పడుతూలేస్తూ పాలమూరు ప్రాజెక్టులు


Sun,September 16, 2012 10:48 PM

సార్-మా పాలమూరు ప్రాజెక్టుల పరిస్థితేంది? వాటికి నీళ్ల కేటాయింపు ఉన్నదా? కరెంటున్నదా? పైసలున్నయా? అన్ని సక్రమంగా వుంటే మరి ఎందుకు పూర్తికావడం లేదు? ‘పాలమూరు ఎత్తిపోతల పథకం’ పండుకున్నదటగదా? అది వస్తదా, రాదా? ఇంకెన్నాళ్లు ఈ నిరీక్షణ?

-బెస్త రాములు, రౌతు నారాయణ, దేవరకర్ర, మహబూబ్‌నగర్


మీ ప్రశ్నలు ఎంతో విసిగి వేసారి, బేజారైన ఫలితంగా వేసినట్టుగానే కనిపిస్తున్నాయి. మీ బాధను అర్థం చేసుకోగలను. నిజానికి ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర ఏర్పాటు వల్ల అత్యధికంగా ‘కోల్పోయిన’ జిల్లా పాలమూరు. ఈ జిల్లా నూటికి నూరుపాళ్లు కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఉంది. మొత్తం కృష్ణా బేసిన్‌ను 12 సబ్ బేసిన్లుగా విభజిస్తే అందులో నాలుగు సబ్ బేసిన్లు ఈ జిల్లాలో ఉన్నాయి. K6 (లోయర్ భీమా) K 11(మూసీ) K8(తుంగభద్ర), K7 (లోయర్ కృష్ణా) సబ్ బేసిన్లు ఈ జిల్లాను కొంతమేరకు ఆక్రమించుకున్నాయి. డిండీ (దుందుభి), భీమా, తుంగభద్ర, ప్రధాన కృష్ణా నదులు ఈ జిల్లా నుంచే ప్రవహిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు ముంపు మూలంగా ఈ జిల్లా భారీగా నష్టపోయింది. హైదరాబాద్ ప్రభుత్వం రూపొందించిన తుంగభద్ర ఎడమగట్టు కాలువ పొడగింపు ప్రాజెక్టు, అప్పర్‌కృష్ణా కుడికాలువ పొడగింపు ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టులు ఆంధ్రవూపదేశ్ అవతరణ కారణంగా మహబూబ్‌నగర్ జిల్లా కోల్పోయి, ఫలితంగా174 టీఎంసీల కృష్ణా నికర జలాలు గ్రావిటీ మార్గంగా (ఎత్తిపోతలు కావు) కాలువల మార్గంగా అంది ఈ జిల్లా సస్యశ్యామలం అయ్యే అవకాశం చేజార్చుకుంది. Thanks to formation of A.P, బచావత్ ట్రిబ్యునల్ ఈ జిల్లాను అనుక్షిగహించి 17,84 టీఎంసీల వినియోగంతో జూరాల ప్రాజెక్టును ఆమోదించి ఉండకపోతే, ప్రాజెక్టు నిర్మాణానికి సీమాంధ్ర పాలకులు కలిగించిన అవరోధాలన్నిటినీ అధిగమించి, తెలంగాణ మంత్రులు పట్టుబట్టి ఉండకపోతే, ఈ ప్రాజెక్టు నిర్మించబడకుండా ఉండుంటే నేడు జిల్లా పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేదో ఊహించుకోవడానికే భయంగా ఉంది. ప్రభుత్వం వెలువరించిన తాజా సమాచారం ప్రకారం జూరాల, రాజోలిబండలు పూర్తిస్థాయిలో అంటే 1,02,200, 87,500 ఎకరాలు, వెరసి 1,89,700 ఎకరాలు సాగుచేసే సామర్థ్యం కల్పించామని, కోయిల్‌సాగర్, సరళాసాగర్ మధ్య తరహా ప్రాజెక్టుల ద్వారా మరో 16,186 ఎకరాలు సాగుచేసే సామర్థ్యం కల్పించామని, చిన్న నీటి పారుదల సౌకర్యాల ద్వారా 3,11,700 ఎకరాలకు సాగు వసతి కల్పించామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. అంటే ఈ జిల్లాలో సాగుకు యోగ్యమైన 34 లక్షల 92 వేల ఎకరాల క్షేత్రంలో 5,18,000 ఎకరాలు సాగునీటి వసతులు కలిగి ఉన్నాయని ప్రభుత్వం లెక్కలు కట్టింది.

ఆ లెక్కలు వాస్తవం అనుకున్నా కేవలం 11.37 శాతం క్షేత్రానికి సాగునీటి వసతి ఉందని అర్థం చేసుకోవాలి. నిజానికి సాగునీటి సామర్థ్యం కల్పించినంత మాత్రాన అన్ని ఎకరాలు నీళ్లు పొందుతున్నాయని కాదు. ఉదాహరణకు ‘రాజోలిబండ ద్వారా’ ఏనాడైనా ప్రభుత్వం 87,500 ఎకరాలకు నీరందించిదేమో గుండెపైన చేయి వేసుకుని చెప్పమనండి. వాళ్ల లెక్కల ప్రకారమే ముప్ఫై వేల ఎకరాలకు మించి ఆయకట్టు సాగవడం లేదు. ప్రభుత్వ లెక్కలు కేవలం గొప్పలు చెప్పుకోవడానికి, సీమాంధ్ర పాలకులు కేంద్రానికి తప్పుడు సమాచారం పంపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకులు సృష్టించడానికి తప్ప పనికిరావు. అన్నీ దొంగ లెక్కలు, అబద్ధాలు అని ఏ రైతును అడిగినా చెబుతాడు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ‘జలయజ్ఞం’ కార్యక్షికమం ద్వారా ఈ జిల్లాలో మరో 8,11,150 ఎకరాలకు నీటి వసతి కల్పిస్తామని, మరో 12 వేల ఎకరాలను స్థిరీకరిస్తామని ప్రకటించింది. వాటి గురించి తెలుసుకుందాం.

ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం భారీ ప్రాజెక్టులు మూడింటిని, ఒక మధ్య తరహా ప్రాజెక్టును ప్రభుత్వం తలపెట్టింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 3,40,000 ఎకరాలు, నెట్టంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా రెండు లక్షల ఎకరాలు, భీమా ఎత్తిపోతల పథకం ద్వారా రెండు లక్ష ల మూడు వేల ఎకరాలు వెరసి భారీ ప్రాజెక్టుల ద్వారా 7,43,000 ఎకరా లు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా (ఇది మధ్యతరహా ప్రాజెక్టు) 38,250 ఎకరాల కొత్త ఆయకట్టు సాగు, 12 వేల ఎకరాలు ఉన్న ఆయక ట్టు స్థిరీకరణ జరుగుతుందని ప్రకటించింది. మినీ ఎత్తిపోతల పథకాల ద్వారా 29,500 ఎకరాలకు సాగునీరందిస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా 8,11,150 ఎకరాల ఆయకట్టు కొత్తగా సాగులోకి వస్తుందని 12 వేల ఎకరాల స్థిరీకరణ జరుగుతుందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొత్త, పాత ప్రాజెక్టులు కలిపి 13 లక్షల 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందజేస్తాయి. ఇంత చేసినా మహబూబ్‌నగర్ జిల్లాలో సాగయ్యే క్షేత్రం 39 శాతం మించే అవకాశం లేదు. నేడు కృష్ణా జిల్లాలో సాగవుతున్న క్షేత్రం 55.28 శాతం, గుంటూరు లో 49.51 శాతం, పశ్చిమగోదావరిలో 52.51 శాతం ఉంది. జలయజ్ఞం తదనంతరం ఆ జిల్లాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఇప్పుడు నిర్మాణంలో ఆప్రాజెక్టుల పరిస్థితి ఏమిటో గమనిద్దాం.

నెట్టంపాడు
ఈ ప్రాజెక్టుకు నికర జలాల కేటాయింపు లేదు. కృష్ణా మిగులు జలాలలో 21.425 టీఎంసీలను ఈ ప్రాజెక్టుకు కేటాయించారు. జూరాల జలాశయం నుంచి నీటిని (మిగులు జలాలను) కుడిపక్కన ఉన్న ఎగువ ప్రాంతాలైన ధారూర్, గద్వాల, గట్టు, మల్దాకల్, లీజ, ఇటిక్యాల్, వడ్డేపల్లి మానవపాడు మండలాలలోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ఎత్తిపోతల ద్వారా అందించే ప్రతిపాదన ఉంది. ఎత్తిపోతలు రెండు దశలలో మొదటి లిఫ్ట్ 49 మీటర్లు, రెండవ లిఫ్ట్ 63 మీటర్లు కాగా మొత్తం 119 మెగావాట్ల విద్యుత్తు ను ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు కోసం 23,969 ఎకరాల భూసేకరణ కావలసి ఉండగా 19,963 ఎకరాలు ఇప్పటికే సేకరించా రు. 2010 డిసెంబర్ 20 నాటికి 1305 కోట్ల రూపాయలు వెచ్చించారు.

ఈ ప్రాజెక్టుకు 1428 కోట్ల రూపాయల వ్యయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వచ్చే సంవత్సరం అంటే 2012-13లో ప్రాజెక్టు పూర్తవుతుందని ప్రభుత్వం చెబుతోంది.తాజా సమాచారం: 10-9-2012 నాడు నెట్టంపాడు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించి మొదటి మోటర్ ద్వారా (మొత్తం నాలుగు మోటార్లు) 750 క్యూసెక్కుల కృష్ణా జలాలను ఎత్తి గుడ్డెందొడ్డి జలాశయానికి చేర్చినట్టు తెలిసింది. గుడ్డెందొడ్డి జలాశయపు సామర్థ్యం 1.20 టీఎంసీలు. ఆరు టీఎంసీల నీటిని ఉపయోగించుకుని మొదటి దశలో 63 వేల ఎకరాలకు నీరు అందజేయడం జరుగుతుంది.

భీమా ఎత్తిపోతల పథకం
ఈ పథకానికి 20 టీఎంసీల కృష్ణా నికర జలాల కేటాయింపు ఉంది. ఇది కూడా ఎత్తిపోతల పథకమే. జూరాల జలాశయం తీర ప్రాంతం నుంచి పంచదేవపాడు గ్రామం దగ్గర 11 టీఎంసీల నీటిని 45 మీటర్లు ఎత్తి అక్కడి నుంచి ఏడు టీఎంసీల నీటిని బుద్‌పూర్ బ్యాలెన్సింగ్ జలాశయానికి చేరుస్తారు. ఆ నీరు 46,800 ఎకరాల సాగుకు వినియోగమవుతుంది. మిగిలిన నాలుగు టీఎంసీల నీటిని మరో 22 మీటర్లు ఎత్తి సంగంబండ జలాశయానికి చేరుస్తారు. సంగంబండ లోలెవల్, హైలెవల్ కాలువల ద్వారా 64,200 ఎకరాలను సాగు చేస్తారు. వెరసి 1,11,000 ఎకరాలకు ఈ స్కీం ఉపయోగపడుతుంది. ఇదంతా భీమా లిఫ్ట్ ఒకటికి సంబంధించిన వివరాలు.ఇక భీమా లిఫ్ట్ విషయానికి వస్తే జూరాల నుంచి సమాంతర కాలువ ద్వారా తొమ్మిది టీఎంసీల నీటిని రామన్‌పాడు జలాశయానికి తరలిస్తారు. రామన్‌పాడు జలాశయం నుంచి ఈ నీటిని ముందస్తు 38 మీటర్లు ఎత్తి అక్కడి నుంచి కొంత నీటిని ఏనుకుంట బ్యాలెన్సింగ్ జలాశయానికి చేరుస్తారు. ఆ జలాశయం నుంచి 14 వేల ఎకరాలకు నీరందిస్తారు.

ఏనుకుంట జలాశయం నుంచి మిగిలిన నీరు రంగ సముద్రం బ్యాలెన్సింగ్ జలాశయం చేరి 21 వేల ఎకరాల సాగుకు ఉపయోగపడుతుంది. ఇది ఒక భాగం. ఏనుకుంట జలాశయానికి తరలించే నీరే కాక రామన్‌పాడు జలాశయం నుంచి ఎత్తిన నీటిలో శేష భాగాన్ని స్టేజీ 2 పంపింగ్ ద్వారా మరో 22 మీటర్లు ఎత్తి శంకర సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేరుస్తారు. ఈ నీరు 57 వేల ఎకరాల సాగుకు ఉపయోగపడుతుంది. ఇదంతా భీమా లిఫ్ట్ 2 వ్యవహారం. భీమా లిఫ్ట్ 2 ద్వారా 92 వేల ఎకరాలు సాగుకు వస్తుంది. మొత్తం రెండు లిఫ్ట్‌లలో ఐదు బ్యాలెన్సింగ్ జలాశయం మద్దతుతో, నాలుగు పంపింగ్ స్టేషన్ల సాయంతో కృష్ణా జలాలు 2,03,000 ఎకరాల మిట్ట పొలాలకు చేరుతాయి. 2,158 కోట్ల రూపాయల ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టుపైన ఇప్పటిదాకా 1644 కోట్లు ఖర్చయింది.తాజా సమాచారం: ఇటీవలే లిఫ్ట్ 2లోని స్టేజి 2 పంపును విజయవంతగా ట్రయల్ రన్ చేశారు.

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం
ఈ పథకం కోసం కృష్ణా మిగులు జలాలలో 25 టీఎంసీలను కేటాయించారు. 244 మీటర్లస్థాయి నుంచి 502 మీటర్లస్థాయి వరకు మూడు దశల లో కృష్ణా జలాలను ఎత్తడం జరుగుతుంది. శ్రీశైలం జలాశయం బ్యాక్‌వాటర్‌ను రేగుమాన్‌గడ్డ నుంచి తరలించి ఎల్లూరు, సింగోటం, జొన్నలగడ్డ, గుడిపల్లి గట్టు బ్యాలెన్సింగ్ జలాశయాలను ఉపయోగించుకుంటూ 3,40,000 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పిస్తారు. మొదటి లిఫ్ట్‌లో ఎల్లూరు జలాశయానికి 95 మీటర్లు ఎత్తి నాలుగు వేల క్యూసెక్కుల నీటిని చేరుస్తారు. 13 వేల ఎకరాల సాగు ఎల్లూరు నుంచి జరుగుతుంది. అక్కడి నుంచి నీరు సింగోటం చేరుతుంది. అక్కడ రెండో లిఫ్ట్ ద్వారా 86 మీటర్లు ఎత్తి నీటిని జొన్నలబొగడ జలాశయం చేరుస్తారు. ఆ జలాశయం మరో 43,200 ఎకరాలకు సేద్యం కల్పిస్తుంది. మిగిలిన నీటిని (3250 క్యూసెక్కులను) 117 మీటర్లు ఎత్తి గుడిపల్లి గట్టు జలాశయం చేరుస్తారు. 2,83,800 ఎకరాలు అంటే అత్యధిక భాగం ఈ జలాశయం నుంచే సాగవుతుంది.
ఇటీవలే ఎల్లూరు పంపింగ్‌ను విజయవంతంగా ట్రయల్ రన్ చేసి నిర్వహించడం జరిగింది. 2990 కోట్ల రూపాయల శాసనాపరమైన ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టుపైన ఇప్పటి వరకు 2072 కోట్ల రూపాయలు ఖర్చయినట్టు సమాచారం.

కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం
ఇది హైదరాబాద్ ప్రభుత్వం 1955లో నిర్మించిన ప్రాజెక్టు. 12 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించవలసిన ప్రాజక్టు కొన్నేళ్లుగా 4,500 ఎకరాలకన్నా ఎక్కువ నీరందించలేకపోతోంది. ఈ పాత ఆయకట్టును స్థిరీకరించి అదనంగా మరో 38,250 ఎకరాలకు నీరందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని 359 కోట్ల రూపాయల వ్యయంతో తలపెట్టడం జరిగింది. జూరాల నుంచి కృష్ణా ట్రిబ్యునల్ అనుమతించిన 3.90 టీఎంసీల నీటిని 118 మీటర్లు ఎత్తి రెండు లిఫ్ట్‌ల సాయంతో మార్గమధ్యలో పర్దీపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను ఉపయోగించుకుంటూ అంతిమంగా నీరు కోయిల్‌సాగర్ చేరి నిర్ధారిత ఆయకట్టుకు నీరందించాలన్నది లక్ష్యం. ఈ ప్రాజెక్టుపైన ఇప్పటి వరకు 280 కోట్లు ఖర్చయింది.

ప్రభుత్వం తలపెట్టిన ఈ నాలుగు ప్రాజెక్టులు పడుతూ లేస్తూ నడుస్తున్న యి. డబ్బు రూపేణ ప్రగతి కనిపిస్తున్నా, కొన్నిచోట్ల కాలువ పనులు పూర్తికాక, మరికొన్ని చోట్ల విద్యుత్ స్టేషన్లు పూర్తికాక, మరికొన్ని సందర్భాల్లో కాంట్రాక్టర్లు సమస్యలు సృష్టిస్తూ పనులలో తీవ్రమైన జాప్యం కలుగుతోం ది. 2009 వరకే ఈ ప్రాజెక్టులు పూర్తి కాగలవని భావించినా, మరో రెండేళ్లలో అయినా పూర్తయితే పాలమూరు ప్రజలు అదృష్టవంతులే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ‘భూసేకరణ’ సమస్య అన్ని ప్రాజెక్టులలో తీవ్రంగా బాధిస్తోంది. ప్రభుత్వం కాస్త ఉదారనీతి అవలంబిస్తే తప్ప ఈ సమస్య తెగ దు. ఇకపోతే ఈ నాలుగు పథకాలకు కలిపి 700 మెగావాట్ల విద్యుత్తు అవసరం. దీని కోసం ప్రత్యేకంగా ఒక విద్యుత్ కేంద్రాన్ని పాలమూరు-రంగాడ్డి ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయవలసి ఉంటుంది.

వలస జిల్లాగా పేరొందిన పాలమూరు జిల్లాకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం రిటైర్డ్ తెలంగాణ ఇంజనీర్లు పాలమూరు జిల్లాలోని ఏడు లక్షల ఎకరాలు, రంగాడ్డి జిల్లాలోని 2.70 లక్షల ఎకరాలు, నల్లగొండ జిల్లాలోని 30 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశ్యంతో ఈ బృహత్ పథకాన్ని రూపొందించారు. 70 టీఎంసీల వరద నీటిని జూరాల నుంచి 35 రోజుల పాటు రోజుకు రెండు టీఎంసీల చొప్పున ఈ స్కీం ఉపయోగించుకుంటుంది. నాలుగు లిఫ్ట్‌లలో ఈ పథకం 310 మీటర్ల స్థాయి నుంచి 675 మీటర్లస్థాయికి నీటిని చేరుస్తుంది. ఈ పథకంపైన 9000 కోట్ల రూపాయలు కనుక వెంటనే దీన్ని చేపట్టవలసిందిగా ఇంజనీర్లు, పాలమూరు, రంగాడ్డి జిల్లా ప్రజావూపతినిధులు ప్రభుత్వానికి అనేకమార్లు విన్నవించుకున్నారు.

తాజా సమాచారం
గత ప్రభుత్వం దీన్ని పక్కనపెట్టింది. కిరణ్‌కుమార్‌డ్డి దీన్ని ఇన్వెస్టిగేట్ చేయించడానికి అంగీకరించారు. అయితే దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వనట్టుగా మధ్యలో అధికారులు ఏవో సాకులు చెప్పుతూ అడ్డుచెప్పుతున్నారు. వైఎస్‌ఆర్ హయాంలో ఎలాంటి అధ్యయనాలు లేకుండా గంటల వ్యవధిలో సీమాంధ్ర ప్రాజెక్టులకు జీవోలు జారీచేసిన ఈ పెద్దమనుషులే తెలంగాణ ప్రాజెక్టుల విషయానికి వచ్చేటప్పటికి ‘అవార్డులు’, ‘రూల్స్’ వల్లిస్తున్నారు.

అంతేమరి-రౌతు మెత్తనవుతే ‘గుర్రం’ ఏం చేస్తుందో చెప్పనక్కర్లేదు. ప్రతి విషయానికి పోరాడి సాధించుకోక తప్పని పరిస్థితి. ముఖ్యమంత్రి ఈ నెల 14-16 వరకు మూడు రోజుల పాటు జిల్లాలో చేపట్టిన ఇందిరమ్మబాట సందర్భంగా కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, విద్యుత్ కేంద్రా ల ట్రయల్ రన్‌ను అధికారికంగా నిర్వహించారు. కానీ పాలమూరు-రంగాడ్డి జిల్లా ప్రజల అభీష్టం నెరవేర్చే ‘పాలమూరు-రంగాడ్డి’ ఎత్తిపోతల పథకం ప్రస్తావన మాత్రం తేలేదు. ఎమ్మెల్యేలు, ఇంజనీర్లు, ప్రజాసంఘాలు ఏక కంఠంతో ఈ ప్రాజెక్టు కావాలని కోరినా, మహబూబ్‌నగర్ జిల్లా మంత్రి ఎంతో పట్టుబట్టినా ముఖ్యమంత్రి కావాలనే ప్రకటన చేయకపోవడం, తెలంగాణ పట్ల దారుణ వివక్ష తప్ప మరోలా అనిపించడం లేదు.

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్
[email protected]

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర