హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!


Tue,September 24, 2013 12:47 AM


వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తెలుగువారందరికీ ఒక రాష్ట్రం ఉండాలన్న సమైక్య సోదర సౌహార్ద్ర సద్భావన కాదు. కేవలం హైదరాబాద్ మీద పేరాశ దురాశ. అక్రమార్జనలకు, భూ ఆక్రమణలకు రాజకీయ నాయకుల అవినీతి నేరాల రక్తసిక్తమైన దుర్మార్గ ఆర్జనకు హైదరాబాద్ రాజధానిగా మారింది. కాంట్రాక్టు రాజకీయనాయకులు గుట్టలకు గుట్టలు, చెరువులకు చెరువులు ఆక్రమించా రు. దేవుళ్ల పేరుమీద మఠాల పేరు మీద, స్వాములు, ఆధ్యాత్మిక వికాసాల పేరు మీద నగరం శివార్లలో వందల ఎకరాలు ఆక్రమించారు. ఆ భూముల చుట్టే రింగు రోడ్డు గిరగిరా తిరుగుతున్నది. వారి భూములకు వెళ్లే రోడ్ల మీదే ఫ్లైఓవర్ లు ఉంటాయి. మెట్రో రైళ్లు కూడా చరచరా తిరుగుతాయి. కాబట్టి ఈ నాయకులకు తెలంగాణ రాష్ట్రం కాకూడ దు. తమ పెత్తనం పోకూడదు. తెలంగాణ వచ్చిన తరువాత కూడా ఈ అక్రమార్జనలను రక్షించడం కోసం హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం కావాలని కోరుకుంటున్నారు. పదేళ్ల పాటు కేంద్రపాలిత ప్రాంతం కూడా వీరికి సరిపోదట. ఈ చొరత్వానికి నేల తల్తిమీద భక్తి అనే జాతీయత ముసుగు తొడిగి, తెలుగుతల్లికి మల్లెపూల దండలు వేస్తున్నా రు. వారికి చీకటి సినీమాఫియా తోడు. హైదరాబాద్ లో ప్రభుత్వ భూముల మీద ఉన్న ప్రతిసినీ స్టూడియో, లాబొరేటరీ, హుస్సేన్ సాగర్ చెరువులో లేదా పక్కన వెలసిన మల్టీప్లెక్స్ కూడా వీరి భూదాహం తీర్చిన మల్లెపూదండలే. ఇవే వీరు తెలుగుతల్లికి వేసిన మల్లె పూదండలు. చంద్రబాబుతోసహా సైబర్ సిటీలో వందలాది ఎకరాలున్న మాజీ సినీ హీరోలు ఇక్కడ సెట్లర్ల వలె తెలంగాణ కు అనుకూల వాక్యాలు పలికి రాజమంవూడిలో నోటికి నల్లగుడ్డ కట్టుకున్న రెండునాల్కల పాములు, అటు సీమాంధ్ర సామాన్యుల బతుకులను ఇటు తెలంగాణ నాగరికతను కాటేస్తున్న అవినీతి విష సర్పాలు. వీరికి కావలసింది హైదరాబాద్ మీద ఢిల్లీ పాలన. వీరికి ప్రజాస్వామ్యం అక్కర లేదు. కావలసింది ఢిల్లీ సుల్తాన్లకు నజరానాలు పంపుకుని ఇక్కడ భూములమీద కబ్జాపెట్టి జనులను బానిసలు చేయాలనుకునే కొత్త దొరలు. వీరి దుర్మార్గపు ఆర్జన కొండల ను దక్కించుకోవడానికి డిల్లీలోని కాంగ్రెస్ నాయకులతో వీరు ఇప్పడికే లోపాయి కారి ఒప్పందాలు కుదుర్చుకునే ఉంటారు. తాజాగా పదవులు పొందిన వారిలో అంతకుముందు పలికిన తెలంగాణ ప్రతికూల వాక్యాలను దిగమింగిన మంత్రులు కొందరైతే, తెలంగాణ అనుకూల వాక్యాలను దిగమింగి, కుహనా సమైక్యవాదం బీరాలు పలికి, తెలంగాణ అనుకూల నిర్ణయం తీసుకున్నతరువాత, హైదరాబాద్‌ను యూటీ చేయాలనే మంత్రులు కొందరు. వీరికి దేశ భక్తి ఉందంటే తెలుగు జాతి, తెలుగుతల్లి సమైక్యత అనే అద్భుతమైన భావనలకు అర్థం తెలుసా అని ఆలోచించవలసింది సీమాంధ్ర, తెలంగాణ ప్రజలు.

రాజకీయ పార్టీలకు హైదరాబాద్‌లో విలువైన భూములు ప్రభుత్వం ఇచ్చింది. సినిమా వారికి సైబరాబాద్ భూముల ను పంచింది. పత్రికలు పెట్టి వేల ఎకరాలు కొల్లగొట్టిన వారు తక్కువేమీ కాదు. టీవీ చానెళ్లు కూడా హైదరాబాద్‌లో ఆస్తు లు సంపాదించుకున్న వ్యాపారులే. ఒక టీవీకి జూబ్లీహిల్స్‌లో 50 ఎకరాలు విలువ వేయి కోట్లు, రెండో టివికి హైదరాబాద్ చుట్టూ వందల ఎకరాలు విలువ 1500 కోట్లు, మూడో టీవీకి భువనగిరిదగ్గర వేయి ఎకరాలు విలువ రెండువేల కోట్లు,, నాలుగో టీవీకి నగరం చుట్టూ వందెకరాలపైనే విలువ 2500 కోట్లు, అయిదోటివికి పాలమాకుల తదితర నగరపరిసర గ్రామాలలో ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములతో సహా నాలుగువేల ఎకరాలు విలువ పదివేల కోట్లరూపాయలపైన, ఆరోటీవీకి పదెకరాలు వంద కోట్లు మాత్రమే, ఏడో టీవీకి వేయెకరాలపైన విలువ 20 వేల కోట్ల పైన. ప్రభుత్వానికి వంత పాడి, ముఖ్యమంవూతులకు కాపలా కుక్కల వలె పనిచేసే కొందరు హిరణ్యాక్షులు నగరంలో వేల ఎకరాలు సంపాదించి, భూసంస్కరణలు తెచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి వీపీ నరసింహారావును దించి వేసింది ఈ సీమాంధ్ర భూమి దొంగలే. ఆ భూసంస్కరణలు అమలుచేయాలనే ఉపన్యాసాలు ఇస్తూ ఎడిటోరియల్స్ రాస్తూ, ఎందుకు అమలు చేయడం లేదని ఇంటర్వ్యూలు చేస్తూ ఉండే హిపోక్షికటిక్ మీడియా తెలంగాణ రాష్ట్రాన్ని సమర్థిస్తుందా? హైదరాబాద్‌పైన కబ్జాను వదులుకుంటుందా? మొదట భూముల మీద తరువాత మెదళ్ల మీద ఆధిపత్యం కోసం వీరు మీడియా వాణిజ్యాన్ని విస్తరించుకున్నారు. వీరి అధీనంలోని మీడియా అసత్యవాణి, తెలంగాణ వ్యతిరేక వాణి కాక అనుకూలంగా ఉంటుం దా? వీరంతా ముందు ప్రజాస్వామ్యానికి, తరువాత ప్రజలకు, పార్టీకి, పిదప పార్టీ స్థాపకులకు, పత్రికాస్వేచ్ఛకు, ఆ తరువాత తెలంగాణకు శత్రువులు. తెలంగాణపైనే కాదు సీమాంధ్ర ప్రజలకు కూడా వీరు శత్రువులే. ఎన్నికలలో గెలవడంకోసం కాంట్రాక్టర్లకు, సినీ వ్యాపారులకు, అక్రమార్జనాపరులకు ఎంపీ సీట్లు ఇచ్చి, కోట్లరూపాయల విరాళాల కు రాజ్యసభ సీట్లు పంచి పార్లమెంటులో అక్రమ సంపన్నుల సంఖ్య, నేరగాళ్ల సంఖ్య పెంచే రాజకీయాలకు తెలుగుదేశం తెర తీస్తే, కాంగ్రెస్ వరద గేట్లు తెరిచింది. ఎన్ని అబద్ధాలైనా ఆడతారు. ఎన్ని సార్లయినా యూటర్న్ తీసుకోవడానికి సిగ్గుపడరు.

మరో నగరాన్ని పెంచడం ఇష్టం లేని సీమాంధ్ర ముఖ్యమంవూతులు హైదరాబాదేతర తెలంగాణను పూర్తిగా విస్మరించారు. తెలంగాణను అభివృద్ది చేయడం లేదని విమర్శలు వచ్చినప్పుడల్లా, హైదరాబాద్ ప్రగతి చూపి అంకెల గారడీ చేశారు. సీమాంవూధకు తగిలిలేకపోయినా హైదరాబాద్ ను తమ రాష్ట్రానికి రాజధాని కావాలని కోరుకోవడం సీమాంవూధకు అన్యాయం.ఇక వీరు అడుగుతున్న హైదరాబాద్ ఏమిటి? హైదరాబాద్ రెవెన్యూ జిల్లానా? గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషనా? హెచ్ ఎండీ ఏనా? లేక ఇంకా తెలంగాణను మింగే విస్తార హైదరాబాద్ మహామహా నగరమా?వీరు హైదరాబాద్ ను అభివృద్ధి చేయడం అంటే చుట్టుపక్కల గ్రామాలను గ్రామపంచాయతీలను చంపేసి వాటి ని నగరంలో కలుపుతూ పోవడమే. 1950 హైదరాబాద్ కార్పొరేషన్ ఆక్ట్ ప్రకారం 172 చదరపు కిలోమీటర్ల పరిధి ఉన్ననగరం హుడా ఏర్పడిన తరువాత 12 పరిసర మునిసిపాలిటీలను కలుపుకొని 1348 చదరపు కిలోమీటర్లకు విస్తరించారు. పరిసర గ్రామాలను పట్టణాలను కలపడం ద్వారా భూములపైన పెత్తనం పెంచుకుంటూపోయారు. 2008 నాటికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ హెచ్‌ఎండీఏ పెరిగి నాలుగు పరిసర జిల్లాలైన రంగాడ్డి, మెదక్, నల్గొండ మహబూబ్ నగర్ లలో 849 గ్రామాలను దిగమింగి, 6852 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. హెచ్‌ఎండీఏ పరిధిలో54మండలాలు కలిపారు. దీంతో 2001లో 36 లక్షలున్న హైదరాబాద్ జనాభా 2008లో 78లక్షలకు పెరిగింది. శ్రీ కృష్ణ కమిటీ లెక్కల ప్రకారం సీమాంవూధులు హైదరాబాద్‌లో ఏడు లక్షలే అయినా ఇప్పుడు దొంగ లెక్కలు చూపుతూ 40 లక్షలు అంటున్నారు. వీరి దుష్ర్పచారం జనాభా అబద్ధాలతో మొదలౌతుంది. 5లక్షల కుటుంబాల జీవనోపాధికి సంక్షోభం కలిగించే ఈ విస్తరణ దురాక్షికమణకన్న తక్కువేమీ కాదు.

ఇటీవల గ్రేటర్ మునిసిపాలిటీ పరిధిలో ఇంకా 15 చుట్టుపక్కల గ్రామాలను కలిపిం ది. మునిసిపాలిటీ వద్దన్నా, ఆ గ్రామాలు తమను కలపొద్దని తీర్మానాలు చేసినా ప్రభు త్వం సెప్టెంబర్ 1న జీవో 407 ద్వారా కలిపేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటించిన తరువాత రాష్ట్ర కాంగ్రెస్ ప్రభు త్వం ఈ చర్య తీసుకుందంటే భూబకాసురల ఆస్తుల రక్షణ కుట్ర కాక మరేమిటి? కలుపుకోవడంలోనే కాదు కలపకుండా వదిలేసిన గ్రామాలు కూడా అక్రమాస్తిపరులకు లాభం చేకూర్చడానికే. సెప్టెంబర్ 17న హైదరాబాద్ మునిసిపాలిటీ జనరల్ బాడీ 13 గ్రామాలను విలీనం చేయరాదని తీర్మానించింది. కానీ ఈ తీర్మానం రాక ముందే వద్దనే 13 గ్రామాలతో సహా మొత్తం 36 గ్రామాలను ప్రభుత్వం కలిపేసింది. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేసినా ఉమ్మడి రాజధాని చేసినా తమ అధికార పరిధి విస్తరించేందుకు, తెలంగాణ అధికారాన్ని తగ్గించేందుకు, రెవిన్యూ, పోలీసు అధికారాలు వర్తించే ప్రాంతాన్ని పెంచుకునే కుట్ర దీని వెనుక ఉందని అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం సాధ్యం కాని పక్షంలో తమ దొంగ ఆస్తులను కాపాడుకోవడానికి కనీసం హైదరాబాద్ మీద రెవెన్యూ అధికారాలు ఢిల్లీకి బదిలీ చేయాలని, ఒక వేళ తమ భూమి దొంగతనం మీద తెలంగాణ తిరుగుబాటు చేస్తే అణచివేయడానికి శాంతి భద్రతల అధికారం కూడా ఢిల్లీకే ఇవ్వాలని వీరు కోరుకుంటున్నారు. హైదరాబాద్ జీడీపీ పెంచామని చెప్పుకుంటూ ఆదాయంలో వాటా కావాలని అడుగుతున్న మేధావులు ఈ భూస్వాముల ఆస్తుల సంరక్షకులే. వీరు రాజకీయాల్లో ఉండి నీతులు వల్లిస్తుంటారు.

హైదరాబాద్‌ను తెలంగాణకు కాకుండా చేయడానికి కుట్రలు ఎన్నో, ఎన్నెన్నో. విభజనపై నిర్ణయం జరిగినా అమలు కోసం ఒక్క అడుగుకూడా ముందుకు పడకపోవడానికి కారణం మేమే అని లగడపాటి ప్రకటించుకున్నాడు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు దానికి జవాబు చెప్పాలి. తెలుగు వారి మధ్య చిచ్చు పెట్టారనే కొత్త నినాదంతో ఢిల్లీలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలంగాణ వ్యతిరేక పన్నాగాలు పన్నుతున్నా రు. ఆ పార్టీలో ఉండి ఆయన పక్కన కెమెరాల్లో కనబడడానికి తాపవూతయపడే తెలంగా ణ నాయకులు జనం ముందు నిలబడి జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. తెలంగాణ ను ఎన్ని రోజులైతే అన్ని రోజులు ఆపడానికి భార్యలను పిల్లలను కూడా ఢిల్లీ పంపడానికి సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఐక్యంగా కొనసాగుతున్నారు. ప్రకటించిన తెలంగాణను ఒక సారి అనైక్యత వల్ల పోగొట్టుకున్నా తెలంగాణ నాయకులకు బుద్ధి రాకపోవ డం దురదృష్టం దుర్మార్గం. తెలంగాణ ప్రజలు ఐక్యంగా హైదరాబాద్ కోసం పోరాటం కొనసాగించక తప్పదని మళ్లీ మళ్లీ చెప్పే అవసరం వచ్చింది. ఈ అవినీతి రాజకీయ నాయకుల హిపోక్షికసీని నమ్మకుండా సీమాంధ్ర ప్రజలు నిజానిజాలను గమనించాలి. వీరి దురాశ వల్ల రాజధాని హక్కు కోల్పోతారని తెలుసుకోవాలి. పక్క రాష్ట్రంలో వీరి నాయకులు సింహాసనాలు వేసుకుని కూర్చుని తమ ఆస్తులు కాపాడుకుంటూ ఉంటే, ప్రతి చిన్న పనికి మహజర్లు పట్టుకుని ప్రజలు వందలాది కిలోమీటర్లు దాటి పక్క రాష్ట్రంలోని రాజధానికి ప్రయాణించాలా?. ఇది పరిపాలనా హక్కును తిరస్కరించడం, సొంత రాజధాని హక్కును హరించడం, తమ ప్రభుత్వం తమకు అందుబాటులో ఉండాలనే హక్కు ను కాలరాయడమే. ప్రజలారా తస్మాత్ జాగ్రత!

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

146

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

Published: Mon,June 24, 2013 11:23 PM

రాజ్యాంగ గాయాలకు పరిహారం లేదా?

చలో అసెంబ్లీని అన్నిరకాలుగా ఆపిన పోలీసులు ఉస్మానియా విద్యార్థులను అసెంబ్లీకి వెళ్లకుండా నిరోధించడానికి భీకర పోరాటం సాగించారు. బా