ నా? సర్కారీ మేధావులు స్వేచ్ఛను ఆ స్థాయికి దిగ జార్చారు. ఉదాహరణకు ప్లానింగ్ కమిషన్‌లో పని చేసి అన్ని సౌకర్యాలు పొందిన ఆర్థిక శాస్త్రవేత్తలు, ప్లానింగ్ కమిషన్ రద్దును సమర్థిస్తున్నారు. అధికా రంలో ఉన్నవాడు ఏది చేసినా దాన్ని సమర్థించడమే స్వేచ్ఛగా పరిగణింపబడుతున్న పాడు కాలమిది.

ఉదారవాద పాశ్చాత్య ప్రజాస్వామ్య తాత్విక పునాది స్వేచ్ఛలో ఉందని ఎంతో మంది తత్వవేత్తలు సూత్రీ కరించారు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఒకవైపు తన దోపి డీని కొనసాగిస్తూ ఆలోచనాపరులకు కావలసిన వెసు లుబాటును కల్పించింది. చుట్టూ అసమానతలున్నా తమకు ఆలోచించే స్వేచ్ఛ ఉన్నదన్నది మేధావుల ధీమా. అసమానతలు పెరిగినకొద్దీ దాన్ని సమర్థిం చడం మేధావులకు చాలా కష్టతరమైపోతున్నది. ఎవ రైనా ప్రత్యామ్నాయాన్ని గురించి మాట్లాడితే వాళ్ల మీద నిర్బంధం ఉపయోగించడం తప్ప సంప న్న వర్గాలకు వేరేమార్గం కనిపించడం లేదు. అణచి వేతను పెంచినకొద్దీ తాము రోజూ మాట్లాడుతున్న ప్రజాస్వామ్య పునాదులు కదిలి, నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి మధ్యనున్న రేఖ మాయమైతే ప్రజా స్వామ్యం పేరు మీద దోచుకోవడం సాధ్యం కాదు.

సాయిబాబా ఒక ప్రతిష్ఠాత్మకమైన విశ్వవిద్యాల యంలో ఆచార్యుడుగా పనిచేస్తున్నాడు. విశ్వవిద్యా లయాలు భావ సంఘర్షణకు నిలయాలని, కొత్త భావాల సృష్టికి కేంద్రాలని, అక్కడ ఎలాంటి భావాల నైనా చర్చించే స్వేచ్ఛ ఉంటుందని చాలాకాలంగా చాలామంది నమ్ముతున్నారు. విశ్వవిద్యాలయాల మీ ద నెహ్రూ భావాలు చాలామందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. నెహ్రూ పేరును, ఆయన భావజాలాన్ని అంతం చేస్తామని ప్రతిజ్ఞ చేసిన నరేం ద్రమోదీ భావ జాలంతో విశ్వవిద్యాలయాలను అంతంచేయడం కూడా ఒక భాగం కావచ్చు. ఆ మాటకు సాయిబాబా అరెస్టు కాంగ్రెస్ పాలనా కాలంలోనే జరిగింది. అప్పు డు మహారాష్ట్రలో కాంగ్రె స్ పాలనే ఉన్నది.బీజేపీ రాజకీయ సంస్కృతికి కాం గ్రెస్ పార్టీ రహదారులు వేసింది. అంటే రెండు పార్టీ లూ సంపన్న వర్గాలకు సంపద కూర్చడానికి అంకి తమైపోవడం దీని వెను కున్న రహస్యం కావచ్చు.

మూడవ అంశం- సాయిబాబాను చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద అరెస్టు చేశారు. ఈ దుర్మార్గ చట్టాన్ని చిదంబరం హడావుడిగా ప్రవేశ పెట్టారు. బాంబే తాజ్ హోటల్ మంటలను 24/7 గంటలు చూపించి, దేశాన్ని భయానక స్థితి లోకి నెట్టి ఈ చట్టాన్ని చేశారు. పార్లమెంటులో దీని పై చర్చ కూడా జరగలేదు. అంతకుముందు అమలై న టాడా, పోటా, మీద చాలా చర్చ జరిగింది. వాటికి వ్యతి రేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరగడం వల్ల రెండు చట్టాలు రద్దయ్యాయి. ఇప్పుడు అమల్లో ఉన్న ఈ చట్టానికి కాల పరిమితి లేదు. రాజ్యం ఎవరినైనా, ఏ కారణం లేకుండా, కొంచెం అనుమానం వచ్చినా ఏళ్ల తరబడి నిర్బంధించవచ్చు.
సాయిబాబా అరెస్టు తర్వాత నేను మహారాష్ట్ర మానవహక్కుల కమిషన్ సభ్యులను కలిశాను.

ఈ కమిషన్ 2013 డిసెంబర్ 10 అంటే అంతర్జాతీయ మానవ హక్కుల దినం జరిపినప్పుడు నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. అదే కమిషన్ దగ్గరికి వెళ్లి అంగ వైకల్యం ఉన్న సాయిబాబా కేసును కమిషన్ సాను భూతితో పరిశీలించాలని అంటే, కమిషన్ ఛైర్మన్ (పూర్వ హైకోర్టు చీఫ్ జస్టీస్) చట్ట వ్యతిరేక కార్య కాల పాల నిరోధక చట్టం కింద ఎవ్వరినీ అరెస్టు చేసినా అది కమిషన్ పరిధిలోకి రాదని వాదించాడు. నాగ పూర్ జైలులో అతనికి కనీస సౌకర్యాలు కల్పిం చేలా ఆదేశించాలని అడిగితే అది చేస్తామని అన్నా, ఆ ఆదే శాలు ఇచ్చినట్టు లేదు. ఇప్పుడు ప్రజా స్వామ్య వా దులు చేయవలసిన, చేయగలిగిన పని ఈ చట్టాన్ని రద్దు చేసేలా ఉద్యమాలు చేయడమే.

సాయిబాబా మీద నిర్బంధాన్ని విస్తృతంగా చర్చిం చాలి. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టగలగాలి. ఇది కేవ లం సాయిబాబా వ్యక్తిగత సమస్య కాదు. ఈ నిర్బం ధంతో స్వేచ్ఛ, విశ్వ విద్యాలయాల స్వయం ప్రతిపత్తి, ప్రజాస్వామ్య వ్యతిరేక చట్టానికి సంబంధించిన అంశా లున్నాయి. అంటే కొన్ని మౌలికమైన ప్రజాస్వామ్య విలువల రక్షణ, విలువల భవిష్యత్తు ఈ నిర్బంధంతో ముడిపడి ఉన్నాయి.సాయిబాబా నిర్బంధాన్ని పట్టిం చుకోకపోతే ప్రతి విశ్వవిద్యాలయ ఆచార్యుడి కడప దగ్గర ప్రమాదం వేచి ఉంటుంది.

1495

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

Published: Thu,September 18, 2014 12:09 AM

సమున్నత మానవత్వమే కవి లక్ష్యం

ప్రజలు తమ జీవితాలు మారాలనే చేసే పోరాటాలు ఉంటాయి. అలాగే వియత్నాం యుద్ధంలాంటి యుద్ధాలుంటాయి. యుద్ధం మీద యుద్ధం చేసే యుద్ధాలు కూడా ఉం