ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!


Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమో ఇంకా కేంద్ర జలసంఘంలోనే అటకాయించి ఉందని ఆమధ్య మీడియాలో చెప్పారు. ఏది నిజం ప్రస్తుత పరిస్థితి ఏమిటి?

-కైజారపు కోదండయ్య పంతులు, నాగారం నల్లగొండ జిల్లా


మీరన్నట్టు ప్రతినాయకుడు తెలిసీ తెలియకుండా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపైన ప్రకటనలు చేస్తున్నారు. అంతవరకు నిజం. జాతీయ ప్రాజెక్టు- కేంద్ర ప్రభుత్వ ఆమోదం అంతా హంబగ్. పచ్చిఅబద్ధం. ‘ఆలులేదు, చూలులేదు’ అన్న సామెత గుర్తుకు తెచ్చుకోండి. నిజం ఏమిటంటే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తెలంగాణ కలల పంట. అది సార్థకమయిన్నాడు తెలంగాణ వరవూపసాదిని అవుతుంది. దీన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ 28 ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టర్లకు అప్పగించాడు. కేంద్ర జలసంఘం ఈ ప్రాజెక్టుకు సూత్రవూపాయపు అంగీకారాన్ని తెలిపింది. దీన్నే ఇంగ్లిషులో (In principle clearence) అంటారు. ఇది ఇచ్చారంటే రాష్ట్ర ప్రభుత్వం ఈప్రాజెక్టు కోసం క్షేత్ర అధ్యయనాలు జరిపి DPR అంటే డీటెల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసి కేంద్రానికి పంపవచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అంతేగాని కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటు ్టకాదు. ఇంజనీరింగ్ నివేదికతోపాటు పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆమోదంకోసం అవసరమయ్యే పర్యావరణ అధ్యయన నివేదికలు తయారు చేయాలి. బోలెడు తతంగముంటుంది. ఇప్పటిదాక జరిగిందేమంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసే పనిని కేంద్ర జల మంవూతిత్వశాఖ అధీనంలో పనిచేసే వాటర్ ఆండ్ పవర్ కన్సెప్టూంట్ సర్వీసెస్ (WAPCOS) అన్న ప్రభుత్వరంగ సంస్థకు అప్పచెప్పింది. వారు రిపోర్టు తయారు చేసి కేంద్ర జల సంఘానికి అందజేశారు. ఆ రిపోర్టును కేంద్ర జలసంఘం పరిశీలిస్తోంది.

ఇంజనీరింగ్ నివేదిక అందించడంతోపాటు పర్యావరణకు సంబంధించిన ప్రజాభివూపాయ సేకరణ, ఇతర అధ్యయనాలను కూడా WAPCOS నిర్వహిస్తున్నది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు సాధించిన విజయాలు రెండు: ఒకటి- కేంద్రం నుంచి సూత్రవూపాయ అంగీకారం పొందడం, రెండు- మహారాష్ట్ర ముఖ్యమంవూతితో ఒప్పం దం చేసుకోవడం. ఈ రెండూ ముఖ్యమైనవే.

కానీ అంతమాత్రం చేత ప్రాజెక్టును కేంద్రం ఆమోదించినట్టు కాదు. కేంద్ర జల సంఘం సాంకేతిక, ఆర్థిక కోణాల నుంచి ఈ ప్రాజెక్టుకు అంగీకారం తెలపాలి. పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖలు క్లియన్స్‌లు ఇవ్వాలి. గిరిజన మంత్రిత్వశాఖ (అవసరమైతే) ఆమోదం తెలపాలి. వీటి ఆధారంగా ప్రణాళిక సంఘం పెట్టుబడుల అనుమతి ఇస్తుంది. ప్రణాళికా సంఘం ఆమోద ముద్ర వేస్తేనే ఆ ప్రాజెక్టు సక్రమవుతుంది. అంటే కేంద్రం నుంచి గ్రాంటులు గానీ ఇతర సంస్థలు అంటే ప్రపంచ బ్యాంకు, US AID, జపాన్ ఇంకా ఇతర దేశాలందించే రుణాలు గాని పొందడానికి అర్హత సాధిస్తుంది. ఇక జాతీయ ప్రాజెక్టుగా పరిగణింపబడాలంటే కేంద్ర కేబినెట్ ఆమోదం పొం దాలి. ఇవేవీ జరగకుండా మన నాయకులు బాధ్యతారహిత్యంగా వీలైనన్ని చోట్ల పోలవవరం, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా ఆమోదింప చేయడానికి తీవ్రమైన కృషి చేస్తున్నాం అని హామీలు గుప్పించటం గమనిస్తున్నాం. వారు చేస్తున్న కృషి ఏమిటో భగవంతునికే తెలియాలి!

ఇప్పుడు జరుగుతున్నదేమంటే కేంద్ర జలసంఘంలో వివిధ డైరెక్టరేట్లు వివిధ అంశాలను పరిశీలిస్తున్నాయి. ఇందులో ప్రాథమిక పరిశీలన నీటి లభ్యత అన్న అంశం గురించి. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు ప్రాణహిత నదిలో లభ్యమయ్యే 160 టీఎంసీలను ఉపయోగించుకుంటుంది. ప్రాణహిత నదిపైన తుమ్ముడిహట్టి అనే చోట మనం బ్యారేజీ కట్టే ప్రతిపాదన ఉంది అంటే ఆ బ్యారేజీ వద్ద ప్రాణహిత దగ్గర ఎన్ని నికర జలాలు ఉన్నాయి. అందులో ఇతర ప్రాజెక్టులకు అవసరమైన నీరుపోను‘ కొత్త ప్రాజెక్టు అయిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వినియోగార్థం ఎన్నినీళ్లు మిగుల్తాయి? అన్న లెక్కను కేంద్రం తేల్చవలసుంటుంది. మన తరఫున WAPCOS తయారు చేసిన నివేదికలో మొత్తం 273.02 టీఎంసీల నీరు తుమ్ముడిహట్టి దగ్గర లభ్యం కాగలవని తెలియచేసింది. ఇందులో మహారాష్ట్ర వాటాకు చెందవలసిన 41 టీఎంసీలుపోను నికరంగా 236.50 టీఎంసీలు లభ్యం కాగలవని కేంద్ర జలసంఘం 2009 సంవత్సరంలో మన రాష్ట్ర ప్రభుత్వానికిచ్చిన సూత్రవూపాయ అంగీకారంలో స్పష్టంగా చెప్పడం జరిగింది.

అయితే ఇప్పుడు కేంద్ర జలసంఘంలోని హైడ్రాలజీ డైరెక్టరేట్ నీటి లభ్యతను పునఃపరిశీలించి తాను ఇదివరకు వెలిబుచ్చిన అభివూపాయంపై సందే హం వ్యక్తంచేసింది. తాజా అభివూపాయం ప్రకారం 160టీఎంసీల నీరు లభించకపోవచ్చు. అంటే మన లక్ష్యాలు పూర్తిగా దెబ్బతినే అవకాశమున్న ట్టు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కంగారుపడ్డ రాష్ట్ర ప్రభుత్వం ఇదేమిటి 160 టీఎంసీలు లభ్యం కాగలవని మీరే గతంలో ఒప్పుకుంటిరి కదా! ఆ ప్రాతిపదికనే మేం మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంటిమి.తుమ్ముడిహట్టిని జాయిం ట్ ప్రాజెక్టుగా నిర్మించి, రెండు రాష్ట్రాలు ప్రయోజనాలు పొందాలని తదుపరి చర్యలు చేపడుతున్నాం. ఈనేపథ్యంలో మీరు స్టాండ్ మారిస్తే మా పరిస్థితి ఏంకాను? అన్న ఆవేదన వెలిబుచ్చడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల మంత్రిత్వశాఖ అమాత్యులతో కూడా చర్చించడం జరిగింది. ఇప్పుడు ఈ విషయంపైన తమ అభివూపాయాన్ని తెలియచేయవలసిందిగా అంతర్ రాష్ట్ర వ్యవహారాలు చూసే విభాగాన్ని (ISM Directorate) ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం బంతి అక్కడ ఉంది. ఇంతలోపే ఈ వివాదం ఎందుకు ఏర్పడ్డదంటే ప్రాణహిత జలాల వినియోగంపై గోదావరి ట్రిబ్యూనల్‌లో పొందుపర్చిన ఆగ్రిమెంట్‌లోని కొన్ని పదాల కారణంగా ఈ ఆగ్రిమెంట్‌ను మహారాష్ట్ర, మధ్యవూపదేశ్, ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు (సచివులు) 7-8-1978 నాడు సంతకం చేశారు.

ఆ ఆగ్రిమెంట్‌లో అంటే అంగీకారం పత్రంలో ప్రాణహితకు నీరంద చేసే ‘పెన్‌గంగ(జి-7) సబ్‌బేసిన్, 2) వార్ధా (జి-8) సబ్‌బేసిన్, 3) ప్రాణహిత (జి-9) సబ్‌బేసిన్‌లో ఆంధ్రవూపదేశ్‌కు ఎగువన ఉన్న మహారాష్ట్ర, మధ్యవూపదేశ్‌లకు గల నీటి హక్కులను ప్రస్తావించి, ఆ హక్కులు పోను మిగతా నీటిని అనుభవించే హక్కును ఆంధ్రవూపదేశ్‌కు ధారదత్తం చేయడం జరిగింది. మహారాష్ట్ర, మధ్యవూపదేశ్‌లకు వివిధ డ్యాం సైట్‌ల దగ్గర గల హక్కులను ప్రస్తావిస్తూ అన్ని జలాలపై హక్కు ఆ రాష్ట్రాలకుంటుందని పేర్కొనడం జరిగింది. ‘ALL WATERS’ అంటే సమస్త జలాలు లేక అన్ని జలాలపై ఆరాష్ట్రాల హక్కు ఉందని అగ్రిమెంట్‌లో రాయ డం వల్ల ఇక పైనుంచి వచ్చే ఆ నీటిలో ఎలాంటి హక్కు ఆంధ్రవూపదేశ్‌కు ఉండ దన్న అభివూపాయాన్ని వ్యక్తం చేసినట్టవుతున్నది. ‘All waters అంటే All utilisable waters అన్ని నీళ్ళు అని అర్థం చేసుకోవాలి’ అని మన రాష్ట్రం వాదిస్తున్నది.

మామూలుగా 75 శాతం విశ్వసనీయత ప్రాతిపదికన నీళ్ల లభ్యత ఆధారంగా ప్రాజెక్టులను రూపొందించడం ఆనవాయితీ. కనుక అదే ప్రాతిపదికన వినియోగించుకోగల నీళ్ళ పరిమాణాన్ని అంచనావేయాలి. కాని వచ్చే నీళ్లన్నీ ఆపై రాష్ట్రాలకు, ఇక దిగువన వచ్చే నీళ్లు మాత్రమే మీకు అనడం భావ్యం కాదని మన వాదన. ప్రస్తుతం కేంద్ర జలసంఘంలోని అంతర్‌రాష్ట్ర వ్యవహారాలు చూసే విభాగం పరిశీలిస్తున్న అంశం ఇదే. నవంబర్ 5 వ తేదినాడు నేను కేంద్ర జలసంఘం సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా ఈ అంశంపై చర్చిండం జరిగింది. కాకతాళీయంగా ప్రాణహిత-చేవెళ్ల చీఫ్ ఇంజనీర్ కూడా అదే సమయంలో ఇదే అంశంపైన చర్చించేందుకు వచ్చారు. కేం ద్ర జల సంఘం మా ఉభయులతో చర్చలు కొనసాగించింది. తమ తుది అభివూపాయం వెలిబుచ్చేముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరికొంత సమాచారాన్ని కేంద్ర జలసంఘం అధికారులు కోరారు. మా వాదనలతో కేంద్ర జల సంఘం ఏకీభవిస్తున్నట్టుగానే కనిపించింది. ఏదేమైనా నీటి లభ్యత పైన ఏర్పడ్డ ప్రతిష్టంభన తొలగడానికి మరికొంత సమయం పట్టవచ్చు.

ఇది ఆదిలోనే మనం ఎదుర్కొన్న హంస పాదు. ఇంకా చాలా మెట్లు ఎక్కవలసిన అవసరముంది. ఎన్నో అవరోధాల అధిగమించవలసిన అగత్యముంది. ము ఖ్యమైన అవరోధం‘బీ-సీ’నిష్పత్తి అంశం కావచ్చు. బీ-సీ అంటే Benefit cost ప్రాజెక్టుపై పెట్టే ఖర్చు దానిపై వచ్చే రాబడి అన్నమాట. మామూలుగా ఏ ప్రాజెక్టుపైనైనా ఒక్కరూపాయి ఖర్చు పెడితే ఒకటిన్నర రూపాయలు ఆదాయం వచ్చేట్టుగా ఉండాలి. ఇది భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు మూలంగా ఒనగూరే ప్రయోజనాలు అధికంగానే ఉన్నా పెట్టే ఖర్చును అధిగమించేట్టుగా ఉండాలి. ఈ అంశం మరో ప్రతిబంధకంగా మారే అవకాశం ఉన్నది. అన్నిటికంటే ప్రధానమైనది విద్యుత్తు లభ్యత అంశం. ఈ ప్రాజెక్టు విజయం రైతులకు ఉచిత విద్యుత్తు అందివ్వడంపైనే ఆధారపడి ఉన్నది. ఈ ప్రాజెక్టుకు 3300 మెగావాట్ల విద్యుత్తు అవసరముందన్న అంచనా. ఈ ప్రాజెక్టుకు విద్యుత్తు ఎక్కడి నుంచి తెస్తారు? ఎలా ఇస్తారు? అన్న అంశంపైన కేంద్రాన్ని ఒప్పించగలిగాం. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా జెన్‌కో సరఫరా చేస్తుందన్న హామీపైనే ప్రతిపాదనలు పంపినట్టుగా ఉంది. ఇప్పుడు రాష్ట్రం విద్యుత్తు విషయం లో ఎలాంటి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సమస్యను ఎలా ఎదుర్కొబోతున్నది? కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా సమాధానపర్చబోతోంది? అనేది అతి ముఖ్యమైన ప్రశ్న.

ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం వారు రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలకు అవసరమయ్యే విద్యుత్తు అవసరాలను తీర్చే పథకం, సొంత విద్యు త్తు కేంద్రాల ఏర్పాటు గురించి ముఖ్యమంవూతికి ఒక ప్రతిపాదనతో వినతి పత్రం ఇచ్చి కూడా ఆరునెలలు దాటింది. ఇంతవరకు దాని పరిస్థితి పట్టించుకున్న నాథుడు లేడు.

ఒక పక్కన కాస్తో కూస్తో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో ప్రాణహిత- చేవెళ్ల పథకం పడుతూలేస్తూ ప్రయాణం సాగిస్తున్నది. మరోపక్కన ప్రజాభివూపాయసేకరణ జరుగుతున్నది. ఇంకో పక్కన నాయకులు హామీల వర్షంతో ప్రజలను మభ్యపెడుతున్నారు. మరో పక్కన కేంద్ర జలసంఘంలో ప్రాజెక్టు రిపోర్టు పరిశీలన నత్త నడకన సాగుతున్నది. ఏదేమైనా తెలంగాణ ఇంజనీర్లు, పట్టువదలని విక్రమార్కుల్లా వెంటబడితే తప్ప ప్రాజెక్టు ముందుకు సాగదు. తెలంగాణ ప్రజావూపతినిధులు, మంత్రులు కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి ప్రాజెక్టును వీలైనంత తొందరగా సాంక్షన్ చేయించుకుని, ఆతర్వాత జాతీ య ప్రాజెక్టు కోసం గట్టిగా ప్రయత్నించాలి. ‘గాలిలో దీపం పెట్టి భగవంతు డా నీవే ఆధారం’ అన్నట్టుగా వ్యవహరిస్తే లాభముండదు.
పోలవరానికెన్ని అవరోధాలు కలిగినా, కేంద్ర జలసంఘం ఎన్ని అభ్యంతరాలు వెలిబుచ్చినా సీమాంధ్ర ప్రజావూపతినిధులు ఎలా పట్టుబట్టి ఇందుకు ప్రణాళికా సంఘం అనుమతులు సాధించగలిగారో ఇందుకు తార్కాణం. ఢిల్లీలో వారు ఎంత మంత్రాంగం నడిపారో, ఎన్ని పాచికల వేశారో అర్థం చేసుకుంటే వారు చేసిన లాబీయింగ్ తెలిసొస్తుంది. దురదృష్టమేమంటే పోలవరం విషయంలో సీమాంధ్ర కాంట్రాక్టర్లే ప్రజావూపతినిధులు. వారే పైరవీకారులు. ఢిల్లీలో చక్రం తిప్పగలిగిన సమర్థులు. మరి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు అంత సమర్థత, బలం ఉందో లేదో తెలియదు. ఒక్కటి మాత్రం నిజం. పోలవరం సాధన కన్నా ప్రాణహిత సాధన అనేక రెట్లు కష్టం. తెలంగాణ సాధించడం ఎంత కష్టమో ప్రాణహిత కూడా దాదాపు అంతే కష్టం. తమ్ముడూ ‘ఇల్లు అలుకగానే పండుగ కాదు’ అన్న సామెత ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు విషయంలో నూటికినూరు పాళ్లు నిజం.

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్
[email protected]

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

Published: Sun,September 16, 2012 10:48 PM

పడుతూలేస్తూ పాలమూరు ప్రాజెక్టులు

సార్-మా పాలమూరు ప్రాజెక్టుల పరిస్థితేంది? వాటికి నీళ్ల కేటాయింపు ఉన్నదా? కరెంటున్నదా? పైసలున్నయా? అన్ని సక్రమంగా వుంటే మరి ఎందుకు