బాబ్లీ బాగోతం


Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను బట్టి చూస్తే ఏమనిపిస్తోంది? అంతకు ముందురోజే భారీ నీటిపారుదల శాఖామంత్రి చాంబర్‌లో అఖిల పక్షం మీటింగ్ జరిగిందని, అందులో నీటిపారుదల రంగ నిపుణులుగా మీరు కూడా పాల్గొన్నారని పేపర్లో చదివాను. మీ వ్యక్తిగత అభివూపాయం ఏమిటి?

-పేరి జగన్నాథశాస్త్రి, వర్గల్, మెదక్ జిల్లా



అదేదో సినిమాలో..‘నిజం చెప్పమంటారా? అబద్ధం చెప్పమంటారా’ అని హీరో అడుగుతాడు. నిజమే చెప్పమంటే, నిష్ఠూరమైన కఠినమైన విషయాలను చెప్తాడు. ఈవేళ బాబ్లీ విషయంలో మొదట్నుంచి జరుగుతున్న భాగోతం చూస్తుంటే ఎన్నో కఠోరమైన విషయాలు బయటపెట్టాల్సి వస్తోంది. తాజాగా సేకరించిన సమాచారం బట్టి సుప్రీంకోర్టులో మహారాష్ట్రకు అనుకూల పవనాలు వీస్తున్నట్టే కనిపిస్తోంది. అదే జరిగితే ఆంధ్రవూపదేశ్ రాష్ట్రానికి ఎదురు దెబ్బ తగిలినట్టే కదా?
తాజాగా సుప్రీంకోర్టు బాబ్లీని పోచంపాడు లేక శ్రీరాంసాగర్, ప్రాజెక్టు జలాశయ పరిధిలో నిర్మించడం వల్ల ప్రతి సంవత్సరం అక్టోబర్ ఒకటి నుంచి మే నెల చివరిదాక అంటే non-Mansoon Season లో వర్షాలు ఆగి, తిరిగి వర్ష రుతువు ప్రారంభమయ్యే ఎనిమిది నెలల వ్యవధిలో బాబ్లీ దగ్గర గోదావరిలో లభించే నీటిపరిమాణం సుమారు 8.90 టీఎంసీలుగా ఉంటుందని మహారాష్ట్ర వాదన ఆధారంగా నీటిని బాబ్లీ మూలంగా శ్రీరాంసాగర్ వదులుకోవస్తుందన్న ఒక నిర్ణయానికి వచ్చి అదే విషయాలపై మహారాష్ట్రను నిలదీసింది. అప్పుడు తెలివిగా మహారాష్ట్ర ఆ 8.90 టీఎంసీలలో అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 27 దాక నీటి ప్రవాహం 6.16 టీఎంసీలను, అక్టోబర్ 28 నుంచి మే 31 దాక వచ్చేనీరు నామమావూతమైన 2.74 టీఎంసీలని చెబుతూ, తాము బాబ్లీని అక్టోబర్ 27 దాక ప్రతి సంవత్సరం గేట్లు తెరచి ఉంచుతామనీ, అంటే శ్రీరాంసాగర్‌కు పై నుంచి వచ్చే గోదావరి నీటిని అడ్డుకోబోమని అక్టోబర్ 28 నుంచి మే 31 దాక మాత్రమే గేట్లు మూసేస్తామని తెలిపారు. అంటే గోదావరిలో ఆ వ్యవధిలో క్రిందికి ప్రవహించే 2.74 టీఎంసీల నీటిని మాత్రమే నిలుపు చేస్తామని,అలా చేయడం వల్ల శ్రీరాంసాగర్ జలాశయానికి కేవలం 0.65 టీఎంసీల నష్టం మాత్రమే వాటిల్లుతుందని, మిగిలిన 2.09 టీఎంసీల నీరు తమ భూభాగానికి చెందుతుందని వాదించింది. మహారాష్ట్ర సమర్పిస్తున్న ఈ గణాంకాలకు రుజువులు చూపించమని సుప్రీంకోర్టు మహారాష్ట్రను ఆదేశించడం జరిగింది.

సుప్రీంకోర్టు ఆదేశించినట్టు మహారాష్ట్ర తమ లెక్కలను ఈ అక్టోబర్ 31 లోపు సుప్రీంకోర్టుకు, ఆంధ్రవూపదేశ్‌కు అందచేయాలి. ఆంధ్రవూపదేశ్ ఆవివరణపై అధ్యయనం చేసి తదుపరి విచారణ 8 నవంబర్ కనుక, ఆరోజు తమ స్పందన తెలియ చేస్తే.. బహుశా సుప్రీంకోర్టు ఆరోజునగానీ, మరో రోజున కానీ తీర్పును వెల్లడించే అవకాశముంది. అంటే బాబ్లీ కట్టడం వల్ల మేం కేవలం 2.74 టీఎంసీల నీటినే వాడుకుంటాం. అందులో ఆంధ్ర రాష్ట్రానివి 0. 65 టీఎంసీలే కనుక ఆ నీటిని తిరిగి మేం వాపసు చేస్తాం ‘ఇంత చిన్న విషయాన్ని ఆంధ్రవూపదేశ్ గోరంతను కొండంతలు చేసిచూపుతోంది అనే పద్ధతిలో ఆంధ్రవూపదేశ్‌పైన సుప్రీంకోర్టుకు ఒక వ్యతిరేక లేక తేలిక భావం కలిగించే విధంగా మహారాష్ట్ర వాదనలు కొనసాగుతున్నాయి.

మహారాష్ట్ర సమర్పించే గణాంకాలు సరియైనవే అయితే, ఆ గణాంకాలను మనం తిప్పికొట్టలేకపోతే, సుప్రీంకోర్టు బాబ్లీని గేట్లతో సహా అనుమతించవచ్చు. అంటే మన పోచంపాడు జలాశయ పరిధిలోనే అధికారికంగా మహారాష్ట్ర ప్రాజెక్టు బాబ్లీ వెలుస్తుందన్న మాట. బహుశా ప్రపంచంలో ఒక రాష్ట్రానికి చెందిన జలాశయంలో మరో రాష్ట్రానికి చెందిన జలాశయం అధికారికంగా ఏర్పడటం ఇదే ప్రప్రథమం. ‘బాబ్లీ మూలంగా కేవలం 2.74 టీఎంసీల నీరు, అందునా 0.65 టీఎంసీలు ఎలాగు మహారాష్ట్ర భర్తీ చేస్తుంది. కనుక కేవలం 2.09 టీఎంసీల కోసమే ఇంత పోటాపోటా? ఆరేళ్లుగా అనేక కోట్ల రూపాయల వ్యయం, ధర్నాలు, నిరసనలు, ఒకరిపై మరోకరు బురద చల్లుకోవడం, ఇతర రాష్ట్రంలోకి చొచ్చుకపోయి దెబ్బలు తినడం, అంతా రాజకీయ రొచ్చు తప్ప తెలంగాణకు నష్టమే లేదా? మరేమిటీ గోల? అసలు ఎక్కడ ఉంది కిటుకు? ఎక్కడ జరిగింది లోటు? ఇవన్నీ సామాన్య మానవుడిని వేధించే ప్రశ్నలు. కాస్త శాంతంగా సమస్యను ఆకళింపు చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. 1975కు పూర్వపు పరిస్థితిని అర్థం చేసుకోవాలి.

మనం పోచంపాడు కట్టుకోవాలనుకున్నాం. హైదరాబాద్ రాష్ట్రం రూపొందించిన బృహత్ ప్రణాళిక గోదావరి వేలీ ప్రాజెక్టు ఆంధ్రవూపదేశ్ రాష్ట్రావతరణ అంతర్ రాష్ట్ర జలవివాద చట్టం రెండు కూడా 1956 సంవత్సరంలోనే ఏర్పాటవడం వల్ల అటకెక్కింది. అనేక చర్చలు, కేంద్ర ప్రభుత్వ జోక్యం ఫలితంగా 6-10-1975 నాడు మహారాష్ట్ర,ఆంధ్రవూపదేశ్‌ల మధ్య ఒక ఒప్పందం కుదిరిం ది. దాని ప్రకారం ప్రధాన గోదావరి నదిపైన పైధాన్ డ్యాం సైట్ నుంచి, పూర్లా నదిపైన సిద్దేశ్వరం డ్యాం సైట్ నుంచి, మంజీరా ఉప నదిపైన నిజాంసాగర్ డ్యాం సైటు నుంచి గోదావరిపైన పతిపాదించే) పోచంపాడు (శ్రీరాంసాగర్) డ్యాం సైట్ వరకు గోదావరి బేసిన్‌లో లభ్యమయ్యే జలాలలో 60 టీఎంసీల నీరు మించకుండా మహారాష్ట్ర తమ కొత్త ప్రాజెక్టులకు వినియోగించుకోవచ్చు. అప్పటికే సాంక్షన్ అయిన, ఆమోదించిన వినియోగానికి ఇది అదనం. పోచంపాడు డ్యాం సైట్‌దాక లభించే మిగతా నీటిని ఆంధ్రవూపదేశ్ వాడుకోవచ్చు. ఇదే అత్యంత ప్రధానమైన క్లాజు. అందులో ముఖ్యంగా మన కొంపముంచినవి పోచంపాడు డ్యాంసైట్ దాక అన్న పదాలు. అంటే గోదావరినదిలో పైన చెప్పిన (పైధాన్ అపబడే జయక్వాడే డ్యాం, సిద్దేశ్వరం డ్యాం నిజాంసాగర్ డ్యాం) మూడు డ్యాం సైట్‌ల నుంచి పోచంపాడు డ్యాం సైట్‌దాక ఉన్న భూభాగంలో (ఆది ఏ రాష్ట్రానికి చెందినా) లభించే జలాలలో 60 టీఎంసీల వరకు మహారాష్ట్రకు హక్కు ఉన్నట్టు ఆ ఒప్పందం స్పష్టం చేస్తోంది. అంటే ఆంధ్రవూపదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డ శ్రీరాంసాగర్ జలాశయంలో నీటిని ఎలాంటి అవరోధం లేకుండా వాడుకోవచ్చని చెప్పకనే చేప్తోంది కదా ఆ క్లాజు.

మహారాష్ట్ర ఇప్పుడు వాడుకోదలుచుకోబూనింది శ్రీరాంసాగర్ జలాశయం అంతర్భాగమైన తమ భూభాగంలోని నీటిని మాత్రమే, కాని తమ 60 టీఎంసీల నీటి లెక్క పూరా కాకపోతే, ఆంధ్రవూపదేశ్ భూభాగంలోంచి కూడా అవసరమైతే నీటిని వాడుకుంటే కూడా ఆ క్లాజు అడ్డుచెప్పడం లేదు. ఇదే మహారాష్ట్ర పదే పదే సుప్రీంకోర్టు చెవిలో జోరిగలా నివేదిస్తోంది. అప్పుడు సుప్రీంకోర్టు ఈ డ్యాం సైట్ అంటే ఏమిటి? అన్నమాటకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. డ్యాం సైట్ అంటే డ్యాం కట్టడం ఏర్పాటై న స్థలం.అంటే కాంక్రీట్ గోడ, మట్టికట్ట, మత్తడి, తూములు ఏర్పాటైన స్థలం అనిమహారాష్ట్ర వాదిస్తే, ‘అబెబ్బే డ్యాం మూలంగా ఏర్పాటైన జలాశయం మొత్తం కూడా అంటే డ్యాంకు ఎగువన 126 కిలోమీటర్ల పొడవునా(అందులో 71 కిలోమీటర్ల పొడువు మన భూభాగం, మిగతా 75 కిలోమీటర్ల పొడవు మహారాష్ట్ర భూభాగం) అంతా కూడా డ్యాం సైట్ అని మన రాష్ట్రం వాదించడానికి విఫల ప్రయత్నంచింది. మన వాదనను మహారాష్ట్ర తిప్పికొడుతూ మనం గతంలో కేంద్రానికి సమర్పించిన పోచంపాడు ప్రాజెక్టు రిపోర్టులో డ్యాం సైట్‌ను ఎట్లా చూపించామో బయటికి తీసి మన వాదనలోని డొల్లతనాన్ని సుప్రీంకోర్టుకు సమర్థవంతంగా చూపడంలో డ్యాం సైట్ అంటే కేవలం డ్యాం కట్టే చోటు మాత్రమే అని, అది రిజర్వాయర్‌కు వర్తించదని సుప్రీంకోర్టు అర్థం చేసుకున్నది. ఇది మన మొదటి ఓటమి. (ఆ ఒప్పందంలో 1975 నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, ఎస్‌బీ చవాన్‌ల మధ్య కుదిరినది) పోచంపాడు జలాశయపు నీటిని మినహాయించి ‘అని రాసుంటే ఏ పేచీ ఉండేది కాదు. దీనివల్ల అవసరమైతే, రేప్పొద్దున, పోచంపాడు డ్యాంసైట్ పైన ఎక్కడ నుంచైనా సరే తమకు ఒప్పందం ఇచ్చిన 60 టీఎంసీల నీటి వినియోగపు హక్కును పొందేందుకు మహారాష్ట్రకు చట్టపరంగా వీలుందన్నమాట.మనమేం అంటున్నాం. మనంపరిహారం చెల్లించాం.

మనడబ్బుతో పోచంపాడు నిర్మించడం ఎక్కడైనా ఉందా?అని ఇలాంటి నైతిక, సాంకేతిక వాదనలు మాత్రమే చేస్తున్నాం. కాని ఆ వాదనలేవీ చట్టపరంగా నిలువవు. అందుకే సుప్రీంకోర్టును మెప్పించలేకపోతున్నవి. అసలు మేం అనుమతించి ఉండకపోతే మీకింత భారీ జలాశ యం ఏర్పడేదికాదు. మీ దగ్గర నష్టపరిహారం తీసుకున్నది, మీడ్యాం మూలంగానే మేం రోడ్లు, వంతెనలు కోల్పోయి, మళ్లీ కట్టుకోవలసి వచ్చినందుకు. అంతేకాని మా భూభాగాన్ని మీకు అమ్ముకోలేదు అన్న మహారాష్ట్ర వాదనలే మన వాదనలకన్న బలంగా వినిపించాయి సుప్రీంకోర్టుకు. సుప్రీంకోర్టు డ్యాం సైట్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాక మళ్ళించిన దృష్టి ‘బాబ్లీ బ్యారేజీ సైజు దాని వల్ల ముఖ్యంగా గేట్లు తెరవడం వల్ల, మూయడం వల్ల, దిగువన పోచంపాడుకు ఎలాంటి నష్టం చేకూరబోతున్నదన్న అంశంపైన. వర్షాకాలంలో వచ్చే నీటిని బాబ్లీ ఎలాగూ అడ్డుకోదు. ఎందుకంటే బాబ్లీ గేట్లు తెరిచే ఉంటాయి. ఆవిషయం నిర్ధారించుకున్నాక, వర్షం లేని సమయంలో పైనుంచి వచ్చే నీరు అంటే Non mansoon season flows మాటేమిటి? ఆవ్యవధిలో ఎంత నీరు వస్తుంది? అందులో ఎంత పరిమాణాన్ని బాబ్లీ ఉపయోగించుకుంటుంది అన్నది తేల్చుకోబూనింది.

కేవలం 2.74 టీఎంసీలే అని మహారాష్ట్ర వాదించ ప్రయత్నిస్తే, మనవాళ్లు మహారాష్ట్ర డాక్యుమెంట్లే 8,90 టీఎంసీలు అని చూపించాయి అన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తెస్తే వారు మన వాదనను అంగీకరించడం జరిగింది. బాబ్లీలో 2.74 సామర్థ్యం ఉన్నంత మాత్రాన పైనుంచి వరద వస్తుందంటే నిరంతరంగా నీటిని లిఫ్ట్‌ల ద్వారా ఉపయోగిస్తుంటే 8.90 ఏమిటి? ఇంకా ఎంతైనా వాడుకోవచ్చు అన్న సంగతిని అర్థం చేసుకోగలింది సుప్రీంకోర్టు. అందుకే బకెట్‌కు చిల్లులుంటే ఎంత నీరై నా బకెట్ నిండదు అన్నమాట న్యాయమూర్తి వాడా రు. అప్పుడు మహారాష్ట్ర ఆ మాటకు ఒప్పుకుంటూ 8.90 టీఎంసీల నీటి పరిమాణంలో 6.16 టీఎంసీల నీరు అక్టోబర్ ఒకటి నుంచి అక్టోబర్ 27 వరకు వస్తుందని ఆనీటిని తాము ఉపయోగించుకోబోమని, మిగతా నీరు అంటే 2.74 టీఎంసీలు ఉపయోగించుకోవడానికే తాము బాబ్లీ గేట్లు మూసివేస్తామని సుప్రీంకోర్టును నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ఆ లెక్కలు కనుక నిజమైతే సుప్రీంకోర్టు బాబ్లీ అనుమతిస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. అప్పుడు మనం 2.74 టీఎంసీల నీళ్లు మేమే ఇస్తాం మీరు బాబ్లీ అనుమతించకండి అని సుప్రీంకోర్టును అర్థించవలసుంటుంది.

మనం మొదట్నించి మొత్తుకునే శ్రీరాంసాగర్ జలాశయంలో నిలువ ఉంచిన నీటి లో 65 టీఎంసీల నీటిని బాబ్లీ వెనక్కిలాగే అవకాశం మాట సంగతేమైంది? ఇది బాబ్లీ గేట్లు మహారాష్ట్ర చెప్తున్నట్టుగా మూసివేయకుండా తెరచి ఉంచితే ఏర్పడే పరిస్థితి? మహారాష్ట్ర కేంద్రం మాట లెక్క చేయకుండానే బాబ్లీ కట్టొద్దన్నా కట్టింది, సుప్రీంకోర్టు గేట్లు పెట్టొదన్నా పెట్టింది. రేపొద్దున గేట్లు మూసేస్తుందన్న గ్యారంటి ఏమిటి? తెరిస్తే మన కొండలు మునగవా? ఈవిషయం ఇంకా సుప్రీంకోర్టు నిర్ణయించిందో లేదో తెలియదు. అప్పుడు బాబ్లీ కంట్రోల్‌ను కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో తుంగభద్ర మాదిరిగా బాబ్లీ కంట్రోల్ బోర్డు, ఏర్పాటు చేయొచ్చు. మన అభ్యర్థనను మన్నించక బాబ్లీని తొలగించడానికి సుప్రీంకోర్టు ఒప్పుకోకపోతే బాబ్లీ కంట్రోల్‌బోర్డు కోసం మనం పట్టుబట్టవలసి వస్తుంది. మరో విషయం - మహారాష్ట్ర తమకు లభించిన నీటి హక్కు అంటే కొత్త ప్రాజెక్టులకు 60 టీఎంసీలు, పాత ప్రాజెక్టులకు 19 టీఎంసీలు (42 అని మహారాష్ట్ర రాష్ట్రం వాదిస్తోంది) మాత్రమే వాడుకుంటుంది. ఇది వరకే వాడుకున్నది. ఇది ఖరారు చేయడానికి కేంద్రం అధీనంలో ఒక నియంవూతణ మండలి ఏర్పాటు చేయాలని మనం సుప్రీంకోర్టును ఇదే సందర్భంలో కోరాలి.దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం సమర్పించిన ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్న ‘సూట్’లో ఈ అంశంలేదు.

కాని మాజీ ఎం.పివినోద్‌కుమార్, నేను సంయుక్తంగా సమర్పించిన రిట్ పిటిషన్‌లో అది ఉన్నది.(దాన్ని కూడా అవసరమైతే పరిగణనలోకి తీసుకుంటామని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది), దాన్ని కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుని వర్తమానంలోగాని, భవిష్యత్తులోగాని మహారాష్ట్ర తమకు హక్కుభుక్తంగా లభించిన నీటిని మాత్రమే వాడుకునే చట్టపరమైన, పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ప్రభుత్వం కూడాగతంలో మాదిరిగా ఏకపక్షంగా ఆలోచించక, అఖిల పక్షాలను సంప్రదించడం, మేధావులతో న్యాయ నిపుణలతో ఆలోచించి రాష్ట్రం శ్రేయస్సు గురించి నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా ప్రభుత్వం బాబ్లీ విషయంలో అతి నిర్లక్ష్యంతో, చిత్తశుద్ధి లేకుండా, రాజకీయ లబ్ది కోసం అనేక వికృతచేష్టలకు పాల్పడి, ఈరోజున సుప్రీంకోర్టు ఎదుట అపహాస్యానికి గురైంది. తెలంగాణ ప్రాంతానికి జీవనాడి అయిన శ్రీరాంసాగర్ విషయంలో దారుణ వివక్షతో తెలంగాణ రైతాంగానికి క్షమించారని ద్రోహం చేసినట్టు నిరూపితమయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టయింది. పరిస్థితి చూద్దాం-సుప్రీంకోర్టు తీర్పు ఏమొస్తుందో?

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్
[email protected]

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

Published: Sun,September 16, 2012 10:48 PM

పడుతూలేస్తూ పాలమూరు ప్రాజెక్టులు

సార్-మా పాలమూరు ప్రాజెక్టుల పరిస్థితేంది? వాటికి నీళ్ల కేటాయింపు ఉన్నదా? కరెంటున్నదా? పైసలున్నయా? అన్ని సక్రమంగా వుంటే మరి ఎందుకు