సమగ్ర బీసీ కమిషన్ కావాలె


Sun,February 15, 2015 12:09 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి వేలాది కోట్లు వెచ్చించింది. ఈ వర్గాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఆ దిశగా చర్యలతో ముందుకు వస్తున్నది. ప్రభుత్వ లక్ష్యం బీసీల సమగ్ర వికాసం. కనుక అమలుచేసే ప్రతి పథకం ఈ వర్గాల అభివృద్ధికి బాసటగా నిలవాలి. అమలుచేస్తున్న అన్ని పథకాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. సక్రమంగా అమలు జరగాలి. అలాగే కొత్త పథకాలు కూడా రూపకల్పన చేయాలి. అందుకు పటిష్టమైన వ్యవస్థ అవసరం. ఈ నేపథ్యం లో తెలంగాణ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలి. ఆ కమిషన్‌ను బీసీలకు మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగించుకోవాలి.

బీసీల సమగ్ర వికాసానికి దోహదపడే విధంగా తెలంగాణ బీసీ కమిషన్ చట్టం రూపొందించాలి. ఉమ్మడి రాష్ట్రంలో బీసీల అభివృద్ధికి నాటి ప్రభుత్వాలు దేశంలో ఎక్కడాలేని విధంగా బీసీ సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేశాయి. బీసీలు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలో అభివృద్ధిలోకి రావాలని ఉద్యమించి దశలవారీగా సాధించుకున్న సంక్షేమ పథకాలైన ఫీజు రీయింబర్స్‌మెంట్, మెస్ చార్జీలు, స్కాలర్‌షిప్‌లు, రుణాల మంజూరు, వేలాది సంక్షేమ హాస్ట ళ్ళు, విద్యా, ఉద్యోగ రంగాలు, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు సక్రమంగా అమల య్యేట్లు చూడాలి.

వీటి అమలులో క్రమంగా అనేక లోపాలు, అక్రమాలు అవక తవకలు చోటు చేసుకున్నాయి. ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయిలో పరిష్కరించడం సాధ్యమయ్యే పనికాదు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షించడం, అమలు తీరుతెన్నులు పరిశీలించడం, ఉదాసీన వైఖరిని కట్టడి చేయడం, అధికారులలో జవాబుదారీతనం పెంపొందించ డం, కొత్త పథకాలకు రూపకల్పన నిరంతరం చేయాలి. అందుకు ప్రస్తుత బీసీ కమిషన్ చట్టం 20/1993ను సమూలంగా మార్పులు చేసి విశేషాధికారాలను కల్పించి రాజ్యాంగబద్ధ హక్కులతో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ను పునరుద్ధరించాలి. ఈ విధంగా రాష్ర్టంలో ఉన్న 52 శాతం జనాభా బీసీల సమగ్రాభివృద్ధికి ముందుకు వచ్చి చర్యలు చేపట్టినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం.

ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం ప్రకారం బీసీ కమిషన్‌కు బీసీ జాబితాలో కులాలను తొలగించడం, చేర్చడం కులాల జాబితాను సమీక్షించడం, ప్రభుత్వం కోరితే ఏదైనా అంశంపై నివేదికలు సమర్పించడంలాంటి పరిమిత అధికారాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుత చట్టం మేరకు కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించే విధానం లోపభూయిష్టంగా ఉన్నది. బీసీల వాస్తవ జీవన స్థితిగతులపై ఏమాత్రం పరిజ్ఞానంలేని వారిని నియమించడం జరుగుతున్నది. రిటైర్డ్‌జడ్జిలను నియమిస్తుండటం వల్ల వయోభారంకు తోడుగా పనిభారం వలన వారు సరిగా పనిచేయలేకపోతున్నారు.

వీరికి బీసీల సామాజిక స్థితిగతులు, సమస్యలపట్ల అవగాహన ఉండడం కూడా అరుదు. విద్యా, ఉద్యోగ రంగాల్లో అమలు చేస్తున్న రిజర్వేషన్లు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు సమీక్షించడానికి సంకల్పించిన గౌరవ సుప్రీంకోర్టు శాశ్వత ప్రాతిపదికన జాతీయ స్థాయిలో, రాష్ర్టాల స్థాయిలో బీసీ కమిషన్లు నెలకొల్పాలని సూచించింది. ప్రసిద్ధ మండల కమిషన్ కేసు ఇందిరా సహాని వర్సెస్ భారతప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది.1993 నుంచి దేశవ్యాప్తంగా జాతీయస్థాయిలో, రాష్ర్టాల స్థాయిలో శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిష న్లు నెలకొల్పబడ్డాయి. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కమిషన్లకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించకుండా కేవలం సమీక్షలు, నివేదికలు, సూచనలకు మాత్రమే పరిమితం చేయడంతో క్రమంగా బీసీ కమిషన్లు ఈ వర్గాల ఉన్నతికి ఏమాత్రం తోడ్పడలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీల సమగ్ర వికాసం కోసం పలు రాష్ర్టాలు కమిషన్ చట్టాల్ని సవరించి పటిష్టం చేసుకున్నాయి.

ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, మహిళ, మైనార్టీ కమిషన్లకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించారు. కానీ బీసీ కమిషన్లకు ఈ వర్గాలపై పరిజ్ఞానంలేని జడ్జీలను నియమించాలనే నిబంధన ఎందుకు? సాధారణంగా రిటైర్డ్ జడ్జిలు చైర్మన్లుగా పనిచేయడాని కి సమ్మతిస్తారు. అయితే ఈ హోదా వారికి సమాజంలో గౌరవం లభించడానికి మాత్రమే దోహదం చేస్తున్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని బీసీ సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లను పూర్తిస్థాయిలో పర్యవేక్షించి చర్యలు చేపట్టడానికి కమిషన్ అధికారాలను విస్తృత పర్చాలి.

అందుకు ఉత్త ప్రదేశ్ బీసీ కమిషన్ చట్టాన్ని పరిశీలించాలి. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీ కాలం పరిమితి మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచడం అవసరం. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల హోదాలను ఇక్కడి మన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో సమానం చేయాలి. ఇందుకు బీహార్, సిక్కిం బీసీ కమిషన్‌లను నమూనాగా స్వీకరించాలి. బీసీ కమిషన్ చైర్మన్‌గా ఈ సామాజిక వర్గాలకు చెందిన సామాజికవేత్తను (లేదా) సామాజిక హక్కుల కోసం విశేషంగా పనిచేసిన రాజనీతిజ్ఞుడిని నియామకం చేయడానికి కమిషన్ చట్టం 20/1993 సవరించాలి. దీనికి సిక్కిం, కర్నాటక, యూపి బీసీ కమిషన్ చట్టాలను పరిశీలించాలి.

విద్యా, ఉద్యోగ రంగాలలో 29 శాతం రిజర్వేషన్లు పొందేందుకు వీలు కల్పిస్తున్న (ఉమ్మడి రాష్ట్రంలోని) బీసీ కులాల జాబితాలోని 138 కులాలను 112 కులాలకు కుదిస్తూ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.3 ను విడుదల చేసింది. కులాల జాబితాలో చేర్పులు మార్పుల కోసం ఏ ప్రభుత్వమైనా ఆయా రాష్ర్టాల బీసీ కమిషన్ల నుంచి నివేదికను కోరాల్సి వుంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టా ల ఏర్పాటు తరువాత ఇంత వరకు బీసీ కమిషన్లు ప్రత్యేకంగా పునరుద్ధరించలేదు. కమిషన్లకు చైర్మన్ సభ్యులను నియమించలేదు. అలాగే బీసీలకు మరింతగా మేలు జరిగేందుకు మన ప్రభుత్వం ఈ అంశంలో పటిష్ట చర్యలు చేపట్టాలి. దీనికోసం వివిధ రాష్ర్టా ల బీసీ కమీషన్ చట్టాలను పరిశీలించి ఆ దిశగా చర్యలు చేపట్టాలి.

బీహార్ రాష్ట్ర బీసీ కమిషన్ చట్టం చైర్మన్, సభ్యుల హోదాలను అక్కడి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో సమానంగా వర్తింపజేస్తున్నది. బీహార్ ప్రభుత్వం మొదటనే చట్టంలో చైర్మన్ నియామకానికి ఎలాంటి ప్రత్యేకమైన నిబంధనలను లేకుండా రూపొందించింది. ఇక్కడి కమిషన్ కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలను, రిజర్వేషన్ల తీరు తెన్నులను పర్యవేక్షిస్తుంది. బీసీల ఆర్థిక, సామాజిక స్థితిగతులపై నివేదికలు ఎప్పటికప్పుడు సమర్పిస్తుంది. ఇలా మనదంటూ సమగ్ర బీసీ కమీషన్‌ను తెలంగాణ రాష్ట్రంలో రూపొందించుకోవాలి. అప్పుడే బీసీల జీవన ప్రమాణాలలో మెరుగైన ప్రగతిని ఆకాంక్షించడం సాధ్యం.

678

KRISHNAIAH R

Published: Sat,October 6, 2012 04:19 PM

రిజర్వేషన్ స్ఫూర్తిని దెబ్బతీయొద్దు

కేంద్ర ప్రభుత్వం మైనారిటీలకు ఇచ్చిన 4.5 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగరీత్యా చెల్లవని ఇటీవల రాష్ట్ర హైకోర్టు చారివూతాత్మకమైన తీర్పు చె

Published: Sat,October 6, 2012 04:19 PM

బీసీల అభివృద్ధిపై ప్రభుత్వ అక్కసు

అధికార కాంగ్రెస్‌పార్టీ రెండేళ్లుగా బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ, వారి ప్రయోజనాలను కాలరాస్తున్నది. దీనిపై అనేకసార్లు మంత్రులతో

Published: Sat,October 6, 2012 04:20 PM

బీసీ రిజర్వేషన్లకు ఎసరు!

రిజర్వేషన్ల సమస్యను కేంద్ర ప్రభుత్వం సాగదీస్తున్నది. మైనారిటీ సబ్‌కోటాకు రాజ్యంగబద్ధత లేదని, సహజ న్యాయసూవూతాలకు విరుద్ధమని, మత ప్ర

Published: Sat,October 6, 2012 04:20 PM

హాస్టల్ విద్యార్థుల ఆకలికేకలు

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలె లక్ష కోట్ల బడ్జెట్‌ను ఘనంగా ప్రవేశపెట్టింది. అవకాశం దొరికినప్పుడల్లా తమది సంక్షేమ ప్రభుత్వం అని గొప్పలు

Published: Fri,October 12, 2012 02:27 PM

ప్రభుత్వ తప్పులు, అభ్యర్థుల తిప్పలు

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అంతకు ముందు ప్రభుత్వం జీవో నెం 3 జారీ చేసి, వెంటనే రద్దు

Published: Sat,October 6, 2012 04:21 PM

విద్యార్థుల సంక్షేమం మరుస్తున్న సర్కార్

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హస్టళ్లల్లో దుర్భర పరిస్థితులపై హైకోర్టు ప్రజా ప్రయోజనాల కింద కేసు నమోదు చేసింది. దీంతో ఈ సమస్య

Published: Sat,October 6, 2012 04:21 PM

ఖాళీలు పెట్టెడు, ఇచ్చేది పిడికెడు

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌డ్డి ఒక లక్షా 16 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇది గతం కంటే ఒక అడుగు ముందుకు వేసే సా

Published: Sat,October 6, 2012 04:21 PM

క్రీమిలేయర్ రాజ్యాంగ విరుద్ధం!

మరోసారి రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఉద్యోగ నియామకాలలో క్రీమిలేయర్‌కు నిబంధన పెట్టాలని నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు, వైఎస్, రోశయ్య హయాం

Published: Sat,October 6, 2012 04:22 PM

బీసీల అభివృద్ధిని అడ్డుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ వారి అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా విద్యా,ఉద్

Published: Sat,October 6, 2012 04:22 PM

సమన్యాయం పాటించకపోతే సమరమే!

కేంద్ర ప్రభుత్వం బీసీల సమస్యలను 64 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేస్తున్నది. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు- అవకాశాలు కల్పించాల ని రా

Published: Sat,October 6, 2012 04:22 PM

హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకలు

-ఆర్ కృష్ణయ్య రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ తదితర కాలేజీస్థాయి కోర్సులు చదివే విద్యార్థుల ప

Featured Articles