బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?


Mon,March 4, 2013 12:26 AM

Damఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసాగర్ ఆయకట్టు ఎడారి అవుతుంద’ని నాయకులు ప్రకటనలు చేస్తూ రైతులను భయాందోళనలకు గురిచేస్తున్నారు. వాస్తవాలు ఏమిటి? శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో కనీస నీటి మట్టాలు ఉంచాలని లోగడ హైకోర్టు స్టే విధించిందని మీరు రాశారు. ప్రస్తుతం ఆ స్టేలు అమలులో లేవని హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఆ ఆదేశాల గురించి కూడా సెలవివ్వండి.

-గువ్వా సుధారాణి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాఇదే పత్రికలో లోగడ అనేక వ్యాసాల్లో తెలంగాణకు సంబంధించిన మూడు కేసులు సుప్రీంకోర్టు, హైకోర్టులో తుది తీర్పు కోసం పెండింగ్‌లో ఉన్నాయని చెప్పడం జరిగింది.
1. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో కనీస మట్టాల కేసు -హైకోర్టు
2. బాబ్లీ ప్రాజెక్టు కేసు - సుప్రీంకోర్టు
3. పోలవరం కేసు - సుప్రీంకోర్టు
ఇందులో మొదటి కేసుపై హైకోర్టు 2012 నవంబర్ 26న తీర్పు వెలువరించింది. ఇక బాబ్లీపైన తీర్పును సుప్రీంకోర్టు 2013-02-28న ప్రకటించింది. ఇంకా పోలవరంపై వాదోపవాదాలు జరిగి, సుప్రీంకోర్టు తన అంతిమ నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉన్నది. పోలవరం ప్రధానంగా కోస్తాంవూధకు లబ్ధి చేకూర్చే ప్రాజెక్టు అయినా దాని ముంపు అధికశాతం తెలంగాణలో ఉండడంచేత పోలవరం ప్రాజెక్టు ‘ప్రోక్షిగెస్’ గురించి తెలంగాణకు సహజంగా ‘ఇంవూటెస్టు’ ఉండడంలో ఆశ్చర్యం లేదు. తీర్పులు వెలువడ్డ రెండు కేసుల గురించి చర్చించుకుందాం.

రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో కనీస మట్టాల కేసు:
వివిధ దశలలో రాష్ట్ర హైకోర్టులో ఈ విషయంపైన నాలుగు ప్రజాహిత వ్యాజ్యాలు (Public intrest Litigation No.s: 252,261, 300&302 of 2012) దాఖలయ్యాయి. వీటిని ఉమ్మడిగా ప్రస్తావిస్తూ తమ అంతిమ తీర్పు (Common order)ను వెల్లడించింది. ఆ తీర్పును అనువదించి ప్రచురించడం జరుగుతున్నది. ‘మేము పార్టీల న్యాయవాదు ల వాదనలను విన్నాము. పై వాజ్యాలలో లేవనెత్తిన అంశాలపైన ప్రభు త్వం ఓ విధానాన్ని ఇది వరకే రూపొందించిందని తెలిసింది. ప్రభుత్వం విధానాన్ని ఇది వరకే రూపొందించింది కాబట్టి, ఆవిధానాన్ని అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిది. అయితే ఆ విధానం నిర్ణీత వ్యవధిలో అమలు అయ్యేట్టు మాత్రమే కోర్టు చూస్తుంది. కనుక ప్రభుత్వం తమ విధానాన్ని ఇదివరకే రూపొందించినా లేదా రూపొందిస్తున్నా ఆ విధానాన్ని అమలు చేసేందుకు తగు చర్యలు తీసుకోవడానికి మేము ప్రభుత్వానికి నాలుగు నెలల గడువు ఇస్తున్నాం.

ఆయా జలాశయాల్లో కనీస నీటి మట్టాలు కాపాడే బాధ్యతను ప్రభు త్వం గుర్తించింది. కనుక ఈ విషయంలో మేము ఎలాంటి తదుపరి ఉత్తర్వులు ఇవ్వడం లేదు. అంటే 25-3-2013 నాటికి హైకోర్టు ప్రభుత్వానికిచ్చిన నాలుగు నెలల గడువు ముగుస్తుంది. అప్పటి వరకు ప్రభుత్వం ఈ వివాదానికి సంబంధించి ఎలాంటి విధానాన్ని రూపొందించి అమలు చేస్తుందో వేచిచూడాలి. అంతవరకు మనమేం మాట్లాడినా ప్రయోజనం ఉండదు.

బాబ్లీ కేసు:
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం (ఆరేళ్ల తర్వాత) వచ్చిన అతి ముఖ్యమైన తీర్పు ఇది. ఉత్తర తెలంగాణకు ‘వరవూపసాదిని’అయిన శ్రీరాంసాగర్‌ను ప్రభావితం చేయగల బాబ్లీపైన సుప్రీంకోర్టు తీర్పు - ఆ తీర్పులోని ప్రధాన అంశాలు.
1) మహారాష్ట్ర ప్రస్తుతం నిర్మిస్తున్న బాబ్లీని యథేచ్ఛగా డిజైను అనుసరించి కొనసాగించవచ్చు.
2) ఆంధ్రవూపదేశ్ కోరినట్టు బాబ్లీని తొలగించాల్సిన అగత్యం సుప్రీంకోర్టుకు అనిపించడంలేదు.
3) అయితే ప్రతి ఏడాది జూలై1 నుంచి అక్టోబర్ 28 వరకు
(వానకాలంలో) బాబ్లీ గేట్లు తెరిచే ఉంచాలి. ఈ వ్యవధిలో గోదావరిలోని సహజ ప్రవాహానికి ఎలాంటి అవరోధం కలిగించకూడదు. వర్షాకాలం దాటాక అంటే అక్టోబర్ 29 నుంచి మరుసటి సంవత్సరం జూన్ నెల ఆఖరు వరకు బాబ్లీ దగ్గర ప్రవహించే నీటి పరిమాణంలో బాబ్లీ బ్యారేజి 2.74 టీఎంసీలకు మించకుండా ఉపయోగించుకోవచ్చు. అయితే ఇందులో 0.6 టీఎంసీల నీరు పోచంపాడు, బాబ్లీ బ్యారేజీకి చెందిన ఉమ్మడి జలాశయాలకు చెందినటువంటిది. మహారాష్ట్ర మాటిమాటికి 2.74 టీఎంసీలు వాడుకోవడానికి వీల్లేదు. ప్రతి సంవత్సరం మార్చి ఒకటి నాడు మహారాష్ట్ర 0.6 టీఎంసీల నీటిని ఆంధ్రవూపదేశ్‌కు విడుదల చేయాలి.

సుప్రీంకోర్టు తన తీర్పులో భాగంగా ఓ త్రిసభ్య కమిటీని బాబ్లీ పర్యవేక్షణ నిమిత్తం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ కేంద్ర జలసంఘం ప్రతినిధి అధ్యక్షతన, ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో పనిచేస్తుంది. ఆ కమిటీ కార్యాలయ స్థలాన్ని కమిటీ ఎంపిక చేస్తుంది. కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అన్ని హంగులు సమకూర్చవలసిన బాధ్యత మహారాష్ట్రది. ఈ కమిటీకి అయ్యే ఖర్చునంతటినీ మహారాష్ట్రయే భరిస్తుంది.

ఆ కమిటీకున్న అధికారాలు, బాధ్యతలు:
1) బాబ్లీ బ్యారేజి నిర్వహణను కమిటీ పర్యవేక్షిస్తుంది.
2) మహారాష్ట్రకు 6-10-1975 నాటి ఒప్పందం అనుసరించి కొత్తవూపాజెక్టుల వినియోగార్థం లభించిన 60 టీఎంసీలు అంతర్భాగంగా 2.74 టీఎంసీల నీటిని బాబ్లీ బ్యారేజి దగ్గర నిలువ ఉండేట్టుగా చూడాలి
3) బాబ్లీ బ్యారేజి గేట్లను జూలై 1 నుంచి అక్టోబర్ 28 మధ్య కాలంలో (వర్షాకాలం సీజన్లో) తెరిచే ఉంచాలి. వర్షాకాలంలో గోదావరిలో సహజంగా వచ్చే వరదను అడ్డుకోకుండా చూడాలి.
4) అక్టోబర్ 29 నుంచి జూన్ మాసాంతం దాకా బాబ్లీ బ్యారేజి దగ్గర లభ్యమయ్యే నీటిలో మహారాష్ట్ర బ్యారేజి కోసం 2.74 టీఎంసీలను మాత్ర మే వాడుకోవాలి. ఇందులో 0.6 టీఎంసీల నీరు శ్రీరాంసాగర్, బాబ్లీ ఉమ్మడి జలాశయం భాగంలో నిలువ ఉండే నీరు.
5) ప్రతి సంవత్సరం మార్చి ఒకటవ తేదీన మహారాష్ట్ర 0.6 టీఎంసీల నీటిని ఆంధ్రవూపదేశ్‌కు విడుదల చేయాలి.

ఈ సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు అయ్యేట్టు చూసే బాధ్యత త్రి సభ్య కమిటీది. 28-2-2013 నాడు తీర్పు వెలువడింది. వెన్వెంటనే మన రాష్ట్రంలోని ప్రతిపక్షాలు తీర్పులో ఏముందో పట్టించుకోకుండా పెద్ద ఎత్తు న ప్రభుత్వంపైన విరుచుకుపడ్డాయి. ఇంకేముంది? ప్రభుత్వ వైఫల్యం కారణంగా శ్రీరాంసాగర్ ఆయకట్టు ఎడారి కాబోతోంది అని మీడియా ముందే రోదనలు ప్రారంభించారు కొందరు నాయకులు. ఏదేమైనా ఒక విషయం మాత్రం చెప్పాలి.

ఇప్పుడు అరచి గీపెట్టి లాభం లేదు. ‘బాబ్లీ’ కట్టకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సకాలంలో మహారాష్ట్రతో వ్యవహరించి తగు చర్యలు తీసుకుం బాగుండేది. ‘బాబ్లీ’ని రూపొందించింది, టెండర్లు పిలిచింది 2004కు పూర్వం(చంవూదబాబు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న రోజులు). ఆ తర్వాత కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వచ్చాక, మహా ఘనత వహించిన వైఎస్ రాజశేఖర్‌డ్డి తేలిగ్గా తన శక్తియుక్తులను ప్రదర్శించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, మహారాష్ట్రతో సంప్రదింపులు జరిపి బాబ్లీని ఆపడమో లేక సైజు తగ్గించడమో చేయగలిగి ఉండేవారు. కానీ ఆయన casual గా తీసుకుని ‘let law takes its own course’ అంటూ తన లాంఛన ప్రయత్నాలను, ఉత్తర ప్రత్యుత్తరాలు, పార్లమెంటు సభ్యులను ప్రధాని దగ్గరికి పంపడం లాంటివి మాత్రం కొనసాగించారు. అవేవీ ఫలించలేదు. చివరకు సుప్రీంకోర్టులో మహారాష్ట్రకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసి చేతులు దులుపుకుంది ప్రభుత్వం.గత జల సేతు బంధం-సువూపీంకోర్టు తీర్పు మన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నది? ఇదీ ఇప్పుడు ప్రజలను వేధిస్తున్న అసలు సిసలైన సమస్య.

1) మానసికంగా మన రిజర్వాయర్‌లో మరో రిజర్వాయర్ (మహారాష్ట్రది) చోటు చేసుకుందన్న ఫీలింగ్ సదా మనల్ని కలచి వేస్తుందన్నది నిజం.
2) అయితే, సుప్రీంకోర్టు ఆదేశాలు తు.చ.తప్పకుండా పాటించడం జరిగితే బాబ్లీ బ్యారేజి వల్ల (2.74-0.60) వెరసి 2.14 టీఎంసీల నీరు మాత్రమే మనం కోల్పోవడం జరుగుతుంది. (ఈ 2.14 టీఎంసీల నీరు కూడా మహారాష్ట్రకు 6-10-75) నాటి ఒప్పందం ప్రకారంగా హక్కు భుక్తంగా లభించిందే)
కాబట్టి నా ఉద్దేశ్యంలో బాబ్లీ వల్ల శ్రీరాంసాగర్‌కు చెప్పుకోదగ్గ (2.14 టీ ఎంసీలను కోల్పోవడం తప్ప, అది కూడా మహారాష్ట్ర తనకు లభించిన నీటిని ఇది వరకే వాడుకుంటున్నది అనుకుంటే) నష్టం లేదు. ఇప్పుడు ప్రతిపక్షాలు కారుస్తున్న మొసలి కన్నీరు, పెడుతున్న బొబ్బలు, రంకెలు కేవలం రాజకీయ లబ్ధికోసం తప్ప మరోటి కాదు. పైపెచ్చు, పోతిడ్డిపాడు, రాజోలిబండ కావుల, పోలవరం ప్రాజెక్టు, దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ లింకు మూలంగా తెలంగాణకు జరుగుతున్న, జరగనున్న నష్టంతో పోలిస్తే ‘బాబ్లీ బ్యారేజి’ మూలంగా (ఒకవేళ జరిగితే) కలిగే ఉప ద్రవం ఏపాటిది..?

నిజానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు పొంచి ఉన్న ప్రమాదం ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా బాబ్లీ వల్ల కాదు. బాబ్లీ వల్ల కోల్పోయేది చాలా స్వల్పమే. అసలు, కొంపలు ముంచేవి రెండు విషయాలు.
1) బాబ్లీ వంటి అనేక కట్టడాలను (తెలిసినవే 13) బాబ్లీకి ఎగువన మహారాష్ట్ర ఇది వరకే పూర్తి చేసింది. మరికొన్నింటిని నిర్మిస్తున్నది. వీటి సంగతేమిటి? మహారాష్ట్రకు ఉన్న నీటి హక్కు కొత్త ప్రాజెక్టుల కోసం 60 టీఎంసీలు. ఇప్పటికే 60 టీఎంసీల నీటిని మహారాష్ట్ర వినియోగించుకుంటున్నదని మనం అనుకుంటున్నాం. ఇది తేల్చేదెవరు? అందుకే ‘బాబ్లీ కమిటీ’ అధికారాలను విస్తృతపరిచి మహారాష్ట్రను తమ హక్కులకు మించి ప్రాజెక్టు కట్టకుండా మన ప్రభుత్వం వెంటనే చర్యలకు ఉపక్షికమించాలి.

2) ఇప్పటి వరకు 6-10-75 ఒప్పందం నాటికి అమలులో ఉన్న ప్రాజెక్టుల వినియోగం ఎంతో రెండు రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారం కుదరలేదు. 42 టీఎంసీలని మహారాష్ట్ర వాదిస్తుంటే 19 టీఎంసీలని మనమంటున్నాం. వెంటనే దీన్ని పరిష్కరించుకోవాలి. ఎన్నడూ లేనిది ఆంధ్రా మీడియా ఇంతగా ‘తెలంగాణ’కు అన్యాయం జరిగిందని ఎందుకు గుండె లు బాదుకుంటున్నది? తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు దోపిడీని కప్పిపుచ్చే ప్రయత్నంలో భాగమా? లేక మహారాష్ట్రతో సుహృద్భావ వాతావరణంలో ఏర్పాటు చేసుకున్న ఒప్పందాల ఫలితంగా రూపుదిద్దుకుంటున్న ‘ప్రాణహిత-చే మెగా ప్రాజెక్టును అడ్డుకోవడానికి చేస్తున్న ‘మెగా’ కుట్రలోని అంతర్భాగమా? ఏదేమైనా, గోరంతను కొండంతలు చేయొద్దు. ఏదో జరగబోతుందని అనవసర ఆందోళనలు ప్రజలకు కలిగించి తమ రాజకీయ పబ్బం గడుపుకునే నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్
[email protected] gmail.com

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

Published: Sun,September 16, 2012 10:48 PM

పడుతూలేస్తూ పాలమూరు ప్రాజెక్టులు

సార్-మా పాలమూరు ప్రాజెక్టుల పరిస్థితేంది? వాటికి నీళ్ల కేటాయింపు ఉన్నదా? కరెంటున్నదా? పైసలున్నయా? అన్ని సక్రమంగా వుంటే మరి ఎందుకు