రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!


Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొంటాయట. ఇంకా సీమాంధ్ర నాయకులు మాయమాటలు గుప్పిస్తూనే ఉన్నారు. తెలంగాణను 57 ఏళ్లపాటు మోసం చేసిన ఈ నాయకులు 66 రోజులపాటు సీమాంధ్ర ప్రజలను మోసం చేసి ఇంకా ఆ ద్వేషాన్ని కొనసాగిస్తున్నారు.


ఇందులో ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు, తెలంగాణ వ్యతిరేక విషం చిమ్మే ఇతర నాయకులు తమకు వాస్తవమేమిటో తెలిసి కూడా, అవాస్తవాలను కావాలని ప్రచారం చేసి సీమాంధ్ర ప్రజలను రెచ్చగొడుతుండడం సిగ్గుపడవలసిన విషయం.తెలంగాణ ప్రజలకు వీరి మోసాలు అర్థమైనాయి కనుకనే ఇంత సుదీర్ఘంగా ఉద్యమాన్ని ప్రశాంతంగా విజయవంతంగా చేశారని కూడా సీమాంధ్ర ప్రజలు గమనించాలి.ddr4
ముందుగా 371డీ గురించి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా ‘ఏర్పడ దు’ అంటూ సీమాంధ్ర ప్రజల్లో ఆశలు కల్పించగల మాయా వాచాలత్వం ప్రదర్శించే నాయకులకు 371డీ రాజ్యాంగంలో కొనసాగడం వల్ల తెలంగాణను ఆపజాలదని తెలుసు. అయినా దాని పైన ఆంధ్రలో ఆశలను తెలంగాణలో నిరాశలను నిరాధారంగా కల్పిస్తున్నారు. రాజ్యాంగం 21వ భాగంలో తాత్కాలిక, ప్రత్యేక నియమాల జాబితాలో ఈ ఆర్టికల్ 371 డీ ఉంది. 369 కింద రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశాలపైన చట్టాలు చేసే అధికారాన్ని తాత్కాలికంగా పార్లమెంటుకు ఇచ్చారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించి నిర్ణీత కాలం వరకు వర్తించే విధంగా వర్తక వాణిజ్యాలకు సంబంధించి చట్టాలు చేయవచ్చు. ఆ గడువు పూర్తి కాగానే ఈ చట్టాలు వాటంతటవే రద్దవుతాయి. ఇవి అధికారాన్నిచ్చే నియమాలు.

ఆ అధికారాన్ని వాడుకోవచ్చు లేదా వాడుకోకపోవచ్చు. ఇందులోనే జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి ప్రత్యేకాధికారాలను ఆ రాష్ట్రానికి కల్పించే వివాదాస్పద ఆర్టికల్ 370 అధికరణం ఉంది. 371ఏ నాగాలాండ్ కోసం, 371బీ అస్సాం కోసం, 371సీ మణిపూర్ కోసం రూపొందించిన నియమాలు. ఆర్టికల్ 371 మహారాష్ట్ర, గుజరాత్ ఆంధ్రవూపదేశ్ రాష్ట్రాలలో వెనుక బడిన ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి బోర్డులను ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతికి అధికారం ఇస్తున్న ది. 1973లో 32 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆంధ్రవూపదేశ్ పదాన్ని ఈ అధికరణం నుంచి తొలగించి, అదే సవరణ ద్వారా 371డీని చేర్చారు. ఈ రెండింటి ప్రభావం ఏమంటే తెలంగాణ అభివృద్ధి మండలి లేదా ప్రాంతీయ మండలిని రద్దు చేయడం, తెలంగాణ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ఉద్దేశించిన ముల్కీ నియమాలను రద్దు చేసిన ఘనమైన నియమం ఇది. ముల్కీ బదులుగా జోన్లను ప్రవేశపెట్టి సీమాంధ్ర ఉద్యోగులకు కూడా రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్రపతికి అధికారం ఇస్తూ ఈ ఆర్టికల్ 371డీ చేర్చారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమ దారుణ పరాజయానికి, జై ఆంధ్ర పేరుతో సాగిన తెలంగాణ వ్యతిరేక లాబీయింగ్ విజయానికి ఇది నిదర్శనం.


జోన్లను సృష్టించే రాష్ట్రపతి ఉత్తర్వుకు ప్రాతిపదిక ఈ 371 డీ. ఒకటి రెండవ భాగాలు సివిల్ సర్వీస్ క్లాస్ ల గురించి వివరిస్తే, మూడో భాగం అడ్మినివూస్టేటివ్ ట్రిబ్యూనల్‌ను రాష్ట్రపతి ఏర్పాటు చేయవచ్చునని వివరిస్తుంది. ట్రిబ్యూనల్ ఉత్తర్వును రాష్ట్రవూపభుత్వం ధృవీకరించిన తరువాతే అది అమలవుతుంది. లేదా మూడునెలలపాటు ఏ స్పందనా లేకపోతే ఆ ఉత్తర్వు ధృవీకరించినట్టు భావిస్తారు. ఈ అధికరణం అయిదో భాగం ఈ ట్రిబ్యునల్ ఉత్తర్వును మార్చే అధికారం, తిరస్కరించే అధికారం కూడా రాష్ట్రవూపభుత్వానికి ఇస్తుంది. రాష్ట్రవూపభుత్వం ఇచ్చే ప్రత్యేక ఉత్తర్వు ఉభయసభల ముందుంచాలని ఆరోభాగం నిర్దేశిస్తుంది. ట్రిబ్యునల్ పైన పర్యవేక్షణ ఉత్తర్వులు హైకోర్టుకు ఉండబోవని ఏడోభాగం నిర్దేశిస్తున్నది. ఎనిమిదో భాగం ట్రిబ్యూనల్ అవసరం లేకపోతే రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఇచ్చింది. నవంబర్ 1, 1956 కు ముందు, 1973 రాజ్యాంగ సవరణకు ముందు నియమించిన ఉద్యోగుల నియామకాలు చెల్లబోవని భావించడానికి వీల్లేదని తొమ్మిదో భాగం వివరిస్తుంది. రాజ్యాంగంలో ఇతర నియమాలు ఏమి చెప్పినా, ఈ ఆర్టికల్‌లో, రాష్ట్రపతి ఉత్తర్వులలో అంశాలు మాత్రమే అమలవుతాయని పదోభాగం వివరిస్తుంది.

ఆర్టికల్ 371డీలో పదోభాగం చూపి రాజ్యాంగంలో ఉన్న అన్ని నియమాలను ఇది మింగేస్తుందని, కనుక ఆర్టికల్ 3 గానీ 4 గానీ దీనికి లోబడే ఉంటాయనే కొత్త పిడివాదాన్ని లేవనెత్తారు! ఈ ఆర్టికల్ కేవలం ఉద్యోగాలకు సంబంధించినది. ట్రిబ్యూనల్ ఏర్పాటుకు సంబంధించినవే కాని రాజ్యాంగాన్ని మొత్తం శాసించేవి కావు. కనుక ఈ వాదం అర్థం పర్థం లేనిది.
ఈ ఆర్టికల్ రాష్ట్రపతికి కొన్ని ఉత్తర్వులు ఇచ్చే అధికారం ఇస్తుంది. ఆ ఉత్తర్వులు మార్చే అధికారం, ఉపసంహరించే అధికారం కూడా రాష్ట్రపతికే ఉంటుంది. ఆంధ్రవూపదేశ్ నుంచి తెలంగాణ వేరైన తరువాత 371డీ కింద రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులు పనికి రాకపోవచ్చు. లేదా మిగిలిన రాష్ట్రానికి ఆ ఆర్టికల్ కింద ఉద్యోగుల రక్షణకు తగిన ఉత్తర్వులను తయారు చేసుకోవచ్చు. లేదా వదిలేయవచ్చు. తెలంగాణకు మాత్రం ఈ ఆర్టికల్ గానీ, దీని కింద చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులు గానీ పనికి రావు. కావాలనుకుంటే 371డీ వంటి మరొక రక్షణ నియమం చేయాలని కేంద్రాన్ని అడగవచ్చు. కాని తెలంగాణలో ఉద్యోగుల ప్రయోజనాలను రక్షించడానికి ఆయా జిల్లాల వారికి ప్రయోజనాలు కలిగించదలచుకుంటే తెలంగాణ ప్రభుత్వమే ఆ పని చేయవచ్చు. తెలంగాణకు అన్యా యం చేసే సీమాంవూధుల ప్రభుత్వం ఉండబోదు కనుక తెలంగాణ ప్రభుత్వం తానే అధికారాన్ని వినియోగించి తగిన ఏర్పాట్లు చేయడం సముచితం.


ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం కూడా 371డీ వంటి నియమాలు ఉండాలని కోరుకుంటే కేంద్రం అందుకు ఆమోదిస్తే ఆంధ్రవూపదేశ్ పునర్విభజన లేదా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లులోనే ఆ మేరకు ఒక నియమం చేయవచ్చు. ఆర్టికిల్స్ 3,4 కింద పార్లమెంటు తెలంగాణ బిల్లును ఆమోదిస్తే రాజ్యాంగంలోని షెడ్యూ ల్‌ను ఇతర వివరాలను మార్చడం సహజంగా జరిగిపోతుంది. అదే విధంగా 371డీ లో ఆంధ్రవూపదేశ్ పక్కన తెలంగాణ అన్న పదాన్ని చేర్చే నియమం కూడా ఈ బిల్లు ద్వారానే చేర్చవచ్చు. లేదా ఏ మార్పూ చేయకుండా వదిలేస్తే 371డీ అధికరణం కేవలం మిగిలిన ఆంధ్రవూపదేశ్‌కే వర్తించే అవకాశం ఉంది. లేదా ఇదే బిల్లు ద్వారా 371 తొలగించే అవకాశం కూడా ఉంది. అదే విధంగా 371డీ ని తొలగిస్తూ లేదా అవసరమైతే అందులో పదాలను మార్చుతూ లేదా చేర్చుతూ ఒక నియమాన్ని బిల్లులో ఏర్పాటుచేస్తే సరిపోతుంది.

ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని సవరిస్తూ వేరే చట్టం అవసరం లేదు. కనుక రాజ్యాంగ సవరణ చేసే బలం కేంద్రానికి లేదని, బీజేపీ మద్దతు ఇవ్వకుండా సీమాంధ్ర నాయకులు లాబీయింగ్ జరిపారని, పార్లమెంటులో సీమాంధ్ర ఎంపీలు వ్యతిరేకించి తీరుతారు గనుక సవరణ జరగదని నోటికి వచ్చినన్ని అబద్ధాలు చెప్తూ సీమాంధ్ర ప్రజలను మభ్య పెట్టడం అనైతికం. ఆర్టికల్ 3 కింద పార్లమెంటు చేసిన చట్టం ద్వారా అవసరమైన మార్పులు ఒకటో నాలుగో షెడ్యూలులో సహజంగా జరిగిపోతాయని ఆర్టికల్ 4 వివరిస్తుంది. ఈ విధంగా పునర్విభజన చట్టం ద్వారా రాజ్యాంగంలోని నియమాలను సవరించినప్పటికీ ఆ చట్టాన్ని ఆర్టికల్ 368కింద రాజ్యాంగ సవరణ చట్టంగా భావించరాదని ఆర్టికల్ 4(2) స్పష్టం చేసింది. సవరణ అవసరం లేదని, అది సవరణ కాదని ఇంత స్పష్టంగా చెప్పిన తరువాత కూడా, ఈ నియమాలను గురించి తెలిసి కూడా అబద్ధాలు చెప్పడం, తెలంగాణకు వ్యతిరేకంగా వాడుకోవడం నీచ రాజకీయం కాకుండా ఏమవుతుంది?

సీమాంధ్ర ప్రజలకు, వారి నాయకులు, ఆ నాయకుల తోకలుగా పనిచేసే పత్రికలు టీవీలు చెప్పే అన్యాయపు రాజ్యాంగ దురన్వయం మరొకటి ఉంది. ఆర్టికల్ 3 కింద రాష్ట్రపతి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు రాష్ట్ర శాసనసభకు అభివూపాయం కోసం పంపాల్సి ఉంటుంది. శాసనసభ తన అభివూపాయాలను ఏ విధంగానైనా వినిపించవచ్చు. కాని ఆ విధంగా తీర్మానం చేయాల్సిన అవసరమే లేదు. ఆ బిల్లును శాసనసభ ఆమోదించనవసరం కూడా లేదు. ఓటింగ్ జరగదు. ఓటింగ్ అవసరం లేదు. కనుక బిల్లును గానీ తీర్మానాన్ని గానీ ఓడించడం అంటూ ఉండదు. శాసనసభలో ఉన్న విభిన్నపక్షాల నాయకులు వారి అభివూపాయాలను నమో దు చేయవచ్చు. వాటిని స్పీకర్ సేకరించి ఒక నివేదిక తయారుచేసి రాష్ట్రపతికి పంపవచ్చు. దాని పైన కావలసినంత సేపు చర్చలు జరుపుకోవచ్చు. లేదా తెలంగాణ కావాలనో వద్దనో చెప్పవచ్చు. లేదా విభజనను ఆమోదిస్తూ అందుకు అనుగుణంగా ఏ ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందో సూచనలు చేయవచ్చు. లేదా బిల్లులో కొన్ని మార్పులను ప్రతిపాదించవచ్చు. ఏ సవరణా లేకుండా మార్చవచ్చు కూడా. కాని సీమాంధ్ర నేతలు ప్రకటిస్తున్నట్టు తీర్మానాన్ని ఓటింగ్‌లో ఓడించే అవకాశమే రాదు.

భారతదేశం విభాజ్యమైన రాష్ట్రాలతో కూడిన అవిభాజ్యమైన జాతి అని భారత రాజ్యాంగ స్వరూపాన్ని నిపుణులు వివరించారు. ఇది భారత యూనియన్ (సంఘం) అవుతుందే కాని సమాఖ్య కాదు అని కూడా అన్నారు. అర్థ సమాఖ్య అనీ, మామూలు సందర్భాలలో సమాఖ్య అనీ, అత్యవసర స్థితిలో మాత్రం కేంద్రానికి బలం పెరిగి యూనియన్ గా మారుతుందని వర్ణించారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 3 విశాల రాష్ట్రాల లో కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరగకుండా కాపాడే ప్రయోజనకరమైన అధికరణం అని తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ఉద్యమ ఫలితం నిరూపించింది. రాజకీయ నాయకుల స్వార్థ పూరిత అవాస్తవ ప్రచారాలకు రాజ్యాంగ నియమాలను కూడా వాడుకోవడం చూస్తే తెలంగాణ ను వ్యతిరేకించడానికి నాయకులు ఎంతకైనా తెగిస్తారని ఇటువంటి నేతల విషకౌగిలి నుంచి తెలంగాణ విడిపడడం అత్యవసరమని అర్థమవుతుంది.

-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు
మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధన కేంద్రం సమన్వయకర్త

124

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

Published: Mon,June 24, 2013 11:23 PM

రాజ్యాంగ గాయాలకు పరిహారం లేదా?

చలో అసెంబ్లీని అన్నిరకాలుగా ఆపిన పోలీసులు ఉస్మానియా విద్యార్థులను అసెంబ్లీకి వెళ్లకుండా నిరోధించడానికి భీకర పోరాటం సాగించారు. బా