న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు


Mon,October 1, 2012 01:12 AM

Almattiఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్‌గఢ్ అడ్డుకోబట్టే ‘పోలవరం’ నిర్మాణం ముందుకు సాగడంలేదని అంటూ ఇక తెలంగాణ ఏర్పడితే సీమాంధ్ర ఎడారి అవుతుందన్నాడు. మీ కామెంట్?:-దేశరాజు అరుణవూపభ, కొత్తఢిల్లీ
సమైక్యాంధ్ర విద్యార్థి ఒక్కడే కాదు, సీమాంధ్ర నాయకులు, రైతులు చాలా మటుకు ఇదేపాట పాడుతున్నారు. తెలంగాణను ఏవిధంగా అడ్డుకోవాలన్నదే వాళ్ల లక్ష్యం. తెలంగాణ ఏర్పడితే మాకు నీళ్లురావని ప్రచారం చేసి, వీలైనంత మేరకు ప్రజలను రెచ్చగొట్టాలన్నదే వారి ధ్యేయం. అయితే ఇవన్నీ తెలిసి మాట్లాడుతున్నారా? తెలీక మాట్లాడుతున్నారా? అంటే.. కొందరికి తెలియకపోవచ్చు. మరికొందరికి సగం తెలిసి ఉండొచ్చు. మరి కొందరిది అతితెలివి కావచ్చు.వాస్తవాన్ని దాచిపెట్టి స్వార్థ ప్రయోజనాల కోసం అబ్ధదాలను కొండంతలుగా చేస్తున్నారు.

మామూలు ప్రజానీకానికి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మన ఇంటి పక్కన ఖాళీ జాగ ఉందనుకోండి. దాని యజమాని ఎక్కడో విదేశాల్లో ఉన్నాడనుకోండి అతనెపుడొస్తాడో, వచ్చినా ఆ స్థలంలో ఇల్లు నిర్మిస్తాడో లేదో, నిర్మించినా ఎంత ఎత్తున, ఎన్ని అపార్టుమెంట్‌లు కట్తాడో ఏమీ తెలియదు. ఈలోగా మనం నెమ్మదిగాఆస్థలాన్ని పిల్లలు ఆడుకోవడానికి, పశువులు కట్టేయడానికి, టెంట్‌లు వేసుకుని మీటింగ్‌లు పెట్టుకోవడానికి తాత్కాలికంగా ఉపయోగిస్తున్నాం. ఆ స్థలం మనదే అన్న భావన మనం మన పిల్లలకు కలిగించాం. వాళ్ళకు ఆస్థలం తమది కాదు, కేవలం తాత్కాలికంగా తమ అధీనంలో ఉందన్న సంగతి తెలియదు. కొంతకాలం తరువాత ఇంటి యజమాని వచ్చి ఆ స్థలంలో సగం స్థలం భవనం నిర్మించుకున్నాడు. దాంతో మన ఇంట్లోకి ముందువచ్చినట్టుగా వెలుతురు గాలి రావడం లేదు. మన పిల్లలకు ఆడుకోవడానికి స్థలం లేదు. అప్పట్నుంచి మనం, మన పిల్లలు, ఆ ఇంటి యజమానిపైన దుమ్మెత్తిపోయడం మొదపూడ్తాం. ఇంచుమించు ఇదే కథ మనది.

కర్ణాటక తన వాటాకు వచ్చిన నీటి మొత్తాన్ని వాడుకునే క్రమంలో అన్ని అనుమతులు తీసుకుని ఆలమట్టిని కుట్టుకుంటే, ఆలమట్టి మూలంగా సకాలంలో మనకు నీళ్లురాక (ఇది వరలో వచ్చినట్టు రాక) మనం బాధపడుతూ మనం కర్ణాటకను ఆడిపోసుకోవడం ఇప్పుడు జరుగుతున్నది. ఇందులో కర్ణాటక తప్పు ఏమిటో విమర్శించే వాళ్లు చెప్పాలి. బచావత్ ట్రిబ్యూనల్ కేటాయించిన 2060 టీఎంసీల నికర జలాలు,ఆపైన రీజనరేషన్ మూలంగా లభ్యమయ్యే 70 టీఎంసీలు, వెరసి 2130 టీఎంసీలు నికరజలాలలో మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు, ఆంధ్రవూపదేశ్‌కు 811 టీఎంసీలు దక్కాయన్న సంగతి పాఠకులకు తెలిసిందే. కర్ణాటక తనకు లభించిన 734 టీఎంసీలలో సుప్రీంకోర్టు అనుమతితో (ఆంవూధవూపదేశ్ ఆలమట్టి ఎత్తును సవాలు చేయడం మూలంగా) కేంద్ర జలసంఘం అనుమతితో 524.256 మీటర్ల ఎత్తులో నిర్మించుకోవడం జరిగితే, 303 టీఎంసీలు సుమారుగా ఆలమట్టి ద్వారానే వినియోగించుకునే అవకాశముంది.

వర్షాకాలంలో వచ్చే వరదనీటిని తొలుత మహారాష్ట్ర తమ వాటా నీరు నిలువ చేసుకున్నాక, వదిలిన దాంట్లో కర్ణాటక తనవంతు తప్పక నింపుకుంటుంది. ఆ క్రమంలో మనకు నీళ్లు రాక ఇబ్బందులు ఏర్పడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. దానికి మనం కర్ణాటకను నిందిస్తే ఏంలాభం? మనం బచావత్ ట్రిబ్యూనల్ ముందు వర్షాకాలపు తొలిరోజుల్లో వచ్చే వరదను పై రాష్ట్రాలతోపాటు మనం కూడా కొంత ఉపయోగించుకునేట్టుగా వాదించి ఆమేరకు పక్క రాష్ట్రాలను ఒప్పించి ఉంటే బావుండును. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న విధంగా బచావత్ ట్రిబ్యూనల్ ముందు పెడసరంగా వాదించి ఏకంగా మిగులు జలాలు మొత్తం స్వాహా చేయాలన్న ఉద్దేశ్యంతో ‘స్కీం-బీ’ కు అడ్డు చెప్పడం ద్వారా ఇప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. మనతప్పును ఎదుటి వాడిపైన రుద్ది మన ప్రజలను రెచ్చగొట్టి పక్కరాష్ట్రాల పట్ల ద్వేషం పెంచే ప్రయత్నాలు మంచివికావు. పోలవరం విషయంలో కూడా ఒడిషా, ఛత్తీస్‌గఢ్ లను తప్పుపట్టలేం. పోలవరం మూలంగా ఏర్పడే ముంపును వ్యతిరేకించడం వారి ధర్మం. మన ప్రజల ప్రయోజనాలను కాపాడుకోవాల నే దుగ్ధ మనకెంత ఉంటుందో, వారి ప్రాంత ప్రజల శ్రేయస్సు దృష్ట్యా వారు ప్రవర్తించడం సహజమే. ఏదేమైనా పోలవరం నిర్మాణ సమస్య ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నది. తుది తీర్పు రాకుండా మనం ఏ మాట్లాడినా సమంజసం కాదు.

ఇక తెలంగాణ విషయానికి వస్తే.. తెలంగాణ ఏర్పడితే ఆంధ్రవూపదేశ్‌కు లభించిన నీటి వాటాలోనే తెలంగాణకు పంపకం అవుతుంది. కాని పక్క రాష్ట్రాల నీటి వాటాలో ఒక్క చుక్క కూడా అదనంగా లభించదు. అది కృష్ణా బేసినే కానివ్వండి, గోదావరి బేసిన్ కానివ్వండి. నికర జలాలే కానివ్వండి, మిగులు జలాలే కానివ్వండి. కృష్ణా బేసిన్ విషయం చర్చిద్దాం. ప్రస్తుతం బచావత్ ట్రిబ్యూనల్ ఆంధ్రవూపదేశ్‌కు కేటాయించిన నికర జలాలు 811 టీఎంసీలు, అందులో సుమారుగా 300 టీఎంసీల వరకు తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయింపులు జరిపినట్టు ప్రభుత్వ రికార్డులున్నాయి. కనుక నికర జలాలలో 300 టీఎంసీలు నుంచి తెలంగాణకు వచ్చే అవకాశంలేదు.

ఇక మిగులు జలాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మొత్తం మిగులు జలాలను అనుభవించే స్వేచ్ఛను మనమే (ఆంవూధవూపదేశ్ రాష్ట్రం) కలిగి ఉన్నాం. ఇది స్వేచ్ఛ మాత్రమే. చట్టపరమైన హక్కు కాదు. ఆ మిగులు జలాలను 227 టీఎంసీలుగా లెక్కలు కట్టి అందులో తెలంగాణకు 77 టీఎంసీలు, సీమాంవూధకు(రాయలసీమకు) 150 టీఎంసీలను కేటాయిస్తూ ప్రభుత్వం ప్రాజెక్టులను రూపొందించి, నిర్మాణాలు చేపట్టింది. అయితే ఈ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అటు నీటి కేటాయింపులు కానీ,ఇటు గ్రాంటులు కానీ ఇవ్వలేదు. ఎందుకంటే ఇవన్నీ అనుమతులు లేని అక్రమ ప్రాజెక్టులని కేంద్రం ఉద్దేశ్యం. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ ఎదుట కృష్ణా జలాల పంపకం (ఏ రాష్ట్రానికి ఎంత) సమస్య పరిష్కారానికున్నది. నికర జలాల పంపకాన్ని పా త ట్రిబ్యూనల్ ఆదేశించినట్టుగా యధాతథంగా ఉంచుతున్నట్టు కొత్త ట్రి బ్యూనల్ ప్రకటించింది. మిగులు జలాల పంపకాన్ని పరిష్కరించే ప్రయ త్నం చేస్తోంది.ఇంతకాలం మిగులు జలాలను పూర్తిగా అనుభవించే స్వేచ్ఛను హక్కుగా భావిస్తూ ప్రజలను మభ్యపెట్టిన మన ప్రభుత్వం మిగు లు జలాలను ఇతర రాష్ట్రాలు కూడా పంచుకోబోవడంతో ఇప్పుడు ఇరుకునపడి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ తీర్పును ఛాలెంజ్ చేసే ప్రయత్నంలో సుప్రీంకోర్టు గడప తొక్కింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యూనల్ తీర్పు వచ్చేలోపు తెలంగాణ ఏర్పడితే తెలంగాణ వాదనలు వినే అవకాశం ట్రిబ్యూనల్‌కు ఉంటుంది. లేకపోతే మాత్రం ఆంధ్రవూపదేశ్‌కు వచ్చిన వాటానే రెండు రాష్ట్రాలు (ఆంధ్ర, తెలంగాణ) పంచుకోవలసి ఉంటుంది. ఇక గోదావరి విషయానికి వస్తే.. 1480 టీఎంసీల నికర జలాలు ఆంధ్రవూపదేశ్ వాటా. అందు లో సుమారు 900 టీఎంసీల నీరు తెలంగాణకు, 580 టీఎంసీల నీరు ఆంధ్ర ప్రాజెక్టులకు కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మిగులు జలాలపై ఎలాంటి చర్చలేదు. నికర జలాల వాడకంలోనే ఇంకా సగానికి సగం మిగిలుంది.

కనుక మిగులు జలాలు పంపకం సమస్య కాకూడదు.
కాబట్టి పైన చెప్పిన విషయాలను బట్టి తేలేదేమంటే.. ప్రజలను తెలిసో తెలియకో, లేక కావాలనో రెచ్చగొట్టడం తప్ప తెలంగాణ ఏర్పడితే ఆంధ్రకు నీరు రాదని ప్రచారం చేయడం పచ్చి అబద్ధం. దుర్మార్గపు పని తప్ప మరొకటి కాదు. రెండు రాష్ట్రాల మధ్య ఏదైనా సమస్య ఏర్పడితే అంతర్‌రాష్ట్ర జలవివాద చట్టం 1956 ప్రకారం కేంద్రం చర్యలు తీసుకుంటుంది. పై పెచ్చు కొత్తరాష్ట్రం ఏర్పడటం తెలంగాణతో మొదలవ్వలేదు. ఆఖరవ్వడం లేదు. వివిధ రాష్ట్రాల మధ్య నీటి పంపకం నిర్వహణ విషయం కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో జరుగుతాయి.

నీటిని అక్రమంగా వాడుకోవడానికి అలవాటు పడ్డ సీమాంధ్ర ప్రజలు అతి తెలివిగా వ్యవహరించడం సహజం. కనుక తెలంగాణ ప్రజలు అధికారులు, నాయకులు మొద్దునిద్ర వీడి చైతన్యవంతులు కావాలి. అసలు తమకు సంక్రమించిన హక్కులేమిటో ముందు తెలుసుకోవాలి. వాటిని రక్షించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి. దురదృష్టమేమంటే.. తెలంగాణలో ఇన్ని ఉద్యమాలు నడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం గాఢ సుషుస్తావస్థ నుంచి బయటికి రాలేదు. ఈ సందర్భంలో శాస్త్రవేత్త న్యూటన్ ప్రతిపాదించిన గమన సూత్రాలు (Law of motion)ను గుర్తు తెచ్చుకోవాలి. Every body preserves its state of rest or uniform motion in a straight line unless an external force acts on it - ఇది ప్రథమ సూత్రం అంటే ‘ఒక వస్తువు తానున్న స్థితినుంచి కాని, లేక అది నడుస్తున్న గతిలో నుంచి కాని మార్పు తేవాలంటే బాహ్యశక్తి అవసరం’ అన్నది. ప్రస్తుతం తెలంగాణను కదిలించాలంటే బాహ్యశక్తి కావాలి. అదేవిధంగా తెలంగాణ పట్ల కొందరు సీమాంధ్ర పాలకులు దురాగతాలు కొనసాగిస్తూ నిరంకుశ ధోరణి ప్రదర్శిస్తున్నారు. వారి చర్యలను అడ్డుకోవాలంటే బాహ్యశక్తి కావాలి. కనుక న్యూటన్ సూత్రాన్ని ఆలంబనగా చేసుకుని టీజాక్ ప్రజాసంఘాలు, మేధావి వర్గం విద్యార్థులు ఒక బలమైన శక్తిగా ఏర్పడి సీమాంధ్ర నాయకుల దుష్ట చర్యలను అడ్డుకోవడానికి, తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపి ముందు కు నడిపించడానికి శక్తి ఉపయోగించాలి. ఇక న్యూటన్ రెండవ సూత్రం. The rate of change of momentum is propor tional to the impressed force and takes place in the direction of force. క్లుప్తంగా చెప్పాలంటే ‘ప్రయోగించే బలాన్ని (శక్తిని) బట్టి ఫలితముంటుంది’ తెలంగాణ సమాజం ఎంత మొద్దు నిద్రలో ఉన్నది. దాన్ని జాగృతం చేయాలంటే ఏ మేరకు శక్తిని ఉపయోగించాలి? అదేవిధంగా సీమాంధ్ర పాలకుల ఆగడాల ఏ మేరకు కున్నాయి. వాటిని ఆపాలంటే ఏమేరకు శక్తినుపయోగించాలి అన్నది విశదీకరించేది రెండవ సూత్రం. మార్పు బలం నీటికున్న ప్రత్యక్ష సంబంధాలను రెండో సూత్రం వివరిస్తుంది.

మూడో సూత్రం- For every action there is an equal and opposite reaction చర్యకు ప్రతిచర్య సమానం అన్నది మూడో సూత్రం. అది మనం నిత్య జీవితంలో చూస్తూ అనుభవిస్తున్న మాట. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ర్యాలీ తీస్తారు. పోలీసులు ఎన్‌సీసీ గేటు దగ్గర అడ్డుకుంటారు. విద్యార్థులు ప్రతిఘటిస్తారు. ఇరువైపుల నుంచి రాళ్లవర్షం, టియర్‌గ్యాస్ షెల్స్ -ఇవి తప్పవు. సీమాంధ్ర నాయకుల అరాచకాలు ఆగడాలు కొనసాగుతున్నంత కాలం చైతన్యవంతులైన విద్యార్థులు ఊరుకోరు ప్రతిఘటిస్తారు. అది సహజమే. అంతే కాదు అవసరం కూడా. చెప్పొచ్చేదేమంటే న్యూటన్ ప్రతిపాదించిన మూడు గమన సూత్రాలను మనం కొత్త గొంతుక (న్యూ టోన్)లో పురోగమన సూత్రాలుగా భావించి ఉద్యమ మార్గదర్శకాలుగా భావించాలి. రాజకీయ పార్టీలతో ప్రమేయం లేకుండా టీజాక్‌లోని ప్రజా సంఘాలు, మేధావులు, విద్యార్థులు తెలంగాణ సమాజాన్ని ముందుకు నడిపించాలి. నాయకులకు నిజాల సారాన్ని నూరిపోయాలి. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి ఓపికతో వీలైన మాధ్యమాలు ఉపయోగించి ఉద్బోధ చేయాలి. తెలంగాణ వస్తే తప్ప తెలంగాణ బతుకులు బాగుపడవు అన్న కటిక సత్యాన్ని తెలియ చెప్పాలి.

తెలంగాణను అడ్డుకునే సీమాంధ్ర నాయకుల, దుష్ట పన్నాగాలు, ఎత్తుగడలు, నక్కజిత్తులను పసిగట్టి ఎక్కడికక్కడ సమాధి చేయాలి. ఇంత బృహత్కార్యక్షికమం తెలంగాణ టీజాక్, దాని అనుబంధ సంఘాలు సంస్థలపై ఉన్నది. ఇక రాజకీయ పక్షాల వ్యూహాలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. ఒకపక్కన టీజాక్ నిర్వహించే ప్రజాస్వామ్య నిరసనలు, ర్యాలీలు, బంద్‌లు లాంటి కార్యక్షికమాలకు పూర్తి మద్దతిచేస్తూ, కేంద్రంపై వత్తిడి తేవలసి ఉంటుంది. తమ కార్యకర్తలకు కూడా తెలంగాణ విషయంలో సంపూర్ణ అవగాహన కల్పిస్తూ, అనవసరమైన మేర శిక్షణ ఇప్పిస్తూ తెలంగాణ అవతరించే వరకు విశ్రమించకుండా ముందుకు సాగితే తప్ప ఏ పార్టీకి కూడా మనుగడ లేదు. ఈ బానిస బతుకులకు నిష్కృతి లేదు.

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్
[email protected]

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

Published: Sun,September 16, 2012 10:48 PM

పడుతూలేస్తూ పాలమూరు ప్రాజెక్టులు

సార్-మా పాలమూరు ప్రాజెక్టుల పరిస్థితేంది? వాటికి నీళ్ల కేటాయింపు ఉన్నదా? కరెంటున్నదా? పైసలున్నయా? అన్ని సక్రమంగా వుంటే మరి ఎందుకు

Featured Articles