ప్రాణం తీసిన సడన్ బ్రేక్

Sat,September 14, 2019 06:39 AM

దోమలగూడ : బైక్ నుంచి కింద పడగా.. వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు మీదనుంచి వెళ్లడంతో ఎంబీఏ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఎస్సై బాల్‌రాజ్ కథనం ప్రకారం..కరీంనగర్ గోపాలపురానికి చెందిన గణేశ్, రూప దంపతులు ముంబైలో నివాసం ఉంటున్నారు. కాగా.. వారి కుమారుడు నితేశ్ (22) బేగంపేట్‌లోని అమమ్మ ఇంట్లో ఉంటూ మల్లారెడ్డి కళాశాలలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు.


కాగా...గురువారం గణేశ్ నిమజ్జనాన్ని చూడడానికి.. రాత్రి 12 గంటల సమయంలో బంధువులు కరణ్, పవన్‌తో కలిసి నితేశ్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు హోండా మ్యాస్ట్రో ( ఏపీ 09 సీయు 4426)పై బయలుదేరారు. మార్గమధ్యలో బైక్ సడెన్ బ్రేక్ వేయడంతో ముగ్గురు కింద పడ్డారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు నితేశ్‌పై నుంచి వెళ్లింది. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108లో గాంధీ దవాఖానకు తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. శుక్రవారం మధ్యా హ్నం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.

2269
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles