పెండ్లి చేయడం లేదని యువకుడు ఆత్మహత్య

Sat,November 9, 2019 06:48 AM

గౌతంనగర్: పెండ్లి చేయడం లేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై లింగస్వామి కథనం ప్రకారం.. పీవీఎన్ కాలనీలో నివాసం ఉంటున్న కె.నరేశ్(23) కారు డ్రైవర్. మూడు నెలలుగా పెండ్లి చేయాలని తల్లిపై ఒత్తిడి చేస్తున్నాడు. సక్రమంగా డ్యూటీకి వెళ్లి డబ్బులు సంపాదించిన తరువాత వివాహం చేస్తానని తల్లి చెప్పింది. దీంతో మనస్తాపం చెందిన నరేశ్ శుక్రవారం ఉదయం బయటకు వెళ్లి యూసిడ్ తాగి ఇంటికి వచ్చాడు. అతని నోటి నుంచి రక్తం కారుతుండగా.. తల్లి గమనించి గాంధీ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

1442
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles