బాబ్లీ- భిన్న వాదనలు


Sun,November 18, 2012 10:42 PM

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మీరు వాదనలు జరుగుతున్నప్పుడు ఉన్నారా? ఏం జరిగింది? తీర్పు ఏవిధంగా ఉండబోతున్నది?

-తడకమళ్ల ప్రవీణ్‌కుమార్, తార్నాక, హైదరాబాద్


సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు రెండుగంటలసేపు బాబ్లీ కోసమే ఏర్పాటైన ప్రత్యేక బెంచి అన్నిపార్టీల వాదనలను శ్రద్ధగా విన్నది. కోర్టు తీర్పు ను రిజర్వ్ చేసిన మాట కూడా వాస్తవమే. కోర్టులో మహారాష్ట్ర, మనరాష్ట్ర అధికారులు, లాయర్‌తోపాటు, రిట్ పిటిషన్లు వేసిన టీఆర్‌ఎస్ పక్షాన నేను, టీడీపీ పక్షాన మాజీ మంత్రి మండవ వెంక పాల్గొన్నాం.ఈ రెండు పార్టీల తరఫున సుప్రసిద్ధ లాయర్ గంగూలీ హాజరయ్యారు. పోచంపాడు (శ్రీరాంసాగర్) జలాశయం పరిధి 55 కిలోమీటర్ల దాక మహారాష్ట్ర భూభాగంలో పరుచుకుని ఉన్నది. ఉభయ రాష్ట్రాల సరిహద్దుకు 10కిలోమీటర్ల ఎగువన శ్రీరాంసాగర్ జలాశయ పరిధిలో మహారాష్ట్ర తన భూభాగంలోనే ‘బాబ్లీ బ్యారేజీ’ని నిర్మించనారంభించింది.

దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనంలేకపోవడంతో సుప్రీంకోర్టు గడప తొక్కింది. 6-10-1975 నాడు ఇరురాష్ట్రాలు చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి మహారాష్ట్ర మన జలాశయం అంతర్భాగంలో బ్యారేజీ నిర్మించడం ద్వారా శ్రీరాంసాగర్‌లోకి వచ్చే వరద నీటి ని అడ్డుకోవడమే కాకుండా, వర్షా లు లేక పైనుంచి ప్రవాహంలేని రోజుల్లో శ్రీరాంసాగర్ జలాశయం నుంచి 65 టీఎంసీల దాక నీటిని వెనక్కు తోడుకునే ప్రమాదమున్నందున వెంటనే మహారాష్ట్ర చేపట్టిన అక్రమ కట్టడాన్ని తొలిగించాలని తగు ఆదేశాలు ఇవ్వాల్సిందని మనం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇందుకు ప్రతిగా మహారాష్ట్ర 6-10-75నాడు చేసుకున్న ఒప్పందాన్ని ఏమాత్రం అతిక్షికమించలేదని, ఒప్పందం ప్రకారం తాను పోచంపాడు డ్యాం సైట్ దాక 6-10-75 తరువాత చేపట్టే కొత్తవూపాజెక్టుల వినియోగార్థం 60టీఎంసీల దాక గోదావరి నీటిని వాడుకునే అర్హత ఉందని, బాబ్లీ బ్యారేజీ వినియోగించుకునే 2.74 టీఎంసీలను కలిపినా తనకున్న 60 టీఎంసీల కేటాయింపులోపేనని వాదించింది. పైగా తనభూభాగం నుంచి నీటిని తీసుకునే హక్కును ఎవరూ కాదనలేరని, ఎంత తీసుకున్నా 60 టిఎంసీలను మించదని తెలిపింది. పోతే శ్రీరాంసాగర్ జలాశయం బ్యాక్ వాటర్‌లో కేవలం 0.65 టీఎంసీలను మాత్రమే తన బ్యారేజీ వాడుకుంటుందని, దాన్ని తిరిగి ఆంధ్రవూపదేశ్‌కు వాపసు చేయడం జరుగుతుందని వాదనలు చేసింది.

వాదనలు జరుగుతున్న కాలంలో సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి బ్యారేజీ నిర్మాణం తన ‘రిస్క్’ మీద కట్టుకోవచ్చని, కాకపోతే బ్యారేజీకి గేట్లు అమర్చవద్దని అంటూ మధ్యంతర ఉత్వరువులిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ మహారాష్ట్ర 13 గేట్లుకు బదులుగా 14గేట్లును అమర్చింది.కాకపోతే ఆ గేట్లను ‘ఆపరేట్’ మాత్రం చేయడంలేదు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన విషయాలను కూడా మనరాష్ట్రం సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒరిజినల్ సూట్లకు తోడుగా కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ, టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్, నేనూ సంయుక్తంగా మూడు రిట్ పిటిషన్లను సుప్రీంకోర్టులో వేస్తే వాటిని ఒరిజినల్ సూట్‌లకు (టాగ్) చేయడం జరిగింది.అనేక వాదోపవాదాలు జరిగాక, సుప్రీంకోర్టు అంతకు కితం అంటే, అక్టోబర్ 2012లో చేపట్టిన విచారణలో శ్రీరాంసాగర్ జలాశయం పరిధిలో బాబ్లీ నిర్మాణం అంటే..,ఒక రిజర్వాయర్ పరిధిలో మరోక రిజర్వాయర్ ఏర్పాటు చేయడం అక్రమమా? సక్రమమా? అన్న అంశం పక్కనబెట్టి, బాబ్లీ బ్యారేజీ గేట్లు మూసేయనంతవరకు ఎగువ నుంచి వచ్చే ప్రవాహనికి ఎలాంటి అడ్డులేకుండా శ్రీరాంసాగర్‌లోకి ఆనీరు పోతుందికదా! అందులో ఎలాంటి అభ్యంతరం ఉండకూడదని తేల్చి చెప్పకపోతే మహారాష్ట్ర ప్రభు త్వం గేట్లు వేసీ ఉంచే వ్యవధిలో ప్రతి సంవత్సరం అంటే పోస్ట్‌మాన్‌సూన్ 29 అక్టోబర్‌నుంచి- 31మే వరకు పై నుంచి గోదావరినీరు ఎంత పరిమాణం రాగలదని, దాన్ని ఏమేరకు మహారాష్ట్ర ఉపయోగించుకుంటుందని, నికరంగా ఆ వ్యవధిలో శ్రీరాంసాగర్‌కు ఏమేరకు నష్టం వాటిల్లుతుందని తెలుసుకునే ఉద్దేశంతో సంబంధిత గణాంకాలను సమర్పించమని మహారాష్ట్రకు ఆదేశాల్చింది. గణాంకాల ప్రతిని సకాలంలో ఆంధ్రవూపదేశ్‌కు అందచేయమని చెప్పడం జరిగింది. ఈనేపథ్యంలో 8-11-2012 నాడు సుప్రీంకోర్టులో ఆసక్తికరమైన చర్చలు సుదీర్ఘంగా కొనసాగినయి. ముందుగా మహారాష్ట్ర తన వాదనలు ప్రారంభించి-29 అక్టోబర్ నుంచి 31 మే దాకా పై నుంచి వచ్చే నీరు 2.57 టీఎంసీలని తాను నిర్మించిన బాబ్లీ బ్యారేజీ సామర్థ్యం 2.74 టీఎంసీలనీ, పైగా తాను బాబ్లీ ద్వారా వినియోగించుకోదలచిన 2.57 టీఎంసీల నీరు గోదావరి ట్రిబ్యూనల్ రిపోర్ట్‌లో చేర్చిన 6-10-75నాటి ఒప్పందం ప్రకారం 60 టీఎంసీల గరిష్ట పరిమితికి లోబడే ఉందని ఆంధ్రవూపదేశ్ ఆరోపిస్తున్నట్లుగా తాను 60 టీఎంసీల గరిష్ట పరిమితి దాటిలేదని, శ్రీరాంసాగర్ జలాశయం నీటిని వెనక్కు లాక్కునే అవకాశం (గేట్లు వేసి ఉంచుతాం కాబట్టి)కూడా లేనేలేదని వాదించింది. ఇక 29-అక్టోబర్ నుంచి 31-మే వరకు గేట్లు మూసిఉంచే విషయం సక్రమంగా కొనసాగేందుకు గాను ఇరురాష్ట్రాల మధ్య ఇటీవలే జరిగిన ‘ప్రాణహిత- చేవెళ్ల ఒప్పందం’లో ప్రతిపాదించిన కమిటీలలో దేన్నైనా సుప్రీంకోర్టు ఆమోదిస్తే సంయుక్తంగా ఏర్పాటు చేయడానికి తాము సంసిద్ధులమనీ తెలిపింది.

కనుక ఎలాంటి భయాలు, అనుమానాలకు అవకాశం లేకుండా ఆంధ్రవూపదేశ్‌కు హామీ ఇస్తున్నాం కనుక బాబ్లీ బ్యారేజీకి అనుమతించవలసిందిగా మహారాష్ట్ర కోరింది. ‘2.57 టీఎంసీలు ఎలా తేల్చారు’ అని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు కేంద్ర జలసంఘం వారు ప్రచురించిన డేటా ఆధారంగా ప్రాజెక్టు ప్లానింగ్‌కు అనుసరించే.. 75 శాతం ప్రాతిపదిక ప్రకారమే ప్రవాహ డేటాలో ఆ అంకెను నిర్ధారణ చేశామని మహారాష్ట్ర జవాబు ఇచ్చింది. మహారాష్ట్ర తరఫున వాదనలు వినిపించిన వ్యక్తి ప్రముఖ న్యాయవాది అంధ్యార్జున మహారాష్ట్ర సమర్పించిన గణాంకాలపై స్పందించమని సుప్రీంకోర్టు ఆంధ్రవూపదేశ్ న్యాయవాది రాజ్యసభ్యుడు పరాశరన్‌ని అడిగినప్పుడు మహారాష్ట్ర సమర్పించిన గణాంకాలు సరైనవే కానీ,వారు 75 శాతం ప్రాతిపదికన వచ్చే నీటిని మాత్రమే బ్యారేజీలో నిలువ చేస్తామనడం మాత్రం పూర్తిగా అవాస్తమని కుండబద్దలుకొట్టారు. 75శాతం ప్రాతిపదికన చూపే సంఖ్య75 శాతం సంవత్సరాలలో ప్రవహించే కనిష్ట జల ప్రవాహామని, దాన్ని కొత్త ప్రాజెక్టుల రూపకల్పన కోసం వాడతారు తప్ప, అది వచ్చే ప్రవాహానికి సంకేతం కాదన్నారు.


వందేళ్ల ప్రవాహాం లెక్కకు తీసుకున్నప్పు డు 74 సంవత్సరాలపాటు, ఆ అంకె కంటే ఎక్కువ ప్రవాహం వస్తుందని, 75 వ ఏట మాత్రమే 2.57 టీఎంసీలు అంధ్యార్జున చెప్పిన అంకె వస్తుంద ని కనుక బ్యారేజీ వద్ద లభించే జాలాలు 74 శాతం సంవత్సరాలపాటు 2.73 టీఎంసీల కన్నా అధికం గా సగటున 14.62 టీఎంసీలపాటు లభిస్తుందని, ఆ వ్యవధిలో బ్యారేజీ నుంచి విరివిరిగా పంపు చేస్తూ వీలైనంత ఎక్కువ నీటిని మహారాష్ట్ర వినియోగించుకునే వీలుంటుందని తెలిపింది. ప్రణాళికా సంఘం 75 శాతం విశ్వసనీయత ఆధారంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ఆమోదించిందని 6-10-75 నాడు చేసుకున్న ఒప్పందంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిజల స్థాయి1091 అడుగులు చూపబడిందని చెప్పింది. బ్యారేజీ నిర్మాణమయ్యే మహారాష్ట్ర బ్యారేజీ నుంచి గేట్లు మూసాక నాన్‌మాన్‌సూన్ సీజన్ (29 అక్టోబర్ నుంచి- 31 మే వరకు)లో పై నుంచి వచ్చే వరద జలాలను వాడుకుంటే ఆ మేరకు శ్రీరాంసాగర్ జలాశయంలోకి నీరురాక, పూరి ్తజలస్థాయికి చేరుకోలేదని వాదించింది. 75 శాతం విశ్వసనీయత ఆధారంగా రూపొందించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు తన నిర్ధారిత లక్ష్యాన్ని సాధించలేదని సమర్థంగా వాదించారు.

అంధ్యార్జున వాదించినట్టుగా బ్యారేజీ 2.57 టీఎంసీలు లేక, 2.73 టీఎంసీలు కాకుండా ఇంకా ఎంతో ఎక్కువ నీటిని వినియోగించుకోగల అవకాశముందని పరాశరన్ చేసిన వాదనతో సుప్రీంకోర్టు దాదాపు అంగీకరించినట్టే అనిపించింది.అసలు బ్యారేజీతో పనేలేదు. బ్యారేజీ గేట్లు అమర్చకుం డా ఉంటే మహారాష్ట్ర కోరినట్టు మొత్తం 2.74 టీఎంసీల నీటిలో ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వం 1.65 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన భలేగాంవ్ బ్యారేజీ వినియోగం పోను, మిగతా1.09 టీఎంసీల నీటిని ఆంధ్రవూపదేశ్ మహారాష్ట్రకు తన వాటా నుంచి ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పింది. అందుకు మహారాష్ట్రను అంగీకరింప చేయాల్సిందిగా సుప్రీంకోర్టును పరాశరన్ అర్థించారు. భలేగాంవ్ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టని, దాని సామర్థ్యం 0.65 టీఎంసీలు మాత్రమేనని, అయినా దానితో కలిసి మొత్తం బాబ్లీతో సహా తాను 60 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకోవడం జరుగుతుందనీ, కనుక బాబ్లీని అనుమతించవలసిందిగా మహారాష్ట్ర కోరింది.

ఆదశలోనే సుప్రీంకోర్టు ‘మహారాష్ట్ర, ట్రిబ్యూనల్ తనకు కేటాయించిన 60 టీఎంసీలు మించకుండా యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తే, బాబ్లీ నిర్మాణానికి మీ అభ్యంతరమేమిట’ని మన రాష్ట్రాన్ని అడిగింది. అప్పుడు మహారాష్ట్రను నమ్మలేమ ని, 13 గేట్లు అని చెప్పి14 గేట్లు అమర్చిందని సుప్రీంకోర్టు వద్దని చెప్పినా గేట్లు అమర్చిందని, మహారాష్ట్ర మాటలను విశ్వసించలేమని జవాబు ఇచ్చిం ది. కేంద్రం ఆధ్వర్యంలో నీటి వినియోగం కోసమే కమిటీ వేస్తే అప్పుడు అభ్యంతరాలేమిటని సుప్రీం అడిగినప్పుడు ‘నిఘా కమిటీలు ఆచరణలో సాధ్య పడేవి కావు. అంతకన్నా బ్యారేజీ అవసరం లేకుండా మహారాష్ట్రకు కావలసిన నీటిని తాము ఇచ్చే ప్రతిపాదన ఉత్తమ’మని మనరాష్ట్రం పునరుద్ఘాటించింది. ఈదశలో రిట్ పిటిషన్ల తరఫున ప్రముఖ న్యాయవాది గంగూలీ జోక్యం చేసుకుంటూ మహారాష్ట్ర తనకు ట్రిబ్యూనల్ కేటాయించిన 60 టీఎంసీలకన్నా మరో 9.8 టీ ఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు లు కట్టుతుందని, శ్రీరాంసాగర్ ఎగువన 5లిఫ్ట్ స్కీములు ఇదివరకే పనిచేస్తున్నాయని, మరో 6 ప్రాజెక్టులు రాబోతున్నాయని చెప్పారు. ఇక నిఘా సంస్థల గురించి ప్రస్తావిస్తూ తుంగభద్ర కంట్రోల్‌బోర్డు కొంతకాలంపాటు సక్రమంగా పనిచేసినా, ఇప్పుడు సమర్థంగా పనిచేయలేకపోతుందని ఆ కంట్రోల్ బోర్డు కేంద్ర జలసంఘం ఇంజనీర్ అధ్యక్షతనే నిర్వహింపబడుతుందని చెప్పారు. ప్రధాని నేతృత్వంలో ఏర్పడ్డ కావేరీ రివర్ అథారిటీ సైతం సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా అమలు చేయలేకపోతుందని,రోజురోజుకూ రాజకీయ నాయకుల జోక్యం అధికం కావడం మూలంగా ఏ కంట్రోల్‌బోర్డు సక్రమంగా పనిచేయడం లేదనీ, కేవలం ప్రభుత్వోద్యోగులకే ఈ సమస్యను వదిలేసే..్తఆసంస్థలు ఎంతో మెరుగ్గా పనిచేయగలవని చెప్పారు.

సుప్రీంకోర్టు ఈ దశలో దేశంలో నీటి సమస్యలను తీర్చడానికి ఓ శాశ్వత ట్రిబ్యూనల్ ఏర్పాటు చేయడం సబబుగా ఉంటుందని, ఇందుకోసం పార్లమెంటులో బిల్లు తెస్తే బావుంటుందన్న అభివూపాయాన్ని వ్యక్తంచేస్తూ..ఈ విషయంలో చొరవచూపమని పార్లమెంట్ సభ్యులయిన పరాశరన్‌కు సూచించింది. చివరకు తమ తీర్పును రిజర్వ్ చేస్తూ ఆంధ్రవూపదేశ్,మహారాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా కేంద్ర జలసంఘం డేటాను తమకనువైన పద్ధతిలో సమర్పించాయనీ, దాన్ని పరిశీలించడం కష్టమవుతుందనీ, ఇరు ప్రభుత్వాలు కలిసి ఒకే డేటా పుస్తకం సమర్పించమని ఆదేశించడం జరిగింది. అంధ్యార్జున, పరాశరన్, గంగూలీ ముగ్గురు లాయర్లు తమ వాదనల సారాంశాన్ని క్లుప్తంగా..నోట్ రూపంలో పదిహేను రోజుల్లో సమర్పిస్తే, ఆ తరువాత తమ తీర్పును వెల్లడిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది.

ఇది 8-11-2012 నాడు సుప్రీంకోర్టులో జరిగిన బాబ్లీ కథ సంగ్రహంగా...ఇక చివరగా మీరు కోర్టు ఏతీర్పు ఏవిధంగా ఉండబోతుందని అడిగారు! శ్రీరాంసాగర్ జలాశయంలో ఇప్పటికే నిర్మించిన బాబ్లీని తొలిగించమని సుప్రీంకోర్టు బహుశా చెప్పకపోవచ్చు.కాకపోతే బాబ్లీతోసహా మొత్తం మహారాష్ట్ర నీటి వినియోగం 60 టీఎంసీలకే పరిమితమయ్యే బాధ్యతను కేంద్రంఆధీనంలో పనిచేసే ఒక నిఘా సంస్థను ఏర్పాటు చేసి దానికి అప్పగించే అవకాశమున్నది. అదేవిధంగా అదే సంస్థ నిర్ణీత సమయాల్లో గేట్లు మూసేయడం, తెరవడం లాంటి పను కూడా చూసే బాధ్యతను చేపడుతుంది.ఏదేమైనా మహారాష్ట్రను కట్టడి చేస్తే తప్ప శ్రీరాంసాగర్‌కు జరిగే భారీనష్టం తప్పుతుంది. ఇప్పటివరకు కట్టిన ప్రాజెక్టులేకాదు,భవిష్యత్తులో కట్టబోయే ప్రాజెక్టులపైన కూడా నియంవూతణ లేకపోతే మహారాష్ట్ర విశృంఖలంగా నీటిని వాడుకుని, తెలంగాణ ప్రాజెక్టులకు నీరు రాకుండా చేసే అవకాశముంటుందనడంలో ఎలాంటి అనుమానంలేదు. కొత్త ప్రాజెక్టుల కోసం మహారాష్ట్ర వాడుకునే 60 టీఎంసీల గురించే మాట్లాడుతున్నది. కానీ పాత ప్రాజెక్టుల పంచాయితీ 42 టీఎంసీలా?,19 టీఎంసీలా ఇంకా తేలవలసి ఉన్నది. మరి సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? నిఘా సంస్థ ఏర్పాటు చేస్తే అది ఏమేరకు న్యాయం చేకూరుస్తుంది? ఈ ప్రశ్నలకు జవాబు భవిష్యత్తు మాత్రమే చెబుతుంది.

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్
[email protected]

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

Published: Sun,September 16, 2012 10:48 PM

పడుతూలేస్తూ పాలమూరు ప్రాజెక్టులు

సార్-మా పాలమూరు ప్రాజెక్టుల పరిస్థితేంది? వాటికి నీళ్ల కేటాయింపు ఉన్నదా? కరెంటున్నదా? పైసలున్నయా? అన్ని సక్రమంగా వుంటే మరి ఎందుకు