సద్దుమణిగిన సింగూరు జలవివాదం


Mon,November 5, 2012 12:14 AM

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి కారణమయిందని పేపర్లో చదివాను. ఏమిటి సార్ ఇంతకీ ఆ సమస్య ఎట్లా పరిష్కారమయింది?

-పి.టి ఆశారేఖ, హనుమకొండ, వరంగల్ జిల్లా


మీరు చదివింది నిజమే. చివరకు ప్రభుత్వం రాజీమార్గంగా జీవో ఇచ్చి ఉపముఖ్యమంవూతిని శాంతింప చేసింది. ఆ తర్వాత ‘ఇందిరమ్మ బాట’ సజావుగా సాగింది. ఒక బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంవూతిని బాగా పొగడటం దాకా వచ్చింది. ఇంతకీ విషయంలోకి వెళ్లే ముందు సింగూరు ప్రాజెక్టు గురించి తెలుసుకుందాం.సింగూరు జలాశయాన్ని మంజీరానదిపైన ఏర్పాటు చేయడం జరిగింది. మంజీరా జలాలను మహారాష్ట్ర, కర్ణాటక,ఆంధ్రవూపదేశ్ పంచుకుంటున్నాయి. మంజీరా గోదావరికి ఉపనది. 1919 సంవత్సరంలో మంజీరా నదిపైన ఘనపురం ఆనకట్టను ఏర్పాటు చేశారు. అది మధ్యతరహా ప్రాజెక్టు. 4.06 టీఎంసీల సామర్థ్యం. ఆయకట్టు 21, 625 ఎకరాలు. మహబూబ్‌నహర్, ఫతేనహర్ కాలువలు బయలు దేరి మెదక్ జిల్లాలోని 21,625 ఎకరాలు సాగుచేయడానికి నిర్ధేశింపబడినయి. మంజీరా నదిపై దిగువన ఓ బారీ ప్రాజెక్టును1923-31 మధ్యకాలంలో నిర్మాణం చేశారు. దీని పేరు నిజాం సాగర్. తెలంగాణకు ఇచ్చిన అపూర్వ కానుక. 58 టీఎంసీల నీటి వినియోగం చేసుకునే విధంగా రూపొందించడం జరిగింది.నిజాంసాగర్ జలాశయం పూర్తి సామర్థ్యం 29 టీఎంసీలు. 2లక్షల 75వేల ఎకరాలకు సాగునీటి అందించే ఉద్దేశ్యంతో నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. ఘనపురం ఆనకట్ట మెదక్ జిల్లా రైతాంగానికి మేలు చేకూర్చగా, నిజాంసాగర్ డ్యాం పూర్తిగా నిజామాబాద్ జిల్లా రైతులకు ప్రయోజనం చేకూరుస్తున్నది.

ఘనపురం ఆయకట్టును స్థిరీకరించడం నిజాంసాగర్ ఆయకట్టును స్థిరీకరించడం నిజాంసాగర్‌లోకి ఉధృతంగా వచ్చే ఒండ్రుమట్టికి కళ్లెం వేయడం, విద్యుత్తు ఉత్పాదన ప్రధాన లక్ష్యాలుగా ఆనాడు హైదరాబాద్ ప్రభుత్వం ఘనపురం ఆనకట్టకు ఎగువన దేవనూర్ ప్రాజెక్టు తలపెట్టింది. 1956 తదనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కుట్రల ఫలితంగా దేవనూరు ఎగిరిపోయి దాని స్థానంలో సింగూరు ప్రాజెక్టు అవతరించింది. 1972లో మొదలైన ప్రాజెక్టు 1999లో పూర్తయింది. ఇది మెదక్ జిల్లాలోని, పుల్కల్ మండలం, సింగూరు గ్రామం వద్ద నిర్మాణమయింది. దీని పూర్తినిలువ సామర్థ్యం 30 శతకోటి ఘనపు అడుగులు (టీఎంసీలు). సింగూరు జలాశయం మూలంగా 32892 ఎకరాల భూమి, 68 గ్రామాలు ముంపుకు గురవడమే కాక ఘనపురం ఆయకట్టు రైతాంగానికి సగం నీరు తగ్గిపోయిందని మెదక్‌జిల్లాలో రైతాంగం తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చడంతో, వారి కోపాన్ని చల్లార్చే ఉద్దేశంతో ప్రభుత్వం 31-10-1980 నాడు జీవో 455 ఇచ్చి సింగూరు జలాశయంలోని 2 టీఎంసీల నీటిని ఖరీఫ్ సీజన్లో ఆరుతడి పంటల కోసం ఇస్తామని 40 వేల ఎకరాలకు ప్రయోజనం కలిగిస్తామని ఆశలు కల్పించింది. వారి ఆశలు సజీవంగా ఉంచే తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ డ్యాంలో తూముల ఏర్పాటు కూడా చేసింది. కాలువ తవ్వడంగాని, నీటిని విడుదల చేయడం కాని ఎలాంటి చర్యలు చేపట్టలేదు. నిర్మాణ సమయంలో ప్రభుత్వాన్ని డబ్బు అవసరమేర్పడి ప్రపంచబ్యాంకు నిధుల కోసం అర్థించడం, వారు సింగూరు జలాశయాన్ని జంటనగరాల తాగునీటి సరఫరా కోసమే ప్రధానంగా వాటి షరతుపైన నిధులు మంజూరు చేయడం జరిగింది. ఆ షరతుల్లోని భాగమే ప్రభుత్వం 24-2-1990 నాడు జారీ చేసిన జీవో 93. దీని ప్రకారం జలాశయంలో విధిగా ప్రతినెల మొదటి తేదిన ఉండవలసిన నీటి మట్టాలను నిర్దేశించింది.

1990 సంవత్సరం నుంచి జలాశయం పూర్తిగా జంటనగరాలకే అంకితమయింది. ఘనపురం ఆయకట్టు రైతులుగాని, నిజాంసాగర్ రైతులు గాని నీటికోసం వెంపర్లాడితే ప్రభుత్వం ఎప్పటికప్పుడు బిచ్చమేసినట్టుగా స్పెషల్ జీ.వో. ఇవ్వడం, సాగునీటి కోసం కొంచెం కొంచెం నీటిని వదలడం తప్ప మెదక్ నిజామాబాద్ రైతులకు ప్రాజెక్టు ఏర్పడ్డప్పుడు ఇచ్చిన హామీలు ఎన్నడూ నెరవేర్చిన పాపానపోలేదు. తెలంగాణ ఉద్యమ ఫలితంగా కేసీఆర్ కేంద్రం ప్రభుత్వంలో చేరడం, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి నరేంద్ర ఎన్నికై ఇద్దరు కేంద్రమంవూతులు కేంద్రంపై వత్తిడి తెచ్చిన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టంలేకున్నా 26-7-2005 నాడు జీవో 136 ఇచ్చి 1990లో ఇచ్చిన జీవోను సవరించి, 40 వేల ఎకరాల కోసం 2 టీఎంసిల నీటి విడుదల నిమిత్తం 88కోట్ల 99 లక్షల రూపాయల ఖర్చుతో పరిపాలనా ఆమోదం తెలిపింది. అంటే ఇచ్చిన హమీని కార్వరూపం దాల్చే తొలి ప్రయత్నం ప్రారంభం కావడానికే 15 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత మహాలక్ష్మి కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ సంస్థకు 9-5-2006 నాడు కాలువలు, ఉప కాలువలు మొదలైన పనులు చేపట్టే పనిని అప్పగించింది. పనులు రెండేళ్ళలో పూర్తి కావలసి ఉన్నా, ఇప్పటికీ మూడు దఫాలుగా గ్రాంటులు విడుదలయినా పనులు 50 శాతం కూడా పూర్తవకపోవడం మెదక్ జిల్లా రైతాంగం దురదృష్టం. ఇదిలా ఉంటే, హైదరాబాద్ తాగునీటి కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 93 మెదక్ జిల్లా రైతాంగానికి శాపంలా మారింది. కాలువ తూముల స్థాయి 520 మీటర్లు. జలాశయం పూర్తి నీటి స్థాయిమట్టం 523. 60మీటర్లు. కాలువలోకి నీటిని వదలాలంటే కనీసం డ్రైనింగ్ హెడ్ మరో మీటరు వేసుకున్నా 521 మీటర్ల పై స్థాయిలోనే నీటిని వదలాలి. జీవో93 ప్రకారం 520 మీటర్లు స్థాయి జలాశయంలో నీరుండే పరిస్థితి లేదు. కాబట్టి నీరు వదలాలన్న లక్ష్యం పూర్తికాదు. కనుక మెదక్ జిల్లా రైతాంగం ఆశలపై నీళ్లు చల్లకుండా ఉండేందుకు ప్రభుత్వం ఓ ఎత్తిపోతల పథకానికి ‘నిలారపు రాజనర్సింహ’ పథకానికి 32.65కోట్ల ఖర్చుతో 2-3-2009 నాడు జీవో 160 విడుదల చేసి నాంది పలికింది. ప్రస్తుత ఉపముఖ్యమంత్రి దామోదరపు రాజనర్సింహ తండ్రిగారి స్మృత్యర్థం ఈ ప్రాజెక్టు వెలిసిందని అర్థం చేసుకోవచ్చు. కనుక ఈ ప్రాజెక్టు రూపకల్పన నుంచి అవతరణ వరకు ఉపముఖ్యమంత్రి హస్తం ఉంటుందని ఆశించడంలో ఎలాంటి అనుమానం ఉండకూడదు. ఈ ఎత్తిపోతల పథకం పనిని తపిల్-ఎస్‌విఇ-డబ్ల్యూ.పి.ఐ.ఎల్ జాయింట్ వెంచర్ సంస్థకు 22-4-2011 నాడు కట్టబెట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నది. వచ్చిన చిక్కు జలాశయంలోని కనీస నీటిమట్టం గురించి. సింగూరు ప్రాజెక్టును రూపొందించినప్పుడు పూర్తి జలస్థాయిని 523. 260 మీటర్లుగా, కనీస నీటిమట్టాన్ని 516.00 మీటర్లుగా చూపెట్టడం జరిగింది. ఆరోజున జీవో 93 గురించి సహజంగా తెలియదు. ఇది 1990లో జారీ చేసింది. దీని ప్రకారం నీటిని 518. 250 మీటర్ల (ఆగస్టు నెల కనీస స్థాయి కన్నా తక్కువ ఉండటానికి వీల్లేదు. అంటే నీటి పంపుల ద్వారా పైకి లాగాలి.

518.250 మీటర్ల నీటిని విధిగా తీసుకోవాల్సిన పరిస్థితి. కనుక ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఇది కేవలం ఫార్మాలిటీ అనుకుందాం. వివాదమవడం అంటే 518. 25 మీటర్ల పై నుంచి తగ్గడం మొదలుపెడితే మెదక్ రైతాంగం కోసం కేటాయించిన 2 టీఎంసీలకే పరిమితం చేస్తారో ఇంకా ఎక్కువ లాగేస్తారో ఎలా నియంవూతించడం అన్నది ప్రధాన సమస్య. ఎక్కువ లాగేసుకుంటే ఆ నీటిపైన ఆధారపడిన నిజాంసాగర్ ఆయకట్టు పరిస్థితి ఏమిటని నిజాంసాగర్ ఆయకట్టును పరిరక్షించవలసిన ఈజిల్లా ప్రతినిధిగా భారీ నీటిపారుదల శాఖామంత్రి సుదర్శన్‌డ్డి ఆందోళన. అదేవిధంగా సింగూరు నీటిపైనే ఆధారపడ్డ జంటనగరాల పరిస్థితి గురించి సీమాంవూధుల ఆవేదన. అంతటితో మెదక్ జిల్లా ఘనపురం ఆయకట్టు రైతుల బాధ కూడా ఇదే. అంటే ఒకసారి నియంవూతణ లేకుండా 518.250 మీటర్లపై నుంచి ఉన్ననీటిని లాగి కాలువలో పడేసుకుంటే తలెత్తే పరిణామాలను ఊహించుకుని పడే బాధ ఈ వివాదానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. సింగూరు పూర్తి జలస్థాయి 523.60 మీటర్లు పూర్తి నీటి సామర్థ్యం సుమారు 30 టీఎంసీలు, 518.25 మీటర్ల నీటి మట్టం స్థాయి వద్ద నీటి సామర్థ్యం 9, 972 టీఎంసీలు. అంటే 518.25 ఎత్తువరకు ఉండే అత్యధిక నీటి సామర్థ్యం (30.000-9.972-20.025 టీఎంసీలు). అంటే సగటున 10 టీఎంసీల స్థాయి వరకు లాగే అవకాశం ఉన్నది. పర్మిషన్ ఉన్నది 2 టీఎంసీల వరకే కనుక, 518.250 మీటర్లపై నుంచి అనుమతి ఇస్తూనే ఎలాంటి పరిస్థితుల్లో 2 టీఎంసీల కన్నా మించకుండా నీరు జలాశయం నుంచి ఎత్తిపోతల ద్వారా కాని, గ్రావిటీ అంటే తూముల ద్వారా కాని తీసుకపోవడానికి ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం మధ్యేమార్గంగా 8-10-2012 నాడు మెమో నెంబర్ 12955/హెచ్‌అండ్‌హెచ్‌ఐసీ ద్వారా ఈ వాదానికి తెరదించింది. దీంతో తాత్కాలికంగా మెదక్ జిల్లా ముఖ్యంగా ఆంధోల్ నియోజకవర్గ రైతులకు సంతోషం కలిగించిందని భావించవచ్చు. నిజానికి జలాశయంలో తూముల స్థాయి 520 మీటర్లకు ఎగువన నీటి విడుదలకు అవకాశం ఉంటే పంపుల అవసరం ఉండదు. తూముల నుంచి నీరు గ్రావిటీ ద్వారా ప్రవహించే అవకాశం లేనప్పుడు పంపింగ్ చేయవలసి ఉంటుంది. అది కూడా 518. 25 మీటర్ల వరకే. ఎమైనా మొత్తం నీటి పరిమాణం అటు గ్రావిటీగా గాని, అలా తూముల తీసుకున్న నీరు సరిపడినంత పరిమాణం లేనప్పుడు మిగతా నీటిని ఎత్తిపోతల ద్వారా గాని 2 టీఎంసీలే. ఈ రెండు టీఎంసీలతో 40 వేల ఎకరాలకు నీరు ఎలా అందిస్తారన్నది వేరేమాట. ఆంధ్రవూపదేశ్‌లో ఒక టీఎంసీ 20 వేల ఎకరాల పం ట పండించిన ఉదాహరణలను ప్రభు త్వం రైతులకు చూపే లెక్కలను కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అసలు రెండు టీఎంసీల నీటిని తమ జిల్లాలోని సింగూరు జలాశయం నుంచి తీసుకోవడానికి మెదక్ లాంటి ఎలాంటి ఇతర నీటి వనరులు లేని కరువు జిల్లా నుంచి తీసుకోవడానికి ఇంతగా అవస్థపడటమేమిటో ఒకపట్టాన అర్థంకాదు. దానికి ఇంత రాజకీయ దుమారం అవసరమా? ఉప ముఖ్యమంత్రి తెరాస నాయకుడితో లాలూచిపడుతున్నాడని, తన పీఠానికి ఎసరు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని ముఖ్యమంవూతికి నూరిపోసిందెవరు?

నిజాంసాగర్ సాకుగా చూపి భారీ నీటిపారుదల మంత్రిని ముఖ్యమంత్రి ప్రాచుర్యంలోకి నెట్టి ఇద్దరు తెలంగాణ మంత్రుల మధ్య చిచ్చుపెట్టడానికి పన్నుతున్న కుట్రలోని భాగంగానే అనుమానించవలసి వస్తుంది. రెండు టీఎంసీలు కాకపోతే మూడు టీఎంసీలు వాడుకుంటారు. ఎక్కువలో ఎక్కువ నాలుగు టీఎంసీలు వాడుకుంటారు. సింగూరు కోసం త్యాగం చేసిన మెదక్ జిల్లా ఆమాత్రం వాడుకుంటే కొంపలు మునుగుతాయా? అయినా ఇవి తెలంగాణ జలాశయంలోని నీళ్లే కదా! తెలంగాణ జలాశయంలోని పరివాహక ప్రాంతంలోని ఒక జిల్లా ఎక్కువగా మరో జిల్లా తక్కువగా వాడుకుంటే ఎమవుతుంది. దానికింత రాద్ధాంతం సృష్టించాలా? ఎలాంటి అనుమతి లేకుండా కృష్ణా జలాలను పోతిడ్డిపాడు ద్వారా జబర్దస్తీగా ఎత్తుకుపోతుంటే నోరుమెదపని సీమాంధ్ర నాయకులు, ఆర్‌డీఎస్ తూములను పగలగొట్టి ఆర్‌డీఎస్ కాలువలోకి చట్టవూపకారం వెళ్లవలసిన నీటిని కేసీ కాలువలకు మళ్ళిస్తూ ఉంటే నోరుమెదపని ప్రభుత్వం, సాగర్ ఎడమ కాలువలోని తెలంగాణ నీళ్లను 11 టీఎంసీల వరకు బాజప్తాగా మళ్ళించి నూజివీడు, తిరువూరు ప్రాంత ఆంధ్ర ఆయకట్టును పెంచుకుంటే .. పట్టించుకోని ప్రభుత్వం పత్రికలు, మీడియా ఇంత చిన్న వివాదాన్ని గోరంతలు కొండతలు చూపడం ఆశ్చర్యంగా ఉన్నది. ఈ సందర్భంగా తెలంగాణ నాయకులకు, ముఖ్యంగా మంత్రులకు ఒక విన్నపం. ఏదైనా సమస్య ఉంటే దాన్ని దయచేసి సంబంధిత తెలంగాణ నిపుణులతో సంప్రదించి పరిష్కారం మార్గం కోసం అన్వేషించండి.అంతేకాని పిల్లుల మధ్య రొట్టె సమస్య పరిష్కారానికి కోతిని ఆహ్వానించకండి. తెలంగాణ ఇంజనీర్లు, మేధావులు, వ్యవసాయశాస్త్రనిపుణులు అనేకమంది స్వచ్ఛందంగా తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారానికి అన్ని వేళలా సంసిద్ధులై ఉన్నారు. వారి సేవలను ఉపయోగించుకోండి. మీ సమస్యలను తీర్చాలని సీమాంధ్ర పాలకుల గూటికి వెళ్ళకండి. వాళ్లు మీ ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నంలోనే మీకు దుర్మార్గమైన పరిష్కార మార్గాలు సూచిస్తారు. వారి ఉచ్చు లో చిక్కుకున్నారంటే ఇక అంతే సంగతులు. తెలంగాణ సమస్యలకు అంతి మ శాశ్వత పరిష్కారం తెలంగాణ రాష్ట్రంలోనే అన్న నిజాన్ని గ్రహించండి.

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్
[email protected]

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

Published: Sun,September 16, 2012 10:48 PM

పడుతూలేస్తూ పాలమూరు ప్రాజెక్టులు

సార్-మా పాలమూరు ప్రాజెక్టుల పరిస్థితేంది? వాటికి నీళ్ల కేటాయింపు ఉన్నదా? కరెంటున్నదా? పైసలున్నయా? అన్ని సక్రమంగా వుంటే మరి ఎందుకు