కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!


Tue,December 3, 2013 06:14 AM

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా, విషాదంతో మన రాష్ట్రం కుంగిపోయింది. ఇక తీర్పు వివరాల్లోకి వెళితే-మన రాష్ట్రాన్ని తీవ్రంగా బాధించే అంశాలు రెండున్నా యి. ఒకటి: మిగులు జలాలపై అనుభవించే హక్కును మన రాష్ట్రానికి ఇవ్వకుండా, పై రాష్ట్రాలకు కలిగించడం. ఇప్పటి దాకా మిగులు జలాలు ‘మనవే’ అనుకుని 227.50 టీఎంసీల వినియోగంతో నిర్మించుకున్న, లేక నిర్మించుకుంటు న్న ఏడు ప్రాజెక్టులు(తెలంగాణలోని నెట్టంపాడు, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ మూడు ప్రాజెక్టులు; వెలిగొండ, తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీనీవా నాలుగు ప్రాజెక్టుల్లో కేవలం తెలుగు గంగకు 25 టీఎంసీలు ఇవ్వడం, ఫలితంగా మిగిలిన ఆరు ప్రాజెక్టులకు నీళ్లుండవు. దీంతో అవి ఎండిపోయి మ్యూజియం బొమ్మల్లాగ మిగిలిపోతాయి.

రెండు: పై రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలలో ముఖ్యంగా కర్ణాటకకు ఆల్మట్టి సామర్థ్యం పెంపు కోసం అదనంగా 130 టీఎంసీలు, ఎగువ తుంగ, ఎగువ భద్ర, సింగటలూర్, మూడు కొత్త ప్రాజెక్టులకు 40 టీఎంసీలు ఇవ్వడం ద్వారా మన రాష్ట్రాని కి ఎగువన కర్ణాటకలో 170టీఎంసీలు అదనంగా నీరు నిలుపుకోవడం ద్వారా మన ‘జూరాల’కు సకాలంలో నీరురాదు. దీంతో కిందికి నీరు విడుదల చేయలేకపోతే శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయా ల్లో నీరు నిండక, కిందికి నీరు పంపకపోతే సాగర్ ఆయకట్టు ముఖ్యంగా కృష్ణాడెల్టా రైతాంగం సకాలంలో నాట్లు వేసుకోలేరు. జూన్, జూలై, ఆగస్టు దాకా వేచిచూడ వలసి వస్తుంది. నవంబర్‌లో కోస్తా తుఫానుల తాకిడితో అల్లాడడం కారణంగా పంటకాలం సరిపోక మొదటి పంటపైన దాదాపు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ కారణాల వల్ల మన రాష్ట్రం ఆవేదనకు గురవడం సహజం.

ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం నష్టపోతుంద న్న అభివూపాయం నిజమే. కానీ ‘ట్రిబ్యూనల్’ అన్నది న్యాయపీఠం. కృష్ణా నదిపైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రవూపదేశ్ రాష్ట్రాలకు హక్కులున్నాయి. కనుక అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, వాస్త వ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ట్రిబ్యూనల్ నిర్ణయించవలసి ఉంటుంది. ‘తీర్పు’ అలా జరిగిందా లేదా అన్న దే ప్రస్తుతం చర్చించాల్సిన అం శం. దానివల్ల ఏ రాష్ట్రం ఎంత లాభపడింది అన్నది వేరే అంశం.
లోగడ కృష్ణా జలాలను మూడు రాష్ట్రాలకు పం చిన బచావత్ ట్రిబ్యూనల్ 1976లో తమ తీర్పును వెల్లడించింది.అది 2000 సంవత్సరందాకా అమ ల్లో ఉంది. అందులో నికరజలాలను మూడు రాష్ట్రాలకు పంచి, మిగులు జలాలను కూడా పంచాలని ఒక సూత్రాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అయితే మూ డు రాష్ట్రాలు అంగీకరిస్తే తప్ప నిర్ణయాలు అమలు కావని చెప్పడంతో నికర జలాలను మాత్రమే వెల్లడించి, మిగులు జలాలను అనుభవించే స్వేచ్ఛను ఆంధ్రవూపదేశ్‌కు ఇస్తూ, ఈ నీటిపై ఎలాంటి చట్టపరమైన హక్కులు ఉండబోవని స్పష్టం చేసింది.

అంతేగాకుండా బచావత్ ట్రిబ్యూనల్ మిగులు జలాల పంపకం అంశాన్ని మే 2000 తర్వాత ఏర్పడే కొత్త ట్రిబ్యూనల్‌కు వదిలేసింది. అంటే మన రాష్ట్రానికి గత 37ఏళ్లుగా మిగులు జలాలను అనుభవించే స్వేచ్ఛ సంపూర్ణంగా ఉందన్న మాట. అయితే ఈ నీటిపైన వినియోగానికి అవసరమైన చట్టపరమైన హక్కులులేవు.అయితే జరిగిందేమంటే.. మనం ఏడు ప్రాజెక్టులను పక్కరాష్ట్రాలు అభ్యంతరాలను వెలిబుచ్చుతున్నా పట్టించుకోకుండా కట్టడం ప్రారంభించాం. పక్కరాష్ట్రాలు సుప్రీంకోర్టు తలుపులు తట్టాయి. ఈ ప్రాజెక్టులు మిగులు ఆధారంగా నిర్మిస్తున్నవని మిగులు జలాలపైన ఆంధ్రవూపదేశ్‌కు ఎలాంటి హక్కులు లేవని వాదించారు. అసలే మిగులు జలా లు, అందునా హక్కులులేని మిగులు జలాలు-వీటి ఆధారంగా నిర్మించే ప్రాజెక్టులకు మా ఆమోదం లేదని కేంద్రం స్పష్టంగా తెలియజేసింది. అప్పటికే పుణ్యకాలం దాటి కొత్త ట్రిబ్యూనల్ ఏర్పడింది. ఈ వివాదాన్ని పరిష్కరించమని సుప్రీంకోర్టు కొత్త ట్రిబ్యూనల్‌ని కోరింది.

‘మిగులు జలాల’పై మన చర్యలకు కేంద్రం నుంచి ఎలాంటి మద్దతు లేదన్నది మనం తెలుసుకోవాల్సిన అంశం. కొత్త ట్రిబ్యూనల్ వచ్చీ రాగానే మిగులు జలాల అంశం తేలేదాకా మన ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపాలని సూచించడంతో గత్యంతరం లేక మనం ఒక హామీ పత్రాన్ని ఇచ్చాం. ‘మీరు రేపు తీసుకోబోయే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటాం, నిర్మాణాలు చేపడ్తున్నాం. కనుక హక్కులను కోరం. కనుక మమ్మల్ని కట్టుకోనివ్వండి’ అన్నది ఆ హామీ సారాంశం.ఇప్పుడు కొత్త ట్రిబ్యూనల్ తమ నిర్ణయాన్ని ప్రకటించింది. అందులో మొత్తం 448టీఎంసీల మిగు లు జలాలల్లో 194 టీఎంసీలను మనకు ఇచ్చి, 254టీఎంసీలను పై రాష్ట్రానికి ఇచ్చింది. (మనకు చేసిన కేటాయింపులు బాక్సులో చూడవచ్చు)

ఇక్కడ మనం రెండు అంశాలను నిష్పాక్షికంగా, నిజాయితీగా ఆలోచించాలి. ఒకటి- హక్కులు లేని మిగులు జలాలపైన మనం నిర్మాణాలు చేపట్టడం ఎంతవరకు సబబు? ఎలాం టి హక్కు లు కోరమని హామీ పత్రం రాసిచ్చి, వాటిపైన సంపూర్ణంగా హక్కులు కోర డం ఏరకంగా సమంజసం? రెండు- అంతర్ రాష్ట్ర నదులతో సంబంధిత రాష్ట్రాలన్నింటికి, నికర జలాలతోపాటు మిగులు జలాలపై హక్కులు ఉంటా యా? ఉండవా? బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ ఆలోచించి చేసింది అదే. మనతోపాటు పైరాష్ట్రాలకు కూడా మిగు లు జలాలపైన హక్కు కల్పించింది. తత్ఫలితంగా మన ఆశలపైన నీళ్లు కుమ్మరించింది. కాకపోతే కాస్త ఊరట కలిగించే విషయమేమైనా ఉంటే పంచిన 448టీఎంసీల మిగులు జలాల కన్నా అధికంగా లభించే జలాలపైన కేవలం మన రాష్ట్రానికే హక్కు ఉంటుందని ప్రకటించడం.

ఇక రెండవ అంశం ఆల్మట్టి..
ఆల్మట్టి డ్యాం ఇప్పుడు 519.60 మీటర్లు ఉంది. అంటే ప్రస్తుత పూర్తి జల స్థాయి అన్న మాట. ఆ స్థాయి వరకు నీటిని నిలువ చేసుకోవచ్చు. ప్రస్తుతం అది 173టీఎంసీల నిలువ చేసే సామర్థ్యం కలిగుంది. ఆల్మట్టి ఎత్తును 524.256 మీటర్ల వరకు తీసుకెళ్లాలన్నది కర్ణాటక ఆకాంక్ష. ఫలితంగా మరో 130టీఎంసీల నీటిని నిలువ చేసుకోవాలన్నది ప్లాన్. అంటే మొత్తం 303 టీఎంసీల వినియోగాన్ని ఆల్మట్టి ద్వారా చేసుకోవాలన్నది కర్ణాటక కోరిక. ‘ఆల్మట్టి డ్యాం ఎత్తు’వివాదం చాలా ఏళ్లు చంద్రబాబు జమానాలో సుప్రీంకోర్టులో నడిచింది.

అప్పుడు సుప్రీంకోర్టు 519.60 మీటర్ల ఎత్తుకు మాత్రమే అనుమతిస్తూ, మున్ముందు ఈవిషయాన్ని ముఖ్యం గా అదనపు నీటిపై కర్ణాటకకు హక్కు కలిగించే విషయాన్ని కొత్తగా ఏర్పడే ట్రిబ్యూనల్ పరిశీలిస్తుందని చెప్పింది.అంటే ఈ సమస్యను కూడా కొత్త ట్రిబ్యూనల్ పరిష్కరించవలసి వచ్చింది. ట్రిబ్యూనల్ వారు అనేక తర్జనభర్జనలు, సాక్ష్యాధారాలు, రికార్డులు పరిశీలించాక కర్ణాటకు గ్నీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇప్పు డు 519.60 మీటర్ల ఎత్తు ఉన్న ఆల్మట్టితోనే అవస్థ లు పడుతున్న ఆంధ్రవూపదేశ్ రైతాంగం మరో ఐదు మీటర్ల ఆల్మట్టి ఎత్తుకు అనుమతివ్వడం దెబ్బమీద దెబ్బ. ట్రిబ్యూనల్ నిర్ణయం జరిగిపోయింది. ఇప్పు డు మిగిలింది సుప్రీంకోర్టుకు మొక్కడం. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యూనల్ తీర్పును సుప్రీం వారు మారుస్తారా? రద్దు చేస్తారా? యథాతథంగా కొనసాగిస్తా రా? అనే విషయాలను భవిష్యత్తు తేలుస్తుంది.

ఇక తెంగాణ పరిస్థితి..
ఒకటి: కొత్త ట్రిబ్యూనల్ తెలంగాణ దుర్భిక్ష ప్రాంతాల అవసరాల కోసం తొమ్మిది టీఎంసీలను జూరాలకు ఇచ్చింది. అంటే మన మూడు ప్రాజెక్టులకు 77 టీఎంసీలు కావలసి ఉంటే వాటికి ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు.ఈ రకంగా మనకు 68 టీఎంసీల నష్టం జరిగింది.


vardalikalvaluరెండు: ఆల్మట్టికి అదనంగా నిలువ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం మూలంగా జూరాలకు, శ్రీశైలానికి, సాగర్‌కు సకాలంలో నీరు రాక నిండడానికి టైం పడుతుందన్నది వాస్తవం. ‘సాగర్’ ఎడమ కాలువ ఆయకట్టు రైతాంగం కూడా నీటి కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. మునుపటిలాగా రైతు లు రెం డు పంటలు ముఖ్యంగా డెల్టా రైతాంగానికి సాధ్యపడకపోవచ్చు. కాకపోతే గుడ్డిలో మెల్ల అన్న ట్టు నాగార్జునసాగర్ క్యారీ ఓవర్ ఓ ఏడాదిపాటు గడ్డుకాలాన్ని దాటించగలుగుతుంది. వరుసగా రెండేళ్ల పాటు పై నుంచి నీళ్లు రాకపోతే అధోగతే. బ్రిజేశ్‌కుమార్ తీర్పు సమన్యాం చేసిందా లేదా? వాళ్లు తీసుకున్న సాంకేతిక అంశాలు కరెక్టేనా ఇలాంటివి ఇప్పుడు మనం చర్చించి లాభం లేదు. ఇంకా ఏమైనా ఆశ ఉందం సుప్రీంకోర్టు తీర్పుపైనే.

ట్రిబ్యూనల్ నిర్ణయం జరిగిపోయింది. ఇప్పుడు మిగిలింది సుప్రీంకోర్టుకు మొక్కడం. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యూనల్ తీర్పును సుప్రీం వారు మారుస్తారా? రద్దు చేస్తారా? యథాతథంగా కొనసాగిస్తారా? అనే విషయాలను భవిష్యత్తు తేలుస్తుంది.

డెల్టా రైతాంగానికి తుఫాన్ల మూలంగా,ఆల్మట్టి మూలంగా భారీ నష్టం. కానీ పులిచింతల వాళ్లను కొంతమేరకు ఈ విపత్తు నుంచి రక్షిస్తుంది. సీమ వాళ్లకు ఇటు మిగులు జలాల కేటాయింపులు లేక, అటు నికర జలాలు తగినన్ని లేక పాలుపోలేని పరిస్థితి. ఇక తెలంగాణ వాళ్లకు మిగులు జలాల కేటాయింపులు లేవు, పులిచింతల లేదు. కనుక వాళ్లకూ ఆల్మట్టి మూలంగా కొంత మేరకు నష్టమే.

బ్రిజేశ్‌కుమార్ తీర్పు కన్నా.. సీమాంవూధులను అధికంగా బాధించే మరో అంశం రాష్ట్రవిభజన. రాష్ట్ర విభజన జరిగితే కృష్ణా నదిని తమ ఇష్టం వచ్చి న చోటకు తరలించి తమకు కావలసిన పద్ధతి లో నీటి వినియోగంలో కోతలు,మార్పులు, కూర్పు లు చేసే అవకాశాన్ని కోల్పోతామన్న బాధ ఎక్కువ. అవిభక్త ఆంధ్రవూపదేశ్‌లో ‘సర్దుబాటు’ ద్వారా అందరికీ న్యాయం చేస్తామన్నది ముఖ్యమంత్రి వాదన. 56 ఏళ్లలో ఏ ప్రాంతానికి సర్దుబాటు జరిగిందో ఆయనే చెప్పడు! కనుక బహుపరాక్. ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ముఖ్యం. ఈ నీటి చోరీని ఆపడం అత్యవసరం. పగ్గాలు ‘కృష్ణా జల నిర్ణయం మండలి’ చేతిలో పెట్టడం ఇప్పటి పరిస్థితితో పోలిస్తే అనేక రెట్లు మేలు.
(వ్యాసకర్త కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజినీర్)

238

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

Published: Sun,September 16, 2012 10:48 PM

పడుతూలేస్తూ పాలమూరు ప్రాజెక్టులు

సార్-మా పాలమూరు ప్రాజెక్టుల పరిస్థితేంది? వాటికి నీళ్ల కేటాయింపు ఉన్నదా? కరెంటున్నదా? పైసలున్నయా? అన్ని సక్రమంగా వుంటే మరి ఎందుకు