బంజారాహిల్స్‌ రోడ్డు నెం. 13లో దారుణం

Mon,October 14, 2019 11:20 PM

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 13లో దారుణం చోటుచేసుకుంది. స్థానిక స్మశానవాటిక వద్ద పది రోజుల వయసు గల శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. శిశువు మృత దేహాన్ని కుక్కలు పీక్కుతింటుండడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల కథనం ప్రకారం.. చనిపోయిన మృతదేహాన్ని సరిగ్గా పూడ్చకపోవడంతోనే ఈ దారుణం జరిగిందని వారు అన్నారు. మృతదేహం పైకి ఉండడంతో కుక్కలు తవ్వి మృతదేహాన్ని బయటకు తీసి, పీక్కు తిన్నట్లు తెలుస్తుందని వారు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

2225
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles