రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి


Mon,October 29, 2012 12:05 AM

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరిస్థితుల్లో మనకేమిటి దారి? మన రైతులకు ‘ క్రాప్ హాలీడే’ ప్రకటించక తప్పదా?

-గాలేటి నాగభూషణం, నక్రేకల్, నల్లగొండ జిల్లా


వానలు తగ్గడం కంటే సీజన్లో మార్పు వచ్చిందన్న మాట వాస్తవం. వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయన్న విషయాన్ని శాస్త్రజ్ఞులు అంగీకరిస్తున్నారు. ఫలితంగా సీజన్లలో తేడా, వానలు పడే రోజుల సంఖ్యలో మార్పు. అట్లాగే వర్షం పడే తేదీల్లో మార్పు, పడే చోట మార్పు వగైరా అనేక మార్పులు మనం కొంతకాలంగా గమనిస్తూ వస్తున్నాం. గతంలో మన ఇంజనీర్లు జూన్ ఒకటవ తేదీ నుంచి సెప్టెంబర్ 30 దాక వానలు పడతాయని భావించి ప్రణాళికలను సిద్ధంగా చేసేవారు. అందుకే మాన్‌సూన్‌ను నాలుగు నెలల వ్యవధిగా భావించి జలాశయాలు సెప్టెంబర్ 30 వ తేదీకి నిండుతాయన్న అంచనాతో ముందుకు సాగేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లాలేదు. బాగా లేట్‌గా మాన్‌సూన్ రావడం గమనిస్తున్నాం. అందుకని నాట్లు వేసుకోవడం నుంచి పంట చేతికి రావడం దాక తేదీల్లో భారీ మార్పులు వస్తున్నాయి. వానలు కురిసే రోజుల్లో మార్పులు రావడం భగవంతుని లీలగా మనం అనుకుని ఊరట చెందవచ్చు. కానీ ఈ మార్పుకు మనిషే కారణమని పర్యావరణవేత్తలు చెప్తున్నారు.

ఉదాహరణకు అడవులను నాశనం చేయడం జీవవైవిధ్యాన్ని ధ్వంసం చేయడం, నిత్యం వాడకంలో ఓజోన్‌ను హరించే అనేక విధ్వంసక పదార్థాలు ఉపయోగించడం వల్ల వాతావరణంలో పలు మార్పులకు మనమే బాధ్యులమని నిందించేవారున్నారు. ఏదైమైనా ప్రకృతి చేష్టల మూలంగా వర్షంలో తేడాలను మనం అనుభవిస్తున్నాం. ఇది మాత్రం ఎవరు కాదనలేని నిప్పులాంటి నిజం. ఇకపోతే మనమే పూర్తిగా బాధ్యులమని చెప్పుకోతగ్గ వాస్తవాలను ఇష్టమున్నా, కష్టమైనా ఒప్పుకుని భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంలో విజ్ఞత ఉంది తప్ప, అనవసరంగా ఇతరులను ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలను నిందించడం వల్ల ప్రయోజనం శూన్యం.

కృష్ణాబేసిన్ విషయం ముందు చర్చిద్దాం. ఈరోజు కృష్ణా బేసిన్‌లో మన రాష్ట్రంలోకి వచ్చే వరద భారీగా తగ్గడం మనం చూస్తున్నాం. ఆ వరద పరిమాణంలో చోటు చేసుకున్న కాలం, వ్యవధి అన్నింట్లోనూ మార్పులున్నాయి. పై రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలు తమ జలాశయాల్లోకి నీరు నింపుకున్నాకే కిందకు వదులుతున్నాయి. ఇందుకు మనం పరస్పరం చేసుకున్న స్కీం ఒప్పందమే కారణం. కనుక మనకు చుక్క నీరు రాకుండా పైరాష్ట్రాలు నీరు సమృద్ధిగా జలసిరితో కళకళలాడుతూ ఉంటే మనం కళ్లల్లో నిప్పులు పోసుకోవడం, జుగుస్సాకరంగా ఆడిపోసుకోవడం లాంటి చేష్టలు చేయకపోవడం మన ఆరోగ్యానికి మంచిది. ఆలమట్టి ఎత్తుపై మనం అవగాహనా రాహిత్యంతో ....పేలాపన లాంటి మాటలు తూటాల్లాగ వదులుతూ ఉంటాం. ఆలమట్టి కాదు ఆల్ మట్టి అంటూ మన తెలుగు మీడియా పతాక శీర్షికలతో ప్రకటించి తన లేకితనాన్ని, తెలివి తక్కువతనాన్ని బహిర్గతం చేసుకున్నదే తప్ప ఏమైనా ఇసుమంతైనా లాభమున్నదా? సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి, కేంద్ర జలసంఘం అనుమతులతో ఆలమట్టి డ్యాం ఎత్తు 524. 256 మీటర్లు కర్ణాటక పెంచుకోవడం మనకు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహాలకు గురి చేయవచ్చు నిజమే . కానీ తమకు బచావత్ ట్రిబ్యూనల్ కేటాయించిన 734 టీఎంసీలు, 585 టీఎంసీలను తమ అవసరమయిన చోట భద్రపరచుకుంటే మనం అభ్యంతరం తెలియచేయడం వల్ల ఏమైనా ప్రయోజనం చేకూరిందా? ఆలమట్టి ఎత్తుపైన మనం సుప్రీంకోర్టులో బాగా పోట్లాడాం.

మన పోట్లాట ఫలితంగా సుప్రీంకోర్టు రెండు ఉత్తర్వులు లిచ్చింది. ఒకటి బచావత్ ఆదేశాల ప్రకారం తమకు కేటాయించిన నీటి పరిమాణం ఆయా రాష్ట్రాలు తమకు అనువైన చోట నిలువ చేసుకోవడం. రెండు: ఏ జలాశయంలో నిలువ చేసుకోవడం, ఆ జలాశయం సైజును నిర్ధారించే విషయంలో జల సంఘం అనుమతి, ఇంకా ఇతర చట్టపరమైన అనుమతులు తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మన రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉన్నా, కొంత ఊరట కలిగించింది. 524-256 మీటర్ల ఎత్తు వరకు తమ ఆలమట్టి డ్యాం ఎత్తును తీసుకెళ్లాలనే కర్ణాటక ఆశలపై తాత్కాలికంగా నీళ్లు చల్లడం జరిగింది. పోతే మనం కోరినట్టుగా శాశ్వతంగా ఆ ప్రయత్నానికి బ్రేక్ పడలేదు. కొత్త ట్రిబ్యూనల్‌కు ఆలమట్టి వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను అప్పచెప్పింది పాత ట్రిబ్యూనల్. కొత్త ట్రిబ్యూనల్ అంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ తమ ప్రాథమిక తీర్పులో ఆలమట్టి ఎత్తును 524.256 మీటర్లకు ఒప్పుకుంది. కేంద్ర జలసంఘం కూడా ఓ.కే అన్నది. ఇంకా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు వెల్లడవలేదు.

ఏదేమైనా ఆలమట్టి పూర్తి ఎత్తుకు మనం మానసికంగా సిద్ధపడటం తప్ప మరోమార్గం లేదు. ఇది సరిపోదన్నట్టు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ ఇప్పటికి మనం స్వేచ్ఛగా హక్కులేకపోయినా హక్కుగా భావిస్తూ అనుభవిస్తున్నా మిగులు జలాలను మూడు రాష్ట్రాలకు పంపిణి కార్యక్షికమానికి ఒడిగట్టింది. ఇది మనకు అశనిపాతమే. మనం చేయగలిగేదేమి లేదు. మనం 227.50 టీఎంసీల మిగులు జలాలను అనుభవించేందుకు వీలుగా కట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న నెట్టంపాడు, కల్వకురి,్త ఎస్‌ఎల్‌బీసీ (ఈ మూడు తెలంగాణ ప్రాజెక్టులు) గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ, వెలిగొండ (ఈ నాలుగు సీమాంధ్ర ప్రాజెక్టులు) భవిష్యత్‌లో మిగులు జలాలు రాక వెల మనకు మనమే బాధ్యులం తప్ప మరొకరిని అని లాభం లేదు. ఇంతవరకు మనది కాకపోయినా మనది మనది అని మురిసిపోయి దురాశకు పాల్పడి మన అమాయక ప్రజలను మోసగించిన మన మూర్ఖత్వానికి మనమే బాధ్యులం తప్ప ఎవరిని దోషులుగా నిలబెట్టలేం.

ఇక గోదావరి బేసిన్ విషయానికి వస్తే బాబ్లీ విషయంలో పోచంపాడు జలాశయ పరిధిలో దర్జాగా మహారాష్ట్ర కట్టడం ఏర్పాటు చేస్తే సుప్రీంకోర్టులో నిలదీయడం తప్ప మన తెలివితేటలను ఉపయోగించి మనకున్న ఎంపీల సంఖ్యబలంతో కేంద్రంపై వత్తిడి చేసి, వారి చలువతో మహారాష్ట్రపై ప్రభావం చూపి దాన్ని ఆపగలిగామా? లేదు. చట్టం తన పని తాను చేసుకపోతుంది అని కేంద్రం నుంచి ఇతర వరాలు పొందడంలో మన ప్రభుత్వం నిమగ్నమయింది.

కానీ బాబ్లీని కట్టనివ్వకుండా, మొగ్గలోనే తుంచివేసే ఏ ప్రయత్నమూ చేయలేదు. అసలు 6-10-1975 నాడు మనం మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందమే లోపభూయిష్టంగా ఉంది. పోచంపాడుకు కట్టుకోనిచ్చారని చంకలు గుద్దుకున్నమే గాని, వాళ్ల భూభాగంలో మన నీటిని నిలువ చేయనివ్వడానికి ప్రతిఫలంగా మహారాష్ట్ర మన నీటిని భవిష్యత్తులో ఎలా వాడుకోగలదో అంచనా వేయడంలో పూర్తిగా విఫలమయ్యాం. upto pochampad dam site (పోచంపాడు డ్యాం సైట్ దాక) అన్న పదాలు అగ్రిమెంట్‌లో ఎంత అనాలోచితంగా వాడామన్నది ఈరోజు తలచుకుంటుంటే ఆ రోజున మన ఇంజనీర్లు లాయర్లు నిద్రపోయారా? ఎందుకని తెలంగాణ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా పరిణమించే ఈ ఒప్పందంపై సంతకం చేశారన్నది అర్థం కాని విషయం.

ఏదేమైనా ఈ తెలివి తక్కువకు మనల్ని మనమే నిందించుకోవాలి తప్ప ఇంకాఎవరినని లాభం లేదు. అదేవిధంగా అదే ఒప్పందంలో మహారాష్ట్రకు 60 టీఎంసీలు కొత్త ప్రాజెక్టులకు వినియోగించుకోవచ్చని రాసుకుంటే ఒప్పందంపై సంతకం చేసి 47 ఏళ్లయినా ఇప్పటి దాక మహారాష్ట్ర ఆ 60 టీఎంసీలు ఉపయోగించుకుంటున్నదా, లేదా అన్న ముఖ్యమైన విషయం తేల్చుకోలేని మన అశ్రద్ధకు ఎవరిని జవాబుదారీని చేద్దాం? అట్లాగే పాత ప్రాజెక్టులకు అంటే 6-10-1975 ఒప్పందం సంతకం చేసే నాటికి ఆమోదం పొందిన మహారాష్ట్ర ప్రాజెక్టులు వినియోగం 42 టీఎంసీలు లేక 19 టీఎంసీలా ఖరారు చేయించుకోలేని మన అసమర్థతకు మనం బాధ్యులమా? లేక కేంద్రాన్ని తప్పుపడదామా? మహారాష్ట్రను దోషిగా నిలబెడదామా? ఇప్పటిదాక మనం అవలంబించింది ఇతర రాష్ట్రాలను తూర్పారబట్టే వైఖరి అదే మూసలో ఒడిషా, ఛత్తీస్‌గఢ్, తమిళనాడుతో కూడా మన వ్యవహారశైలి ఉన్నది. పక్క రాష్ట్రాలను వీలైనంతమటుకు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మంచి చేసుకోవాలే తప్ప కోర్టులతో కొట్లాడి సాధించుకోలేమని ఇంకా మనకు ఎప్పుడు తెలిసి వస్తుందో?

ఇదంతా ఒకవైపు అయితే, మరోపక్కన మన రాష్ట్రంలోనే తెలంగాణ ప్రాంతాన్ని, వారికి హక్కుభుక్తంగా లభించే నీటిని అక్రమంగా అన్యాయంగా, దౌర్జన్యపూరితంగా, వివక్షతో దోచుకునే ప్రవాసనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పై రాష్ట్రాలను ఎట్లా తూలనాడుతున్నామో, ఈప్రాంతం కూడా రేపు ప్రత్యేక రాష్ట్రమైయితే ఆ రాష్ట్రం కూడా తమకు సక్రమించే నీటిని తమ జలాశయాల్లో నింపుకుని అనుభవిస్తే అది కూడా సీమాంధ్ర ప్రాంతాలకు కంటకవూపాయంగానే మిగుల్తుంది. అందుకే రాష్ట్రం ఏర్పడకుండా ఉండేందుకు శాయశక్తులా సీమాంధ్ర పెట్టుబడిదారులు అబద్ధాల ప్రచారం కొనసాగిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు రాష్ట్రాల అక్రమాలను కారణంగా పేర్కొంటూ, రేపు తెలంగాణ ఏర్పడితే సీమాంధ్ర ప్రాంతం ఎడారి అవుతుందని ప్రచారం సాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల విషయంలో మన మాటలు ఎంత నిజమో, తెలంగాణ విషయంలో కూడా అంతే నిజం.

ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర నిజాయితీ గురించి కేంద్ర ప్రభుత్వంలోని ఏ మంత్రిత్వశాఖను అడిగినా చెబుతుంది. ముఖ్యంగా కేంద్ర జల సంఘంలోని ఏ అధికారినడిగినా, మీ ఆంధ్రవూపదేశ్‌కు ఇతర రాష్ట్రాలను ఆడిపోసుకోవడం తప్ప మరో పనిలేదు అంటారు. మన సీమాంధ్ర కంట్రాక్టర్ -నాయకులు వారు పెంచిపోషిస్తున్న అధికారులు, వారి మానస పుత్రికలైన టీవీ చానెల్స్, పత్రికలు అనునిత్యం ఇతర రాష్ట్రాలపై దుమ్మెత్తి పోయడం, తిట్ల దండకం చదవడంతో కాలక్షేపం చేస్తున్నాయి. మన రాష్ట్రంలోని బలహీనమైన తెలంగాణ ప్రాంతంపైన సవతి ప్రేమతో ఇబ్బందులు కల్పించి, సమైక్యవాదపు ముసుగులో అందమైన అబద్ధాల వలను వారిపై విసరడం, సీమాంధ్ర ప్రజలకు రంగు రంగుల కలలు సృష్టించి మాయాజాలంలో వారిని భ్రమింప చేయడం తప్ప నిజాయితీగా ఆత్మవిమర్శ చేసుకున్న పాపానపోలేదు.
ఇక జరగవలసిందేమిటి? అమాయకపు రైతాంగాన్ని రక్షించేదెట్లా అని మీరడిగారు. ఇప్పటికైనా కళ్లు తెరచుకుని, వాస్తవాలను గ్రహించి, వస్తున్న మార్పులు అనివార్యం అని తెలుసుకుని, వాటికి అనుగుణంగా మన పంటల విధానంలో మార్పు చేసుకోవడం తప్ప మరోమార్గం లేదు.

మనకు మున్ముందు గతంలోలాగ ‘వరద’ రాదు. మనకు పైరాష్ట్రాలు తమ నీటిని తప్పక వాడుకుంటాయి. తమ కడుపు నిండగానే కిందికి వదుల్తాయి. రేపు తెలంగాణ ఏర్పడ్డాక కూడా అంతే. తెలంగాణ ఏర్పడక మరికొంత అలస్యమైయినా తెలంగాణ ప్రజలకు జరిగే అన్యాయాల గురించి తమ హక్కుల గురించి క్షుణ్ణంగా తెలిసిపోయింది. మునుపటిలాగ వారిని వంచించే ప్రయత్నాలు ఇక సాగవు. కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ‘పంటలు’ మార్పుకుంటామా ? సీజన్ మార్చుకుంటామా? ఏం చేస్తే బావుంటుందో వ్యవసాయ శాస్త్రనిపుణులు, నీటిపారుదల నిపుణులు ఒకచోట కూర్చుని నిర్ణయించవలసి ఉంటుంది. ‘నవంబర్’లో తుఫానులు వస్తాయి కనుక అప్పటికే పంటచేతికి అందాలి. కనుక విధిగా మాకు నీళ్లువదలాలి అని ప్రభుత్వాన్ని దబాయించి, జీవోలను తుంగలో తొక్కి అక్రమంగా నీటిని మళ్ళించడం భవిష్యత్తులో కుదరదు. కనుక రైతు సోదరులారా మిమ్మల్ని వంచించే, భ్రమింపచేసే ఈ మహ నాయకుల మాటలను నమ్మి ఇంకా మోసపోవద్దు. కళ్ళుతెరచుకుని వాస్తవాలను గ్రహించండి. ఇకముందు మునుపటిలాగా మీరు కావాలనుకున్నప్పుడు నీళ్లు రావు. కనుక ‘క్రాప్ హాలీడే’ ప్రకటించుకుంటారా లేక ‘పంటల మార్పిడి’ చేసుకుంటారా? ఆలోచించండి.

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్
[email protected]

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

Published: Sun,September 16, 2012 10:48 PM

పడుతూలేస్తూ పాలమూరు ప్రాజెక్టులు

సార్-మా పాలమూరు ప్రాజెక్టుల పరిస్థితేంది? వాటికి నీళ్ల కేటాయింపు ఉన్నదా? కరెంటున్నదా? పైసలున్నయా? అన్ని సక్రమంగా వుంటే మరి ఎందుకు