అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు


Sun,December 30, 2012 11:53 PM

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన చెందాం. ఐతే మీరు అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారనీ, కేసీఆర్ మరికొందరు నాయకులు మిమ్మల్ని పరామర్శించి పేపర్లో చదివి మరింత ఆందోళనకు గురయ్యాం. ప్రస్తుతం మీ ఆరోగ్యపరిస్థితి కుదుటపడిందా?ఇటీవలి కాలంలో మీ దృష్టికి వచ్చిన నీటి ప్రాజెక్టుల విషయాలేమైనా ఉంటే మాకు చెప్తారా? -కె. దుర్గా మల్లేశ్వరరావు, జనగాం, వరంగల్ జిల్లా
Damనిజమే. దాదాపు నెలరోజులకు పైగా అస్వస్థతతో బాధపడుతూ నిమ్స్ లో చికిత్స చేయించుకున్నాను. దేవుని కృప వల్ల మీలాంటి లక్షలాది శ్రేయోభిలాషుల ఆశీస్సుల వల్ల తెలంగాణ మేధావులు, రచయితలు, ప్రజల చల్లని దీవెనల కారణంగా గండం గడిచి బయటపడ్డాను. మరి కొంతకాలం పాటు చికిత్స కొనసాగుతుంది.అందుచేత మునుపటిలా వారంవారం మీకు కనిపించను. ఏదైనా ముఖ్యమైన సంఘటన, డెవలప్‌మెంట్ చోటుచేసుకుంటే చిన్న చిన్న వ్యాసాల ద్వారా మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. నా ఈ ప్రయత్నానికి పూర్తి సహకారమిచ్చిన ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యానికి, ‘టీ-న్యూస్’ యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఈ నెల రోజుల వ్యవధిలో నా దృష్టికి వచ్చిన ప్రధాన అంశాలు నాలుగు. అందులో ఒకటి-బాధ కలిగించేది. మిగిలిన మూడు సంతోషం కలిగించిన అంశాలు. ముందుగా ఖేదం కలిగించిన అంశం ప్రస్తావిస్తాను.

మళ్లీ మళ్లీ అవే అబద్ధాలు:ఇటీవలి కాలంలో రాష్ట్ర విస్తృత స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సదస్సు జరిగింది. ఆ సదస్సులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి పోలవరం ప్రస్తావన తీసుకొచ్చారు. పోలవరం వల్ల కలిగే లాభాల చిట్టా పేర్కొంటూ ‘పోలవర ం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నా రు. వాస్తవానికి పోలవరం కట్టితే 45 టీఎంసీల కృష్ణా నికర జలాలు తెలంగాణకు, రాయలసీమకు దక్కుతాయ’ న్నారు. ఏ విజయమ్మో, చిరంజీవో మరో నాయకుడో పోలవరం గురించి తెలిసీ తెలియక మాట్లాడితే రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. అన్ని విషయాలు సంపూర్ణంగా తెలిసి ఉండవలసిన ముఖ్యమంత్రి సాంకేతికంగా ఏ సమాచారాన్నైనా నిముషాల మీద అందించడానికి సిద్ధంగా ఉన్న అధికార గణంతో వాస్తవాలను తెలుసుకుని ఎంతో బాధ్యతగా ప్రవర్తించవలసిన పెద్దమనిషి, వాస్తవాలను మరుగున పరిచి ఇలా అబద్ధాలను పదేపదే వల్లించుకుంటూ పోతే ఏమనుకోవాలి? అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడవలసిన ముఖ్యమంత్రి ప్రవర్తించవలసిన పద్ధతి ఇదేనా?

ఇంతకీ నిజమేమిటంటే.. ప్రభుత్వం పోలవరం వద్ద 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తే.. అప్పుడు సంభవించే ముంపు లెక్కలు కట్టింది. కానీ ఇప్పుడు ఆ వరద 50 లక్షల క్యూసెక్కులయింది. స్పిల్‌వే డిజైన్‌ను 50లక్షల క్యూసెక్కుల లెక్కన రివైజ్ చేశారు. కానీ ముంపు లెక్కలు యథాతధంగా ఉంచారు. పోలవరం కట్టితే ప్రభుత్వ లెక్కల ననుసరించి ఖమ్మం జిల్లాలోని 276 గ్రామాలు ముంపుకు గురైన గ్రామాల్లో నివసించేవారు అత్యధికంగా గిరిజనులు నిర్వాసితులవుతారు. ఖమ్మం జిల్లాలో ఒక లక్షా యాభైవేల ఎకరాల పంటభూమి నీట మునుగుతుంది.

ఇక అడవి సంగతి సరేసరి. ఆంధ్రా ప్రాంతంతో పోలిస్తే నీట మునిగే గ్రామాలు, నిర్వాసితులయ్యే గిరిజనులు, ఇతర ప్రజలు, పంటభూములు , అటవీ ప్రాంతం అన్నీ ఆంధ్రకన్నాఎంతో ఎక్కువే. పోలవరం వల్ల వచ్చే లాభం-7 లక్షల 20వేల ఎకరాలు అదనంగా సాగులోకి (ఆంవూధా వూపాంతంలో), మరో 16 లక్షల ఎకరాలు వరదనీటితో సాగునీరు చేసుకునే యోచన. (అందుకే కాలువ సైజును భారీగా పెంచారు). ఉత్తరాంధ్ర వరకు తాగునీటి ప్రయోజనాలు కనుక ‘తెలంగాణను ముంచి ఆంధ్రకు లబ్ధి చేకూర్చే ప్రాజెక్టు పోలవరం’అని అంటే.. కాదని చెప్పమనండి! ఏ ఇంజనీరునైనా.

ఇక ముఖ్యమంత్రి పదేపదే ఉచ్ఛరించే 45 టీఎంసీల మాట సంగతి విషయమేమంటే.. పోలవరంకు అన్ని అనుమతులు కేంద్రం ఇచ్చి , సుప్రీంకో ర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెను పోలవరం నుంచి 80 టీఎంసీల నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించుకోవచ్చు అన్నది బచావత్ ట్రిబ్యూనల్ ఇచ్చిన తీర్పు. గోదావరి-కృష్ణా లింకు పూర్తి కానక్కరలేదు. పోలవరంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరు క్షణమే తరలించుకుపోయే 80 టీఎంసీలలో 35 టీఎంసీలు మహారాష్ట్ర,కర్ణాటక వినియోగించుకోవచ్చన్నది బచావత్ తీర్పు కనుక, పై రాష్ట్రాలు జూరాలకు వదలవలసిన కృష్ణ నికర జలాలలో 35 టీఎంసీలను తగ్గించుకుని మిగతా నీటిని మాత్రమే వదులుతారు.

కనుక శ్రీశైలంకు, నాగార్జునసాగర్‌కు పై రాష్ట్రాల నుంచి వచ్చే నికర జలాల్లో 35 టీఎంసీల కోత పడుతుందన్నమాట. కృష్ణా డెల్టాకు బచావత్ అవార్డు చేసిన కేటాయింపుల ప్రకారం లభించవలసిన నీరు 181.20 టీఎంసీలు. అందులో ప్రభు త్వం తీసుకున్న నిర్ణయం(బచావత్ ట్రిబ్యూనల్‌లో కూడా పేర్కొన్న విధంగా)80 టీఎంసీల నీరు నాగార్జునసాగర్ నుంచి రావాలి. మిగతా 101.20 టీఎంసీల నీరు సాగర్ కిందినుంచి రావాలి. పులిచింతల నిర్మా ణం కాని కారణంగా ఇంతకాలం ప్రభుత్వం బచావత్ తీర్పును ఉల్లంఘించి జారీ చేసిన జీవోలను పక్కనపెట్టి డెల్టా వాళ్ల బెదిరింపులకు లొంగి శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నీళ్లున్నా , లేకపోయినా డెల్టావాళ్లకు అగ్రతాంబూలం అనే సంప్రదాయం కొనసాగిస్తూ పోయింది.

ఇక ఇప్పుడు డెల్టా వాళ్లకు పీడ విరగడై పోతుంది. 80 టీఎంసీల నీళ్లు పోలవరం నుంచి వస్తే మిగతానీరు సాగర్ కిందినుంచి వస్తుంది. ఎలాగూ పులిచింతల తయారై వాళ్లకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా పనిచేస్తుంది. మరీ అనుకున్న విధంగా నీరు తక్కువవుతే ఎట్లాగూ మాది నూటా యాభై ఏళ్ల చరిత్ర కలిగిన డెల్టా అన్న పాత చింతకాయ పచ్చడి సిద్ధాంతం, ప్రభుత్వం సాఫ్ట్ కార్నర్ ఎలాగూ ఉండనే ఉంటుంది.

సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల నీరు వదలడంలేదు. కనుక ఆ నీటిని (నికర జలాలను) శ్రీశైలం నుంచి సీమ ప్రాజెక్టులకు, తెలంగాణ ప్రాజెక్టులకు వాడుకోవచ్చని ప్రభుత్వ ఆలోచన. మిగులు నీటిపై ఆధారపడ్డ సీమాంధ్ర ప్రాజెక్టులలో వెలిగొండ పకాశం),గాలేరు నగరి, తెలుగుగంగ, హంద్రీనీవాలకు 150.5 టీఎంసీలు ప్రభుత్వం మిగులు జలాలను కేటాయించింది. ఇక తెలంగాణ ప్రాజెక్టులకు అంటే నెట్టంపాడు, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీలకు కలిసి 77 టీఎంసీలు కేటాయించింది. బేసిన్‌లో ఉన్న తెలంగాణకు 77 టీఎంసీలేమిటి? బేసిన్ బయట ఉన్న సీమాంవూధకు 150.50 టీఎంసీలు ఎందుకు కేటాయించారు? అని ఏ తెలంగాణ నాయకుడైనా అడిగిన పాపానపోలేదు. తెలువక పోవడమటుంచి, ఎంత కాలం సీమాంధ్ర నాయకుల కాళ్లకు మొక్కి కుక్కకు బొక్కేస్తే సంతోషంగా కాళ్ల దగ్గర పడుండే బానిస నైజం మన నాయకులకు ఇంకెన్నాళ్లు?

బచావత్ గడువు తీరడంతో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యూనల్ అవతరించింది. ఇటీవలే ప్రాథమిక తీర్పును వెల్లడించిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యూనల్ మిగులు జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టుల్లో ఒక్క తెలుగుగంగకు మాత్రం 25 టీఎంసీలు ఆమోదం తెలిపింది. ఇప్పుడా అవార్డు పునఃసమీక్షలో ఉండటమే గాక సుప్రీంకోర్టు కూడా అంతిమ తీర్పు వెల్లడించవలసి ఉంటుంది. మన కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పే మాట ప్రకారం- 45 టీఎంసీలు మనకు దక్కుతాయి. కనుక ఆయన 30 టీఎంసీలను సీమాంధ్ర ప్రాజెక్టులకు కేటాయించి 15 టీఎంసీలను తెలంగాణకు కేటాయించే అవకాశముంది. (పాత నిష్పత్తి 150.5:77). అంటే ఒట్టి పుణ్యానికి 30 టీఎంసీల కృష్ణా జలాలు, రాయలసీమకు దక్కుతాయన్నమాట. ఇంత భారీ ఎత్తున నష్టం కలిగే తెలంగాణకు పోలవరం వల్ల కలిగే లాభం కేవలం 15 టీఎంసీలు. 15 టీఎంసీలతో ఏడాదికి లక్షా 50వేల ఎకరాలకు సాగునీరందించవచ్చు. పోలవరం మూలంగా మనిగే భూమే ఒక లక్షా 50వేల ఎకరాలు. ఇప్పుడు చెప్పండి? మన సీఎం అబద్ధాన్ని వీలైన చోటల్లా చెప్పుకుంటూ పోతూ ప్రజలను ఎంత గందరగోళానికి గురిచేస్తున్నారో? సీమాంవూధకు దక్కే 30 టీఎంసీలను కిరణ్‌కుమార్‌డ్డికి ఇష్టమైన ప్రాజెక్టు హంద్రీనీవాకు తరలిస్తాడని వేరే చెప్పాలా?

సంతోషించదగిన మూడు విషయాలు:ప్రాణహిత-చే ప్రాజెక్టు అనుమతులు అంటూ ఈ మధ్యనే ఒక ప్రముఖ దినపవూతిక ‘ప్రాణహిత-చే చకచక’ అన్న శీర్షికన కథనం రాసింది. ఇంతకాలం మనకు భయం కలిగించిన విషయంలో, నీటి లభ్యత గురించి కేంద్ర జల సంఘం తమ అనుమతిని తెలిపిందని రిపోర్టు చేసింది. కేంద్ర జలసంఘం ఖరారు చేసిన అతిముఖ్యమైన అంశం నీటిలభ్యత. పైగా ఇది అంతర్‌రాష్ట్ర ఒడంబడికల ననుసరించి ఖరారు చేయవలసి ఉంటుంది. కేంద్ర జలసంఘం సంబంధిత అధికారులను ఒప్పించి చేసే దిశలో ఈ రచయిత కూడా తన వంతు పాత్ర నిర్వహించాడు. ఇంకా కేంద్ర జలసంఘం అనుమతులు రావలసి ఉన్నా దానికి అట్టే ఆలస్యం కాకపోవచ్చు. తెలంగాణకు వరవూపసాదిని అయిన ప్రాణహిత ప్రాజెక్టు ఒకఅడుగు ముందుకు వేసినట్టే.

డిండీ ఎత్తి పోతల పథకం:మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలోని మూడు లక్షల ఎకరాల మెట్ట ప్రాంత భూములకు నీరందివ్వడమే గాక, నల్లగొండ ఫ్లోరైడ్ బాధితులకు ఊరట కలిగించే ఈప్రాజెక్టుపై డీటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసి సంబంధిత చీఫ్ ఇంజనీర్‌కు సమర్పించడం జరిగింది. ఇది జరిగింది 2009-10 సంవత్సరంలో. తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడ్డ చీఫ్ ఇంజనీర్ దాన్ని ప్రభుత్వానికి సమర్పించకుండా ‘డిలే టాక్టిక్స్’ ఉపయోగించి చీఫ్ ఇంజనీర్స్ కమిటీకి పంపించి చేతులు దులుపుకున్నాడు. ఏదేమైనా ఈ కమిటీ దీన్ని గత రెండు సంవత్సరాలుగా కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టింది. ఇటీవలే ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం, ఆయన వెంటనే అధికారులను పురమాయించడం, ఈనెల 30 (డిసెంబర్ 30 లోపు) రిపోర్టును సమర్పించమని కఠినంగా హెచ్చరించినట్టు తెలిసింది. ‘దేవుడు వరమిచ్చినా పూజారి వరాలివ్వలేదు’ అన్న సామెతకిది ప్రత్యక్ష నిదర్శనం. ఏదేమైనా ఇది శుభ పరిణామం.

లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు:ఈ ప్రాజెక్టుకు అంతర్ రాష్ట్ర ఒప్పందాలు జరిగి పనులు కూడా జరుగుతున్నాయి. అయితే విధిగా పర్యావరణ అనుమతులు (ఆంవూధా వూపాంత అనుమతుల కోసం) పొందాలి. ప్రభుత్వం లోగడ సమర్పించిన టీఓఆర్ పర్యావరణ అనుమతుల కమిటీకి నచ్చక వాపసు చేసింది. తాజాగా ప్రభు త్వం ఇచ్చిన వివరణలతో సంతృప్తి చెందిన కమిటీ పర్యావరణ ప్రభావిత అధ్యయన నివేదిక తయారు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రాజెక్టు మరో ముందడుగు వేసింది. ఏదేమైనా మనకు స్వరాష్ట్రం వచ్చేదాకా ఈ వలసవాద సీమాంధ్ర అధికారుల ఆగడాలు, దురాగతాలు తప్ప వు. ఇటీవలే కేంద్రం భరోసా ఇచ్చినట్టు సోనియమ్మ దయతలిచి తెలం గాణ ఇవ్వడానికి సుముఖంగా ఉండి ప్రకటన చేస్తే మనకు ఈ సమైక్య పీడ విరగడవుతుంది. చూద్దాం. ఈ తెలంగాణ వాళ్లకు శాప విమోచనం కలగడానికి ఇంకా ఎంత కాలం పడ్తుందో..!

-ఆర్ విద్యాసాగర్‌రావు
కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్
[email protected]

36

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

Published: Sun,September 16, 2012 10:48 PM

పడుతూలేస్తూ పాలమూరు ప్రాజెక్టులు

సార్-మా పాలమూరు ప్రాజెక్టుల పరిస్థితేంది? వాటికి నీళ్ల కేటాయింపు ఉన్నదా? కరెంటున్నదా? పైసలున్నయా? అన్ని సక్రమంగా వుంటే మరి ఎందుకు