హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?


Tue,October 8, 2013 02:12 AM

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాలోచనలు మూడు. 1. తెలంగాణనుంచి వచ్చిన ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు ను దించేయడం, 2. పీవీ తెచ్చిన భూసంస్కరణలను తుంచేయడం, 3. సుప్రీంకోర్టు కూడా ఆమోదించిన ముల్కీనిబంధనలను, అందులో తెలంగాణ పేరును, తెలంగాణ ప్రాంతీయ కమిటీని నామరూపాలు లేకుండా చేశారు. ఒక వైపు ఉద్యమం నడుపుతూ జనాన్ని వీధుల్లో రకరకాల సమస్యలకు గురి చేస్తూ, మరోవైపు డిల్లీలో లాబీయింగ్ తెలివి, డబ్బుసంచులు, ప్రలోభాలు పన్నాగాలు పన్నుతూ ఈ విజయం సాధించారు. పాపం సీమాంవూధులకు ఈ విషయం తెలియదు. పొట్టి శ్రీరాములు వంటి వారు కూడా వీరి పన్నాగాలకు ఆమరణ దీక్ష పేరుతో బలైపోయారు. ‘మద్రాసు నగరం మాదే’ అనే దురహంకార పూరిత నినాదం చేసి ఉండక పొతే ఆంధ్ర రాష్ట్రం ఆయన మరణం కన్నా ముందే వచ్చి ఉండేది. ఇప్పుడు కూడా ఈ దుష్ట నాయకులు తమ స్వార్థ పూరిత రాజకీయాలతో సీమాంవూధులను ఉసి గొలుపుతున్నారు. అధికారం కోసం అర్రులు చాచి మంత్రిపదవులు, ఎంపీ టిక్కెట్లు సంపాదించిన వారు వాటిని అంత తేలికగా వదులుకుంటారా? సీమాంవూధులు ఎప్పుడు రాజీనామా చేసినా వాటిని ఆమోదించకూడదనే ఒప్పందం లోపాయికారిగా కుదరిన తరువాతనే చేశారు. తెలంగాణ కలిసి ఉంటే తప్ప ఆంధ్రకు రాయలసీమకు మనుగడే ఉండదని చెప్తున్నా రు. ‘మాకు తాగడానికి కూడా నీళ్లుండవు, మేము ఎక్కడికి పోవాలి’ అని జగన్ నిరాహార దీక్షకు కూర్చుని వక్కాణించారు. ఇంత కన్న అబద్ధం మరొకటి ఉండదు. తెలంగాణ నుంచి నీళ్లు దోచుకోవడం కోసం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని దీని అర్థమా? ఈ దౌర్భాగ్య పరిస్థితి నిజంగానే ఉంటే ఈయన గారు, ఆయన గారి తండ్రిగారు, ఇన్నాళ్లూ పాలించిన సీమాంధ్ర ముఖ్యమంవూతులు అసమర్థులు, స్వార్థ పరులు, దేశ భక్తి, ప్రాంత భక్త్తి ఏమాత్రం లేని వారని, కుటుంబ భక్తి లేదా డబ్బు భక్తి తప్ప మరేదీ వారికి లేదని అనుకోవచ్చా?

అక్రమం, ఆక్రమణ, అవినీతిలో పండిపోయిన సీమాంధ్ర నేతలకు హైదరాబాద్‌లో వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తు లు, వేల ఎకరాల భూములు ఉన్నాయి. అక్రమార్జిత సంపదతో వెనుక వేసుకుని అనేక కేసుల్లో నిందితులుగా నిలబడి సమైక్యం అని నీతి సూత్రాలు చెప్పడమంటే దయ్యాలు వేదాలు వల్లించడమే. హైదరాబాద్ మీద పట్టు సంపాదించి ఆస్తుల రక్షణ కోసం ఉద్యమం సాగిస్తూ, సీమాంధ్ర ప్రజలకు మాత్రం తాము సమై క్య రాష్ట్రం కోసం త్యాగంచేస్తున్నామని బిల్డప్ ఇస్తున్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడం ఇక సాగదని తెలిసిన తరువాత ఈ నేతలు సీమంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారు.డిల్లీలో అధిష్టానం పాదాల దగ్గర కిరీటాలు పెట్టి మీరేనిర్ణ యం తీసుకున్నా, రాష్ట్ర విభజన చేసినా సరేనని చెప్పి తిరిగి వచ్చిన వారు కాంగ్రెస్ నాయకులైతే, మీరు చేస్తానన్న పని చేయకుండా మమ్మప్నూందుకు అడుగుతున్నారు? తెలంగాణ బిల్లు తెస్తే మద్దతిస్తాం అని చెప్పి, ఇక్కడ తెలంగాణ నేతలను, అక్కడ ఆంధ్ర నేతలను రెచ్చగొట్టే అనైతిక విధానాన్ని అనుసరించినవారు టీడీపీ నాయకులు. ఆర్టికిల్3 ప్రకారం మీకు సర్వాధికారాలు ఉన్నాయి కనుక మీ ఇష్టం అని చెప్పి తరువాత మాట మార్చిన ఘనులు వైఎస్‌ఆర్ సీపీ వారు. వీరినే సమైక్య ఉద్యమానికి సారధులు అనే అబద్దపు ప్రచారాలను సాగిస్తున్నది వారి తోక మీడియా. జనమాధ్యమాలు జనం మధ్య ఉండి విశ్వసనీయత జనవిధేయతతో వ్యవహరించాలనే సూత్రం ఏనాడో వదిలేసి, కార్పొరేట్ వ్యాపారుల పెంపుడు కుక్కలై పోయిన విషయం కొత్తగా చెప్పనవసరం లేదు. వీరి అవాస్తవ ప్రచారాలతో సీమాంధ్ర మోసపోతున్నది.సమైక్యాంధ్ర ఒక నకాబు. ఒక నినాదం. వారికి కావలసింది హైదరాబాద్ మాత్రమే. ఎందుకంటే వారికి ఇక్కడ భూములున్నాయి, ఇళ్లున్నాయి. విజయనగరంలో బొత్స ఆస్తులపై దాడులు జరిగినట్టే ఇక్కడ కూడా రాజకీయ ప్రత్యర్థులే దాడులు జరిపిస్తారని, తమ అక్రమ వ్యాపారాలు బయట పెడతారని, తమ ఆర్జన అక్రమార్జన అంటారని, భూసంస్కరణలు అమలు చేస్తారని, లేదా కొత్త భూమి చట్టాలు తెచ్చి తమ స్వార్థ ప్రయోజనాలకు గండి కొడతారని వారి భయం. కనుక హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని అంటున్నారు. కాదని తేలిపోయిన తరువాత, కనీసం దాన్ని కేంద్రం గుప్పిట్లో ఉంచాలని కుట్రలు చేస్తున్నారు. అక్టోబర్ 6న దిగ్విజయ్ సింగ్ చేసిన ప్రకటన వారి కుట్రల ప్రభావాన్ని సూచిస్తున్నది. కేంద్ర పాలిత ప్రాంతం కాబోదని హామీ ఇస్తూనే, హైదరాబాద్ గవర్నర్ పాలిత ప్రాంతంగా ఉంటుందని లేదా పాలనాధికారాలు కేంద్రానికి ఉంటాయని ఆయన అంటున్నారు.

ఆర్టికల్ 356 కింద రాజ్యాంగ పాలనాయంత్రాంగం విఫలమైనప్పుడు మాత్రమే రాష్ట్రపతి పాలన లేదా గవర్నర్ పాలన సాధ్యమవుతుంది. మొత్తం రాష్ట్రం గవర్నరు అధ్వర్యంలోకి వస్తుందే కానీ, ఒక రాజధాని నగరం మాత్రమే కాదు. పాక్షికంగా 356ను విధించడానికి రాజ్యాంగంలో ఆస్కారం లేదు. రాష్ట్రంలో కేంద్ర పాలన విధించడానికి పార్లమెంటు తీర్మానం అవసరం అవుతుంది. అదీ ఆర్నెల్లే గాని పదేళ్లపాటు సాధ్యం కాదు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి భూమి, రెవిన్యూ, శాంతి భద్రతలు, పోలీసు వగైరా అధికారాలను కేంద్రానికి బదిలీ చేయాలనే ఆలోచన రెండోది. డిల్లీ ఈ తరహా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి 239ఎ ఆర్టికల్‌ను రాజ్యాంగంలో ఒక సవరణ ద్వారా చేర్చవలసి వచ్చింది. కాని హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కాదు కనుక అందుకు ఆస్కారం లేదు.
తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగంగా హైదరాబాద్ ఉంటుందని స్పష్టమైంది కనుక తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న పాలనాధికారాలలో, తెలంగాణ అసెంబ్లీకి సహజంగా ఉండే శాసనాధికారాలలో కొన్నింటిని కేంద్రానికి బదిలీచేయాలన్నది మరో ఆలోచన. మన రాజ్యాంగంలో 258 ‘ఎ’ ఆర్టికల్‌ను ఉపయోగించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. అంటే గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే, రాష్ట్ర అసెంబ్లీ అనుమతి గానీ, మంత్రివర్గ సిఫార్సు గానీ లేకుండానే తెలంగాణ అధికారాలలోని కీలకమైన శాంతి భద్రతలు, భూమి, రెవిన్యూ, పోలీసు, విద్య, పట్టణాభివృద్ధి అధికారాలను, కేంద్రం అంగీకారంతో కేంద్రానికి బదిలీ చేసే అధికారాన్ని ఈ ఆర్టికల్ ఇస్తున్నది. ఈ అధికరణాన్ని ఉపయోగించి అధికారాలను గవర్నర్ బదిలీ చేస్తారా! అనే విషయం తేలలేదు. రాష్ట్ర రాజధాని నగరం పైన మాత్రమే పూర్తి అధికారాలను లేదా కొన్ని కీలకమైన అధికారాలను గవర్నర్‌కు ఇవ్వడం ఇంతవరకు ఎక్కడా జరగలేదు. డిల్లీ, చండీగఢ్ నమూనా కాకుండా కొత్తగా హైదరాబాద్ నమూనాను కేంద్రం రూపొందిస్తున్నదని అనుకోవలసి వస్తుంది. నిజానికి ఆర్టికల్ 258‘ఎ’ ఒక దుర్మార్గమైన రాష్ట్ర వ్యతిరేక నియమం. దీన్ని ఏడో సవరణ ద్వారా 1956లో చేర్చారు. అదే సంవత్సరంలో ఆంధ్రవూపదేశ్ ఏర్పడింది. రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వంతో ప్రమేయం లేకుండా కేంద్రమూ, తన ఏజంటైన గవర్నరూ కలిసి అధికారాలను బదిలీచేయడం అక్రమం. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం భూసంస్కరణలు అమలు చేయాలన్నా, భూ ఆక్షికమణలు తొలగించే శాసనాలు తేవాలన్నా గవర్నర్ దయ ఉండాలి. లేదా డిల్లీ చక్రవర్తుల ఆమోద ముద్ర ఉండాలనే పరిస్థితిని కల్పిస్తున్నారు. నాటి హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రత్యేక తెలంగాణ వాదాన్ని ఓడించి, ఆయనను హైదరాబాద్ లో లేకుండా తప్పించి వేరే రాష్ట్రాలకు గవర్నర్‌గా పంపించడానికి కారణం ఆయన ప్రవేశ పెట్టిన భూసంస్కరణలు సీమాంవూధుల విస్తరణ ఆకాంక్షలకు, ఇక్కడి భూములు ఆక్రమణలకు అడ్డుగా ఉండడమే. నీలం సంజీవడ్డి కుట్రలకు తెలంగాణతోపాటు బూర్గుల బలైపోయారు. తరువాతిదశలో పట్టుబట్టి సమైక్య రాష్ట్రంలో భూసంస్కరణలను తెచ్చింది పీవీ నరసింహారావు. దుర్మార్గులంతా కలిసి కుట్ర పన్ని పీవీని కుర్చీనుంచి దించారు.ఈ సీమాంధ్ర భూ ఆక్రమ దారులను ప్రభుత్వం అడ్డుకోలేదని తెలిసి విసిగి వేసారిన ప్రజలు ప్రజాసంఘాలు సమ్మెకు దిగితే, పోలీసు అధికారాలు, లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతి లో ఉంటాయి కనుక తెలంగాణ ముఖ్యమంత్రి రబ్బరు స్టాం పుగా మారి తెల్ల మొగం వేయాల్సిందే. మొత్తం హైదరాబాద్ పైన పాలనాధికారాలన్నీ గవర్నర్‌కు ఇచ్చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేవలం ఇతర తొమ్మిది జిల్లాలకు తన పాలనను పరిమితం చేసుకోవలసి వస్తుంది. పదేళ్ల దాకా ఈ విధంగా కొనసాగితే ఇంకా ఎన్ని లక్షల తెలంగాణ భూములు సీమాంవూధుల పరమవుతాయో! ఆ భూములపై రెవిన్యూ వసూలు చేసే అధికారం కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఉండదు. కార్పొరేట్ చదువులను ప్రశ్నించే అదికారాలు గానీ, పోలీస్ అధికారాలు కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఉండదు.హైదరాబాద్ మీద తెలంగాణ ప్రభుత్వానికి అధికారాలు లేకుండా గవర్నర్‌కో, డిల్లీ సుల్తానులకో అప్పగిస్తే సీమాంధ్ర ప్రజలకు ఏం లాభమో ఆ ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ డిమాండ్‌తో రహస్య మంతనాలు చేస్తున్న సీమాంధ్ర నాయకులను నిలదీయాలి. తెలంగాణ ప్రజలను మోసం చేసిన వీరికి అందరినీ మోసం చేసే అలవాటయిందని తెలుసుకొని జాగ్రత్త పడాలి.సీమాంవూధకు రాజధాని లేకుండా పదేళ్లపాటు హైదరాబాద్‌లో నేతలు తమ ఆస్తుల కోసం వేళ్లాడటం సీమాంవూధకు ద్రోహమని గుర్తించాలి. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను ఇచ్చినట్టే ఇచ్చి, మోసపూరితంగా హైదరాబాద్ పైన సర్వాధికారాలను తెలంగాణకు నిరాకరిస్తే దాన్ని ఉద్యమ పార్టీలు జేఏసీ అంగీకరించకూడదు. అంగీకరిస్తే మరొక చారివూతక ద్రోహం అవుతుంది. చెన్నాడ్డి తెలంగాణ ప్రాంతీయ సమితిని కాంగ్రెస్‌లో కలిపినట్టు, టీఆర్‌ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో కలిపితే ఈ రెండు ద్రోహాలకు మధ్య తేడా ఏమీ ఉండదు. తెలంగాణ రాజధానిని డిల్లీ పాలు చేసి కాంగ్రెస్‌తో కలిసిపోతే పదవులు రావచ్చు. కానీ చరివూతహీనులుగా మిగిలిపోతారు. హైదరాబాద్ నగరంలో దొంగలను రక్షించే అధికారాన్ని అప్పగిస్తారా? లేక ఆ దొంగలను శిక్షించే అధికారాన్ని దక్కించుకుంటారా?

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

199

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

Published: Mon,June 24, 2013 11:23 PM

రాజ్యాంగ గాయాలకు పరిహారం లేదా?

చలో అసెంబ్లీని అన్నిరకాలుగా ఆపిన పోలీసులు ఉస్మానియా విద్యార్థులను అసెంబ్లీకి వెళ్లకుండా నిరోధించడానికి భీకర పోరాటం సాగించారు. బా