పతాక రూపకర్తను స్మరించుకుదాం


Thu,January 24, 2013 11:40 PM

pingaliఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్పి పింగళి వెంకయ్య. పింగళి వంశీయులు మహారాష్ట్ర ప్రాంతం నుంచి వలస వచ్చినవారు. వీరనారిగా చరివూతపుటల్లో ప్రసిద్ధికెక్కిన ఝాన్సీ లక్ష్మీబాయి పింగళివారి ఇంటి ఆడపడుచు. అటువంటి మహనీయుడు 1878 ఆగస్టు 2వ తేదీన కృష్ణాజిల్లా భట్లపెనుమఱ్ఱు గ్రామంలో జన్మించి బాల్యం గడిపాడు. 1938లో గాంధీ విగ్రహ ఆవిష్కరణ సందర్భమున ఆ గ్రామాన్ని సందర్శించినట్టు పెద్దలు చెప్పారు. ఆ మహనీయుని గురించి మనం తెలుసుకోవలసిన విషయాలు అనేకం.

స్వాతంత్య్రం కోసం దేశవ్యాప్తంగా పోరాటాలు మహోన్నతంగా సాగుతున్న రోజులలో, 1921లో విజయవాడలోని గాంధీనగర్‌లో కాంగ్రెస్ కమిటీ సమావేశంలో పాల్గొన్న బాపూజీ కోరిక మేరకు మూడు గంటల వ్యవధిలో పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించారు. కాషాయ రంగు త్యాగశీలతకు, తెలుపు రంగు సచ్చీలతకు, నిర్మలత్వానికి, ఆకుపచ్చ రంగు సౌభాగ్యానికి చిహ్నాలుగా మధ్యలో రాట్నంతో రూపొందించిరి. ఆ త్రివర్ణ పతాకంలో నెహ్రూ సలహా మేరకు రాట్నానికి బదులు అశోక ధర్మచక్రం ఉంచారు. భారత రాజ్యాంగ సభ 1947 జూలై 22న ఈ పతాకాన్ని ఆమోదించింది.

చొరవ, సాహసం మూర్తీభవించిన వెంకయ్య 12 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి లోయర్ సెకండరీ పూర్తిచేసి బందరు హిందూ హైస్కూలులో చదివి, బొంబాయి వెళ్లి సైన్యంలో చేరి దక్షిణావూఫికాలోని బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. తర్వాత జపాన్ వెళ్లి జాతీయ పరిక్షిశమలలో శిక్షణ పొందాలనే కోరికతో జపాన్ భాషను నేర్చుకున్నారు. ఆ భాషలో అనర్గళంగా మాట్లాడుతుంటే తోటి విద్యార్థులు ‘జపాన్ వెంకయ్య’ అని ముద్దుగా పిలిచేవారు. చెరుకు, ప్రత్తి, పొగాకు పంటలపై ఆయన అనేక పరిశోధనలు చేశారు. ఆయన చేసిన పరిశోధనలకు ‘రాయల్ అగ్రికల్చర్ సొసైటీ’ వారు సభ్యత్వం ఇచ్చి గౌరవించారు. బందరులో జాతీయ కళాశాల స్థాపించుటకు ముట్నూరి కృష్ణారావు, కోపల్లి హనుమంతరావు, పట్టాభి సీతారామయ్యతో కలిసి కృషి చేసిన వ్యక్తి పింగళివారు.

యువతరాన్ని ఉత్తేజపరచాలని జాతీయత నెలకొల్పాలని చైనాలో జాతీయ విప్లవాన్ని సాధించిన ‘సన్‌ఎట్‌సేన్’ చరివూతను భారతీయులకు అందించిన మొదటి భారతీయుడు పింగళి. 1912లోనే ఆ గ్రంథంలో టిబెట్ నుంచి దలైలామా పారిపోయే రోజు వస్తుందని, చైనా ఇండియాపై దాడి చేస్తుందని చెప్పిన జ్యోతిష్కుడు. 1924 నుంచి 1944 వరకు ఖనిజాన్వేషణపై దృష్టి మరల్చి వజ్రకరూరు, హంపీ ప్రాంతాలలో వజ్రాలు దొరుకుతాయని అంటూ 1955లో ‘వవూజపు తల్లి రాయి’ అనే గ్రంథాన్ని రాశారు. 1960 వరకు ఖనిజ పరిశోధన సలహాదారుగా ఉన్నారు. 1919 సంవత్సరం బందరు ఓడరేవును పునరుద్ధరించాలనే ఆలోచనతో ఆంగ్లంలో ఒక పుస్తకాన్ని రాశారు. దాన్ని చదివిన నైజాం నవాబు వెంకయ్యను పిలుచుకుని కిషన్ ప్రసాద్ బహదూర్‌తో కలిసి చర్చించారు. స్వాతంత్య్ర సమరయోధుడైన వెంకయ్య- జాతీయజెండా రూపకర్త, నిరంతర అన్వేషకుడు, పరిశోధకుడు. కర్షక శాస్త్రవేత్తగా ఆయన గడిపిన జీవితం మరో ఎత్తు.

1906లో కలకత్తాలో కాంగ్రెస్ మహాసభ జరుగుతుంది అని తెలుసుకున్న వెంకయ్యలో స్వదేశాభిమానం పెల్లుబికింది. దీంతో ఆయన కలకత్తా వెళ్ళి కాంగ్రెస్ సభలో పాల్గొని అందరి మన్ననలను పొంది విషయ నిర్ణాయక సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ సమావేశంలో యూనియన్ జాక్ ఎగరేశారు. అది వెంకయ్యకు నచ్చలేదు. ‘బ్రిటిష్ దేశ జెండా మన జెండా అవుతుందా?’ అనే తపనతో మనకు ఒక జెండా లేకపోబట్టే కదా బ్రిటిష్ జెండా ఎగరేశారు అనుకున్నారు.

ఆయన జాతీయ జెండా రూపకల్పనలో దాదాబాయి నౌరోజీ, బాలగంగాధర్ తిలక్, లాలాలజపతిరాయ్, మోతీలాల్ నెహ్రూ, అశతోష్ ముఖర్జీ, పి.సి.రాయ్, జె.సి.బోస్, బిపిన్ చంద్రపాల్, రవీంవూదనాథ్ ఠాగూర్ వంటి జాతీయ నాయకులను సంప్రదిస్తూ ఉండేవారు. 1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ హోంరూల్ లీగ్ వారు ఒక జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జనవరి ఒకటవ తేదీన ఉద్యమ నాయకురాలు అనిబిసెంట్ దీనిపై న్యూ ఇండియా అనే పత్రికలో వ్యాసం రాశారు. అది పింగళి వారు రూపొందించినదే.

జపాన్ వెంకయ్యగా పిలిచినా, ప్రత్తి వెంకయ్యగా పిలిచినా వజ్రాల వెంకయ్యగా పిలిచినా, రాజకీయ ద్రష్ట, స్వాతంత్య్ర సమరయోధుడు అయినా పింగళి వెంకయ్య జెండా వెంకయ్యగానే సార్ధక నామదేయుడు. అయినా ఆయనకు భారత ప్రభుత్వం సముచిత స్థానం ఇవ్వలేకపోయినది. ఆయన తెలుగువాడి గా పుట్టటమే నేరమా? పింగళి వెంకయ్య గారి చివరి రోజులు చాలా దుర్భరంగా గడిచాయంటే మనందరికి ఆశ్చర్యం కలగవచ్చు. ఖనిజ సలహాదారుడుగా 1960లో ఆయనను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినది. అప్పటి వరకు కాలాన్ని నెట్టుకొస్తున్న ఆయన వయస్సు 82 సంవత్సరములు. చూపు తగ్గిపోయి, నడవలేని పరిస్థితులలో చేతిలో చిల్లిగవ్వలేదు. ఆయన జెండా పేరు చెప్పుకుని చేయి చాచి కడుపు నింపుకోలేదు. సంపాదించిన ఆస్తిలేదు. బతికినంతకాలం పరువుగానే గడిపారు తప్ప ఎవరికి బరువు కాలేదు.

దేశానికి స్వాతంవూత్యము వచ్చి ‘స్వతంత్ర భారత్‌కి జై అనే నినాదాలు మారువూమోగుతూ ‘జాతీయ పతాకం’ ఆకాశంలో స్వేచ్ఛగా రెపపలాడుతూ ఉంటే భారతమాత తన ‘ముద్దుబిడ్డ’ నే మరచిపోయింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారత ప్రభుత్వం ఒక కరపత్రం ‘మన జాతీయ పతాకం’ అని వ్రాస్తూ ‘మన జాతీయ పతాకము నిర్మాణము చేసినది ఒక తెలుగువాడు’ అని వ్రాసినారు. దానిలో పింగళి వెంకయ్య పేరు వ్రాయడానికి ఏ కారణాలు అడ్డువచ్చాయో? 82 సంవత్సరాల వయస్సులో కూడా వెంకయ్యగారు స్వశక్తి మీదనే ఆధారపడవలసి వచ్చినది.

ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు పింగళి పరుశరాం. వీరి పరిస్థితి అంతంత మాత్రమే . రెండవ కుమారుడు చలపతిరావు దేశభక్తితో మిలటరీలో చేరి 1960లో క్షయ వల్ల దివంగతులైనారు. పరిస్థితుల వల్ల ఎలాగో కాలం గడపాలనే ధైర్యంతో జీవితాన్ని గడిపేవారు. గతంలో మిలటరీ సర్వీసు చేయటం వల్ల బ్రిటిష్ భారత ప్రభుత్వం విజయవాడలో చిట్టినగర్‌లో ఇచ్చిన స్థలంలో పూరి గుడిసె వేసుకుని కాలానికి ఎదురీదిన మహానుభావుడు. డాక్టర్ కె.ఎల్.రావు, జి.ఎస్.రాజు, గూడూరు నమశ్శివాయ, కాట్రగడ్డ శ్రీనివాసరావు లాంటి మహానుభావులు ముందుకు వచ్చి పింగళి వెంకయ్యగారి పరిస్థితి చూడలేక 15-01-1963న సన్మానం చేసి ధన సహాయమందించారు.

ఆ తర్వాత ఆరు నెలలకే 4-07-1963న వారు దివంగతులైనారు. ఇప్పటికి వారి కుటుంబాలు చెల్లాచెదురై పూట గడవక కాలం గడుపుతున్నారు. కొన్ని జీవితాలు దేశానికి, ప్రజలకు ఎంత చేసినా ఇంత హీన పరిస్థితిలో గడుపుచున్నారంటే, అది ప్రభుత్వ నిర్లిప్తతా? అలక్ష్యమా? మనం అందరము హృదయం మీద చేయివేసుకుని ఆత్మపరిశీలన చేసుకునే రోజు వస్తుంది. ఆయన ఆఖరి గడియలలో కూడా తను రూపొందించిన జెండాను మరువ లేదు. తను మరణించిన తర్వాత జాతీయ పతాకాన్ని కప్పి, దగ్గరలోని రావిచెట్టుకు కట్టమనేవారు. ఆయన చివరి కోరిక నెరవేరింది.
నాంది

నేను భట్ల పెనుమఱ్ఱు గ్రామములో ఉపాధ్యాయ వృత్తినాచరిస్తూ ఉండగా, ఆంధ్రవూపదేశ్ రాజపుత్తము, నెలవారీ వచ్చే ‘ఆంవూధవూపదేశ్’ అను పుస్తకములో జాతీయ పతాక రూపకర్త గురించి వ్యాసము ప్రచురించబడినది. దాని ఆధారముగా అనేక గ్రంథాలయములలో (విజయవాడ, తెనాలి, గుంటూరు)ను, విజయవాడలోని పత్రికామువూదణాలయములోను తిరిగి సేకరించుట జరిగింది. వాటన్నిటిలోను జాతీయపతాక రూపకర్త పింగళి వెంకయ్య జన్మస్థలం భట్లపెనుమఱ్ఱు గ్రామముగానే యున్నది. గ్రామకరణం కీ.శే. భట్ల పెనుమర్తి నరసింహారావు ధృవీకరించిరి. వెంకయ్య గ్రామాన్ని అనేక పర్యాయములు దర్శించినట్లు కొంతమంది పెద్దలు చెప్పేవారు. హైదరాబాద్‌లోని భట్ల పెనుమఱ్ఱు గ్రామవాసుల సమ్మేళనములో కూడా నేను ప్రస్తావించుట జరిగినది. ఒకసారి ఆంధ్రాబ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య వర్ధంతి చేయుచూ అప్పటి మేనేజరు పాఠశాలకు వచ్చి ఆ కార్యక్షికమమునకు నన్ను కూడా ఆహ్వానించుట జరిగినది.

వక్తలందరు మాట్లాడిన తర్వాత నన్ను మాట్లాడమన్నారు. నేను మాట్లాడుతూ ఆంధ్రాబ్యాంక్‌ను జాతీయం చేసినా, దాని వ్యవస్థాపకులయిన పట్టాభి జయంతి,వర్ధంతి మరిచిపోకుండా జరుపుతారు. వాడ,వాడలో విదేశ రాయబార కార్యాలములలోను కులమత భేదాలు లేకుండా వందనం చేసేది ఒక్క ‘జాతీయజెండా’ అని వ్యాఖ్యానించుట జరిగినది. గోల్డెన్‌జూబ్లీ లోగోను చూపి ఈ జెండా రూపకర్త మన గ్రామవాసి అయినా ఆయన విగ్రహం కాని, ఒక వీధికి గాని పింగళి వెంకయ్య పేరు లేకపోవుట చాలా బాధాకరం అని చెప్పటం జరిగింది. వెంటనే సభాధ్యక్ష స్థానములో ఉన్న మాజీ సర్పంచ్ కీ.శే. చలసాని కుటుంబరావు లేచి వైధర్ మాష్టారు సహరిస్తే విగ్రహానికి ఎంత ఖర్చు అయినా భరిస్తానని చెప్పిరి.

ఆనాటి సభలో ఉన్న సర్పంచ్ దొప్పలపూడి పాపలేని అయినంపూడి రోడ్డు నుంచి గంగానమ్మ గుడి వరకు ఉన్న ప్రధానవీధికి ఆయన పేరు పెడ్తాను అని మాట నెరవేర్చుకున్న ధీశాలి. ఆనాటి సభలో ఎంపీటీసీ కొక్కిలిగడ్డ గౌతముడు, ఉప సర్పంచి గొట్టిపాటి గోపాలకృష్ణ, గ్రామస్తులు ఉన్నారు. వెంకయ్య విగ్రహం తయారు చేయుటకు తెనాలి, గుంటూరు తిరిగి నాలుగు గంటలు చర్చించాను. ఈ జెండాకు తండ్రి (పింగళి వెంకయ్య) అనే భావన వచ్చేటట్టు ఉండాలని కోరిక. ప్రజల చేతిలో ఈ పతాకం పదిలంగా ఉండాలన్న ఆయన కోరిక నెరవేరే విధంగా ఆ వ్యక్తిని- రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గుర్తించకపోయినా -మన గ్రామస్తుడుగా మనం గౌరవించాలి అనే సదాశయముతో విగ్రహం ఏర్పాటుకు కృషి చేశాను.


మన దేశం కోసం ఎందరో మహానుభావులు, త్యాగధనులు ప్రాణత్యాగం చేసినారు. పరదేశపాలనను అంగీకరించక బ్రిటిష్ దమనకాండను వ్యతిరేకించి వారి తూటాలకు బలైనవారు అనేకులు. అంతటి మహానుభావులలో నిత్య పరిశోధకుడు, బహుభాషా కోవిదుడు, వ్యవసాయ శాస్త్రవేత్త, స్వాతంత్య్ర యోధుడు జాతీయపతాక నిర్మాత పింగళి వెంకయ్య జన్మించిన గ్రామంలో నేను కూడా పుట్టానంటే నాకు చాలా గర్వంగా ఉన్నది అని చిరుగుపాటి వరవూపసాద్ (ఎమ్మెల్సీ) అనేక సార్లు చెప్పేవారు.
విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ తిరంగా రన్ ఏర్పాటు చేయుటకు నిర్ణయించారు. అప్పుడు ఎమ్మెల్సీ చిగురుపాటి వరవూపసాద్ చైర్మన్‌గా ఒక కమిటీ వేశారు. తిరంగా రన్ వెంకయ్య పుట్టిన వూరు నుంచి జ్యోతి వెలిగించి ప్రారంభించాలని నిర్ణయించారు.

అది నా గ్రామం కనుక ఎక్కడా ఏ లోపం జరగకూడదని భావించి, అందుకు గ్రామస్తులకు యాభై వేల రూపాయలు గ్రామ సర్పంచ్ గొట్టిపాటి వెంకవూటావు, గొట్టిపాటి శివరామకృష్ణ ప్రసాద్ చిగురుపాటి వరవూపసాద్ అందచేసిరి. 3-2-2008 తేదీ తిరంగా రన్ సందర్భంగా చలసాని అనిల్‌బాబు వెంకయ్య జన్మస్థలంలో భవన నిర్మాణము చేయుటకు అంగీకరించిరి. స్మారక భవనానికి పలువురు ప్రజావూపతినిధులు శంకుస్థాపన చేసిరి. తెనాలి పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలసౌరి 10 లక్షలు, జిల్లా పరిషత్ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు 5 లక్షల నిధులతో భవన నిర్మాణము సాగించుటకు వాగ్దానము చేసిరి.

కొరత ఏర్పడితే నిడుమోలు శాసనసభ్యులు పాటూరు రామయ్య మరో ఐదు లక్షల రూపాయలు ఇచ్చుటకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఈ నాయకులు మాట నిలబెట్టుకోలేకపోయిరి. శిలాఫలకము మాత్రము అలాగే ఉండిపోయినది. ఎవ్వరూ ముందుకు వచ్చి ఏవిధమైన ఏర్పాట్లు చేయలేదు. అది గ్రామస్తులకు తల వంపుగా భావించి అందుకు స్థలదాతలు చలసాని అనిల్‌బాబు, గ్రామవాసి ఎమ్మెల్సీ చిగురుపాటి వరవూపసాద్, చలసాని శాయాజీరావు సమన్వయకర్తగా, భారతదేశ చరివూతలో ఏ గ్రామంలోను ఎవ్వరు చేయని విధంగా, జాతి మరచిన మన పింగళి వెంకయ్య భవన నిర్మాణం కోసం గ్రామస్తులంతా కదం తొక్కుతూ ముందుకు వచ్చి ఆయనకు సముచిత గౌరవం కల్పించుకుంటామని వాగ్దానాలు చేసిరి. భారత చరివూతలో గ్రామ ఔన్నత్యమును చాటుకున్న ఘనత భట్ల పెనుమఱ్ఱు గ్రామస్తులకే చెందుతుం ది.

ఆయన మన మధ్య లేకపోయినా ఆయన సృష్టించిన జాతీయపతాక రూపకర్తగా మాత్రం భారతీయుల హృదయాల్లో చిరస్మరణీయుడు. ఆయన కృషికి గుర్తింపుకాని, ఆదరణగాని లభించలేదు. ఆయన అనేక విషయాలు అనర్గళంగా మాట్లాడేవారు. బహుక్షిగంథకర్త. ఇంతగా దేశానికి సేవలందించిన వెంకయ్య రుణాన్ని మనం ఎలా తీర్చుకున్నామంటే లభించే జవాబు చాలా బాధాకరంగా ఉంటుంది. అటువంటి జాతి రత్నానికి ప్రభుత్వం ఇప్పటికైనా ‘భారత రత్న’ బిరుదు ప్రకటిస్తే ముదావహంగా ఉంటుంది.

సేకరణ: వేములపల్లి వైధర్‌పమీల
(26న పింగళి వెంకయ్య భవనం ప్రారంభోత్సవం సందర్భంగా)

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

Published: Sun,September 16, 2012 10:48 PM

పడుతూలేస్తూ పాలమూరు ప్రాజెక్టులు

సార్-మా పాలమూరు ప్రాజెక్టుల పరిస్థితేంది? వాటికి నీళ్ల కేటాయింపు ఉన్నదా? కరెంటున్నదా? పైసలున్నయా? అన్ని సక్రమంగా వుంటే మరి ఎందుకు

Featured Articles