కలిసుంటే ఎవరికి సుఖం?


Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా బేరసారాలాడి ఎక్కువ నిధులు సాధించవచ్చని, చిన్న రాష్ట్రాలు ఏర్పడితే నక్సలైట్ల సమస్యలు ఏర్పడతాయని తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్ర నాయకులు ప్రతిరోజూ ఊదరగొడ్తుంటారు. ఇలా మాట్లాడుతుంటే కేంద్రం ప్రభావితం కాదంటారా?

-మపూడ్డి వేణుగోపాల్‌డ్డి, దేవరకొండ, నల్లగొండ జిల్లా


తెలంగాణ అవతరించేంతవరకు సీమాంధ్ర నాయకులు, వారి అండదండలతో నడిచే మీడియా సమైక్య బాకా ఊదుతూనే ఉంటాయి. అందుకు తెలంగాణ వాదులు సిద్ధపడే ఉండాలి. తెలంగాణ ఏర్పడకుండా ఉండటానికి ఎన్ని కుయుక్తులు పన్నాలో, ఎంత దుష్పచారం చేయాలో అంతా చేస్తూనే ఉంటారు. కలిసి ఉంటే కలదు సుఖమన్నది నానుడి.ఒక ఇంట్లో అన్నదమ్ములు కల్సి ఉంటే ఇరుగుపొరుగు వాళ్లు డెబ్బలాటకు వచ్చినప్పుడు అది ఉపయోగపడుతుందన్నది నిజం. అయితే ఆ లాభాన్ని దృష్టిలో పెట్టుకుని అన్న తమ్ముని పట్ల ద్రోహం చేస్తూ ఆస్తినంతా కరిగిస్తూ, తమ్ముడి నెత్తిన శఠగోపం పెట్తే కలిగే నష్టంతో పోలిస్తే ఆ లాభం ఎంతో తక్కువ. కనుక కలిసుంటే ఎవరికి లాభమో కాస్త ఆలోచించాలి. ఇటీవలే కేంద్రమంత్రి పల్లంరాజు కూడా రాష్ట్రం పెద్దదై ఉంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర బేరమాడే శక్తి పెరుగుతుందని సెలవిచ్చారు అంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 23 జిల్లాలుంటే జిల్లా వెనుకబాటుతనం, సైజు వగై రా చూసి ఎక్కువనిధులను కేం ద్రం నుంచి రాబట్టవచ్చని వారి ఊహ.

income అది నిజమే కావచ్చు. కాని ఇక్కడ సమస్యేమిటంటే అలా రాష్ట్రం పేరిట వచ్చిన నిధులను ఏ ప్రాంతానికి తరలిస్తూన్నారనేది? హైదరాబాద్‌లో భూములమ్మిన డబ్బు, హైదరాబాద్‌లో, తెలంగాణలో వసూలయ్యే పన్నులను,కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఏ ఏ జిల్లాలకు తరిలిస్తున్నారో ఒక్కసారి చిట్టావిప్పితే సమైక్యంగా ఉంటే ఎవరికి లాభమో బయటపడుతుంది. 2007 మార్చిలో శాసనసభలో ఆనాటి ఆర్థిక మంత్రి రోశయ్య ప్రశ్న నెంబర్ 7406 కు ఇచ్చిన సమాధానంలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో వచ్చిన ఆదాయం, పెట్టిన ఖర్చు మూడు సంవత్సరాలలో, ఆపైన నాలుగో సంవత్సరం పాక్షికంగా ఏవిధంగా ఉందో వివరించారు. దానిని పరిశీలించి చూస్తే రాష్ట్రం సమైక్యంగా ఉంటే ఏ ప్రాంతానికి ప్రయోజనకారిగా ఉంటుందో, ఎందుకని కలిసి ఉండాలని పట్టుబడుతున్నారో అర్థమవుతుంది.

పై అంకెలు శాసనసభలో సమర్పించినప్పుడు హైదరాబాద్‌లో జమ అయిన ఆదాయాన్ని తెలంగాణలో చూపకుండా వేరుగా చూపి తద్వారా తెలంగాణ ఆదాయాన్ని చిన్నదిగా చూపెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. హైదరాబాద్ ఆదాయం, ఇతర పద్దుల ద్వారా కేంద్ర నిధులు వగైరా వచ్చిన నిధులు, హైదరాబాద్‌పై పెట్టిన వ్యయం వివరాలు మరో పట్టికలో గమనించవచ్చు.

andhraఈ పట్టికలను చూస్తే ఏం అర్థమవుతుంది? ఆంధ్రలో వ్యయం, రాబడి కంటే ఎక్కువని, రాయలసీమలో వ్యయం ఆదాయంతో పోలిస్తే రెండు మూడు రెట్లు. కనుక తెలంగాణ విడిపోతే సీమాంధ్ర పరిస్థితి ఏమవుతుందో, ఎందుకు రాష్ట్రం కలిసుండాలని సీమాంధ్ర నాయకులు తహతహలాడుతున్నారో తెలియడం లేదా? ఇక నీళ్ల విషయానికి వస్తే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక తెలంగాణ విడిగా ఉంటే తెలంగాణకు న్యాయంగా, చట్టబద్ధంగా చెందవలసిన నీరు బచావత్ ట్రిబ్యూనల్ కేటాయించిన నీరు అక్రమంగా తెలంగాణ నుంచి బయటికి తరలించడానికి సాధ్యపడేదా? ఉదాహరణకు రాజోలిబండ పథకం ట్రిబ్యూనల్ మహబూబ్‌నగర్ జిల్లా వాడకానికి 15.90 టీఎంసీలు కేటాయించింది. అనేక సంవత్సరాలుగా ఏనాడైనా పాలమూరు జిల్లా ఆరేడు టీఎంసీల కంటే ఎక్కువ నీరు వచ్చిందా. రాజోలిబండ ఆనకట్ట తూములను బలవంతంగా తెరిపించి అక్రమంగా తుంగభద్ర నీటిని కర్నూలు జిల్లాకు తరలించింది వాస్తవం కాదా? ఫలితంగా 39.90 టీఎంసీలు అనుభవించవలసిన కె.సి కాలువ 50 నుంచి 60 టీఎంసీలు ప్రతి ఏడు దక్కించుకోవడం లేదా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండి ఉంటే జూరాల ప్రాజెక్టు కట్టి కూడా రిజర్వాయర్ నింపకుండా సగానికి సగం ఖాళీ పెట్టి ఉండేవారా? కర్ణాటకకు ముంపునకు పరిహారంగా చెల్లించవలసిన కొన్ని కోట్ల రూపాయలను చెల్లించకుండా దాటవేస్తూ ఫలితంగా జలాశయాన్ని ఖాళీగా ఉంచి జూరాల నింపవలసిన విలువైన జలరాశిని క్రిందికి అంటే శ్రీశైలంలోకి నాగార్జున సాగర్‌కి, కృష్ణా డెల్టాకు తరలించడం అబద్దమా? అనేక సంవత్సరాలుగా అట్లా విడిచిన వందల వేలాది టీఎంసీల నీరు మహబూబ్‌నగర్‌కు దక్కి ఉంటే అక్రమంగా రాజోలిబండను అన్యాయం చేసి కె.సి కాలువకు తరలించిన నీరు పాలమూరుకు లభించి ఉంటే ఇప్పుడు పాలమూరు జిల్లాలో ఇన్ని వలసలు, ఇన్ని ఆత్మహత్యలు చోటు చేసుకుని ఉండేవా? తెలంగాణ ఆంధ్రవూపదేశ్‌లో అంతర్భాగంగా కాక ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి ఉండి ఉంటే శ్రీశైలం ప్రాజెక్టు బచావత్ ట్రిబ్యూనల్ ఆదేశించినట్టు కేవలం విద్యుత్ ప్రాజెక్టుగా కాక, బహుళార్థక సాధక ప్రాజెక్టుగా రూపాంతరం చెంది ఉండేదా? ఈ రోజున తెలంగాణకు, కోస్తాంధ్ర ప్రయోజనాలకు ఉరితాడుగా మారిన పోతిడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్, దాని సైజు నాలుగింతలను చేసి మిగులు జలాల పేరిట కృష్ణా జలాలను యదేచ్ఛగా గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ, కె.సి కాలువ ప్రాజెక్టులకు వెలిగొండ టన్నల్ ద్వారా ప్రకాశం జిల్లాకు తరలించేందుకు లేక తస్కరించేందుకు ఆస్కారం కలిగి ఉండేదా? మద్రాసుకు తాగునీటి మిషతో ప్రారంభించిన తెలుగుగంగపైన 16.95 టీఎంసీల సామర్థ్యంతో వెలుగోడు, 17 టీఎంసీల సామర్థ్యంతో బ్రహ్మంగారి మఠం, 78 టీఎంసీల సామర్థ్యంతో సోమశిల, 68 టీఎంసీల సామర్థ్యంతో కండలేరు, అదేవిధంగా శ్రీశైలం కుడిగట్టు కాలువ పైన గోరకల్లు (13టీఎంసీలు) ఔకు (4.86 టీఎంసీల) గాలేరు నగరిపైన, హంద్రీనీవా పైన అనేక జలాశయాలు నిర్మించి, కృష్ణా జలాలతో నింపడానికి సాధ్యమయి ఉండేదా? ప్రణాళికా సంఘం ఆమోదించినట్టు కాకుండా నాగార్జున సాగర్ ఎడమ కాలువను దారి తప్పించి, తెలంగాణ ఆయకట్టు తగ్గించి (111 టీఎంసీలు వినియోగానికి బదులు 100 టీఎంసీలకు తగ్గించడం ద్వారా) ఆంధ్ర ఆయకట్టుకు ఆ నీటిని బదిలీ చేసి 2 లక్షల 48వేల ఎకరాలు పెంచడం వీలుండి ఉండేదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉంటే తెలంగాణ భూముల్ని ముంచుతూ, సున్నపు నిక్షేపాలను మింగేస్తూ తెలంగాణ యువతకు ఆశాజ్యోతి కావలసిన సిమెంట్ పరిక్షిశమలను దెబ్బతీసిన పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం అంత సులువుగా సాగి ఉండేదా? అంతెందుకు శ్రీశైలం జలాశయంలో, నాగార్జునసాగర్ జలాశయంలో నీరున్నా లేకపోయినా- ప్రతి సంవత్సరం అదేదో మాతాత హక్కు అన్నట్టు 150 ఏళ్ల చరిత్ర ఉందన్న ఒక ఎలిబీ సృష్టించి ఎలాంటి చట్టబద్ధమైన హక్కు లేకపోయినా, కృష్ణా జలాలను డెల్టాకు అవసరమైనప్పుడల్లా తరలించేందుకు వీలయ్యేదా? విద్యుత్తు పేరిట ప్రకాశం బ్యారేజీకి భారీగా నీరు వదిలే ఏర్పాటు చేయడం, తద్వారా నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీరందక పోవడం జరిగేదా? అసలు కృష్ణా డెల్టాకు రెండో పంటకు బచావత్ ట్రిబ్యూనల్ కేటాయించిన నీరు కేవలం 15.30 టీఎంసీలు, ఇప్పుడు వాడుతున్న నీరు మూడు నాలుగుట్లు. జంటనగరాలకు కృష్ణా నీటిని తరలించడానికి ఇన్ని అవస్థలు పడవలసివచ్చేదా? గోదావరి జలాలను తరలించవలసిన అవసరం ఏర్పడి ఉండేదా?

గోదావరి బేసిన్ విషయానికి వస్తే- తెలంగాణకు వరవూపసాదిని అయిన పోచంపాడు ప్రారంభమయి 50 సంవత్సరాలు అయింది.పడుతూ లేస్తూ సకాలంలో నిధులు విడుదల చేయలేదు. వచ్చిన గ్రాంటులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. మొదట అనుకున్న ప్రథ మ దశ ఆయకట్టుకు (9 లక్షల 68 వేల ఎకరాలకు) నీరందించలేక 5 లక్షల ఎకరాలకే పరిమితమయింది. ఇక రెండోదశ వరద కాలువలు ఎప్పుడు పూర్తవుతాయో, పూర్తయినా నిర్ధారిత ఆయకట్టుకు నీరందించగలవో లేవో చెప్పలేని అధ్వాన్నస్థితి. ఇందుకు కారణం తెలంగాణ రాష్ట్రం అవతరించక ఆంధ్రవూపదేశ్‌లో చేరడమే. ఆంధ్రవూపదేశ్ సమైక్యంగా ఉండటం వల్లే గోదావరి డెల్టాకు నీళ్లు తక్కువయినప్పుడెల్లా పోచంపాడు (శ్రీరాంసాగర్) నుంచి, కిన్నెరసాని నుంచి జబర్దస్తీగా నీళ్లు తరలిస్తూ ఉంటారు. ఇది కలిసి ఉండటం మూలంగా కోస్తాంధ్ర కు దక్కిన సౌఖ్యం కాదా? పోలవరం ఇచ్చంపల్లి ప్రాజెక్టులు రెండూ కూడాఒకే రకమైనవి. రెండింటిలోనూ గిరిజన ప్రాంతాల అటవీ క్షేత్రాల ముంపు భారీగా ఉన్నది. రెండు ప్రాజెక్టుల ఉనికి పొరుగు రాష్ట్రాల అనుమతులపైన ఆధారపడి ఉంది. రెండింటికీ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ అనుమతి ఇవ్వలేదు. కాని చిత్రంగా పోలవరం నిర్మాణంలో ఉన్నది, ఇచ్చంపల్లి అటకెక్కింది. ఇది కలిసి ఉండటం వల్ల తెలంగాణకు కలిగిన చేటు. ఆంధ్రకు చేకూరిన మేలు. ఉమ్మడి రాష్ట్రం తెలంగాణకు ఎలాంటి మేలు కలగచేయ దు. సరికదా తీవ్ర నష్టం కలిగించే దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టును చేపట్టి తెలంగాణకు చెందిన 165 టీఎంసీల నీటిని వరద జలాల ముసుగులో సీమాంవూధకు దోచిపెట్టే ప్రయత్నం కలిసి ఉండటం వల్లనే సాధ్యపడింది.

ఇలా ఎన్నని చెప్పుకుంటాం? తెలంగాణ బొగ్గును తరలించి రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్‌లో, విజయవాడ థర్మల్ స్టేషన్‌లో విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. తెలంగాణ ఉద్యోగాలను సీమాంధ్ర వాళ్లు అనుభవిస్తున్నారు. చివరకు రాజధాని హైదరాబాద్‌లోనే తెలంగాణ నీళ్లు, తెలంగాణ భూములు కాజేసి హైటెక్ భవనాలు నిర్మించి, అందులో స్టాఫ్‌వేర్ కంపెనీలు తెరచి తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలివ్వరు. ఇన్ని అక్రమాలు, దురాగతాలు, మో సాలు, వంచనలు ‘కలిసి ఉండటం’ మూలంగానే సాధ్యమవుతున్నది. కనుక సోదరా కలిసి ఉంటే ఎవరికి సుఖమో, ఎవరికి దుఃఖమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిన్న రాష్ట్రాలైన జార్జండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలుగా ఏర్పడిన తరువాత బీహర్, యూపీ, మధ్యవూపదేశ్ కంటే అధిక ప్రగతి సాధించాయని జాతీయ గణాంకాలే చెబుతున్నాయి. తెలంగాణ రాకుండా అడ్డుపడడానికి సీమాంధ్ర నాయకులు నక్సలైట్లు ఇంకా అవసరమైతే, సునామీలు, రైలు ప్రమాదాలు ఎన్నో తెలంగాణలో సంభవిస్తాయంటారు. కేంద్రానికంతా తెలుసు. కేంద్రం తెలంగాణ ఏర్పాటు చేసే వరకు ఈ సీమాంధ్ర నాయకుల బాకాలను భరించక తప్పదు.

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్
[email protected]

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

Published: Sun,September 16, 2012 10:48 PM

పడుతూలేస్తూ పాలమూరు ప్రాజెక్టులు

సార్-మా పాలమూరు ప్రాజెక్టుల పరిస్థితేంది? వాటికి నీళ్ల కేటాయింపు ఉన్నదా? కరెంటున్నదా? పైసలున్నయా? అన్ని సక్రమంగా వుంటే మరి ఎందుకు