జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం


Tue,October 23, 2012 12:22 AM

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారంలో అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు రాష్ట్ర రాజధానిలో ముగిసింది. ఎప్పు డు ఏ కుంభకోణం పురుడుపోసుకుంటుందోనని ఎదురుచూస్తున్న గడ్డపైన, నిధుల లేమితో నీళ్లు మింగుతున్న ప్రభుత్వానికి ఊరటగా నిధులు రావడం, వాటిని ఖర్చు చేయడమనేదే ప్రాధాన్యంగా కనిపించింది. అధికారులు, నాయకులు వేలాదికోట్ల కుంభకోణాల ఆరోపణలతో వందలాదిరోజులుగా ఊచలు లెక్కపెడుతున్నా రు. ఈ తరుణంలో ఈ సదసు నిర్వహణలో కూడా ఎన్ని కోట్లు మాయమయ్యాయో అని సామాన్యుడు ఆలోచించే పరిస్థితి. అంతేతప్ప జీవ వైవిధ్యం గురించి గానీ, వీటి రక్షణ ప్రాధాన్యం గురించి గానీ, ఎవరి వల్ల కొన్ని జీవజాతులు అంతరించిపోతున్నాయి, దీనివల్ల తనకు ఎలాంటి నష్టం వాటిల్లుతుందని ఆలోచించే పరిస్థితి లేదు.

ప్రభుత్వం నిర్వహించే కార్యక్షికమంలో గానీ, అమలు చేసే పథకాలలో గానీ, హైదరాబాద్‌లోని హైటెక్ ప్రాంతాలలో ప్రతిధ్వనించే ఈ జీవ వైవిధ్య చర్చల ఊసు ఎక్కడా వినిపించలేదు. పల్లె నుంచి పట్టణం వరకు ఎన్నడూ సదస్సులు నిర్వహించిన పాపానపోలేదు. అందుకే డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఉపయోగించుకుంటున్నారు అనే అపవూపదనే అన్నిటినీ మించిపోయింది. ప్రభుత్వమే జీవవైవిధ్య విధ్వంసానికి కారణమని హైదరాబాద్ నగరంలో చెరువులు, చెట్లు, చేమలు, పక్షులు అంతరించిపోవడానికి కృత్రిమ ఆధునీకరణ ఫలితమనేది స్పష్టమవుతుంది. నాడు ఆహ్లాదకరమైన వాతావరణానికి పేరొందిన షహర్ హైదరాబాద్. భారత అధ్యక్షుడే సంవత్సరానికి కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడికొచ్చే సంప్రదాయానికి కూడా విఘాతంగా మారింది. స్వచ్ఛంద సంస్థలు కొన్ని సమాంత ర సదస్సులను నిర్వహించి ఆలోచింపజేశాయి. ఆధునిక యుగంలో పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఎరువులు, క్రిమి సంహారక మందు లు, గ్రామీణవూపాంత జీవ వైవిధ్యాన్ని ధ్వంసం చేశాయి. మనిషి ప్రపంచ దేశాలతో పోటీపడి రంగుల కలలో తాను మసి అయిపోతున్న దుస్థితిని మరిచిపోతున్నాడు. అనాలోచిత ప్రభుత్వాలు ఈ అరాచకానికి రాజమువూదవేసి మరొకవైపు సదస్సుల పేరిట మొసలి కన్నీరు కారుస్తున్నాయి.

గతంలో ప్రతి ఇంట్లో, ఊరి బయట ఊరపిచ్చుకల హడావుడి కనిపించే ది. అవి అద్దాలలో తమ ప్రతిబింబాన్ని చూసుకుంటూ తమ ప్రత్యర్థి అని భావించి నిరంతరంగా పోరాడుతున్న దృశ్యాలను చూసే భాగ్యం ఈ కాలపు పిల్లలకు లేదు. పిచ్చుక గూళ్లలోకి పాములు చొరబడి వాటిని తింటూ ఉంటే ఆ బాధాకరమైన సంఘటన కుటుంబాలను కలచివేసేది. నేడు వాటి స్థానాలలో పడగవిప్పిన పాములలాగా సెల్ టవర్స్ ఊరినిండా చేరి విషం కక్కుతున్నాయి. అప్పుడప్పుడు అంతరించిపోతున్న ఊరపిచ్చుకల ఫోటోలతో పాటు ఎన్నో జీవరాసుల గురించి ప్రచార, ప్రసార సాధనాలలో వచ్చినా మన రాష్ట్రం గానీ, భారత ప్రభుత్వం గానీ పట్టించుకోలేదు. ఎన్నో సందర్భాలలో మనం విదేశాలను విమర్శిస్తున్నాం. కానీ ఎన్నో దేశాలు అంతరిస్తున్న జీవుల పట్ల ఆందోళన చెందడమే కాకుండా జీవవైవిధ్యాన్ని కొనసాగించడానికి, వాటి సమతుల్యతకు భంగం వాటిల్లకుండా ఎన్నో చట్టపరమై న చర్యలు తీసుకుని, వాటిని కఠినంగా అమలు చేస్తున్నాయి. ప్రచార, ప్రసా ర సాధనాలలో ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించి మనం ఏం చేద్దామో చెప్పకుండా కేవలం దేశ, విదేశాలలో మన్ననలు పొందాలనే ఉత్సాహం ప్రభుత్వంలో కనబడింది. ఈ విషయాన్ని సదస్సులకు వచ్చిన విదేశీయులు కూడా అర్థం చేసుకున్నారు.

దేశవ్యాప్తంగా దాదాపు నాలుగువేలకోట్ల విలువ గల క్రిమిసంహారక మందులు ప్రతిసంవత్సరం వాడుతుంటే, అందులో సగ భాగం మన రాష్ట్రంలోనే వాడుతున్నామని జయతీఘోష్ కమిటీ నివేదికలో స్పష్టం చేసిం ది. మన రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యల పూర్వాపరాలు, వాటి నివారణకు సంబంధించిన అధ్యయనం చేయడానికి, 2004లో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నియామకం చేయడం జరిగింది. కానీ ఆ నివేదికను శాసనసభలో ఉంచలేదు. ఎన్నడూ చర్చించలేదు. క్రిమిసంహారక మందుల విచ్చలవిడి ఉపయోగమే వివిధ జీవులు, పక్షులు అంతరించిపోవడానికి ప్రధాన కారణం. దీనివల్ల తినే ఆహారంతో పాటు కన్నబిడ్డకు పాలిచ్చే తల్లి పాలల్లో కూడా విష అవశేషాలున్నాయని ఎన్నో నివేదికలు చెప్పాయి. నీరు తాగడానికి, పొలాల్లోకి వెళ్లి అక్కడే గుట్టలు గుట్టలుగా చనిపోయిన నెమళ్ళను పోలీసులు పంచనామా చేసిన కేసులున్నాయి.

మన జాతీయపక్షి దారుణంగా మరణానికి గురైపోతుంటే కనీసం జీవవైవిధ్య సదస్సుకు సంబంధించిన లోగోలో ఆ పక్షి కనపడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక మన దేశ యావత్తు యంత్రాంగం జీవవైవిధ్యాన్ని సాఫీగా కొనసాగించే పరిస్థితులను కల్పించడంలో ఘోరాతిఘోరంగా విఫలమై ప్రపంచ దేశాల ముందు చతికిలబడింది. మన దేశంలో ఎన్నో సాంప్రదాయక పద్ధతులలో ఉండే ప్రజలు చాలావరకు వారి పరిసరాలలో లభించే కూడు, గూడు, గుడ్డ, మందులు, ఎరువులపైన ఆధారపడి అక్కడి వినోద కార్యక్షికమాల నుంచి ఆనందం పొందుతారు. వీటి విలువ, పరిరక్షణ, భవిష్యత్తు గురించి ప్రభుత్వం ప్రాధాన్యతా అంశంగా పరిగణించాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచంలో ప్రతి రెండు మాసాలకు 1500 జాతులు అంతరించిపోతున్నాయి. మన దేశంలో ఈ పరిణామ క్రమంలో ఎన్ని అంతరించిపోతున్నాయి? వాటి స్థానంలో ఎన్ని కొత్తగా చేరుతున్నాయన్న వివరణ అత్యంత ప్రాధ్యాన్యమైంది.

అభివృద్ధి చెందుతున్న దేశంలో ప్రాథమిక ఆరోగ్యానికి సంబంధించి 80 శాతం మంది సంప్రదాయక మందుల పైననే ఆధారపడుతారు. భారతదేశం ఆయుర్వేద, సిద్ధ, యునానిపైనే ఆధారపడింది. ఆయుర్వేదంలో ఈ భూమి మీద లభించే ప్రతి మొక్కకు ఔషధ గుణముందని చెప్పబడింది. ఒకసారి బ్రహ్మరుషి ‘జీవకుడి’ని ఔషధ గుణం లేని ఒక చెట్టును గాని, మొక్కను గాని గుర్తించాలని ఆదేశించాడట. జీవకుడు 11 సంవత్సరాలు పరిశోధన తర్వాత అటువంటిది లభించలేదని విఫలమయ్యానని విన్నవించుకుంటే ఆ రుషిని ఆశ్చర్యపరిచే విధంగా బ్రహ్మ ఆయనను గొప్ప వైద్యునిగా గుర్తించాడట.

అభివృద్ధి చెందిన దేశాల వాడుకలో ఉన్న ఒకటింట నాలుగవ వంతు ఔషధాలు మొక్కలపై ఆధారపడినవే! మనం తప్పనిసరిగా ఉపయోగించే 21 మందులు ఇందులో భాగమే. ‘ఫిలిపెండ్యులా ఉల్మారియా’ మొక్క నుంచి ఆస్ప్రిన్‌ను, క్వినైన్‌ను ‘సింకోనా’ తదితర చెట్ల బెరడు నుంచి తీస్తున్నారు. దాదాపు 90 శాతం ప్రపంచ ఆహారం 20 రకాల మొక్కల నుంచి లభిస్తుంది. అందుకే ఎక్కువ పంటకు, చీడ పీడల నివారణకు జీవ ఉత్పత్తి శాస్త్ర పరిశోధనలు మన దేశానికి అత్యవసరం. మన దేశంలో దాదాపు 50,000 నుంచి 60,000 రకాల వరి, 1000 రకాల మామిడి, 5000 రకాల సోర్‌గమ్‌ను, 500 రకాల పెప్పరు, పంటలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆసియాలోని ఎన్నో ప్రాంతాలలో ఒక వైరస్ వల్ల వరి పంట ధ్వంసమైపోతుంటే 1970లో అడవి ప్రాంతాలలో లభించే వరి ధాన్య రకాల జీన్స్ ద్వారా రక్షించడం జరిగింది.
ఫిలిఫ్ఫైన్స్‌లోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 6,723 రకాలను పరిశోధించి ఈ వైరస్‌ను ఎదుర్కోవాలంటే ఉత్తరవూపదేశ్‌లో 1963లో ఓరిజనివారా అనే ఒక రకాన్ని అభివృద్ధి చేయాలని ఎంపిక చేసింది. అదే రకాన్ని అధికంగా ఇప్పుడు సౌత్, సౌత్ ఈస్ట్ ఆసియాలో పండిస్తున్నారు.

మన దేశంలో ఎక్కువగా జీవ వైవిధ్యమున్న ప్రాంతాలు దూరంగా అక్కడి ప్రజల చేత రక్షించబడుతున్నాయంటే వీటిని పవివూతంగా, ఆరాధ్యంగా భావిస్తున్నారు. కానీ ఈ ఆధునిక యుగంలో అంతరించిపోతున్నాయి. కొత్త వంగడాలు ప్రవేశించి తరతరాలుగా వస్తున్న సంప్రదాయ పంటలను, విత్తనాలను లేకుండా చేస్తున్నాయి. మన దేశంలోని 50 శాతం అటవీ సంపద అంతరించిపోయింది. బాగా తెలిసి, ఉపయోగంలో ఉన్న 150 ఔషధ మొక్కలు అంతరించిపోయాయి. అపురూప మృగాలు, పక్షులతో పాటు వందల రకాల పంటలు కనుమరుగయ్యాయి. కనీసం పంట విత్తనాలను కూడా దాచుకోలేకపోయాం. ఔషధ తయారీ వ్యాపార సంస్థలు హద్దు, అదుపు లేకుండా విస్తరించి ఔషధ మొక్కలను సేకరిస్తూ వాటిని అంతమొందిస్తున్నాయి. ఉదాహరణకు అడవిలో దొరికే రావుల్ఫియా సర్పంటైనా (సర్పగంధ) మొక్కను 4000 సంవత్సరాల కిందటే పాము కాటు, ఇతర నరాల బలహీనతలకు దివ్య ఔషధంగా వాడేవారు. యాభై ఏళ్ల కిందటే ఆధునిక ట్రాంక్విలైజర్స్‌కు ఇది పునాదిగా మారింది. కానీ అతిగా వాడడం వల్ల, ముందుచూపు లేకపోవడం వల్ల అంతరించిపోయింది.

మరోవైపు క్రిమి సంహారక మందుల వాడకం జీవ వైవిధ్యాన్ని అథోగతి పాలు చేస్తున్నది. ఈ అంశంపైన చర్చించి చర్యలు తీసుకోలేదు. అసలు ఈ సదస్సు నిర్వహించే నైతికత ప్రభుత్వానికి ఉన్నదా? అని ఆలోచించక తప్ప దు. లోక్‌సభలో 2012 ఏప్రిల్ 24న ఎరువులు, క్రిమి సంహారక మందులకు సంబంధించి ప్రశ్న వస్తే దానికి ప్రభుత్వం 67 క్రిమి సంహారక మందులను కొన్ని దేశాలలో నిషేధించినా మనదేశంలో ఉపయోగిస్తున్నామని చెప్పింది. అందులో ఎండోసల్ఫాన్ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రభు త్వం ఈ ఎరువుల, క్రిమి సంహారక మందుల ఉపయోగానికి ఒక వ్యవసాయ విధానాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశ్యంలో లేదని, రాష్ట్ర ప్రభుత్వాలే సంబంధిత విభాగాల ద్వారా ప్రజల్లో అవగాహన కలిగిస్తుందని చేతుపూత్తేసిన తర్వాత సాక్షాత్తు ప్రధాని- జీవవైవిధ్యాన్ని కాపాడుకుందాం అన్న సందేశాన్ని ప్రపంచానికి ఇస్తే ఆ నైతికతను ప్రశ్నించక తప్పదు.

ఎండోసల్ఫాన్ ఎంతోమంది ప్రాణాలు తీయడమే కాకుండా దాన్ని ఏరియల్ స్ప్రే చేయడం ద్వారా ఇంకా ప్రజలు రోగాలతో సతమతమవుతున్నారని కర్ణాటక, కేరళ రాష్ట్రాలు ఉద్యమం చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం దాన్ని తయారుచేసే ముడిసరుకులను వదులుకోవాలంటే వేల కోట్లు అవుతున్నాయి కాబట్టి, ఆ ముడిసరుకు అయిపోయేంత వరకు ఉత్పత్తిని అనుమతించాలని సుప్రీంకోర్టు నుంచి పార్లమెంటు వరకు వాదించింది. దీన్ని బట్టి మన ప్రభుత్వం కేవలం డబ్బుకే ప్రాధా న్యం ఇచ్చి ఆరోగ్యాన్ని పర్యావరణను, జీవవైవిధ్యాన్ని ఖాతరు చేయడం లేదని స్పష్టమవుతుంది. ఇది ప్రపంచ దేశాలకు తెలియదని అనుకుంటే పొరపాటు. ఈ సదస్సు తర్వాత అన్ని దేశాలు మనల్ని తప్పుపట్టక తప్పదు.

మూడు కంపెనీలు ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ఈ క్రిమిసంహారక మందులో 70 శాతం మన దేశంలోనే ఉత్పత్తి చేసి, హానికరం అని తెలిసినా ముడిసరుకును ఏం చేయాలని అమాయకంగా చర్చలు చేస్తుంటే సమాజం సహించడమనేది అన్యాయం. ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం ఈ ఎండోసల్ఫాన్‌ను మన రాష్ట్రాలలో అనుమతించాలని కోరడం ఆశ్చర్యాన్ని, అవమానాన్ని కలిగస్తుంది. ప్రభుత్వ వాదన కేవలం వెల్త్ మీద తప్ప హెల్త్ కోసం కాదని పత్రికలు ఘోషించాయి. పెస్టిసైడ్స్ మేనేజ్‌మెంట్ బిల్ 2008లో ఒకవేళ ఏదైనా హానికరం అని తేలితే మూడు నెలల్లో డిస్పోస్ చేయవచ్చని ఉన్నా అమలు చేయలేకపోతున్నారు. చట్టాలు లోపభూయిష్టమే కాక ఉన్న చట్లాను సంపన్నులకు అనుకూలంగా మార్చుతున్నారు.

జాతీయ, అంతర్జాతీయ చట్టాలున్నా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు నిస్వార్థంగా ముందుకు సాగుతున్నా, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ ద్వారా స్థానికుల భాగస్వామ్యంతో అటవీ రక్షణకు పూనుకుంటునా ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రాధా న్యం ఇవ్వకపోవడం వల్ల అడవులు అంతరించిపోతున్నాయి. పంచాయతీరాజ్, ఎన్స్‌టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ చట్టం అమలు చేయపోవడం వల్ల గిరిజనుల అటవీ సంపద, ఖనిజ సంపద జీవవైవిధ్యం సమూలంగా నాశనమవుతుంది. పార్లమెంటులో నిస్సిగ్గుగా Government is not centenplating agriculture policy on utilization of pesticides and fertilizers అని చెప్పడం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ కార్యక్షికమాల ద్వారా ప్రమాదం నుంచి తప్పించుకోవడానిక అవగాహన కల్పిస్తున్నామని మాత్రమే చెప్పారు. కానీ ఈ దేశంలో ఒక్క ఊరిలోనైనా ఇది జరిగిందా? అనేది ప్రశ్నించుకోవాలి.

ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు, జీవవైవిధ్యాన్ని కొనసాగించడానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి, కొత్త చట్టాలను రూపొందించాలి. వాటి కఠినంగా అమలు పరచడం, పాలిథిన్ బ్యాగులను నిషేధించాలి. మరోవైపు ఉత్పత్తిదారులకు రాయితీలు కల్పించినట్టు కాకుండా, స్వచ్ఛంద సంస్థలను, పదవీ విరమణ చేసిన ఉపాధ్యాలను, ఉద్యోగులను, కవులు, కళాకారులను గౌరవవూపదమైన వేతనంతో వారిని గ్రామాల వారీగా ఉపయోగించుకోవాలి. ఒక నిర్దిష్టమైన విధానాన్ని మారుమూల ప్రాంతాల వరకు రూపొందించుకోవాలి. పరిపాలన వ్యవస్థలో ప్రాధాన్య అంశంగా పరిగణించినప్పుడే జీవ వైవిధ్యం కొనసాగించే మార్గం లభిస్తుంది. ఆర్భాటంగా ముగిసిన జీవ వైవిధ్య సదస్సు ఫలితం, మన ప్రభుత్వానికి నిధుల రూపంలో దక్కింది. రెండవది ముఖ్యమంవూతికి ఢిల్లీ పరపతి పెరిగి, మంత్రివర్గ విస్తరణలో తప్పకుండా జీవిస్తారు.

-సీహెచ్. విద్యాసాగర్‌రావు
(కేంద్ర మాజీ మంత్రి)

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

Published: Sun,September 16, 2012 10:48 PM

పడుతూలేస్తూ పాలమూరు ప్రాజెక్టులు

సార్-మా పాలమూరు ప్రాజెక్టుల పరిస్థితేంది? వాటికి నీళ్ల కేటాయింపు ఉన్నదా? కరెంటున్నదా? పైసలున్నయా? అన్ని సక్రమంగా వుంటే మరి ఎందుకు

Featured Articles