మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు


Thu,July 30, 2015 01:59 AM

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ
ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి ఇది. 2015 జూలై 31న హైదరాబాద్, బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో సాయంత్రం 6 గంటలకు ఆవిష్కరణ సభ జరుగుతుంది. వీఎస్ ప్రసాద్ అధ్యక్షతన జరుగు సభలో కె. శ్రీనివాస్, ఎమ్. భారతి, అల్లం నారాయణ, సూరేపల్లి సుజాత, వరవరరావు, హరగోపాల్ ప్రసంగిస్తారు. స్వేచ్ఛారావం సామాజిక రాజకీయ వ్యాసాల సంపుటిని బొజ్జా తారకం ఆవిష్కరిస్తారు. పర్‌స్పెక్టివ్స్ ఆర్.కె సభా నిర్వాహకులుగా వ్యవహరిస్తారు.

సాధారణంగా సంఘటనలను, వ్యక్తులను, వ్యవస్థలను, ఉద్యమాలను గమనించేవారు వాటిని తక్షణ సందర్భం నుంచి చూస్తారే కానీ చారిత్రక నేపథ్యం నుంచి చూసే పద్ధతి అలవరచుకోలేదు. చాలా సంఘటనల వెనుక ఒక చరిత్ర ఉంటుంది. దాని ప్రభావం భవిష్యత్తు మీద అనివార్యంగా ఉంటుంది. ఈ పద్ధతి అవలంబించకపోతే జరుగుతున్న ప్రక్రియకు పొంగిపోవడమో లేదా క్రుంగిపోవడమో జరుగుతుంటుంది. రాష్ట్ర విభజన పరిణామంతో ఆంధ్ర పాంతంలో చాలామంది క్రుంగిపోయారు. తెలంగాణలో చాలామంది పొంగిపోయారు. ఈ రెండు భిన్న అనుభవాల్లోని అంతర్లీన చలన సూత్రాలను గమనిస్తే రెంటికీ పరిమితులున్నాయి. కొత్త భవిష్యత్తు నిర్మించుకొనడానికి అవకాశాలున్నాయి.

ఏ దేశంలోనైనా వృద్ధి జరగవలసిందే, కానీ వృద్ధి అంటే అభివృద్ధి కాదు. ఎంతకాలం వృద్ధి ఏడు శాతమో ఎనిమిది శాతమో అనే ఒక చర్చ లేదా వృద్ధి రేటును మనం దాటుతామా లేదా అనే మరో చర్చ. ఈ చర్చకు ఏమైనా అర్థమున్నదా? ఈ చర్చలో మనుషులు అంటే అట్టడుగు మనుషులున్నారా? దీన్లో ఉదాత్తమైన విలువలున్నాయా?

మానవాళి ప్రసవ వేదన పొంది సృష్టించిన ప్రజాస్వామిక, మానవీయ విలువల పురోగతి ఏమైనా ఉందా? ఈ విలువలు తనలో ఇమిడించుకొన్న రాజ్యాంగాన్ని పాలకులు ఎందుకు ఖాతరు చెయ్య టం లేదు? పాలకులు తమ జాతీయతను ఎందుకు కోల్పోయారు? ఈ మౌలిక ప్రశ్నలు అడగవలసిన తరుణం ఇది. ఈ ప్రశ్నలకు ఇంతసూటిగా ఈ వ్యాసాల్లో అడిగినా,అడగకున్నా.. ఆ ప్రశ్నల స్పృహ ఈ వ్యాసాల నేపథ్యంలో ఉంది. ఈ వ్యాసాల సం దర్భం విలువలు, వ్యవస్థలు మారిపోతున్న లేదా కూలగొట్టబడుతున్న కాలమనే స్పృహ ఉంది.
తొమ్మిది దశాబ్దాల క్రితం స్థాపించబడ్డ మతోన్మాద సంస్థ పడుతూలేస్తూ విజృంభిస్తున్న కాలమి ది. విచిత్రంగా హిందూ జాతీయవాదంతో ప్రారంభమైన ప్రక్రియ సాధారణ పరిస్థితులలో కనీసం జాతి సంపద గురించి, సార్వభౌమాధికారం గురిం చి ఉద్యమించే బదులు..

సామ్రాజ్యవాద శక్తులతో మిలాఖతై దేశ సంపదను లూటీ చేసే బహుళజాతి సంస్థల అడుగులకు మడుగులొత్తుతున్నది. ఒకవైపు రాజకీయాలలో ఈ అభివృద్ధి నమూనా గానం, మరోవైపు సాంస్కృతిక రంగంలో మత ద్వేష రాజకీయాల రాగం! సామ్రాజ్యవాద దోపిడీ, మతద్వేష రాజకీయాల కలియక తీవ్రస్థాయికి చేరుకుంటున్న సందర్భ ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ వ్యాసాల మీద ఉంది.

చరిత్రలోకి వెళ్లి గమనిస్తే.. ఉత్పత్తి విధానంపై డి.డి. కోసంబి చేసిన సూత్రీకరణ వెలుగులో నా అవగాహన రూపొందింది. యూరోపియన్ ఖండంలో ఉత్పత్తి విధానాలు మారిన క్రమాన్ని అద్భుతంగా విశ్లేషించాడు మార్క్స్. కొత్త ఉత్పత్తి విధానం పాత ఉత్పత్తి విధానాన్ని రద్దుచేసి ఒక ప్రత్యామ్నాయ సామాజిక సంబంధాలను నిర్మాణం చేస్తుంది. బానిస సమాజాలు భూస్వామ్య సమాజాలుగా, భూస్వామ్య సమాజాలు పెట్టుబడిదారీ సమాజాలుగా మారటమన్నది విప్లవాల ద్వారా సాధ్యమయ్యిందనేది ప్రధాన భూమిక.

బానిస సమాజ మార్పుకు స్పార్టకస్ నాయకత్వంలో బానిసలు నిర్వహించిన పాత్ర, భూస్వామ్య సమాజాల విప్లవీకరణకు ఫ్రెంచి విప్లవం లాంటి విప్లవాలు నిర్వహించిన పాత్ర చరిత్ర గతిని మార్చాయి. రష్యా, చైనా విప్లవాలు పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి సోషలిస్టు వ్యవస్థ నిర్మాణానికి దారి వేస్తాయని ఆశించినా, ఆ చారిత్రక పాత్ర నిర్వహణలో ఆ రెండు విప్లవా లు విఫలమయ్యాయి. ఈ విప్లవాల స్ఫూర్తితో మనదేశ విప్లవ రాజకీయాలు నాలుగున్నర దశాబ్దాలుగా ప్రసవ వేదన పడుతూనే ఉన్నాయి.

మనదేశంలో మౌలికంగా రావలసిన మార్పులకు కొత్తదారులను, కొత్త పద్ధతులను నిరంతరం ప్రయోగాల ద్వారా ఆవిష్కరించవలసి ఉంది. దీని కోసం బీజప్రాయంగా కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రధానంగా కొత్త ఉత్పత్తి విదానం పాత ఉత్పత్తి విదానాన్ని ఏ దశలో కూడా రద్దు చేయకపోవడం వలన మన దేశంలో బహుళ ఉత్పత్తి విధానాలు ఒకదానితో మరొకటి రాజీపడో, ప్రతిఘటిస్తూనో కొనసాగుతున్నాయి.

దీనితో ఇదొక బహువర్గ సమాజంగా తయారైంది. దీనికితోడు కులవ్యవస్థ సామాజిక నిర్మాణాన్ని మరింత సంక్లిష్టంగా మార్చింది. బహుశా బహువర్గ సామాజిక నిర్మాణం వల్లే అస్తిత్వ రాజకీయాలు ఒక బలమైన సామాజిక రాజకీయశక్తిగా రూపొందాయి. విప్లవ రాజకీయాలు ఈ సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ అంబేద్కర్ వ్యక్తిత్వాన్ని ఆయన ఆలోచనా విధానాన్ని పునర్మూల్యాంకనం చేసే యత్నం జరుగుతున్నది.

విప్లవ రాజకీయాలు నిజాయితీగా ప్రజలవైపు నిలబడి ప్రాణాలు త్యాగం చేసి నా, ఆ రాజకీయాలు గిరిజన ప్రాంతాలలో విస్తరించినంతగా మైదాన ప్రాంతాలలో విస్తరించలేకపోతున్నాయి. వర్గ రాజకీయాలకు గిరిజన ప్రాంతాలలో ఉన్న విస్తృతమైన వెసులుబాటు లేదా సందర్భం, గిరిజనేతర ప్రాంతాలలో లేకపోవడానికి బహువర్గ సామాజిక నిర్మాణం కారణం కావొచ్చు. ఈ నిర్మాణంలో ఒకవర్గాన్ని సమీకరించే క్రమంలో మరోవర్గం జారిపోతున్నది. ఈ వైరుధ్యాల నేపథ్యంలో మన రాజకీయ సామాజిక సమస్యలను, సవాళ్ళను విశ్లేషించవలసి ఉం టుంది. ఈ సైద్ధాంతిక చట్రాన్ని తెలంగాణ రాజకీయాల విశ్లేషణకు ఉపయోగిస్తే తెలంగాణలో జరుగుతున్న మార్పులను కొంచెం స్పష్టంగానే అర్థం చేసుకోవచ్చు.

తెలంగాణ ఉద్యమం ప్రాంతీయ అసమానతల నుంచి పుట్టింది. ఈ అసమానతలు సంపదలో, అధికారంలో, సాంస్కృతిక జీవనం లో, మిగతా అన్ని రంగాలలో పెరగడం వల్ల ఒక ప్రాంతంలో తాము వివక్షకు గురైనామనే భావన చాలా లోతుగా వెళ్లింది. ఉద్యమం ఒక అస్తిత్వ ఉద్యమంగా ముందుకు వచ్చింది. అస్తిత్వం అసమానతలను అంతగా పట్టించుకోదు. అయితే ఉద్య మం జరిగిన మొత్తం కాలంలో ఒకవైపు అస్తిత్వ రాజకీయాలు భౌగోళిక తెలంగాణ వైపు నడిపిస్తే, అసమానతలు సమాంతర ఉద్యమాలకు దారితీసా యి. అసమానతలలోని అస్తిత్వాలు, అస్తిత్వాల లోని అసమానతలు చర్చకు వచ్చాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చాలని కొందరు భావిస్తే, ఎటువంటి/ఎవరికోసం తెలంగాణ అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి.ఈ వ్యాసాల్లో ఈ సందిగ్ధతను పట్టుకోవడానికి ప్రయత్నం జరిగింది. ఉద్యమ ఉధృతికి సాంస్కృతిక కళారూపాలు దోహదపడ్డాయి. భౌగోళిక తెలంగాణ సాకారమయ్యింది.ఒక సంవత్సరంలోనే భిన్న నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇది సహజమే. ఇప్పటి తెలంగాణను దగ్గరగా చూస్తే పాలనలో భూస్వామ్య సంస్కృతి, ప్రజల్లో ప్రజాస్వామిక ఆకాంక్ష బలంగా కనిపిస్తున్నాయి. ఈ రెంటి మధ్య ఘర్షణ అనివార్యం అని స్పష్టంగానే కనిపిస్తోంది.

చివరగా.. రాసేవాళ్లకైనా, చదివేవాళ్లకైనా ఒక విలువల చట్రం అవసరం. దేన్నై నా మనం ఏ కోణం నుంచి చూస్తున్నాం అనేదే ప్రధానం. చాలామంది ఒక విషయాన్ని తమ స్వానుభవం నుంచి చూస్తారు. కొందరు కొంత విమర్శనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా చూస్తారు. ఇవి అవసరమే కానీ, ఇవి సరిపోవు. ఎటువంటి సమాజాన్ని మనం కోరుకుంటున్నాం లేదా స్వప్నిస్తున్నాం అన్నది చాలా ప్రధానం. ముఖ్యంగా బహువర్గ సమాజానికి ఇది చాలా అవసరం. తమ వర్గాన్ని, తమ అస్తిత్వాన్ని దాటి చూడటం భవిష్యత్తు సమాజం స్వప్నం మీద ఆధారపడి ఉంటుంది. అంటే సమాజం మారాలి. ఒక మెరుగైన మానవీయ సమాజం రావాలి అనే బలమైన ఆకాంక్ష లేకపోతే తాము ఆశిస్తున్న సమాజ మార్పు అర్థం కాదు. తమ పాత్ర ఏమిటో అంతకంటే అర్థం కాదు. సామాజిక మార్పు నిరంతర చలనం వంటిది. ఆ చలనంలో మనం ఎక్కడ నిలుచున్నాం అనేది కీలకం. ఈ వ్యాసాలు అలాంటి అవగాహనకు తోడ్పడాలనే ఒక చిన్న ప్రయత్నమే ఈ స్వేచ్ఛారావం.

1289

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

Published: Thu,September 18, 2014 12:09 AM

సమున్నత మానవత్వమే కవి లక్ష్యం

ప్రజలు తమ జీవితాలు మారాలనే చేసే పోరాటాలు ఉంటాయి. అలాగే వియత్నాం యుద్ధంలాంటి యుద్ధాలుంటాయి. యుద్ధం మీద యుద్ధం చేసే యుద్ధాలు కూడా ఉం

Featured Articles