బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం


Mon,September 24, 2012 12:36 AM


బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర్థం కావడం లేదు. కట్తున్నప్పుడు మనవాళ్లు నిద్రపోయారా? సుప్రీంకోర్టులో ఇప్పుడు రెండు రాష్ట్రాలు దెబ్బలాడుకుంటే ఏం లాభం? జరిగిన నష్టం తెలంగాణకు కదా? పూర్తి వివరాలు చెప్పండి- నష్టం జరగకుండా ఉపాయమేదైనా ఉందా?

-కంతుల శ్రీరాంకుమార్, బేగంబజార్, హైదరాబాద్


మీరన్నది నూటికి నూరుపాళ్లు నిజం. జరిగే నష్టం తెలంగాణకు. ప్రాజెక్టు సాంక్షన్ అయినప్పుడు, టెండర్లు పిలిచినప్పుడు భూమి పూజ చేసినప్పుడు, పని మొదలయినప్పుడు మనకు ఎలాంటి సమాచారం లేదు. ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నలోపం వల్ల చాలా అలస్యంగా ఈ సమాచారం ప్రభుత్వ దృష్టికి వచ్చింది. అది ప్రజలు, విపక్షపార్టీలు, పత్రికలు మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అక్రమ నిరాణాన్ని బయటపెట్టబట్టి. అంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోయినట్టే. ఇక విషయానికి వస్తే- మహారాష్ట్ర ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వాలు 6-10-1975 నాడు ఒక ఒప్పదం చేసుకున్నాయి. దాని ప్రకారం ప్రధాన గోదావరి నదిపైన పైథాన్ డ్యాంసైట్ నుంచి, పూర్ణా ఉపనదిపై సిద్దేశ్వరం డ్యాం సైట్ నుంచి, అట్లాగే మంజీరా ఉపనదిపైన నిజాంసాగర్ డ్యాం సైట్ నుంచి గోదావరిపైన ఉన్న ప్రతిపాదిత పోచంపాడు డ్యాం సైట్ వరకు గోదావరి బేసిన్‌లోని జలాల్లో 60 టీఎంసీల నీరు మించకుండా కొత్త ప్రాజెక్టులకు మహారాష్ట్ర వినియోగించుకోవచ్చు. అప్పటికే సాంక్షన్ అయిన, ఆమోదం పొందిన వినియోగానికి ఆది అదనం. పోచంపాడు డ్యాంసైట్, దాకా లభించే మిగతా నీటిని ఆంధ్రవూపదేశ్ వాడుకోవచ్చు. ఇది ముఖ్యమైన ఒప్పందంలోని భాగం. రెండవ భాగమేమంటే పోచంపాడును 1091 అడుగుల పూర్తి జలస్థాయి, 1093 అడుగుల జలస్థాయిలో నిర్మించుకోవచ్చు. పోచంపాడు వల్ల మహారాష్ట్రలో మునిగే భూములు, కట్టడాలకు నష్ట్రపరిహారంతోపాటు నిరాక్షిశయులయ్యేవారికి పునరావాసంకోసం అయ్యే ఖర్చును ఆంధ్రవూపదేశ్ భరిస్తున్నది. ప్రాజెక్టు మూలంగా నదీవూపాంతాల ముం పును మహారాష్ట్ర అంగీకరిస్తున్నది. ఒప్పందం ప్రకారంగానే పోచంపాడు నిర్మాణమైనది. మహారాష్ట్రలో ముంపుకు గురైన కట్టడాల నిర్మాణం కోసం 6 కోట్ల రూపాయలను మహారాష్ట్రకు చెల్లించడం జరిగింది. డ్యాంవల్ల ఎలాంటి భూములు మునగలేదని కూడా సమాచారం. ఇంత వరకు బాగానే ఉన్నది. ఒప్పందంలోని మొదటిభాగం ప్రకారం కొత్త ప్రాజెక్టులకు 60 టీఎంసీల దాక పోచంపాడు డ్యాం సైట్ వరకు మహారాష్ట్ర ఉపయోగించుకోవచ్చునని ఒప్పందంలో ఉందికదా అని, ఏకంగా పోచంపాడు జలాశయం పరిధిలోనే మహారాష్ట్ర బాబ్లీ నిర్మా ణం చేపట్టింది. ఇక్కడ మరో విషయం అర్థం చేసుకోవాలి. పోచంపాడు (శ్రీరాంసాగర్) జలాశయం పరిధి మహారాష్ట్రలో 55 కిలోమీటర్ల దూరం వరకు పరచుకుని ఉన్నది.బాబ్లీ ప్రాజెక్టును మహారాష్ట్ర ఆంధ్ర సరిహద్దు (బాసర)కు 10 కిలోమీటర్ల ఎగువన తన భూభాగంలోనే నిర్మించుకుంటున్నది. అయితే భూభాగం మహారాష్ట్రదే కాని,ఆ భూభాగం శ్రీరాంసాగర్ జలాశయ పరిధి కిందకు వస్తుంది. అంటే మరో మాటలో చెప్పాలంటే మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు మన జలపరిధిని ఆక్రమించుకున్నది. కాని ఆ నదీ భాగంపైన శ్రీరాంసాగర్ జలాశయం ఏర్పాటుకు మహారాష్ట్ర సమ్మతించింది. కనుక బాబ్లీ ప్రాజెక్టు కట్తున్నది.

ఆంధ్రవూపదేశ్ శ్రీరాంసాగర్ జలాశయ పరిధిలోనే ఇట్లా ఒక రిజర్వాయర్ పరిధిలో మరో డ్యాంను కట్టడం ప్రపంచంలో ఎక్కడా జరిగినట్టులేదు. బహుశా ఇదే ప్రథమం కనుకనే ఇది అక్రమమని దీన్ని అపవలసిందిగా మన ప్రభుత్వం మహారాష్ట్రను, కేంద్రాన్ని అనేక సార్లు విన్నవించుకున్నది విజ్ఞప్తులు చేసింది. ఫలితం లేకపోగా సుప్రీంకోర్టుకు 2005లో ఫిర్యాదు చేసింది. ఆరేళ్లకు పైగా సుప్రీంకోర్టులో ఈకేసు సాగుతోంది. బహుశా ఈ ఏడాది ము గింపులోగా తుది పరిష్కారం వస్తుందని ఆశించవచ్చు.సరే అక్రమంగా కట్తున్నారు. దీనివల్ల జరిగే నష్టమేమిటో తెలుసుకుం దాం. పటంలో చూపెట్టినట్టుగా శ్రీరాంసాగర్ జలాశయం నీటి పరిధిలో ఒక త్రిభుజం లాంటి ప్రిజం, బాబ్లీ జలాశయపు ప్రిజం ఉమ్మడిగానే ఉంటుంది. బాబ్లీ బ్యారేజీ దగ్గర నది అడుగు 1070 అడుగులు. 1071 అడుగుల దాక ఒక అడుగు మేరకు రాతి కట్టడం, ఆపైన గేట్లు. ఆగేట్లు బాబ్లీ జలాశయపు పూర్తిస్థాయి 1109 అడుగుల దాక 38 అడుగుల ఎత్తు. గేట్లు తెరిస్తే 1071 అడుగుల నుంచి 1091 అడుగుల దాక ఏర్పడే బాబ్లీ జలాశయం శ్రీరాంసాగర్ జలాశయంలోని భాగమే. బాబ్లీ గేట్లు దించారనుకోండి-1109 అడుగుల నుంచి, 1071 అడుగుల వరకున్న నీటి నిలువ 2.74 టీఎంసీలు మాత్రమే. అందులో 1071నుంచి 1091 అడుగుల దాక ఉన్ననీటి పరిమాణం ఇంకా చాలా తక్కువ. 0.65 టీఎంసీలు మాత్రమే. వచ్చిన చిక్కెల్లా ఏమిటంటే.. 1091 అడుగులపైన బాబ్లీ జలాశయం నీటిపైన మనకెలాంటి పేచీ లేదు. 1091 అడుగుల కింద గేట్ల మూసి వేస్తే శ్రీరాంసాగర్ జలాశయం నీరు 0.65 టీఎంసీలు, గేటు తెరిస్తే శ్రీరాంసాగర్ జలాశయంలో 1091 నుంచి 1071 అడుగుల మేర (20 అడుగుల రౌండ్‌లో) 65 టీఎంసీల నీరుంటుంది. కాబట్టి ఆ నీటిని ఎంతైనా లాగేసే అవకాశం బాబ్లీ కున్నది. అట్టే చూడ్డానికి పిట్ట కొంచెమే కానీ, కూత ఘనమన్నట్టుగా మహారాష్ట్ర వాదిస్తున్నట్టు ‘ఇది తాగునీటి ప్రాజెక్టు. మేం పంపుల ద్వారా జలాశయం నీటిని మొత్తం వాడుకునేదే 2.74 టీఎంసీలు, అందులో శ్రీరాంసాగర్‌కు చెందిన నీరు 0.65 టీఎంసీలే, కావాలంటే ఆమాత్రం నీటిని తిరిగి వాపసు చేస్తాం. ఆంధ్రవూపదేశ్ భయపడ్తున్నట్టు మేం ఎక్కువ నీటి వాడుకునే అవకాశం లేదు. కావాలంటే అక్టోబర్ తర్వాత గేట్లు వేసే ఉంచుతాం. కనుక శ్రీరాంసాగర్ నీరు వాడుకోం’ వంటి మాటలతో హమీలు ఇప్పటి నేపథ్యంలో నమ్మదగినట్టు లేదు. అసలు బాబ్లీ ప్రాజెక్టును శ్రీరాంసాగర్ జలాశయం పరిధిలో నిర్మించడమే నేరం. అక్రమం. అందులో 65 టీఎంసీల లాగే అవకాశమున్న రీతిలో గేట్లు అమర్చడం మరో అపరాధం.

ఇది ఒక సమస్య అయితే మరో సాంకేతిక సమస్య ఏమిటంటే.. ఒప్పందం ప్రకారం మహారాష్ట్ర కొత్త ప్రాజెక్టుల కోసం 60 టీఎంసీల వరకే ఉపయోగించుకోవచ్చు. మహారాష్ట్ర ఇది వరకే ఆ నీటిని ఉపయోగించుకున్నదని, ఇప్పుడు బాబ్లీకి అదనంగా మరో పదకొండు బ్యారేజీల నిర్మాణం కొనసాగిస్తున్నదని, ఇంకా రెండు బ్యారేజీలను మరో రెండు కేటీ వియర్లను ప్రతిపాదిస్తున్నదని, అవన్నీ కలిపి 14.036 టీఎంసీల అదనపు వినియోగముంటుందని ఆంధ్రవూపదేశ్ ఆరోపిస్తున్నది. ఇదిలా ఉంటే ఒప్పందం నాటి కి పాత ప్రాజెక్టుల వాడకం19 టీఎంసీలే అని మహారాష్ట్ర స్వయంగా ట్రిబ్యూనల్ ఎదుట రాసిచ్చింది కనుక దానికే కట్టుబడి ఉండాలని మనమంటున్నం. పాత ప్రాజెక్టుల వినియోగం 42 టీఎంసీలేనని మహారాష్ట్ర వాదిస్తున్నది. అంటే మరో 23 టీఎంసీల అదనపు జలాలను మహారాష్ట్ర పాత ప్రాజెక్టుల పేరుతో, 14 టీఎంసీలను అదనపు జలాల పేరుతో మహారాష్ట్ర వాడుకో చూస్తుందని అర్థం అవుతుంది. దీనివల్ల శ్రీరాంసాగర్‌కు వచ్చే నీటి పరిమాణం భారీగా తగ్గుతుందని మనం ఆందోళన చెందుతున్నాం. ఎలాగు బాబ్లీ ప్రాజెక్టును శ్రీరాంసాగర్ జలాశయం పరిధిలో నిర్మించడం వల్ల 65 టీఎంసీల దాకా వెనక్కిలాగే ప్రమాదం ఉండనే ఉన్నది. అంటే వచ్చే నీళ్లు 37 టీఎంసీలు (23+14) తగ్గటమేకాక, ఉన్న నీళ్లలో 65 టీఎంసీల దాక దొంగిలించే అవకాశమున్నది. కాబట్టే మనం ఇంత హైరానా పడుతున్నామన్నమాట.

ఇకపోతే విపక్షాలు బాబ్లీపైన ఎంత గందరగోళం చేసినా, ప్రభుత్వం ఎన్ని మీటింగులు పెట్టినా, కేంద్రం ఎంత ప్రయత్నించినా ఇంతమటుకు మహారాష్ట్ర ఏమాత్రం సానుకులంగా స్పందించలేదు. నిర్మాణం పూర్తి చేసింది. గేట్లు అమర్చింది. గేట్లు ఆపరేట్ మాత్రం చేయడంలేదు. కారణం- సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి. ఇక సుప్రీంకోర్టులో జరుగుతున్న బాగోతం చూద్దాం...తొలుత నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ సుప్రీంకోర్టులో రిట్.నెం. 134(2006లో)దాఖలు చేశారు. 10-4-2006 నాడే అది విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు స్పందించి- ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది. ఆ ప్రయత్నం విఫలం కావడంతో ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం 3-7-2006న సూట్ దాఖలు చేసింది. మహారాష్ట్ర బ్యారేజీని అక్రమంగా నిర్మిస్తూ గోదావరి ట్రిబ్యూనల్ తీర్పును ఉల్లంఘించింది కాబట్టి, వెంటనే నిర్మాణం ఆపు చేయవలసిందని విజ్ఞప్తి చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం ‘అసలు తాము నిర్మిస్తున్న బ్యారేజీ మూలంగా ఎలాంటి ఉల్లంఘన చోటు చేసుకోలేదని, ఆంధ్రవూపదేశ్ ఫిర్యాదు జలవివాదం కోవలోకి వస్తుంది కాబట్టి దాన్ని విచారించే అధికారం సుప్రీంకోర్టుకు లేదని, దానికోసం కేంద్రం ట్రిబ్యూనల్ ఏర్పాటు చేయాల’ని, సమస్యను సుప్రీంకోర్టు పరిధిలోంచి తప్పించే యత్నం కొనసాగించింది. అయితే.. అదృష్టవశాత్తూ సుప్రీంకోర్టు మహారాష్ట్ర వాదనతో అంగీకరించలేదు. ఈలోగా మధుయాష్కీకి తోడు వినోద్‌కుమార్, ఎర్రబెల్లి దయాకర్‌రావు విడివిడిగా దాఖలు చేసిన రిట్‌పిటిషన్లు కూడా సుప్రీంకోర్టు పరిశీలనలోకి వచ్చాయి. ఒక దశలో మనరాష్ట్రం తరఫున వాదిస్తున్న పరాశరన్ చాలా వింతగా ప్రవిర్తించడం మొదలు పెట్టాడు. మహారాష్ట్ర తరఫున వాదిస్తున్న ఆంధ్యార్జన వాదనలతో సమర్థంగా ఢీ కొట్టడానికి బదులు యూటర్న్ తీసుకొని ఈ సమస్య మహారాష్ట్ర, ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం అంతర్‌రాష్ట్ర జల వివాదచట్టం-1956 క్రింద పరిష్కరించుకోవాలి. ఇందు లో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం ఉండకూడదు, కనుక మధుయాష్కీ, వినోద్‌కుమార్, ఎర్రబెల్లి కోర్టుకు సమర్పించిన రిట్ పిటిషన్లను కొట్టి పారేయండని వింతగా వాదించడం మొదలు పెట్టాడు. ఈ వాదనతో ఆశ్చర్యపోయిన సుప్రీంకోర్టు న్యాయవాదులు అసలు మీరు ఆంధ్రవూపదేశ్ తరఫున వాదిస్తున్నారా? మీ కేసుకు మద్దతుగా ఆ ముగ్గురు ఎంపీల దరఖాస్తులను కొట్టేయండని కోరడంలో మతలబేంటి? మీరు ప్రస్తావిస్తున్నట్లు ఈ సమస్య అంతపూరాష్ట్ర జలవివాద చట్టం పరిధి కిందకు వస్తే మేం చేసిందేమీ లేదు. లేదా ట్రిబ్యూనల్‌కు వెళ్లి పరిష్కరించుకొమ్మని చెప్తాం. ఇది మీకు సమ్మతమేనా ఆలోచించుకోమని మందలించడం జరిగింది. దీంతో మళ్లీ మన లాయర్ తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. పరాశరన్ ఒకప్పు డు దిట్టేమో గానీ ఇప్పుడు వయస్సు మీద బడటం వల్ల కావొచ్చు, ఆయన చేసే వాదనలు అస్పష్టంగా, అసంబద్దంగా, బలహీనంగా, ఆంధ్యార్జున వాదనల ముందు వీగిపోయేట్టు ఉన్నాయి. ఈ విషయాన్ని రాజశేఖర్‌డ్డి దృష్టికి తేవడం జరిగింది. కానీ పరిస్థితిలో మార్పులేదు. ఈ ప్రభుత్వం కూడా ఆయన్నే కొనసాగిస్తోంది.

ఏదేమైనా 26-4-2007 నాడు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అయితే గేట్లను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా అమర్చకూడదు. తన సొంత బాధ్యతపైన నిర్మాణం కొనసాగించేందుకు అనుమతి ఇవ్వడమైంది కాబట్టి, ఈ నిర్మాణానికి సంబంధించిన ఎలాంటి నష్ట పరిహారాన్ని (మును ముందు) రాష్ట్రం కోరకూడదు. మధ్యంతర ఉత్తర్వులను కూడా తోసిరాజని మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ నిర్మాణం చేపట్టి గేట్లు నిర్మించి, వాటిని అమర్చింది. సుప్రీంకోర్టులో కేవలం ట్రయల్న్ చేస్తున్నామని బుకాయించింది. ఇప్పుడు గేట్లు అమర్చి బటన్ నొక్కితే ఆపరేట్ కావడానికి సిద్ధంగా ఉన్నది ప్రాజెక్టు. ఎట్లాగూ గేట్లు అమర్చాం కాబట్టి ‘FAIT ACCOMPLI’ ప్రాతిపదికన తమ ప్రాజెక్టు నిర్వహణకు అనుమతివ్వాల్సిందిగా సుప్రీంకోర్టును ప్రాధేయపడుతున్నది మహారాష్ట్ర. అసలు ఇది జలవివాదమా లేక గోదావరి ట్రిబ్యూనల్ తీర్పు ఉల్లంఘనా? ఒప్పందం ప్రకారం నష్టపరిహారం స్వీకరించాక శ్రీరాంసాగర్ జలాశయం పరిధిలో బాబ్లీ నిర్మించడం చట్టసమ్మతమా? ఈ సమస్య పరిష్కారం ఎలా? ఇలాంటి న్యాయ చట్ట, సాంకేతిక సమస్యలకు తుది పరిష్కారం కనుగొనే ప్రయత్నంలో సుప్రీంకోర్టు అక్టోబర్‌లో నిరవధికంగా విచారణ ప్రక్రియ కొనసాగించి తీర్పు ఇచ్చే అవకాశమున్నది. ఏదేమైనా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు , దానిపైన ఆధారపడ్డ తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ , వరంగల్, ఖమ్మం, నల్లగొండ రైతుల, ప్రజల భవిష్యత్తు సుప్రీం కోర్టు తీర్పుపైనే ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇంత జరుగుతున్నా బాబ్లీ విషయంలో ఏనాడూ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించదు. పోలవరం కేసు సుప్రీంకోర్టులో విచారణకు వస్తే మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, లాయర్లతో కళకళలాడుతుంది కోర్టు ప్రాంగణం. అదే బాబ్లీ కేసు విచారణ జరుగుతుంటే మొక్కుబడిగా అధికారులు, లాయర్లు తప్ప ఏనాడూ మంత్రి పుంగవులు అధికార పక్ష ప్రతినిధులు పట్టించుకోలేదు. పాపం ప్రతిపక్ష నాయకులు వినోద్‌కుమార్, దయాకర్‌రావు మాత్రం హాజరవుతారు. యాష్కీ ఒక్కరే అధికా పక్ష మనుకుంటే అయన మినహాయింపు. అందుకే పోలవరం కేసు వైష్ణవాలయమవుతే, బాబ్లీ శివాలయమని అక్కడి లాయర్లే చెప్పుకుంటారు. ఇక తెలంగాణకు నష్టం జరుగకుండా ఉండాలంటే ..1.మహారాష్ట్ర ట్రిబ్యూనల్ కేటాయించిన నీటికన్న ఎక్కువ మోతాదులో నీరు వాడుకోకుండా కేంద్రం అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి దానికి చట్టపరమైన శక్తిని ఇవ్వాలి. 2. ఎలాగూ బాబ్లీని కట్టారు కాబట్టి దాన్ని కూలగొట్ట మనడం భావ్యం కాదు. కానీ దానివల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ క్రింది చర్యలు తీసుకోవాలి. ఎ) శ్రీరాంసాగర్ పూర్తి జలస్థాయి 1091 అడుగులకు దిగువ బాబ్లీ అడుగు 1071కు పైన ఉన్న శ్రీరాంసాగర్ నీరు బాబ్లీలోకి ప్రవహించకుండా గేట్లను శాశ్వతంగా మూసేయడమో, లేక రాతి కట్టడం నిర్మించడమో చేయాలి. బి) బాబ్లీ మూలంగా శ్రీరాంసాగర్ జలాశయంలోకి రాకుండా ఆగిపోయిన నీటిని అంచనా వేసి ఆ నీటి పరిమాణాన్ని బాబ్లీనుంచి శ్రీరాంసాగర్‌లోకి వదిలే ఏర్పాటు చేయాలి. మరి- సువూపీంకోర్టు తెలంగాణకు నష్టం కలగకుండా పైన చెప్పిన విధంగా తీర్పు ఇస్తుందా! మరోలా ఇస్తుందా? వేచి చూడవలసిందే!

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్
[email protected]


35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Sun,September 16, 2012 10:48 PM

పడుతూలేస్తూ పాలమూరు ప్రాజెక్టులు

సార్-మా పాలమూరు ప్రాజెక్టుల పరిస్థితేంది? వాటికి నీళ్ల కేటాయింపు ఉన్నదా? కరెంటున్నదా? పైసలున్నయా? అన్ని సక్రమంగా వుంటే మరి ఎందుకు

Featured Articles