ఒక్క పొద్దు కావాలి


Sat,May 4, 2019 11:42 PM

katta-shekar-reddy
భస్మాసురుని కథ మళ్లీ అవసరమైంది. అప్పుడు ఒక్క డే భస్మాసురుడు. ఇప్పుడు అటువంటివి అనేకం. ఆయన అసలు పేరు బ్రహ్మాసురుడు. ఆయన శివభక్తుడు. శివుని కోసం ఘోర తపస్సు చేసి తాను ఎవరి తలపై చేయిపెడితే వారు భస్మం అయిపోయే విధంగా ఆయన వరం పొందుతాడు. భస్మాసురుడు అటు తిరిగి ఇటు తిరిగి చివర కు శివుడి వెంటపడతాడు. శివుడు విష్ణువును వేడుకుంటాడు. విష్ణు వు మోహిని అవతారమెత్తి భస్మాసురునితో మత్తెక్కించే నృత్యం చేయించి చివరకు తన చేతిని తనపైనే పెట్టుకుని విధంగా ప్రేరేపిస్తాడు. భస్మాసురుడు ఒకానొక నృత్యభంగిమలో తన చేతిని తన తలపైనే పెట్టుకుని అంతమవుతాడు. ఇప్పుడు శివుడి అవతారాలు అనేకం. వారు సృష్టించే భస్మాసురు లు అనేకం. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రా మ్... ఇలా ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉన్నాయి. కోట్లాదిమంది అందులో మునిగి తేలుతున్నారు. మంచీ జరుగుతున్నది. చెడూ జరుగుతున్నది. తక్ష ణం ఆపదల నుంచి రక్షించే సాంకేతిక వేగం ఆ మాధ్యమాల వల్ల జరుగుతున్న మేలు. మన ఎయిర్‌ఫోర్సు కమాండర్‌ను పాకిస్తాన్ భూభాగంలో పట్టుకుని కొడుతున్న దృశ్యాలు ఎవరో ఒకరు వీడియో తీసి వెంటనే సామాజిక మాధ్యమాల్లో పెట్టడం వల్ల ప్రపంచమంతా అప్రమత్తం అయింది. ఆయనను విడుదల చేయాలని డిమాండు, విడుదల చేయకపోతే యుద్ధం సంభవిస్తుందన్న భయాలు అంత టా వ్యక్తం అయ్యాయి. ప్రపంచం ఒత్తిడి, యుద్ధం భయం వల్ల పాకిస్తాన్ కమాండర్‌ను విడుదల చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ వీడియో ఒక పెద్ద విపత్తు నుంచి భారత పాకిస్తాన్‌లను కాపాడిందనిపిస్తుంది. అటువంటి ప్రయోజనాలు అనే కం ఉండవచ్చు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పట్టాభిషేకం చేయడం ఈ సామాజిక సాధనాలు ఇచ్చిన మరో గొప్ప వరం. ప్రధాన మాధ్యమాలు అన్నీ రాజకీయ కోరస్‌లకు అలవాటుపడిన కాలం లో, మంచిని మంచి చెడును చెడు అని ఒక మాట అనలేని కాలం లో ప్రతిమనిషీ తన మనసులో ఉన్న అసంతప్తినీ, నిరసననూ తెలియజేయడానికి ఈ మాధ్యమాలు ఒక మంచి అవకాశం. ఎవరూ దేనినీ దాచలేని స్థితి. స్వేచ్ఛగా భావాలు పంచుకునే వాహకాలుగా ఇవి ఉపయోగపడుతున్నాయి. ఇది ఒక పార్శం.

జీవితం మూసగా ఉండదు. పోతపోసినట్టు సాగదు. నిజమే. కానీ చెలియలికట్ట లేని ప్రవాహం మాదిరిగా కూడా ఉండకూడదు. అటువంటి ప్రవాహం ఎవరినో ఒకరిని ముంచుతుంది. ఎక్కడో ఒకచోట విషాదం నింపుతుంది. భక్తికోసమో, దేహ భారం తగ్గించడం కోసమో వారానికి ఒకరోజు ఒక్క పొద్దులు ఉండటం అలవాటు. ఇప్పుడు భస్మాసుర శక్తులకు దూరంగా, సామాజిక మాధ్యమాలకు దూరంగా, సెల్‌ఫోన్లకు దూరంగా, కేవలం మనుషులతోనే, సమూహంలోనే జీవించే ఒక్క పొద్దులు రావలసిన అవసరం ఉన్నది. పచ్చని చెట్ల మధ్య, పొలాల గట్ల మధ్య, అడవుల మధ్య స్వచ్ఛమైన గాలి పీలుస్తూ హాయిగా నలుగురు మాట్లాడుకునే ఒక్క పొద్దు ఒకటి కావాలి.


మరో పార్శం, అసత్యాలు, విద్వేష, ఉన్మత్త ప్రచారాలు, సమస్త కల్మషాలను కుమ్మరించే వేదికలుగా కూడా ఇవి మారుతున్నాయి. ఉన్నవీ లేనివీ, కల్పించినవీ ఒక ప్రవాహంలాగా ఇందులోకి వచ్చి పడుతున్నాయి. ఈ ప్రవాహం వ్యక్తులను, సమూహాలను, సమాజాన్ని దిగ్భ్రమకు, అశాంతికి గురిచేస్తున్నది. ఇదిగో ఇక్కడే ఈ సాధనాలు భస్మాసురుని పాత్రను పోషిస్తున్నాయి. స్వేచ్ఛకు రెక్కలు తొడిగి వదలడం తేలికే. కానీ ఆ స్వేచ్ఛ విశృంఖలతగా మారుతున్న పరిస్థితిని కట్టడి చేసే పరిస్థితి ఏదీ ఆ సాధనం ఏదీ ఆ మాధ్యమాల చేతిలో లేకపోవడం, వాటిని నియంత్రించే వ్యవస్థలు ప్రభుత్వాలు, దేశాల చేయి దాటిపోవడం విషాదం. చైనా వంటి దేశాలు ఇటువం టి వాటిని నిషేధించాయి. కానీ చైనా ఇంతకంటే ప్రమాదకరమైన ఆప్స్‌ను, సమాచార సాంకేతిక సాధనాలను తయారుచేసి ప్రపంచంపైకి వదులుతున్నది. టిక్‌టాక్ అని ఒక ఆప్ ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చింది. అది తయారుచేసి వదిలినవారెవరో కానీ అది సృష్టిస్తున్న కలకలం కల్లోలం అంతా ఇంతాకాదు. కుటుంబాలు, సమూహాలు, సమాజాలు అతలాకుతలం అవుతున్నాయి. పరిమితులు లేని భావ కాలుష్యం, అభిప్రాయ కాలుష్యం. ఈ సాధనాల వల్ల సమాజాల్లో చెలరేగుతున్న అశాంతి ఒక ఎత్తయితే, అవి తినేస్తున్న విలువైన సమయం మరో ఎత్తు. సమాచార సాంకేతిక సాధనాలను వినియోగిస్తున్నవారి సంఖ్య, వారు వాటిపై వెచ్చిస్తున్న సమయం, వాటిల్లో వారు చూస్తున్న అంశాలు, చేస్తున్న ప్రచారాలను అధ్యయనం చేస్తే అవి సమాజానికి చేస్తున్న మేలు కంటే కీడే ఎక్కువ. ఇవేవీ ఉత్పాదక సాధనాలు కావు. కాలక్షేప సాధనాలు. ఇచ్చకాల కు, మెచ్చుకోళ్లకు, భావజాల యుద్ధాలకు, సరదా ముచ్చట్లకు వేదికలు. ఇలా సమయం వృథా అవుతున్నదనే అనేక దేశాలు వీటిపై ఆంక్షలు పెడుతున్నాయి. ఈ ఆప్స్ అన్నింటికీ భారతదేశమే పెద్ద మార్కెట్. చైనా మనకంటే పెద్ద దేశమే. కానీ అక్కడ నిషేధాలున్నాయి కాబట్టి ఈ మాధ్యమాల కేంద్రీకరణ అంతా మనవద్దే.


సామాజిక మాధ్యమాలు వేదికగా ఎవరో ఒకరు ఏదో బట్టకాల్చి ఎవరి మీదనో వేస్తాడు. ఎవరో ఒకరు పేజీల కొద్దీ బురదను తెచ్చి ఎవరిమీదనో కుమ్మరిస్తుంటాడు. ఆ బురదను కడుక్కోవడం అవతలివారి పని. ఆ మంటను చల్లార్చుకోవడం బాధితుడి అవసరం. వీటిని కట్టడి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా చట్ట-న్యాయ వ్యవస్థలు అదనపు మౌలిక సదుపాయాలు కల్పించాల్సి వస్తున్నది. కేసులు, ఫిర్యాదులు, దర్యాప్తులు, దోష నిర్ధారణ జరిగే లోపు తీర్పు లు, నష్టాలు, హత్యలు, ఆత్మహననాలు జరిగిపోతాయి. ఇవి భస్మాసుర హస్తాలు కాక ఏమిటి? ఒకటి కాదు, వందలకొద్దీ ఆప్స్ వస్తూ నే ఉన్నాయి. పాటలు పాడేవి, డ్యాన్సులు వేసేవి, నగ్న ప్రదర్శనలు చూపేవి, ఉన్మత్త, యుద్ధ క్రీడా సాధనాలు... ఒకటేమిటి ఒక మనిషి దృష్టిని మళ్లించడానికి అవసరమైన అన్ని ఆకర్షణలూ యథేచ్ఛగా ప్రవహిస్తున్నాయి. ఒక ఆట ఆడి పిల్లలు చనిపోవడం ఏమిటి? ఆడనివ్వకపోతే చనిపోవడం ఏమిటి? పిల్లలు గంటలకొద్దీ ఫోన్లలో మునిగిపోవడం ఏమిటి? మనుషులు మనిషితనం కోల్పోతున్నారు. తన సహజాతాలను, సహచరులను, చుట్టూ ఉండే సమాజా న్ని కోల్పోతున్నాడు. యంత్రభూతం అవుతున్నా డు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వదిలి ప్రాణంలేని ఒక ప్రపంచంలోకి జారిపోతున్నాడు. తడిమే చేతులను వదిలేసి, జీవంలేని కీబోర్డును పట్టుకుని వేలాడుతున్నాడు. అమానవీయత వ్యక్తులను, సమూహాలను ఆవరిస్తున్నది. ఎవరో రేపిన గాలి దుమారాల వెంట కొట్టుకుపోవడం, కొట్టుకుచావడం నిత్యకృత్యం అవుతున్నది. గోవుకు ఉన్న విలువ, మనిషికి లేకపోవడం ఏమిటి? మనిషి లేని, మనిషితనం లేని మతం లేదు. అటువంటి మతం మనిషిని చంపడం ఏమిటి? సామాజిక మాధ్యమాలు లేని కాలంలో మతోన్మాదం లేదని కాదు. మారణకాండలు లేవని కాదు. ఎప్పుడూ ఉన్నాయి. ఇప్పుడు ఈ మాధ్యమాలు కూడా మరో ఆయుధం అయ్యాయి అంతే.

మనిషి మనిషిగా, సంఘజీవిగా, మంచిగా జీవించడం ఏ కారణం చేతకూడా బలహీనపడకూడదు. బర్త్‌డే బంప్ పేరిట ఒక కుర్రవాడిపై సహవిద్యార్థులంతా కలిసి పిడిగుద్దులు కురిపిస్తున్న వీడియో ఇటీవల వైరల్ అయింది. ఆ వీడియో ఏ కళాశాలదో అప్రస్తుతం. కానీ అందులో దృశ్యం మనకు కనిపిస్తూనే ఉన్నది. ఈ తరం వెర్రితలలకు ఈ ఘటన తార్కాణం. వికృతత్వం వికటాట్టహాసం చేస్తే, అంతిమంగా మిగిలేది విషాదమే. మొన్న ఒక ఇంజినీరింగ్ కళాశా ల పిల్లలు ఎక్కడో ఏదో పార్టీ చేసుకుని ఇంటికి తిరిగివస్తూ రోడ్డు ప్రమాదానికి గురై అసువులు బాశారు. ఎంత విషాదమో. అయ్యో అనుకున్నారంతా. కానీ రోడ్డు ప్రమాదానికి కారణాలు తెలిసి అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. పిల్లలను ఇంత విశృంఖలంగా పెంచుతున్నామా? ఇంత స్వేచ్ఛగా వదిలేస్తున్నామా? తరాలు ఎప్పుడూ ఒకే తీరుగా ఉండాలని లేదు. ఉండవు. జీవితం మూస గా ఉండదు. పోతపోసినట్టు సాగదు. నిజమే. కానీ చెలియలికట్ట లేని ప్రవాహం మాదిరిగా కూడా ఉండకూడదు. అటువంటి ప్రవా హం ఎవరినో ఒకరిని ముంచుతుంది. ఎక్కడో ఒకచోట విషాదం నింపుతుంది. భక్తికోసమో, దేహ భారం తగ్గించడం కోసమో వారానికి ఒకరోజు ఒక్క పొద్దులు ఉండటం అలవాటు. ఇప్పుడు భస్మాసుర శక్తులకు దూరంగా, సామాజిక మాధ్యమాలకు దూరంగా, సెల్‌ఫోన్లకు దూరంగా, కేవలం మనుషులతోనే, సమూహంలోనే జీవించే ఒక్క పొద్దులు రావలసిన అవసరం ఉన్నది. పచ్చని చెట్ల మధ్య, పొలాల గట్ల మధ్య, అడవుల మధ్య స్వచ్ఛమైన గాలి పీలుస్తూ హాయిగా నలుగురు మాట్లాడుకునే ఒక్క పొద్దు ఒకటి కావాలి.

2098

KATTA SHEKAR REDDY

Published: Sun,September 15, 2019 12:55 AM

వచ్చేది మీరైతే సచ్చేది తెలంగాణ

ఎన్ని అభ్యంతరాలున్నా తెలంగాణకు కేసీఆరే కరెక్టు. ఆయన కాకుండా మరొకరు తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఉంటే ఇవ్వాళ చెలరేగుతున్న ఆంధ్రా ఆధా

Published: Sun,September 8, 2019 12:30 AM

కబ్జా రాజకీయాలు

రాజకీయాల కోసం, అధికారం కోసం అవసరమైతే నాయకులు దేశభక్తులుగా మారుతారని ఎక్కడో ఒక నానుడి చదివినట్టు గుర్తు. చాలా సందర్భాల్లో ఇది రుజ

Published: Sat,August 31, 2019 11:24 PM

ఓటికుండల చప్పుడు

ఓటికుండకు చప్పుడెక్కువ. అబద్ధానికి నోరు పెద్దది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఓటికుండకు మించి విలువ చేయవు

Published: Sun,August 25, 2019 08:06 AM

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్

Published: Sun,May 26, 2019 11:12 AM

ప్రజా తీర్పునకు వందనం

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన

Published: Sun,May 19, 2019 01:18 AM

రెవెన్యూ నియంతృత్వం

రెవెన్యూ కథలు రాస్తే రామాయణమంత, చెబితే మహాభారతమంత. ఈ మూడువారాల్లో ఎన్ని బాధ లు, ఎన్ని గాథలు? పేదా, పెద్ద అన్న తేడా ఏమీలే దు. కడు

Published: Sat,April 27, 2019 10:54 PM

పాములూ-నిచ్చెనలూ

అధికార యంత్రాంగం ఒక సమస్యను ఎంత తేలిగ్గా పరిష్కరించగలదో, అంత జటిలం చేయగలదు. రెవె న్యూ సమస్యలపై నమస్తే తెలంగాణ ప్రారంభించిన ధర్మగ

Published: Sun,April 21, 2019 06:25 AM

పాతకు పాతర కొత్తకు ఆహ్వానం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

Published: Sun,April 14, 2019 03:23 PM

గెలిచేదెవరు-ఓడేదెవరు

రెండు రాష్ర్టాల ఎన్నికలు ముగిసాయి. నేతల ముఖాల్లో ఆందోళన, మాటల్లో అల్లరిని చూసి ఓడిపోతున్నదెవరో కనిపెట్టవచ్చు. అదే నేత ల్లో వ్యక్

Published: Sun,April 7, 2019 08:31 AM

బాబు బాధితుడా! వంచకుడా!

ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయు డు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబా బు ఇప్పుడు

Published: Mon,April 1, 2019 11:38 AM

తిట్టు రాజకీయాలు

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచా రం

Published: Mon,March 25, 2019 12:44 PM

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభ        


Featured Articles