మీడియా స్వేచ్ఛ - ప్రసార నేరాలు


Thu,July 10, 2014 09:44 AM

ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం
ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన తరువాత కులాల ప్రయోజనాల ఆధారంగా ప్రసార నేరాలు జరుగుతూ ఉంటే ఎవరు మాత్రం ఏ చేస్తారు?

పాశి కల్లు తాగెటోనికి ఫారిన్ మందు ముందల బెట్టినట్టే ఉన్నది మన తెలంగాణ ఎమ్మెల్యేల కత.. పాత్రికేయ చరిత్రలో ఇంతటి దిగజారుడు వాక్యాన్ని ఎవరైనా అరుదుగా చూస్తారు. జీవితం జర్నలిజం తెలిసినవారు ఈ విధంగా రాయరు. రాజకీయ పక్షపాతం, తెలంగాణ ద్వేషం, కులతత్వం కురిపించే వాక్యం ఇది. కల్లు తాగడం ఎమ్మెల్యే కావడానికి అనర్హత, ఫారిన్ మద్యం తాగడం అర్హత అనే స్థాయికి ఈ జర్నలిస్టు దిగజారిన తర్వాత, చదువుకోకపోయినా ప్రమాణ స్వీకారంలో పదాలు సరిగ్గా పలకకపోయి నా అతని కన్న జన హదయం గెలిచి వచ్చిన ప్రజాప్రతినిధులే మేలైన వ్యక్తులు. ఈ అసమర్థులు మరొకరిని అసమర్థులన డం న్యాయం కాదు.లంగోటి కట్టుకునేటోనికి లాప్‌టాప్ ఇస్తే మడిశి ఏడ్నో పెట్టుకున్నట్టు మరేంజేసుకుంటరో,ఏడ అమ్ముకుంటరో ఆళ్లకే తెలవాలె కని..ఇది మరొక దురహంకార నింద. తెలంగాణ ఎమ్మెల్యేలను తిట్టడానికి అవమానించడానికి ఒక చానెల్ తెలంగాణ యాసను వాడుకోవడం కూడా నీచ ప్రక్రియ. కనీస విలువలున్న మనుషులెవరూ ఈవిధంగా మాట్లాడరు. కనీస విలువలున్న జర్నలిస్టు ఇటువంటి మాటలు ప్రసారం చేయ రు. పాత్రికేయ ప్రమాణాలను అధఃపాతాళానికి దించడమే కాకుండా, అభివ్యక్తి స్వాతంత్య్రాన్ని ప్రమాదంలో పడేసే వాక్యాలివి. ఈపని చేసిందెవరన్నది అనవసరం. ఎవరు చేసినా విమర్శించాల్సిందే. తెలంగాణ వ్యతిరేకత నరనరాన జీర్ణించుకున్న ఈ రాతలను ప్రతిఘటించాల్సిందే.

ఆ విధంగా చెప్పడం స్వేచ్ఛకాదు, నేరం. కేబుల్ టీవీ నెట్‌వర్క్ రెగ్యులేషన్ చట్టం1995 ప్రకారం ఇది ప్రసార నేరమవుతుంది. టీవీ చానెల్ గానీ, కేబుల్ ఆపరేటర్ గానీ లేదా ఏ వ్యక్తి అయినా ప్రసార నేరం చేస్తే మొదట రెండేళ్లు, రెండోసారి అదే నేరం చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష జరిమానా కూడా విధించాలని సెక్షన్ 16 నిర్దేశించింది. ప్రసారాలు అసభ్యంగా అసహ్యం గా ఉండకూడదనీ,అశ్లీలం, పరువు నష్టం,కావాలని నిందించే వాక్యాలు చెప్పడం, అర్ధ సత్యాలు, పరోక్ష అసత్య ఆరోపణలు చేయడం, వ్యక్తిని లేదా సమూహాన్ని, సామాజిక వర్గాన్ని కించపరచడం, ఒక జాతి ని, భాషను ప్రాంతాన్ని నీచంగా చిత్రీకరించే దశ్యా లు, మాటలు వాడడం కూడదని కోడ్ వివరిస్తున్నది. వీటిని ఉల్లంఘించే ప్రసారాలు నేర ప్రసారాలు అవుతాయని చట్టం నిర్దేశించింది. ఇటువంటి తిట్ల కార్యక్రమాలను లెక్కిస్తే ఈ చానెల్స్ యజమానులు కొన్ని జీవితాల పాటు జైల్లో ఉండాల్సి వస్తుంది. మన చానె ల్స్ చెప్పిందే చెప్పడం మనకు తెలిసిందే. కనుక ఒక్కొక్క చానెల్ పునః ప్రసారం చేసిన ప్రతిసారీ ఈ నేరం చేసినట్టే, తెలంగాణ వ్యతిరేక చానెల్స్ తెలంగాణను అవమానిస్తూ చేసిన ప్రతి కార్యక్రమం ప్రతి ప్రసారం పునఃప్రసారం కూడా విడివిడిగా ఒక్కొక్క నేరమవుతుంది. ఆలెక్కన ఒక్కో చానెల్ ఒక్కరోజు లో కనీసం రెండు నేరాలయినా చేశారని క్లిపింగ్స్ ద్వారా చెప్పగలిగితే పోలీసులు కేసులు రిజిస్టర్ చేయవలసిందే, కోర్టులు విచారించవలసిందే.

ఇదివరకు సర్కారులో ఉన్న వారి అండదండల తో ఈ చానెల్స్ ఇష్టం వచ్చిన రీతిలో ఈ దుర్మార్గ ప్రసారాలు చేసినా పోలీసులు కదలలేదు, జనం కేసు లు పెట్టే ధైర్యం చేయలేదు. టీడీపీని తప్ప ఎవరినైనా బూతులు తిడతామని టీవీ గొట్టాల సాక్షిగా ప్రమా ణం చేసినట్టు వ్యవహరించే టీవీల ప్రసార నేరాలను ఎందుకు ప్రసారం చేయాలని కేబుల్ టీవీ ఆపరేట ర్లు నిలదీస్తున్నారు. అయితే కేబుల్ టీవీ ఆపరేటర్లకు టీవీ చానెల్ ప్రసారాలు ఆపే అధికారం లేదు. కాని రోజూ ప్రసార నేరాలు చేసే టీవీ చానెల్ ను తమ నెట్ వర్క్ ద్వారా జనానికి అందించి పదేళ్లపాటు జైలుకు వెళ్లే ప్రమాదం కొనితెచ్చుకునే బదులు ప్రసారాలు నిలిపివేయడమే మంచిదన్న వారి వాదం సమంజసమే. అది చట్టబద్ధం కూడా. వారి ప్రసార ఒప్పందంలో చట్టవ్యతిరేక ప్రసారాలు చేయరాదనే నియమం కూడా కచ్చితంగా ఉంటుంది. కనుక ఇది ఒప్పంద ఉల్లంఘన కూడా అయ్యే అవకాశం లేదు. రోజూ నేరాలు చేసే బదులు, ప్రసారమే ఆపేస్తాను అని సమర్థించుకునే అవకాశం కేవలం ఇదొక్కటే.

ఇందులో పరువు నష్టం అనే నేరం కూడా ఉంది. క్రిమినల్ పరువు నష్టం అని సెక్షన్ 499 ఇండియన్ పీనల్ కోడ్‌లో నిర్వచించారు. రాసిన వారిని, చెప్పి న వారిని,చూపిన వారిని (చానెల్ వారు, కేబుల్ ఆపరేటర్లు),యాంకర్‌తో సహా పరువు నష్టం నేరానికి రెండేళ్ల పాటు జైలుకు పంపించవచ్చని సెక్షన్ 500 వివరిస్తున్నది. ఇటువంటి ఎన్నో నేర వాక్యాలు పత్రికలు, టీవీ చానెల్స్ ప్రసారం చేస్తూనే ఉన్నాయి. నేరా ల రిజిస్ట్రేషన్ జరిగితే వాటి సంఖ్య తెలుస్తుంది.తాను రాసేది నేరం అవుతుందని కూడా తెలియని తెలివి తక్కువ దద్దమ్మలతో మీడియా నడిపే వారికి లాప్ టాప్‌ను వాడుకోవడం రాదని తెలంగాణ ఎమ్మెల్యేలను నిందించే అధికారం ఎక్కడినుంచి వస్తుంది? లాప్‌టాప్ మడిచి ఎక్కడ పెట్టుకుంటా డో అనడం నీచమైన ఆలోచన, అమ్ముకుంటాడనడం జైలుకు పంపించతగిన నింద భాష. మీడియా స్వా తంత్య్రం జర్నలిస్టు వ్యాపారులకు ఎంత అవసరమో, పరువుతో బతికే జీవనహక్కు అంతకన్న ప్రజాప్రతినిధులకు అవసరం. తెలంగాణ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఈ ఒక్క వాక్యంపైన కచ్చితంగా పరువునష్టం క్రిమినల్ కేసే నమోదు చేయవచ్చు. 60 మంది ఎమ్మెల్యేలకు ఇటువంటి నేరగాళ్లమీద 60 క్రిమినల్ కేసులు పెట్టే హక్కు ఉంది.

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, అన్నా డిఎంకె పార్టీ కార్యకర్తలు తమను వ్యతిరేకించే వారిపైన డిఫమేషన్ కేసుల పరంపరం నమో దు చేశారు. వందల కేసుల్లో ఆమె గెలిచారు కూడా. జయలలిత గురించి నిరాధారంగా మాట్లాడడానికి, ప్రసారం చేయడానికి ఈరోజు ఎవరూ అక్కడ సాహసించరు. ఏ భయమూ లేకుండా నిర్లజ్జగా మాట్లాడే సంస్కతి ఈ మధ్య తెలుగు మీడియాలో, తెలుగు రాజకీయ నాయకుల్లో వచ్చింది. నేతలు చాలా నీచం గా మాట్లాడడం అది యథాతథంగా పదేపదే మీడి యా ప్రసారం చేయడం ప్రతిదీ నేరమే. ఇవి కాకుం డా నష్టపరిహారం కోసం సివిల్ దావా కూడ వేయవచ్చు. ఇది కేవలం నైతిక విలువలకు సంబంధించినదీ స్వయం నియంత్రణకు వదిలేయాల్సినదీ కాదు. ఒక పార్టీకి కొమ్ముకాస్తూ ఒక వర్గం భూస్వాములకు పల్లకీ మోస్తూ, మరొక పార్టీని తిడుతూ ఒక ప్రాం తాన్ని ద్వేషిస్తూ వ్యాపారం చేసుకునే వారు నీతి నియమాలకు బద్దులవుతారని, స్వయంగా తప్పులను తెలుసుకుని సరిదిద్దుకుంటారని నమ్మలేం. కనుక వారి వల్ల హక్కులు కోల్పోయిన ఎమ్మెల్యేలు కోర్టులను ఆశ్రయించకతప్పదు.

విడిగా పరువు నష్టమైతే ఇది సమష్టిగా శాసనసభాహక్కుల ఉల్లంఘన. కచ్చితంగా బాధ్యులైన వారి ని సభావేదికకు రప్పించి నిరసనను, అసమ్మతిని, ఆగ్రహాన్ని ప్రకటించి మందలించాల్సిందే. జైలుకు పంపే అధికారం కూడా ఉన్నా దాన్ని వినియోగించ డం న్యాయం కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రజాభిప్రాయాన్ని తప్పుదారి పట్టించే అభివ్యక్తి నేరాలకు ప్రత్యామ్నాయంగా అభిప్రాయాన్ని నిర్మించడం ద్వారా ఎదుర్కోనవలసి ఉంటుంది. వ్యక్తులు పరువు నష్టం గురించి పోరాడడం, సభ తన మర్యాద గురించి చర్యలు తీసుకోవడం వరకు అభిప్రాయ నిర్మాణానికి సహకరించే అంశాలు. నిషేధాలు విధించడం గానీ, సభాధిక్కారానికి జైలుకు పంపడం గానీ చేయకుండానే దుర్మార్గ రచనలకు వ్యతిరేకంగా దీటైన జనాభిప్రాయాన్ని నిర్మించడం అవసరం. ఇటువంటి రాతలు రాసే వారి విశ్వసనీయత క్షీణించి పోతున్న విషయం జనానికి చెప్పవలిసి ఉంది.

వీధుల్లో నెత్తుటి నేరాలు తగ్గలేదు కాని నెత్తురు చిమ్మించే విధంగా రెచ్చగొట్టే మాటలు, తడిగుడ్డతో గొంతులు కోసే నేరాలు పెరిగిపోతున్నాయి. కత్తులను చట్టాలతో శిక్షలతో ఎదుర్కోవచ్చు. కాని తేనె పూసిన కత్తులతో ఘర్షణ సాధ్యం కాదు. రాజకీయ లక్ష్యాలతో రాజకీయ పార్టీల అనుబంధ దుకాణాలు గా వెలుగొందుతున్న టీవీచానెల్స్‌లో వ్యక్తీకరణ స్వాతంత్య్రం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి అంటే అది అర్థం పర్థం లేని నినాదమే. ఆర్టికల్ 19కింద భావప్రకటనా స్వేచ్ఛ అన్నారే గాని పత్రికా స్వేచ్ఛ అని రాయలేదని, అమెరికా రాజ్యాంగంలో ఉన్నట్టుగా భారత రాజ్యాంగంలో కూడా ఆ విధంగా రాయాలని మొదట్లో పెద్ద చర్చ జరిగింది.

కాని ఆ విధంగా మార్చకపోవడమే మంచిదైంది. టీవీ, సెల్, ఇంటర్నెట్ వంటి రకరకాల మాధ్యమాలలో భావప్రకటనకు ఈ స్వేచ్ఛా హక్కు వర్తించే సౌలభ్యం ఏర్పడింది. నిన్న మొన్నటి దాకా పత్రికలోనో టీవీ చానెల్‌లోనో పనిచేసే వాడికే భావప్రకటనా స్వేచ్ఛ ఉండేది, లేకపోతే కరపత్రాలు రాసుకోవాల్సిందే. కాని ఇప్పుడు సాంకేతిక వనరులు చేతికందివచ్చినాయి. ఇంటర్నెట్‌లో ప్రతిపౌరుడు భాష వచ్చినా రాకపోయినా, భావాలు తెలుపుకునే అవకాశాలు, వాటిని మనోవేగంతో ప్రపంచానికి పంపుకునే వెసు లుబాటు వచ్చింది. బహుశా ఇంతగా భావస్వేచ్ఛను ఇదివరకు వాడుకోలేదోమో. చదువురాకపోయినా అభిప్రాయాలు జనాన్ని చేరుకునే మాధ్యమాలు - టీవీ,రేడియోలు. టీవీ విపరీతంగా విస్తరించింది.

అభిప్రాయ నిర్మాణం ఒక రాజకీయ వ్యాపారంగా మారింది. వార్తల కన్న సొంత అవసరాలు తీర్చే అవాస్తవాల ప్రచారం ఎక్కువైంది. వాస్తవాలకు రంగులు పూసే రచనా వ్యాపారులు ముఖాలకు రంగులు పూసుకుని కెమెరాల ముందుకు రావడం తప్పుకాదు. అక్కడ తన్నులాటలను ప్రోత్సహించే మాటలు మాట్లాడించి తమాషా చూస్తున్నారు. చివరకు ఒక టీవీ, ఒక పత్రిక ఉన్నవాడే పార్టీ పెట్టగలస్థితి ఏర్పడింది. ఇటువంటి వ్యాపార రాజకీయ పార్టీ అనుబంధ టీవీల్లో జనహితమైన వార్తలేవో వస్తాయని అనుకోవడం, అక్కడ చైతన్యం దొరుకుతుందని, పౌరుడు చైతన్యశీలుడవుతాడని ఆశించడం దురాశ.పక్షపాతం మామూలు విషయం. ఆత్మస్తుతి పరనిందల మధ్య వాస్తవిక వార్త, సద్విమర్శ ఇరుక్కుపోయింది. జనహితం మాత్రం అడపాదడపా మాటల్లో వినిపిస్తూ ఉంటుంది.

టీవీ చానెల్స్‌లో అర్ధరాత్రి అశ్లీల సమయంగా మారిపోవడం, దేశ, సంఘ, జాతి వ్యతిరేక ప్రసారాలను ఆపడానికి, కేబుల్ ఆపరేటర్లు పుట్టగొడుగులవలె పుట్టి అరాచకం చేస్తూఉంటే కేబుల్ టివి రెగ్యులేటరీ చట్టం 1995లో తెచ్చారు. సెక్స్ క్రికెట్ పాలిటిక్స్‌లతో రేటింగ్ పెంచుకుని వ్యాపార ప్రకటనలు చేయడం ఎన్నికల్లో అభ్యర్థికి భజన చేసేందుకు లక్ష లు వసూలు చేయడం 90 శాతం మీడియా వారి మార్గంగా మారింది. తెలంగాణ ఏర్పడడాన్ని వ్యతిరేకించిన 90 శాతం మీడియా తెలంగాణ ఏర్పడిన తరువాత తన ద్వేష ప్రసారాల మోతాదు తగ్గించలేదు. టీఆర్‌ఎస్‌ను నిరంతరం విమర్శించడం, టీడీపీని నిరంతరం పొగడ్తలతో ముంచెత్తడానికి అవి పుట్టాయా అన్నట్టు చేస్తున్నాయి. దానికి ప్రతిగా తెరాసను పొగుడుతూ టీడీపీని తిట్టే ఛానెళ్లను తేవడమొక్కటే మార్గమా! రెండూ సమర్థనీయం కాదు. ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాల నిర్మాణం. అందుకోసం ఏ కౌటిల్యానికయినా దిగజారడమే నేటి నీతి. రాజకీయం, పత్రికా రచన, విద్య వ్యాపారమైన తరువాత కులాల ప్రయోజనాల ఆధారంగా ప్రసార నేరా లు జరుగుతూ ఉంటే ఎవరు మాత్రం ఏ చేస్తారు?

2696

MADABHUSI SRIDHAR

Published: Tue,March 4, 2014 04:05 AM

నదులు-వివాదాలు

గంగా, యమున, కష్ణా, గోదావరి, కావేరి లాంటి జీవ నదులు దేశంలో వివిధ రాష్ర్టాల గుండా పయనిస్తూ ఎన్నో ఉపనదులను కలుపుకొని ఆయా పరివాహక ప్ర

Published: Tue,November 19, 2013 05:17 AM

భద్రత ముసుగులో దోపిడీకి లైసెన్స్!

ఏదో చేసి హైదరాబాద్ మీద పట్టు సంపాదించాలనే తపన, హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదనే దుర్బుద్ధి హైదరాబాద్‌లో ఉన్న భూస్వాములకే కాదు, మామూల

Published: Mon,June 30, 2014 07:18 PM

నష్టపోయిన ప్రాంతానికే పరిహారం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా నష్టపోయే రంగాలు రెండు. ఒకటి ప్రభుత్వోద్యోగాలు. రెండు సేద్యపు నీటి ప్రాజెక్టులు. విశాలాంధ్ర ఏర

Published: Mon,June 30, 2014 07:19 PM

పది జిల్లాల ప్రజలు పట్టరా?

తెలంగాణ ఏర్పాటును సమర్థించి, ‘తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకొమ్మని, ఏ నిర్ణయమైనా మేము అధిష్ఠానవర్గం అభీష్టానికి కట్టుబడి ఉంటామ’ని

Published: Tue,October 22, 2013 12:39 AM

రాజ్యాంగంపై సీమాంధ్ర నేతల రాజకీయం!

రాజ్యాంగంలో ఆర్టికల్ 371 డీ, అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడం అని రెండు కొమ్ములున్న సీమాంధ్ర రాజకీయ పొట్టేళ్లు కొండంత తెలంగాణను ఢీ కొ

Published: Tue,October 8, 2013 02:12 AM

హస్తినకు హైదరాబాద్‌ను కప్పంగా ఇస్తారా?

సీమాంధ్ర నాయకులు 1972లో ‘జై ఆంధ్రా’ అన్నపుడు వారి లక్ష్యం రాష్ట్ర విభజన అని పైకి కనిపిస్తుంది. కానీ దాని వెనుక దాగిన అసలైన దురాల

Published: Tue,October 1, 2013 02:19 AM

తెలంగాణపై చీకటి నింపే మాటలు

ఆంధ్రలో వెలుగులు చిమ్మడానికి తెలంగాణలో చీకట్లు కమ్ముకోవాల్సిందేనా? విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ వెలుగుల కోసం రాయలసీమ థర్మ

Published: Tue,September 24, 2013 12:47 AM

హైదరాబాద్‌పై పెత్తనం అక్రమాస్తుల రక్షణకే!

వాళ్లకు కావలసింది తెలంగాణతో కూడిన ఆంధ్రవూపదేశ్ సమైక్యత కాదు. తెలంగాణ లేని హైదరాబాద్. వారు తెలంగాణను సీమాంధ్రతో కలపాలనుకున్నది తె

Published: Fri,September 20, 2013 12:26 AM

నలభై వేల దౌర్జన్యానికి ఒక్క జవాబు జై తెలంగాణ

తెలంగాణ గుండె ధైర్యం, తెలంగాణ కమిట్‌మెంట్, తెలంగాణ పట్ల ప్రగాఢమైన అభిమానం అంటే ఏమిటో, ఇన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం వెనుక ఉన్న

Published: Tue,September 3, 2013 12:28 AM

బిల్లులో చిల్లులుంటాయి జాగ్రత్త!

జూన్ 4, 1969, హైదరాబాద్ విమానాక్షిశయం. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యమ నాయకులలో ఒకరి

Published: Tue,August 27, 2013 12:48 AM

తెలంగాణ ఆకాంక్షపై ఆంధ్రా ఎన్జీవోల అక్కసు

సమైక్యత అనేది ఒక ఖాళీ నినాదంగా మార్చి దేశ సమైక్యతకు, జాతి ఐక్యతకు, చివరకు ఆ పదానికి కూడా ముప్పు తెస్తున్నాయి దుర్మార్గ రాజకీయాలు.

Published: Tue,August 20, 2013 01:44 AM

ప్రదర్శన ఉద్యమం సమైక్యత కాదు

సమైక్యాంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మిగిలే ప్రాంతం. తెలంగాణ తో కూడిన ఆంధ్రవూపదేశ్ కాదు అనడానికి మరో నిదర్శనం సీమాంధ్ర

Published: Mon,August 12, 2013 11:50 PM

నష్టపరిహారం: ఎవరికి ఎవరు ఇవ్వాలి?

తెలంగాణను 1956కు ముందు హైదరాబాద్‌రాష్ట్రం అని పిలిచే వారు. దానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్నాటక జిల

Published: Tue,August 6, 2013 01:58 AM

హైదరాబాద్ కోరడం సీమాంధ్రుల దురాశే!

తెలంగాణ పట్ల వ్యతిరేకత తెలుపుతున్న వారంతా హైదరాబాద్ కోసమే. రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు, వాటి సీమాంధ్ర న

Published: Mon,July 29, 2013 10:51 PM

సీమను చీల్చి తెలంగాణను కూల్చే కుట్ర

ఇన్నాళ్లూ రాష్ట్ర విభజన అనగానే సమైక్యవాదం లేవనెత్తి అడ్డుకున్నసీమాంధ్ర రాజకీయ పెట్టుబడి దారులు ప్రస్తుతం తెలంగాణను నిలువరించడం కోస

Published: Tue,July 23, 2013 12:03 AM

ఆపడానికి, ఆలస్యానికి ఆరు కుట్రలు

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ క

Published: Tue,July 16, 2013 12:30 AM

ప్రజాచైతన్యమే తెలంగాణకు హై కమాండ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోస్తా, సీమ రాజకీయ నాయకులను మించి అడ్డెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే ఈ తెలంగాణ ద్వేష నాయకులకు తోడు

Published: Tue,July 9, 2013 12:55 AM

‘దిగ్విజయ’ సింగం తెలంగాణ

తెలంగాణ అనే నిప్పురవ్వతో రాజకీయ పార్టీలు మళ్లీ చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టులు చేసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే

Published: Tue,July 2, 2013 01:35 AM

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి..

వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసి

Published: Mon,June 24, 2013 11:23 PM

రాజ్యాంగ గాయాలకు పరిహారం లేదా?

చలో అసెంబ్లీని అన్నిరకాలుగా ఆపిన పోలీసులు ఉస్మానియా విద్యార్థులను అసెంబ్లీకి వెళ్లకుండా నిరోధించడానికి భీకర పోరాటం సాగించారు. బా