‘దిగ్విజయ’ సింగం తెలంగాణ


Tue,July 9, 2013 12:55 AM


తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే వారు రాజకీయ నాయకుల అవతారం ఎత్తి ప్రజావూపతినిధుల పోజు కొడుతూ ప్రజల ఆకాంక్షలకు, ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందని వినిపిస్తున్న ప్రతిసారీ సమైక్యాంధ్ర పేరుతో తెలంగాణ వ్యతిరేకశక్తులు ప్రత్యక్ష, పరోక్ష దుర్మార్గాలకు పాల్పడుతున్నాయి. ఇప్పుడు కూడా వారి వికృత, వ్యూహాల, అనైతిక క్రీనీడల మధ్య తెలంగాణ భవిష్యత్తు ఊగిసలాడుతున్నది. ఆజాద్ ద్వారా ఆంధ్రవూపదేశ్ వ్యవహారాలను ఇన్నాళ్లూ నడిపిన కాంగ్రెస్ అధిష్ఠానం, దిగ్విజయ్‌సింగ్‌ను ఆ స్థానంలో దింపింది. ఆయన కూడా కొత్తేమీ కాదు. హోం మంత్రి గా చిదంబరం నడిపిన తెలంగాణ ఫైలుకు సుశీల్ కుమార్ షిండే కొత్తగా హోం మంత్రిగా రాగానే ఒక కొత్త రంగు పూసే ప్రయత్నం చేసినట్టే, తెలంగాణపైన నిర్ణయం ఇదిగో అదిగో అనే మీమాంసకు దిగ్విజయ్ అనే కొత్త ముఖాన్ని తగిలించారు. అధిష్ఠానం పక్షా న ఇదివరకు చాలామంది తెలంగాణ గురించి రకరకాల ప్రకటనలు చేయడం మనం చూశాం. ఆజాద్‌తో పాటు షిండే, వీరప్ప మొయిలీ, ఆంటోనీ రకరకాలుగా తెలంగాణ గురించి మాట్లాడి గందరగోళం సృష్టించడం కూడా తెలంగాణకు తెలుసు. చివరకు ఏం చేస్తారో తెలియదు గాని దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్‌లో అడుగుపెట్టి ఆశలు కల్పించే మాటలు మాట్లాడి తెలంగాణ విషయాన్ని మళ్లీ తెర మీదకు తెచ్చారు. ఈ సందర్భంలో తెలంగాణ గురించి ఆయన చెప్పిన మాటలపైన చర్చ బాగానే జరుగుతున్నది.

దిగ్విజయ్ మూడు వ్యాఖ్యలు చేశారు. మొదటి వ్యాఖ్య: రాజకీయ నాయకులకు వ్యాపారాలు ఉండకూడదు. వ్యాపారం వేరు, రాజకీయం వేరు. రెండింటినీ కలిపి వేయడం తప్పు. వైఎస్ రాజశేఖర్‌డ్డి ఎన్నడూ ఆ పని చేయలేదు. వైఎస్ లక్షణాలు జగన్‌కు రాలేదు. కాని ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఈ విష యం తెలియకుండా రాజకీయాలు వ్యాపారాలు కొనసాగించడం చాలా సందర్భాలలో వ్యాపారాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంవల్ల ఈ పరిస్థితులు వచ్చాయి. అది ఆయన చేసిన పొరబాటు. సీబీఐ చాలా అంశాలను దర్యాప్తు చేస్తున్నది. ఆయన ఎక్కడో ఒకచోట సీబీఐకి దొరికిపోవడం తథ్యం. వ్యాపారాలు ఉన్నందు వల్లనే ఆయన కూడా (టి సుబ్బరామిడ్డి)ఇబ్బందులు పడుతున్నారు. అసలు వ్యాపారులను రాజకీయాల్లోకి ఆహ్వానించిందే కాంగ్రెస్ పార్టీ. ఆర్థిక నేరగాళ్లయినాసరే వారికి పెద్దపీట వేసిం ది. రాజకీయ నాయకుల హోదాను వ్యాపారులకు కల్పించి ప్రజావూపతినిధులు తమ వ్యాపారాలకు ప్రాధామ్యం ఇచ్చే దుస్థితిని తెచ్చింది.

తరవాత ఆ స్థాయిలో లేదా అంత కు మించిన స్థాయిలో వ్యాపారులను, నల్లడబ్బుదొరలను ప్రోత్సహించి రాజకీయాల్లోకి తెచ్చింది బీజేపీ. టీడీపీ కూడా ఇదే పని చేసింది. మిగిలిన రాజకీయపార్టీలలో కూడా వ్యాపార గుత్తేదారు ప్రజావూపతినిధులు ఒకరిద్దరు లేకపోలేదు. పన్ను మినహాయింపుల కోసమే పార్టీలు పెట్టి సంపన్నులైన రాజకీయనాయకులు ఉన్నారు. రాజకీయాల్లో రాణించాలంటే బోలెడంత డబ్బు అవసరం కావడం వల్ల, వ్యాపారాల్లో సక్రమంగా కొంత, అక్రమంగా కొంత అత్యధిక సంపద సమకూర్చుకునే అన్యాయమైన అవకాశాలు ఈ దేశంలో ఉండడం వల్ల లాభా లు తప్ప మరేమీ అర్థం కాని వ్యక్తులు ప్రజావూపతినిధుల వేషం కట్టారు.‘టై’లు కట్టుకునే ఫక్తు వ్యాపార వేత్తలు లాల్చీలు ధోతులు ధరించి ప్రజల క్షేమమే మా క్షేమమని అబద్దాలు మాట్లాడడం మొదలు పెట్టారు. టీ సుబ్బరామిడ్డి వ్యాపారాల వల్ల ఇబ్బందులు పడుతున్నారన్న దిగ్విజయ్ సింగ్ వ్యాపారులను కాంగ్రెస్ వారు ఏ విధంగా ప్రోత్సహించారో కూడా తెలిసిన వ్యక్తే అయి ఉండాలి.

నిజానికి వ్యాపారుల కన్నా రాజకీయాలలో చేరిన కాంట్రాక్టర్లు ప్రజాస్వామ్యానికి, ప్రజలకు ఎక్కువ నష్టం చేశారు. రాజ్యాంగంలో ఎంపీల అర్హతలు అనర్హతలు నిర్ణయించే నియమాలు కాంట్రాక్టర్లను వ్యాపారులను రాజకీయాలలోకి రావడానికి ప్రోత్సహించలేదు. ప్రభుత్వం కింద కాంట్రాక్టులు చేసే వారు ఎంపీలు కావడానికి అనర్హులు. కాని ఈ నియమాన్ని పెద్ద రాజకీయ పార్టీలు కూడా పాటించలేదు. సర్కారీ డబ్బును కొట్టేయడానికి నిరంతరం ప్రయత్నించే వారు, ప్రభుత్వ ఇంజినీర్లకు లంచాలిచ్చి మంత్రులను అధికారులను ప్రలోభ పెట్టే గుత్తేదారులు ఎంపీలు, మంత్రులు అయిన తరువాత ఇక ప్రజల ఆకాంక్షల గురించి అడిగేవావరు? దశాబ్దాల ఉద్యమం తరువాత, కేసీఆర్ ఆమరణదీక్షతో తెలంగాణ ఓ కొలిక్కి వచ్చి, భారతవూపభుత్వం అధికారిక ప్రకటన ఇచ్చిన తరువాత రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం కావడానికి కారణం ముగ్గురు నలుగురు కాంట్రాక్టర్ ఎంపీలు, ఆ గుత్తేదారుల తాబేదారులే అని కొత్తగా చెప్పనవసరం లేదు. గుత్తేదారులు అపారమైన దేశభక్తిని దైవ భక్తిని ప్రదర్శిస్తారు. వెనుక వేల కోట్లరూపాయల డబ్బు మూలుగుతున్నప్పుడు జనానికి నీతి వాక్యా లు చెప్పడం మీడియాలో సెకన్ల లెక్కన కాలం, అంగుళాల లెక్కన ప్రచారాన్ని కొనుక్కోవడం ప్రారంభించింది ఈ అవినీతి పరులైన గుత్తేదారులే.

మీడియాలో చెల్లింపు వార్త లు, అమ్ముడు బోయే వ్యాసాలు వీరి సృష్టే. ప్రజాస్వామ్యంలో ప్రతి రంగాన్ని కలుషితం చేసింది వీరి అక్రమార్జనే. దిగ్విజయ్‌కి ఈ విషయం ఇప్పుడర్థమైందా!, లేక తమ పార్టీ కాంగ్రెస్ ఎంపిక చేసిన ముఖ్యమంవూతులు తమ కుమారులు అత్యంత సంపన్నులుగా మారడానికి సహకరించిన విషయం ఇన్నాళ్లూ ఆయనకు తెలియదా. లేక కాంగ్రెస్ రాజకీయ వ్యాపారాలను ఆపాలన్న ఆలోచన తాజాగా ఏమైనా వచ్చిందా? లేక జగన్‌ను విమర్శించడం కోసం వచ్చిన మాటలా? ఇక దిగ్విజయ్ సింగ్ రెండో ఉవాచ: వైఎస్‌ఆర్ పార్టీలో, జగన్‌లో కాంగ్రెస్ డీఎన్‌ఏ ఉంది. అందులోని వారంతా కాంగ్రెస్ పార్టీ వారే. వైఎస్ రాజశేఖరడ్డి కూడా చాలా కీలకమైన కాంగ్రెస్ నాయకుడు. ఆ పార్టీలో ఉన్నవారిని మళ్లీ కాంగ్రెస్‌లో చేర్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్య జగన్ మోహన్ రెడ్డి. ఆయన ఏడాదిగా జైల్లో ఉన్నా డిల్లీ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు. ఆయన చెల్లెలు పాదయాత్ర, చంద్రబాబు నాయుడు పాదయావూతను అన్ని రంగాల్లో ఓవర్ చేసేసింది. అనేకపార్టీలు చేయించుకున్న, కొనుక్కున్న, అన్ని రకాల సర్వేలు జగన్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని వెల్లడిస్తున్నా యి. కోస్తా, సీమల్లో జగన్ ప్రభావం పెరగడం వల్లనే కాంగ్రెస్‌లో తెలంగాణ పట్ల సానుకూల ప్రతిస్పందన ఉందనే విశ్లేషణ కూడా బలీయమైనదే.

దిగ్విజయ్ మూడో ఉవాచ: తెలంగాణ పై డిసెంబర్ 9న చిదంబరం చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నారా అని అడిగితే దిగ్విజయ్ అవుననడం చాలా స్పష్టమైన అనుకూల ప్రకటన అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ్రప్రక్రియ ప్రారంభం అయిందని భారత ప్రభుత్వం తరఫున ప్రకటించింది ఆనాటి హోంమంత్రి. చిదంబరం ప్రకటన వలె దిగ్విజయ్ ప్రకటన కూడా అమలుకాకుండా మిగులుతుందో లేదో చెప్పలేము. ఇదివరకు జరిగినట్టు డెడ్‌లైన్ పెట్టడం ఇష్టం లేదని త్వరలో నిర్ణయిస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తే పార్టీ రోడ్ మ్యాప్ ఏమిటి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే పార్టీ రోడ్ మ్యాప్ ఏమిటి అని దిగ్విజయ్ ప్రశ్నించారు. రెండు రకాల నివేదికలను అందుకుంటుంది అధిష్ఠానం. మరో వైపు మీడియాకు తగినంత సరుకు అందించేందుకు, రాజకీయంగా రాష్ట్రమంతటా చర్చలు రేకెత్తించేందుకు, రాయలసీమలోని రెండు జిల్లాలను తెలంగాణకు మిగిలిన జిల్లాలను ఆంధ్రకు తగిలిస్తే ఫరవాలేదా అనే ప్రతిపాదనకూడా దిగ్విజయ్ చేశారు. రెండో ఎస్సార్సీ వేస్తామని చేసి వాగ్దానం నెరవేర్చలేకపోయామన్నది మరొక వ్యాఖ్య. తెలంగాణలో సగం, కోస్తాంవూధలో సగం కలపడానికి గాను రాయలసీమను చీల్చకూడదని రాయలసీమలో భావోద్వేగాలు పెరుగుతున్నాయి. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకునే వారు అసమ్మతితో రగులుతున్న తెలంగాణను వారి సమైక్య జాలంలో చేర్చడం లేదు. వారి పదజాలంలోనే కాదు జనజాలంలో కూడా తెలంగాణ లేదు. పది జిల్లాలు లేనే లేని ఆ వాదం ఏదైనా అవుతుందేమో కాని సమైక్య వాదం మాత్రం అయ్యే అవకాశమేలేదు. రాష్ట్రంలో ప్రతి జిల్లా, ప్రతి రంగం, ప్రతి వ్యవహారం తెలంగాణ, కోస్తాంవూధ గా ఏనాడో చీలిపోయాయి. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలో సీమాంధ్ర, తెలంగాణ యూనిట్‌ల అంతర్గత వైరుధ్యాలు, పరస్పరం దారుణంగా తిట్టుకునే ప్రకటనలు, ఈ చీలికకు రుజువులు.

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఇదివరకెన్నడూ లేని విధంగా నమ్మకరాహిత్యం, విశ్వాస సంక్షోభంలో కొట్టుకుపోతున్నాయి. తెలంగాణ ఇవ్వడంలో ఆలస్యం చేయడం వల్ల మొత్తం తెలంగాణ నిరాశ నిస్పృహలతో రగిలిపోయింది. వేయిమంది ప్రాణాలు తీసుకున్నారు. ఈ పార్టీల భయానక హిపోక్షికసీతో యూ-టర్న్ లతో చెత్త ప్రకటనలతో, వ్యక్తిగతంగా ఒకరినొకరు నీచంగా నిందించుకునే సంస్కార రాహిత్యంతో మొత్తం తెలంగాణలో నైరాశ్యం వ్యాపించింది. ఇంత ఆలస్యం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పడికీ తెలంగాణ ఇవ్వకపోతే , తెలంగాణలోనే కాదు, తెలంగాణకు చేసిన ద్రోహమే ప్రజలందరికీ చేయగల డీఎన్‌ఏ కాంగ్రెస్‌లో మిగిలిందని, తెలంగాణేతర ప్రాంతాల్లోనే కాదు, మొత్తం దేశంలో కూడా విశ్వాసం కోల్పోతుందనడంలో సందేహం లేదు. ఒకవేళ తెలంగాణ ఇస్తే అంతకన్న ఆశ్చర్యకరమైన సంగతి మరొకటి ఉండదు. అందువల్ల తెలంగాణ సాధించిన కీర్తిని మొత్తం కొట్టేయాలన్న కాంగ్రెస్ ఎత్తుగడ ఎంతవరకు ఫలిస్తుందో. విపరీత ఆలస్యం వల్ల తెలంగాణ ఇచ్చినా కూడా అపకీర్తి పాలై ఎన్నికలలో ఆశించిన విజయాలు పొందలేకపోతుందో? తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన పార్టీగా టీఆర్‌ఎస్ కీర్తి పొందకుండా ఆపడం కాంగ్రెస్‌కు సాధ్యం అవుతుందా? ఇక ఆ పార్టీతో టీఆర్‌ఎస్ విలీనం అవుతుందా లేదా అనే ప్రశ్న ఆ రెండు పార్టీల నేతల మధ్య రాజకీయాలకు సంబంధించిన అంశం. తెలంగాణ అనుకూల, వ్యతిరేక వాదంగా చీలిపోయిన ఆంధ్రవూపదేశ్‌లో సమైక్యం గతించి చాలా కాలమైంది. తెలంగాణ సాధించడం, తరువాత ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలను నెరవేర్చడం అనే బాధ్యతలు మాత్రం చైతన్యవంతులైన ప్రజలపైనే ఉన్నాయి. కుల, వ్యాపా ర, గుత్తేదారు అసమర్థ, దుర్మార్గ పార్టీలకు బుద్ధిచెప్పే సాహసం, శక్తి ప్రజలకు రావాలి.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు,
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

35

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

Published: Mon,June 24, 2013 11:23 PM

రాజ్యాంగ గాయాలకు పరిహారం లేదా?

చలో అసెంబ్లీని అన్నిరకాలుగా ఆపిన పోలీసులు ఉస్మానియా విద్యార్థులను అసెంబ్లీకి వెళ్లకుండా నిరోధించడానికి భీకర పోరాటం సాగించారు. బా

Featured Articles