భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!


Tue,November 19, 2013 05:17 AM

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూలు ఉద్యోగులకు, మేధావులని పిలువబడే సీమాంధ్ర పాత్రికేయులకు కూడా ఉండ డం ఆశ్చర్యకరం. బహుశా తెలంగాణ వలె ప్రపంచంలో ఎక్కడా ఇంతటి వ్యతిరేకతను, శత్రుభావాన్ని ఎవ రూ ఎదుర్కోలేదేమో. కోస్తాంవూధకు చెందినవారు హైదరాబాద్‌లో పుట్టి పెరిగి దశాబ్దాలు గడిచినా ఇక్కడి జనంతో సమైక్యం కావడం మాట అటుంచి, తీవ్ర వ్యతిరేకతను ఎందుకు కలిగి ఉన్నారో, దాన్ని ఇంతబాహాటంగా ఎందుకు ప్రదర్శిస్తున్నారో అర్థం కాదు. ఒక ప్రభుత్వోద్యోగి అయి ఉండి, ఇకపై మా ఉద్యమం శాంతియుతంగా సాగదనీ, హైదరాబాద్ ను ఆక్రమిస్తామని అనడం వాక్ స్వాతంవూత్యాన్ని అతిక్షికమించి బాధ్యతాయుత ప్రవర్తనను విస్మరించి, రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తామని ఐపీసీ కిం ద నేరాలు చేస్తామని ప్రకటించడమే అవుతుంది. తెలంగాణను రెచ్చగొట్టే ఇటువంటి వ్యూహాలకు తెలంగాణ ప్రజలు ప్రతిస్పందించకూడదని, వారు అనుసరిస్తున్న శాంతి మార్గాలను వదిలిపెట్టకూడదని కోరుకోవాలి. హైదరాబాద్‌ను రాజధాని ప్రాంతంగా (కాపిటల్ టెరిటరీ)గా కేంద్ర ప్రభుత్వం రూపొందించే ఆలోచనలో ఉందనే మరొ క వార్తను ప్రచారం చేస్తున్నా రు. ఇది సీమాం ధ్ర పెట్టుబడి దారుల ప్రయోజనాలను హైదరాబాద్‌లో వారి విస్తారమైన అక్రమార్జిత భూములను రక్షించడానికి సాగుతున్న మరో ప్రయత్నం. న్యూఢిల్లీని నేషనల్ కాపిటల్ టెరిటరీ గా మార్చారు. అది కేంద్ర పాలిత ప్రాంతం. అంటే కేంద్ర పాలిత ప్రాంతం అనకుండా హైదరాబాద్‌ను యూటీ చేయడానికి మరో ప్రయత్నం చేస్తున్నారని అర్థం చేసుకోవాలి.

ఎక్కడైనా ఎవరైనా ఒక ప్రాంతాన్ని యూనియన్ టెరిటరీ చేయాలని కోరుకోవడం అంటే వారికి ప్రజాస్వామ్యం మీద ప్రజా ప్రాతినిధ్య విధానం మీద నమ్మకం లేదని అనుకోవలసిందే. ఎందుకంటే యూటీలో ప్రజావూపాతినిధ్యం ఉండదు. ఢిల్లీ, పుదుచ్చేరి వంటి యూటీలలో శాసనసభ ఉండి అం దులో సభ్యులను ఎన్నిక చేసినప్పడికీ వారికి నామ మాత్రపు హోదానే తప్ప ఏ అధికారాలూ లేవు. ముఖ్యమంత్రి, మంత్రులు కూడా రబ్బరు స్టాంపు లుగా మిగిలిపోతారు. అడ్మినివూస్టేటర్‌గా ఉన్న లెఫ్టినెంట్‌కో, గవర్నరుకో మొత్తం అధికారాలుంటాయి. ఢిల్లీని విస్తరించి, పక్క రాష్ట్రాల ప్రాంతాలను కూడా కలిపి, ఒక నేషనల్ కాపిటల్ టెరిటరీ (ఎన్‌సీటీ)ని తయారుచేశారు. జాతి రాజధాని నగరం కనుక అం దులోనే ఉన్న కేంద్ర ప్రభుత్వానికి ఎన్‌సీటీ పరిపాలనకు సం బంధించి పూర్తి అధికారాలు ఇవ్వడానికి కేంద్రపాలిత ప్రాంతం చేశారని అనుకోవచ్చు. ఢిల్లీ ఎన్‌సీటీకి శాసనసభను ఏర్పాటు చేసిన తరువా త దానికి రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర హోదా ఉంటుం ది. కనుక రెండో జాబితాలోని అంశాలపైన ప్రత్యేక పాలన, శాసనాధికారాలు కూడా ఉంటా యి. కేంద్ర పాలిత ప్రాంతాల చట్టం ప్రకారం అక్క డ శాసనసభకు అందులో ఉన్న ముఖ్యమంవూతికి కూడా అధికారాలు లేనేలేవు. కేవలం నామ మాత్ర పు ప్రభువులే. అసలు సిసలు అధికారాలన్నీ అడ్మినివూస్టేటర్‌కు మాత్ర మే ఉంటాయి. గవర్నర్ హోదా తో సమానమైన ఈ అడ్మినివూస్టేటర్‌కు ముఖ్యమంత్రి, మంత్రివర్గం సలహాలు ఇవ్వడం వరకే కానీ, ఆ సలహాలు పాటించి తీరాలని మిగతా గవర్నర్లకు ఉన్నట్టు ఈ అధికారికి నియమం లేదు. ముఖ్యమంత్రి లేదా అతని మంత్రి వర్గం ఏమి చెప్పినప్పడికీ ఆ సలహాను వదిలేసి సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం అడ్మినివూస్టేటర్‌కు ఉంటుంది. అంటే గవర్నర్ వలె రబ్బరు స్టాంపు కాదు. నిజానికి ముఖ్యమంత్రి రబ్బరుస్టాం పు అవుతాడు. కేంద్రపాలిత ప్రాంతాల ప్రభు త్వ చట్టం ప్రకారం ఎన్నో పరిమితులు ఉంటాయి. కేం ద్ర ప్రభుత్వం అడ్మినివూస్టేటర్ ద్వారా పూర్తి అధికారాలను చలాయిస్తుంది. అందుకే దాన్ని కేంద్ర పాలిత ప్రాంతం అన్నారు.

హైదరాబాద్‌ను రాజధాని ప్రాంతం అంటూ కేంద్ర పాలిత ప్రాంతం అన్న మాట వాడకుండా, ఆ ప్రాంతం తెలంగాణకు రాజధాని అయినా అక్కడి వ్యవసాయ భూముల మార్పిడికి, బదిలీకి కేటాయింపులకు, వాటి అభివృద్ధికి, ఫీజువిధింపు తది తర సంబంధించిన అధికారాలు లేకుండా చేయాలనుకోవడం దుర్మార్గమైన చర్య. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో మోసం చేసి ఆక్రమించుకున్న వ్యవసాయ భూములను విడిపించడం తెలంగాణ ప్రభు త్వ కర్తవ్యం. భూముల దురాక్షికమణతోనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలైంది. ఈరోజు హైదరాబాద్ ను ఆక్రమించడమే లక్ష్యమని దురుద్దేశాన్ని బయటపెట్టుకున్న కోస్తాంధ్ర ఎన్‌జీవోలు చేస్తున్నది తెలంగాణలో వ్యవసాయ భూములను ఆక్రమించుకోవడమే.విలీనం దశలో తెలంగాణఉద్యోగాలకు భూములకు రక్షణలు కోరింది. దానికి కేవలం ఒక పెద్ద మనుషుల ఒప్పందం ఒకటి సంతకం చేసి పారేశారు. ఇప్పుడు అక్రమ ఉద్యోగాలకు, అక్రమార్జిత భూములకు, రాజ్యాంగ పరమైన రక్షణ కావాలని కోరుతున్నారు. ఇందులో కూడా తెలంగాణను వివక్షకు గురి చేయాలని చూస్తున్నారు. ఒప్పందాలను నాశనం చేశారు. అయినా శాంతియుతంగా ఉద్యమించారే గానీ ఏరోజూ ఆక్యుపై హైదరాబాద్ వంటి ఉద్యమాలకు పాల్పడలేదు. అక్రమంగా తెలంగాణ ఉద్యోగాలను ఆక్రమించుకున్న వారిమీద ఉద్యమంలో భాగంగా తెలంగాణ వాలా జాగో ఆంధ్రావాలా భాగో అనే నినాదం ఇస్తే గగ్గోలు చేసిన పక్షపాత మీడియా ఆక్యుపై హైదరాబాద్ వంటి రెచ్చగొట్టే నినాదాన్ని ఖండించడానికి కూడా ఇష్టపడడం లేదు. శాంతియుతమైన ఉద్యమంగా ఉండబోదని హెచ్చరిస్తే ఎవరూ మాట్లాడరు. మరోవైపు ఢిల్లీలో కూచుని శాంతి భద్రతలను అదుపుచేసే అధికారం, భూముల దుర్మార్గాలను సరిచేసే అధికారాలు తెలంగాణ ప్రభుత్వానికి ఉండకుండా రాజ్యాంగ రక్షణలు కావాలని లాబీయింగ్ చేస్తున్నారు.

(రచయిత : నల్సార్ న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు,మాధ్యమ న్యాయశాస్త్ర పరిశోధన
కేంద్రం సమన్వయకర్త)

411

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

Published: Mon,June 24, 2013 11:23 PM

రాజ్యాంగ గాయాలకు పరిహారం లేదా?

చలో అసెంబ్లీని అన్నిరకాలుగా ఆపిన పోలీసులు ఉస్మానియా విద్యార్థులను అసెంబ్లీకి వెళ్లకుండా నిరోధించడానికి భీకర పోరాటం సాగించారు. బా