పాదయాత్రలు ఫలించేనా?


Tue,February 5, 2013 12:02 AM


రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్థం, పరమార్థం ఉండేది. ఓదార్పు యాత్రకు అంతరాయం కలిగింది. జగన్ జైలు పాలైన తర్వాత ఈ మధ్యన చంద్రబాబునాయుడు పాదయావూతను ప్రారంభించారు. తర్వాత ఈ యాత్రను తలదన్నే విధంగా షర్మి ల పాదయాత్ర నిర్వహించారు. అసలు చంద్రబాబు పాదయాత్ర నిర్వహించకపోతే బహుశా షర్మిల ఈ యాత్రను చేసి ఉండేవారు కాదు.ఇద్దరినీ ప్రజలు ఆదరించారు. ఎవరినైనా ఆదరించే క్షమత మన ప్రజల దగ్గర ఉన్నది. ఎన్నికల్లో మాత్రం క్షమించకుండా ఎవరిని ముంచాలో, ఎవరిని తేల్చాలో చేసి చూపెడతారు. పాదయావూతలు గర్జనలుగా మారి వ్యక్తిగత ఆరోపణలు పతాకస్థాయికి చేరుకున్న సందర్భంలో ఈ యాత్రలకు శరీరాలు సహకరించకపోవడం వల్ల ఆగిపోతున్నాయి. డాక్టర్లు రంగంలోకి దిగి ఈ యాత్రల దిశానిర్దేశం చేస్తున్నారు.అసలు రాష్ట్రంలో పాదయావూతలు నిరంతరం చేసేవారు నక్సలైట్లు... వారి వెనుక పోలీసులు. వీరిద్దరి పాదయావూతలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. రాజకీయ నాయకులు సాధారణంగా పాదయావూతలు చేయవలసిన అవసరం రాదు. ఏదైనా ప్రజోపయోగ అంశానికి సంబంధించి సమస్య పరిష్కారం అయ్యేంతవరకు ప్రజలను చైతన్యపరుస్తూ లక్ష్యాన్ని సాధించడానికి పాదయావూతలు చేపబడతారు. ప్రజల మధ్యన పాదయాత్ర చేస్తున్న నేతలకు తమ పార్టీల సమీకరణలు జోడయితే అవి రక్తికడతాయి. మహాత్మాగాంధీ ఉప్పు సత్యాక్షిగహం చేయడానికి దారితీసినటువంటి జటిల సమస్యలు ప్రజాస్వామ్య దేశంలో కూడా ఎన్నో ఉన్నాయి. సత్యాక్షిగహం, పాదయావూతలు, ప్రజా ఉద్యమాల వల్ల కొన్ని ప్రజా ఉపయోగకర సమస్యల పరిష్కారాన్ని పొందవచ్చు. అధికారంలో ఉన్న వాళ్ల మెడలు వంచే శక్తి ఈ ఉద్యమాల లో ఉన్నది. అయితే సరైన సమయంలో స్పందించడం అత్యంత ప్రధానమైంది. రెండవది గమ్యం చేరే వరకు మడమ తిప్పకుండా పోరాడడం.ఈ మధ్యన జరిగిన అన్నా హజారే ఉద్యమంలో అనూహ్యమైన ప్రజాస్పందన ను చూశాం. ప్రభుత్వం దిగి వచ్చింది. ‘నిర్భయ’ ఉదంతం ఉద్యమ రూపం దాల్చి ఉరిమి మహిళాలోకాన్నే కాదు యావత్ భారతావనిని అతలాకుతలం చేసింది. ఆక్రోశం పెల్లుబికింది. చట్ట సవరణలు సిద్ధమయ్యాయి. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, అత్యాచారం చేసినా, కఠినాతికఠినమైన శిక్షలు రూపొందించబడుతున్నాయి. కిక్కురుమనకుండా ప్రజావూపతినిధులు పార్లమెంటులో చట్టాలను ఆమోదించే వాతావరణం సర్వత్రా నెలకొన్నది.
మన రాష్ట్రంలో ప్రజల, ప్రతిపక్షాల స్పందన సరైన సమయంలో కరువైందా అని ప్రశ్నించుకోక తప్పదు. 2004 నుంచి అంచెలవారీగా ఈ పరిస్థితి పరిశీలిస్తే రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా నిర్వీర్యమైపోయింది. పవివూతమైన శాసనసభ ప్రేక్షకపాత్ర పోషించే దుస్థితి దాపురించింది. తగిన సమయంలో ప్రతిపక్షాలు సమైక్యంగా స్పందించకపోవడం వల్ల జలయజ్ఞం అభాసుపాలయింది. ప్రాజెక్టుల టెండర్లు ఏ మేరకు సమంజసమని, ఇన్ని రోజులు ఎందుకు స్పందించలేదని నిలదీయలేకపోయాయి. పాలకవర్గం జలయజ్ఞాన్ని అశ్వమేధ యాగంగా మార్చి సవాళ్లు విసురుతుంటే దాన్ని పట్టుకోలేని దుస్థితి ఏర్పడింది.యజ్ఞాలు దేవతలు చేస్తుంటే రాక్షసులు రక్తంపోసి భగ్నం చేసేవారని విన్నాం. నేడు రాక్షసులే యజ్ఞం చేస్తే ఎట్లుంటుందో చూస్తున్నాం. రాబోయే రోజుల్లో రైతుల రక్తం పీల్చకమానరు. ఎల్లంపల్లి ప్రాజెక్టుపైన ప్రచార, ప్రసార సాధనాలు ఎంత ఉప్పు అందించినా శాసనసభలో ఇచ్చిన నోటీసుకు, చేస్తున్న వాదనలలో కుంభకోణానికి సంబంధించిన కోట్ల రూపాయలు అంకెల లెక్క తప్పుతున్నదని ప్రతిపక్షమే దాడికి గురైంది. ఇడుపులపాయలోని భూములకు సంబంధించి వచ్చిన ఆరోపణ మీద కొన్ని రోజుల వరకు చర్చ కొనసాగి, చివరికి అప్పటి ముఖ్యమంత్రి నవ్వుతూ ఇచ్చిన సమాధానంతో సమాప్తమైంది. శాసనసభలో ప్రజావసరాలకు అనుగుణంగా ప్రతిపక్షాలు ప్రచార, ప్రసార సాధనలలో వచ్చిన కుంభకోణాలను ప్రస్తావించినా అవి పత్రికలకే పరిమితమైనాయి. అవినీతిపైన, వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలపైన చెప్పుకోదగ్గ కమిటీలు ఏర్పడడం గాని, కేసులు నమోదు కావడం కానీ జరగలేదు.ఎమ్మార్ ప్రాపర్టీస్, ఓబులాపురం గనులు తదితర అంశాలకు సంబంధించి సీబీ ఐ దర్యాప్తు జరపడం, కేసులు నమోదు కావడం ప్రజావూపతినిధులు, ఐఏఎస్ అధికారులు, ఇతరులు నెలల తరబడి జైలు ఊచలు లెక్కబెట్టే పరిస్థితి రావడం, అసెంబ్లీలో జరిగిన చర్చ వల్లనో లేక ప్రజా ఉద్యమం వల్లనో కాలేదని, కోర్టుల చొరవతో జరిగాయని.... అదీ అధికార పార్టీకి చెందిన మాజీమంత్రి అంటే ఆశ్చర్యం వేస్తుంది. శాసనసభ్యులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోలవరం టెండర్ల కు సంబంధించి కాంట్రాక్టర్లే బహిరంగంగా పరస్పరం అభియోగాలు చేసుకుంటున్నారు. వీరి అనుభవానికి సంబంధించి రష్యా నుంచి తెచ్చిన పత్రాలు సరిగ్గా లేవని మన రష్యన్ ఎంబసీ అధికారులే ధృవీకరించారు. ఒక రష్యానే కాదు, చైనా దేశంలో పనిచేసినామని తెచ్చిన పత్రాలు కూడా సరైనవి కావని మరొకరి ఆరోపణ. ఈ మోసపూరిత కాంట్రాక్టరు తన స్థాయిని ధృవీకరించే పత్రాలు చాలా దేశాల నుంచి తెచ్చి, టెండర్లలో ఉంచి కోట్లాది రూపాయల పనులు కొట్టేసినారని, వాటన్నిటి మీదా విచారణ జరపాలని ఆరోపణలు వచ్చాయి. పోలవరం టెండరుకు సంబంధించి చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఒక కమిటీ అనుమానాస్పద పత్రాలని ధృవీకరించినట్టు వార్తలొచ్చాయి. ప్రాథమికంగా నేరం జరిగిందని అనిపించినా, పోలీసులకు చర్యల కోసం పంపించకుండా, మరొక నిపుణుల కమిటీ చేత వీటినే ధృవీకరించుకోవడానికి రష్యాకు ప్రయాణమవుతున్నారంటే రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో ఎవరికీ అర్థం కావడం లేదు. అసలు పోలవరానికి పర్యావరణ అనుమతి లేదని, ప్రాజెక్టు కొనసాగడానికి వీలు లేదని కోర్టులలో వాదాలు జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష పార్టీ లు ఒకటై దీన్ని ఛేదించే ప్రయత్నం చేయకపోవడం విచారకరం.రాష్ట్ర శాసనసభలో అధికార, ప్రతిపక్ష సభ్యులలో చీలికలు వచ్చాయి. కేబినెట్‌లోనే మంత్రులు ప్రాంతాలవారీగా విడిపోయారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులు కొందరు ఈ మధ్యన కొత్తపార్టీ పెట్టి ఎన్నికల్లో గెలిచారు. వీరు ప్రభుత్వం మైనారిటీలో పడ్డదని, ప్రధాన ప్రతిపక్ష పార్టీనే అవిశ్వాసం పెట్టాలని నినదిస్తున్నారు. ఇవన్నీ ప్రజాస్వామ్యంలో వింత పరిణామంగా కనిపిస్తున్నాయి.1985 నుంచి రాష్ట్ర శాసనసభలో ఒక కొత్త పోకడ ప్రారంభమైంది. ప్రధాన ప్రతిపక్షం ప్రజాసమస్యల ప్రస్తావన పేరిట సభా కార్యక్షికమాలను స్తంభింపచేయడం, వాకౌట్ చేయడం, సభలోంచి గెంటివేయబడడం, రోజుల తరబడి సస్పెండ్ కావడం సాగించిం ది. ఈ విధంగా బహుళ ప్రచారం పొంది, శాసనసభ వేదికగా సమర్థవంతమైన పార్టీగా ప్రచారం చేసుకొన్నది. మేమే సరైన ప్రత్యామ్నాయం అనే సంకేతాన్ని ఇచ్చుకున్నది. అనుకున్నట్లే తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. తర్వాత ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’ అన్నట్టుగా మళ్లీ ఈ ప్రతిపక్షం కూడా నిరసనలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి, తమ ప్రచారం కోసమే సభా కార్యక్షికమాలను అడ్డుకొంటున్నది. నువ్వా... నేనా అనే స్థాయిలో సభలో దూషణలు ప్రారంభమయ్యాయి. వ్యక్తిగత విషయాలు పరాకాష్టకు చేరాయి. ఊహించినట్లుగానే తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షం, అధికార పక్షం పాత్రలు తారుమారయ్యాయి. అసెంబ్లీలో అల్లరి చేస్తేనే అధికారం ఖాయమనే అభివూపాయం మరింత బలపడింది. అయితే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ రెండుసార్లు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ పాచికలు అంతగా పారవని ప్రతిపక్షం గ్రహించి వైఎస్ రాజశేఖర్‌డ్డి పాదయావూతను ఆశ్రయించి ఫలితాన్ని దక్కించుకున్నారు. రెండోసారి అధికారంలోకి రావడమే కాకుండా యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలకు ఊపిరిపోశారు.సభను స్తంభింపచేస్తే అధికారం వస్తుందని భావించే రోజులు పోయి ఇప్పుడు పాదయావూతలు విజయసోపానాలని భావించే సీజన్ వచ్చింది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ చేసిన పాదయాత్ర ప్రజలను ప్రభావితం చేసి, చివరికి కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిందని ప్రచారం జరిగింది. దాంతో తెలుగుదేశం పార్టీ గతంలో అనుసరించిన శాసనసభ స్తంభన వ్యూహానికి బదులుగా పాదయావూతల పర్వానికి శ్రీకారం చుట్టింది. శాసనసభలో అప్ప ట్లో అనుసరించిన విధానం కాని, ఇప్పుడు పాదయావూతలు జరుపుతున్న వ్యూహం కాని సామాన్య ప్రజల సమస్యలను ఏ మాత్రం ప్రతిబింబించడం లేదు. అధికార పార్టీ తప్పిదాలను ఎండగట్టి, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను మార్పించే శక్తి, ఊపిరి ఈ పాదయావూతల్లో కనిపించడం లేదు.


పాదయావూతల సందర్భంగా పార్టీ నేతల్లో మనస్పర్థలు, వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు, రక్తపోటు, మధుమేహ వ్యాధికి సంబంధించిన లెక్కలు, గణాంకాలు, కాలు శస్త్ర చికిత్సలు, హాస్పిటల్‌లో పాదయావూతలు చేయించి పరిశీలించడం లాంటివి ఎక్కువ ప్రచారంలోకి వచ్చాయి. కాళ్లు బొబ్బపూక్కి పడుతూ లేస్తూ నడుస్తున్న దృశ్యాలకు ప్రచారం ఎక్కువ వచ్చింది. గత పాదయావూతలోనే రోశయ్య తెలుగుదేశం ఆరోగ్యాన్ని నిరంతరం పరీక్షించి రక్షణ కల్పిస్తామని ప్రకటించడం ద్వారా వారి పాదయావూతలో పాదం మోపడం హాస్యాస్పదంగా మారింది.వందల సంవత్సరాల కిందటే ఆదిశంకరుడు, స్వామి వివేకానందలు కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు చేసిన పాదయావూతల స్ఫూర్తి లోపించడమే ఈ అనారోగ్యాలకు కారణం అని తెలుసుకోవాలి.ఇప్పుడు జరుగుతున్న పాదయావూతల గురించి కనీసం మాట్లాడేవారే కరువయ్యారు. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ యాత్రలకే ప్రాధాన్యం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వారే ప్రధాన ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషిస్తున్నారు, పోటీపడుతున్నారు. నేటి రాష్ట్ర రాజకీయ పరిష్కారం కేవలం ఢిల్లీ ప్రకటనతో ముడిపడి ఉన్నది. అసెంబ్లీలో అల్లరి, పాదయావూతల ఫలితాలు ప్రహసనంగా మారిపోయాయి. రాష్ట్రాన్ని విడగొట్టడడమే నేడు ఏకైక ప్రధాన ఎజెండాగా ఉంది. దీన్నిబట్టే రాజకీయాలు మారుతాయి. చాలారోజుల తర్వాత ప్రజల కోరిక నెరవేరుతుంది. లేకుంటే తెలంగాణ ఉద్యమమొక్కటే దేశ రాజకీయాలను శాసిస్తుందని చరివూత-ఇప్పటి సకల జనుల సమ్మెలు-ఆత్మహత్యల పరంపర హెచ్చరిస్తున్నాయి.
-సీహెచ్. విద్యాసాగర్‌రావు
కేంద్ర మాజీ మంత్రి

154

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

Published: Sun,September 16, 2012 10:48 PM

పడుతూలేస్తూ పాలమూరు ప్రాజెక్టులు

సార్-మా పాలమూరు ప్రాజెక్టుల పరిస్థితేంది? వాటికి నీళ్ల కేటాయింపు ఉన్నదా? కరెంటున్నదా? పైసలున్నయా? అన్ని సక్రమంగా వుంటే మరి ఎందుకు