నదులు-వివాదాలు


Tue,March 4, 2014 04:05 AM

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్రాంతాలను సస్యశామలం చేస్తున్నాయి. వ్యవసా య ఆధారిత మనదేశంలో ఈ జీవనదులు భూముల్లో బంగారాన్ని పండిస్తాయి. ప్రజల తాగునీటి అవసరాలను తీరుస్తూ ప్రజలతో దేవతలుగా కొలువబడుతున్నాయి.

అయితే ఈ నదులు ఆవిర్భవించిన చోటు నుంచి వివిధ రాష్ర్టాల గుండా ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తాయి. అయితే..ఈ నదులు ప్రవహించే క్రమంలో ఎగువ రాష్ర్టాలకూ, దిగువ రాష్ర్టాలకూ అనివార్యంగా కొన్ని వివాదాలు తలెత్తుతున్నాయి. ఈక్రమంలోనే దేశంలో అనేక చోట్ల, పలు రాష్ర్టాల్లో జలవివాదాలు అంతర్‌రాష్ట్ర జలవివాదా ల పేరుతో జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నదీ ప్రవాహ క్రమం లో ఎగువన ఉన్న ప్రాంతంలోని ప్రజలు తమ సాగునీటి అవసరాల కోసం నదీ జలాలను అవసరమున్నంత మేర వాడుకోవాలని చూసే క్రమంలోనే అసలు సమస్యలు తలెత్తుతున్నాయి. సాధారణంగా ఎగు వ రాష్ర్టాలు నదీ జలాల వాడకానికి ప్రాజెక్టులు నిర్మించి, రిజర్వాయర్‌లు నిర్మించి వాటిని నీటితో నింపి నిలువు చేసుకుంటాయి. దీంతో దిగువ ప్రాంతాలకు సహజంగా ప్రవహించే నీటి పరిమాణంలో తగ్గుదల ఉంటున్నది. ఎగువ రాష్ట్రం వాడుకుని మిగిలిన జలాలను దిగువ ప్రాంతాలకు విడిచినవే మిగులుజలాలు. ఈమిగులు జలాలను వాడుకోవడంలో కూడా దిగువ ప్రాంతాలకు అనేక సమస్యలు ఉత్పత్నమవుతున్నాయి. ఎగువ రాష్ర్టాల్లో నీటిని నిలువ ఉంచడం వల్ల నీటిలో లవణాల శాతం పెరిగిపోతున్నది. వ్యర్థ పదార్థాలు పేరుకుని పోవడం తోపాటు రంగు కూడా మారిపోతున్నది.

అన్నింటి కన్నా ముఖ్యమైన సమస్య ఏంటంటే.. కాలువల ద్వారా నిర్దేశిత ప్రాంతానికి చేరేలోగానే న్యాయంగా చేరాల్సిన నీటి వాటా కన్నా చాలా తక్కువ చేరుతున్నది.కాలువల ద్వారా ప్రవహించే క్రమంలో భూమిలో ఇంకిపోవడం, ఆవిరి అయిపోవడం ద్వారా నీటి పరిమాణంలో చాలా వరకు తరుగుదల ఉంటున్నది. కాబట్టి ఎగువ ప్రాంతాలతో పోలిస్తే.., దిగువ ప్రాంతాలకు నీరు అందుతున్న నీటిలో తరుగుదల ఉండటంతో తరచుగా వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చిందే ఆల్మట్టి వివాదం. తమ అవసరాల కోసం తమ ప్రాంతంలో ప్రవహిస్తున్న నదిపై ఉన్న ప్రాజెక్టు ఎత్తు పెంచామని కర్ణాటక అంటే.., తమ ప్రాంతానికి రావలసిన నీటి వాటాలో కర్ణాట క జలచౌర్యానికి పాల్పడుతున్నదని దిగువ రాష్ట్రం వాదనకు దిగింది.

ఇలాంటివే ఎన్నో జల వివాదాలు దేశంలో నిత్యం రాజుకుంటూనే ఉన్నాయి. ఈ జలవివాదాలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం 1956లో అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం రూపొందించింది. ఇది సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా రూపొందించబడింది. ఈ చట్టం ప్రకారం ఏ నదీ పరివాహక ప్రాంతంలోనైనా నీటి పంపకాలు, నది జలాలపై అధికారం విషయంలోనూ, మిగులు జలాల విషయంలోనూ తలెత్తే వివాదాలను పరిష్కరిస్తారు. ఎక్కడైనా నదీజలాల విషయంలో తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం ఈ చట్టం ద్వారా ముందుకు పోతున్నది. అలాగే నదీజలాల సమస్యలను పరిష్కరించే క్రమంలో ఈ చట్టం అనేకసార్లు సవరణలు పొందింది. పరిస్థితులు, సమస్యలకు అనుగుణంగా ఈ మధ్యనే 2002లో ఈ అంతర్రాష్ట్ర జలవివాద చట్టానికి సవరణ చేశారు. దీని ప్రకారం నదీజలాల వివాదం, మిగు లు జలాల పంపిణీ రాష్ర్టాల పరిధిలోనిదని రాజ్యంగంలోని 7 వ షెడ్యూల్ వివరిస్తున్నది. మొత్తంగా చూస్తే.. ఐఆర్‌డబ్ల్యూడీ చట్టం అనేది కేవలం అంతర్రాష్ట్ర జలవివాదాల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ఉంటున్నది. ఎప్పుడైనా రెండు రాష్ర్టాల మధ్య జల వివా దం తలెత్తినప్పుడు సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు జలవివాద పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబడుతుంది.

ఇది తలెత్తిన జల వివాదాన్ని రాజ్యాంగ నిబంధనలు, సూత్రాల ఆధారంగా సమస్యను అధ్యయనం చేస్తుంది. జలవివాదాల్లో సాధారణంగా ఉండే కాలుష్యం, నీటిలో ఉప్పు శాతం, వాతావరణ, పర్యావరణ సమస్యలు, వరదలు, విపత్తులు లాంటి సమస్యల ఆధారంగా వివాదాన్ని పరిష్కరిస్తుంది. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు తీర్పుతో సమానం.ఏజలవివాదం పైన గానీ ట్రిబ్యునల్ తీర్చు ప్రకటిస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వ ఆమోదించి దాన్ని గెజిట్ రూపంలో ప్రకటిస్తుంది. ఇలా ప్రకటించిన వెంటనే ఆ తీర్పు అమలులోకి వస్తుంది.
దేశంలో జలవివాదాల ట్రిబ్యునల్‌ల చరిత్ర సుదీర్ఘమైనది. కష్ణా నది జలాల సమస్యపై 1969లో ట్రిట్యునల్ ఏర్పాటు చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర,ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య తలెత్తిన కష్ణజలాల కోసం దీన్ని ఏర్పాటుచేసి, 1976 నాటికి సమస్యను పరిష్కరించే తీర్పు వెలువరించాలని కోరా రు. ఆ తర్వాత ట్రిబ్యునల్ తీర్పు ప్రకరణమే 2001లో తిరిగి మరో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది.

అలాగే గోదావరి జలాల పంపిణీపై ప్రభుత్వం ట్రిబ్యునల్ వేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ర్టాల మధ్య కూడా జలవివాదాలు తలెత్తడానికి అవకాశాలున్నాయి. ఎప్పుడైనా నదీజలాల విషయంలో ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ఇరు ప్రాంత ప్రజలు, పాలకులు వ్యవహరిస్తే చాలా వరకు జల వివాదాలు పరిష్కారమవుతాయి. కానీ జలాల పంపకాల విషయాలతో రాజకీయాలుచేసే పరిస్థితులతోనే అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. సుదీర్ఘ న్యాయపోరాటాలు నడుస్తున్నాయి. ఏ సమస్యలు వచ్చినా అవగాహనతో, సహనంతో పరిష్కరించుకుంటే.. అనవసర అంతఃకలహాలు అంతమవుతాయి. [email protected]

995

MADABHUSI SRIDHAR

Published: Thu,July 10, 2014 09:44 AM

మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

Published: Mon,June 24, 2013 11:23 PM

రాజ్యాంగ గాయాలకు పరిహారం లేదా?

చలో అసెంబ్లీని అన్నిరకాలుగా ఆపిన పోలీసులు ఉస్మానియా విద్యార్థులను అసెంబ్లీకి వెళ్లకుండా నిరోధించడానికి భీకర పోరాటం సాగించారు. బా